పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

హజ కవి పోతన గారి భాగవత గ్రంధం అనే విశ్వం అందాన్ని అంతటిని తెలుగు లిపిలో అందించాలనే ప్రయత్నమే మన ఈ తెలుగుభాగవతం.ఆర్గ్. ఇది పోతన భాగవతంలోని 9014 పద్యగద్యలు అన్ని, ప్రతి పద్యగద్య శ్రవణదస్త్ర ప్రతిపదార్థములు, పదాల వివరణలు, చంధో నియమాలు, సంబంధిత ఇతర గ్రంధాదులు అన్నిటి సమాహారం మన తెలుగుభాగవతం.ఆర్గ్. గణనాధ్యాయంలోని అధ్యయనాలు కూడ ఇచ్చాము.

వ్యాస కృతి సంస్కృత మాతృక నుంచి ప్రాంతీయ భాషల లోకి తీసుకొచ్చిన ప్రథమ భాగవతం మనదే. భాగవతం భక్తి ప్రపత్తులకి కాణాచి. ఇది పంచమ వేదం. అందుకే పోతన గ్రంధారంభం లోనే యిలా అన్నారు

1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకు నై చింతించెదన్.

శ్రీ వేదవ్యాసులు క్రీ. పూ. 3000 కన్నా పూర్వం వారు. బమ్మెర పోతనామాత్యులు క్రీ. శ. 1373 - 1460 మధ్య జీవించారు. పోతన తెలుగు భాగవతంలోని ప్రతి పద్యం సద్యోముక్తి సంధాయకం. పోతనది.

1-18-క.
లికెడిది భాగవత మట
లికించెడి వాడు రామద్రుండట

అన్న ప్రపత్తి. స్వేచ్ఛానువాద ప్రక్రియ. గంటం పంచదారలో అద్ది రాసాడేమో లేకపోతే ఇంత మాధుర్యం ఎలా వస్తుంది? అన దగ్గ రచనాశైలీ. ఇప్పుడు పోతన కృతిగా ప్రసిద్ధ మైనా దీనిలో గంగన, సింగన, నారయ అని మరొక ముగ్గురి కృషి కూడా కొంత ఉంది. పోతన ఇతర రచనలు

1. వీరభద్ర విజయము.
2. నారాయణ శతకము.
3. భోగినీ దండకము.

ట్టి తెలుగు భాగవతం పద్యగద్యాలు, శ్రవణ దస్త్రములు (ఆడియోలు) పోతన యితర రచనలు మొదలైన వాటన్నటిని తెలుగులో సంకలనం చేసి తెలుగుభాగవత.ఆర్గ్ జాలిక ఒకే చోట అందిస్తోంది. గణనాధ్యాయి ఊలపల్లి సాంబశివరావు, వెంకట కణాద, బండి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, మిరియాల దిలీప్ మరికొందరు సభ్యుల సహకారంతో ఇదంతా మీకు అందిస్తోంది. తెలుగు భాగవతం.ఆర్గ్. ఈ గ్రంధాదులు ప్రధానంగా ఎమ్ ఎస్ వర్డు, ఎక్సెల్లులు వాడుట వలన వాడుకరులకు మిక్కిలి అనుకూలంగా ఉన్నాయి.

భాగవత ప్రియులు, సాహితీ అభిమానులు, రసఙ్ఞులు, తెలుగువారు రండి. ఆస్వాదిందండి. ఈ జాలికని సహృదయంతో ఆదరించండి. మీ సూచనలు, అభిప్రాయాలు సాదరంగా అందించండి. అవి మా కెంతో ముఖ్యమైనవి. మరిన్ని విషయాలు మరింత చక్కగా అందించటానికి అవి ఎంతో ప్రోత్సాహాన్ని బలాన్ని ఇస్తాయి.