పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : మంత్రసాధన - కృష్ణనామం

~ సద్గురు శ్రీ శివానందమూర్తి గారు

“కృష్ణుడి పేరుతో” ఏ మంత్ర సాధన చేసినా;

ముఖ్యంగా శక్తి మంత్రాలను; కాళి దుర్గ అలాంటి మంత్రాలను;

దేవీ మంత్రాలను సాధనచేసేవాడు

కృష్ణుడే గురువు అనుకుంటే త్వరగా సిద్ధి పొందుతాడు. అది ఒక రహస్యము.

శ్యామల స్వరూపుడు రాముడు, లలిత స్వరూపుడు శ్రీకృష్ణుడని మంత్ర శాస్త్రం చెబుతోంది.

లలిత అంటే ఎవరు?

“ముగ్గురమ్మల మూలపుటమ్మ”

బ్రహాండము అవతల ఉన్నటువంటిది. అది వేరే కథ.

“చాల పెద్దమ్మ”

“సురారులమ్మ కడుపాఱఢిపుచ్చిన యమ్మ”

ఎన్నో అద్భుతాలు, కాబట్టి అట్టి పరాశక్తి స్వరూపుడు శ్రీకృష్ణుడు. ఈ

బ్రహ్మాండంలో పుట్టినవాడుకాదు, అవతలి నించి వచ్చినవాడు. కాబట్టి,

ఆ తత్వాన్ని స్మరించడానికి అనుగ్రహం ఉండాలి