పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ప్రణీతము- చిరువ్యాఖ్యానము

 ప్రణీతః : సర్వశబ్దసంబోధిని (సంస్కృతనిఘంటుః - ఆంధ్రటీకాసహితః) (పరవస్తు శ్రీనివాసాచార్య) 1875 - (సం॥) స్థానాంతర ప్రాపణ సంస్కృతాగ్నిః ॥ ; (తె॥) మఱియొక స్థలమునందుంచుటకై సంస్కారము చేయఁబడిన యగ్ని.

 భాగవతము అగ్ని వలెనే పరమ పవిత్రతమమైనది. అందుచే, పోతనామాత్యుల వారు “(సం॥) స్థానాంతర ప్రాపణ సంస్కృతః॥ ; (తె॥) మఱియొక స్థలమునందుంచుటకై సంస్కారము చేయఁబడినది.” అని గ్రహించి ప్రణీతము అని ప్రయోగించి సంస్కృతమున గ్రహించి ఆంధ్రమున / తెలుగునకు ప్రాప్తించి ఉందురు.

~ భాగవత గణనాధ్యాయి.