పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : నవమ స్కంధ విశ్వామిత్రుని వంశం ఘట్ఠంలో పొసగని పాఠం

నవమ స్కంధము నందలి విశ్వామిత్రుని వృత్తాంతము.

సాహిత్య అకాడమీ వారి నవమ స్కంధము, 263 పుటాంత గమనికలో:- 503-వ, లో గల (కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునికి హర్యధ్వనుండును, హర్యధ్వనునకు, సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియు, సంకృతికి జయుండును, జయునికి, క్షత్రధర్మండును బుట్టిరి; వీరలు క్షత్రవృద్ధుని వంశంబునం గల రాజులు;) పాఠము అమూలకము అని కలదు.
పెరుమాళ్ళయ్య వారి భాగవతము, నవమ స్కంధము, 724వ పుటాంత గమనికలో: 504-వ. లో గల (కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునికి హర్యధ్వనుండును, హర్యధ్వనునకు, సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియు, సంకృతికి జయుండును, జయునికి, క్షత్రధర్మండును బుట్టిరి; వీరలు క్షత్రవృద్ధాన్వయులు) అను పాఠము.....
498-వ. లో [“నా పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్త్రవృద్దుండును, రజియును, రంభుండును, ననేనసుండును ననువారు పుట్టి; రందు క్షత్త్రవృద్ధునకుఁ గుమారుండగు సుహోత్రునకుఁ గాశ్యుండుఁ గుశుఁడు గృత్స్నమదుండు నన ముగ్గురు గలిగి;” తరువాత పై పాఠము కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునికి హర్యధ్వనుండును, హర్యధ్వనునకు, సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియు, సంకృతికి జయుండును, జయునికి, క్షత్రధర్మండును బుట్టిరి; వీరలు క్షత్రవృద్ధాన్వయులు) పిమ్మట (కృత్స్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుండును, నమ్మహాత్మునికి బహ్వృచప్రవరుండును జన్మించి; రా బహ్వృచప్రవరుండు దపోనియతుండై చనియె; కాశ్యునకుఁ గాశియుఁ గాశికి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండును జనించిరి.) అను పాఠము వ్రాతప్రతులం జూపట్టెడి] అని ఉన్నది.

ఈ ప్రకారంగా 9-497-వ.లోనూ, 9-503-వ. లోనూ తగిన మార్పులు చేర్పులు చేయడమైనది.