పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ఉటంకింపులు - కవితాంజలి

ఉటంకింపులు - కవితాంజలి

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

1
మ్మెలు సెప్పనేల జగమెన్నఁ గఁ బన్నగరాజసాయికిన్
సొమ్ముగ వాక్య సంపదలు సూఱలు సేసినవాని భక్తిలో
మ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
మ్మెర పోతరాజుఁ గవిట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

- సింగయ- ఆంధ్రమహాభాగవతము, షష్టస్కంధము

2
వాగీశాగోచరమగు
భావతాగమము రామద్రుని పేరన్
ధీరిమఁ దెనుఁగు చేసిన
భావతుం బోతరాజు బ్రణుతింతు మదిన్.

- తామరపల్లి తిమ్మయ్య - శేషధర్మము

3
రులకసాధ్యమై పరగు భాగవతంబు రహస్యమంతయున్
రికృపచే నెఱింగి మృదులాంధ్రవచో రచనా చమత్క్రియా
ణ మహాప్రబంధమునుగా రచియించిన భానుతేజు బ
మ్మెపుర పోతరాజును సమీకృత తేజు నుతింతు నెప్పుడున్.

- పట్టమెట్ట సరస్వతీ సోమయాజి- పృథుచరిత్ర

4
మ్మతిగాను భాగవతసారముఁ దీసి, తెనుంగుఁ జేసి, లో
మ్మునయందు నిల్పి కవికాంత సమాజములోన నెక్కుడై
మ్మిసుహృత్కులోదితుని ల్చి భజించి మహాత్ముఁడైన యా
మ్మెర పోతరాజుకవి పాదయుగంబున కేను మ్రొక్కెదన్.

- బసవరాజు నాగేంద్రకవి - ఆనందసుందరీచాతుర్యలీలావిలాసము

5
లాలిత్యము పాకశుద్ధి భగవద్భక్తాగ్రసంసేవ్యమున్
మత్యున్నతమున్ మహాశుభదమున్ ద్మోద్భవానందమున్
చిచిద్రూపవిభాగ భాగవతమున్ చింతుంతు నాంధ్రంబుగా
యం జెప్పిన పోతరాజు పదముల్ త్ప్రేమ నే మ్రొక్కెదన్.

- చిదంబరకవి- అంగదరాయభారము.

6
ఖిల వేదంత విద్యారహస్య విదుండు
హజపాండిత్య విశారదుండు
త్తక్షితీశాధస్తోత్ర విముఖుండు
శంభుపదాబ్జ పూజారతుండు
టుతర కవితా విభాసిత ప్రతిభుండు
కలాంధ్ర లక్షణ క్రవర్తి
ఘుకులేశనిదేశచిత మహాభాగ
తపురాణుడు పుణ్యర్థనుండు
బుధజనహితుండు బమ్మెర పోతసుకవి
యెన్న రేఫ రకారంబు లెరుగడనుచు
జ్ఞు లొక కొంద రాడుదు మ్మహాత్ము
విత నెందును లోపమ్ము లుగ దభవ! 

- కూచిమంచి తిమ్మకవి- సర్వలక్షణసార సంగ్రహము

7
తుచ్ఛులు సరిగాదనినను 
స్వచ్ఛపుఁ బోతన కవిత్వ సంపద చెడునే? 
స్వేచ్ఛ జఱభి దూషించిన
చ్ఛపతివ్రతకుఁ బాప మంటుట గలదే?

- వావిలికొలను సుబ్బారావు - ఆంధ్ర వాల్మీకి రామాయణము

8
పేరికంబు; కాపురము పెద్దది; దేహియనంగ నాల్కయున్
రాదుమనంబు స్థైర్యమున గ్రాలక గ్రంథము వ్రాయ శక్యముం
గాదుగురుండు లేఁడు; హుట్టములన్ నిగమాంత విద్య; యె
ట్లీడితివయ్య పోతన కవీశ్వర! భాగవతాబ్ధివీథులన్.

- మిన్నికంటి గురునాథశర్మ- గురుభాగవతము

9
వులెవ్వారును తెల్గుసేయుటకు సంల్పించనేలేని భా
తగ్రంథము నిన్పగుగ్గిళుల ద్రాక్షాపాకరమ్యంబుగాఁ
వు రీతిం దెలఁగించి యుంచిన మహోదారుండు మా పోతరా
ట్కవితావల్లభు దివ్యమూర్తికి నమస్కారంబు గావించెదన్. 

- పురాణం సూర్యనారాయణ తీర్థులు - భారతి జనవరి 1943

10
వినుతకవీంద్ర! కొంద ఱవివేకులు కాకవు లందునం దలా
క్షణికుఁ డటంచు మిమ్ములను జాటిరి దానఁ గొఱంత గల్గునే! 
తర గంధసింధురము గ్రామమునం బయనం బొనర్చుచో
శుకము లన్నియున్ మొఱుగుచో గజరాజున కేమి లోటగున్?

- తుమ్మల సీతారామమూర్తి- ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1923

11
రామచంద్ర సాక్షాత్కార మ్యహృదయ
నితభవ్య భావోత్పుల్ల రసవచన
గుంఫితాశేష కవితానిగూఢ భక్తి
రవశా! పోతనా! నీకు వందనంబు.

- చిలుకూరి నారాయణరావు - భారతి

12
దైము మానుషాకృతినిఁ దాల్చి జగద్ధిత భక్తి నిల్పఁగా
భామునందలంచి వరభాగవతంబునుఁ దెల్గుబాసలో
ఠీవి ననన్యసాధ్యమగు ఠేవ రచింపఁగఁజేసి లోకసం
భాన మీఱి దా వఱలు మ్మెర పోతన నెంతు సత్కవిన్.

- నందిరాజు చలపతిరాయ కవి - మంగళగిరి మాహత్యము.

13
న్నాఁడా యనిపించె నైజకవితాభ్యున్నత్యహోవాద సం
న్నుండై నరపాలదర్శనము సంభావింపఁగాఁ బోని యా
న్నీఁడే కవి లోకమందు నతనిన్ మారందధారోర్మి వై
న్నద్యంబుపవిత్రమంజుపడుఁ బోన్నం బ్రణామించెదన్.

- మల్లంపల్లి వీరేశ్వరశర్మ - శంకరారాధ్య చరిత్రము

14
మ్మతమైన భాగవతసార వియద్ధుని సంస్కృతాంతరి
క్షమ్మున నుండఁ, దన్నదినిఁ య్యన భూమికిఁ దెచ్చి ఘోరపా
మ్ము లడంపఁగా దెలుఁగుఁ ల్కిన మత్కుల పావనుండునౌ
మ్మెర పోతనార్యుఁడను వ్యభగీరథు నాశ్రయించెదన్.

- కొమ్మద్ది సుబ్బరాయకవి- సూక్ష్మతనువిద్యావిలాసము

15
భావతంబు సర్వరసబంధురమున్ దెలిగించినాఁడు స
ర్వామసారవేది జఠరార్థముగాఁ జెయిసాఁచకే మహా
భాగుఁడితం డటంచు నరపాలురు మెచ్చఁగ జీవితంబు సొం
పౌ తి నోమినాఁ డితరు లౌదురె పోతనవంటి సత్కవుల్!

- తిరుపతి వేంకటకవులు - చాటుపద్య సంపుటము

16
సిరిని దరిద్రదేవతను చిక్కని చూపులనొక్క వైఖరిన్
నితము జూచుచున్ మనసు నీరజనాభుని వంక ద్రిప్పి యి
ద్ధను సమత్వ మిచ్చటన తాండవ మాడుచునున్నదో యనన్
గెడు పోతనార్యు కవిభాస్కరు నాత్మ దలంతు నిచ్చలున్.

- దేశిరాజు రామదాసు - ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1922

17
భ్రరపదంబులందు భగత్ప్రకృతిప్రణయానురాగత
త్త్వమును సమన్వయించి, పసి చ్చిక మేయుచు తప్పిపోవు వ
త్సములకు కృష్ణగానమున దారులు సూపి, సుధాధునీతరం
 మృదుమృదంగ భంగి కవికాంతుడు పోతన విచ్చె తెన్గునన్.

- రాయప్రోలు సుబ్బారావు- ఆంధ్రావళి

18
భావతాఖ్యతో నమృతభాండము తెన్గుల కిచ్చు నమ్మహా
భాగుని పోతనన్ బరమ భాగవతోత్తము నాంధ్రభాగ్వధూ
టీ గురుశోకవారణ పటిష్ఠుఁ దలంతుఁ గలిం దళింప జ
న్మాతుఁడైన ముక్తితనయా జనకున్ సనకున్ శుకార్భకున్.

- వానమామలై వరదాచార్యులు, పోతన చరిత్రము

19
సిడిమేడ లొసఁగు ప్రభువతంసము లుండఁ 
బూరిండ్ల యందునే చేరినావు
త్నాంబరము లిచ్చు రారాజు లుండంగఁ
దురు బట్టలఁ గట్టఁ డఁగినావు
మృష్టాన్నములు గూర్చు మేదినీశ్వరు లుండఁ
దై దంబలినె త్రాగఁ లఁచినావు
గ్రహారము లిత్తు ను ధరాధిపు లుండ
దారిద్ర్యభారమే తాల్చినావు
కోరికల నెల్ల నొనగూర్చు ధీరులుండ
రుల సాయంబు రవ్వంతఁ డయకుండ
జీవయాత్రను జెల్లించినావు బళిర! 
పూత గుణధుర్య! బమ్మెర పోతనార్య!

- శ్రీ భాసీం అలీషా, సమదర్శిని, శుక్లయుగాదిసంచిక,1929.

20
 కవితాకుమారికను ద్ద ధనంబును నగ్రహారముల్
గొను మని యిచ్చు భూమిధనకుంజరులున్నను లేమిఁ గుందుచు
న్నను హరికిచ్చి రాజులఁ దృణంబుగ నెంచి యశంబు గన్న యా 
ఘునిఁ బోతనన్ దలఁతు నాదృతి భాగవతోత్తమోత్తమున్.

- చింతలపల్లి నరసింహశాస్త్రి , శృంగార కాదంబరి

21
పుకింపఁగ జడదేహముఁ; 
లికింపఁగ నంతరాత్మ, భాషామృతమున్
చిలికించి, భక్తి బీజము
లికించెను పోతరాజు నాంధ్రనలందా!

- నిడదవోలు వేంకటరావు.

22
మృతమహాంబురాశి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
మునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దుల పద్దెముల్ శతా
బ్ధము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్!

- దాశరధి- ఆంధ్రజ్యోతి, 14-3-1982

23
వ్యాసపీఠము పజ్జ బాసికపట్టుతో
భావగతమ్ముగా భాగవతము
భారతీ తీర్థంబు, బాదరాయణ మౌని
సాధుమేధా సహస్రారధార, 
శుకముని ముఖవినిస్స్రుత సుధాపూరంబు,
సనిర్భర కవితారామ నరసి, 
క్తిభావతరంగ బంధురాపగ, భగ
ద్దివ్య గుణగణ ర్ణనా మ
హార్ణవమ్ము నాపోశనం వధరించి
ఆంధ్రమున నమ్మహాకృతి క్షరాకృ
తిన్ వెలార్చిన కవిలోక దివ్య సంయ
మికిని మా పోతనామాత్యునకు జొహారు!

- యస్వీ జోగారావు, పంచకల్యాణి

24
వదమృత నామకీర్తనోత్సంబు నందు
రవశత్వంబు నొంది భాముల డింది
మించి యాత్మార్పణంబు గావించుకొందు
పుట్టు కవిరాజ! బమ్మెర పోతరాజ!

- తిరుగుబోతు, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1925