పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భాగవతం ప్రాంతీకరణం

వ్యాసమూలం అయిన శ్రీమద్భాగవతపురాణం సంస్కృతంలో ఉన్నది. దీనిని ప్రజాబాహుళ్యానికి విస్తృతంగా అందించడం కోసం ప్రాంతీయ భాషలలోనికి తిసుకురావడంలో ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయి. . వాటన్నిటిలోనూ సంపూర్ణంగా సమగ్రంగా ప్రాంతీకరణ జరిగిన మొట్టమొదటిది మన పోతన్నగారి ఆంధ్రీకరణయే. భాగవతము ఇతర భాషల లోనికి ప్రాంతీకరణ జరిగిన సమాచారం శ్రీ నిడదవోలు వెంకటరావుగారు తమ "పోతన" రచనలో వివరించారు. ఆ సమాచారం క్రింద ఉల్లేఖించబడింది చూడగలరు.