పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముందుమాట : సంస్థలు

సహాయ సహకార ప్రోత్సాహముల నిచ్చిన కొందరు వ్యక్తులు, సంస్థలు –
సహాయ సహాకారాలందించిన సహృదయులు రసఙ్ఞులు అందరిని పేర్కొనుట సాధ్యం కాదు. కనుక కొందరిని ఉదహరిస్తాను. కాని అందరికి కృతఙ్ఞడనే నని ఇందుమూలముగా తెలుపుకుంటున్నాను.
1.            కుటుంబ సభ్యులు – నా అదృష్టము వలన నా కుటుంబ సభ్యులు భార్య లలిత, ఇద్దరు కొడుకులు – కోడళ్ళు (ఫణి – పద్మ, భాస్కర్ – విద్య), ముగ్గరు మనవళ్ళు చక్కగా సహకరించారు. లేనిచో ఈపాటి కృషి చేయగలిగేవాడనేకాదు. ఇంకా కంప్యూటరులో తెలుగు వాడుటకు తెవికె చూపి మొట్టమొదట ఈ కార్యక్రమం చేపట్టే ధైర్యం చెప్పిన కొడుకు చి. ఫణి, హైదరాబాదు. అంతర్జాలంలో పెట్టడానికి దారిచూపి సహకారం అందించిన కొడుకు చి. భాస్కర్, సింగపూర్. అంతే కాదు సాంకేతిక విషయా లనేకంలో సహాయపడ్డారు.
5.           శ్రీ వెంకట కణాదగారు ఉత్సాహ, ప్రోత్సాహాలు, ఆర్థిక సాయం, ప్రత్యేకంగా ఈ అంతర్జాల పుటలు పెట్టాలని ప్రోత్సహించి, ప్రధాన గాత్ర ప్రదానం, బాధ్యతగా పాలుపంచుకొనుట చేస్తున్నారు. శ్రీ రామక సత్యం, శ్రీ ఓగేటి కృపాలు గార్లు కూడ గాత్ర ప్రదానం చేసారు. శ్రీ ఎమ్మాది, శ్రీ మోపూరు ఉమామహేశ్వర రావు, శ్రీ దిలీప్ మిరియాల, శ్రీ బండి శ్రీనివాస శర్మ, ఈ పుటలకు వలసిన సాంకేతిక, నిర్వహణ సహాకారం అందిస్తున్నారు. చి. హరికృష్ణ, చి. కిరణ్ దస్త్రములను అంతర్జాలంలోకి ఎగుమతి చేయుటలో సహకరించారు. 
9.           రచయిత శ్రీ. సత్యన్నారాయణ గారు చేస్తున్నది మంచి పని కనుక అందరికి అందుబాటులోకి తెండి అని ప్రోత్సహించి సహకరించినవారిలో ప్రథములు. తెలుగు విశ్వవిద్యాలయము ప్రొ. శ్రీమతి ఉషాదేవి గారు, ఇచ్చిన ఉత్సాహ ప్రోత్సహాలు మరువరానివి. ఈటివి-2 వారి తెలుగు-వెలుగు కార్యక్రమము వారు పరిచయ భాగ్యం కలగించి ప్రోత్సహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ. వెలిచేటి నిత్యానందం గారు, ఆచార్య. ఎలిచేటి మురళీధర్ గారు, హైదరాబాదు రామకృష్ణా మిషను శితికానంద స్వామి గారు, పోతన ధ్యానందిరము తాలూకు శ్రీమతి ఎమ్ రుక్మిణి గారు, తెలుగు పిహెచ్ డి విద్యార్థులు చి. చంద్రశేఖర్, చి. రామమోహన్ రావు అభిమానంగా ప్రోత్సాహించారు., కవివర్యులు శ్రీ చింతా రామక్రిష్ణ గారు ఈ పనికి ఆశీర్వదించి ప్రోత్సాహించారు.
13.        ఈ పనికి సహాయపడిన పుస్తకాదుల (జాబితా వేరే ఇవ్వబడినది) రచయితలు, ప్రచురణ కర్తలు, తెలుగు ఉపాధ్యాయురాలు దుర్గ, శ్రీదేవి టాగూరు తమ సమయంకొంత దీనికి కేటాయించి సహకరించారు. శ్రీమతి. చిట్టక్కగారు శబ్దరత్నాకరము, వ్యాకరణ పుస్తకాలు ఇచ్చి, మిత్రులు శ్రీమతి & శ్రీ శర్మ గారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి శ్రీమదాంధ్ర మహా భాగవతము ఇచ్చి ప్రోత్సహించారు. చి. గిడుగు జగన్నాధ్ (గిడిగి రామ్మూర్తిగారి ముని మనవడు) చక్కటి డెల్ కంప్యూటరు కొనిపెట్టులో సహాయంచేసారు. 
17.        ముఖ్య అంతర్జాల సంస్థలు – తెవికె, dli డాట్ కాం (Digital Library India), గూగుల్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం, ఎమ్ ఎస్ ఎన్ వారిస్కైడ్రైవ్, Bharathiyoo వారి OS & Office, Scibd.com, తెలుగు పరిశోధన డాట్ కాం.
21.        HCL, Delle కంప్యూటరులు, View sonic tablet వలసిన మాధ్యమ సహకారం అందించాయి. తెలుగు యూనివర్సిటీ గ్రంధాలయము, సింగపూరులోని frontier CC & Library లు చేసిన సహాయాలు కూడ చిన్నవేమీ కాదు. అంతేకాదు, పంచమస్కంధం టీకటిప్ఫణులు చేస్తున్నప్పుడు, గుండెనెప్పి వస్తే సమయానికి అత్యవసరంగా ఎమర్జన్సీ బైపాస్ సర్జరీ చేసి మరల పని చేయుటకు అవకాశం కల్పించిన వైద్యులు చి. ముఖేష్ చేసిన మేలు చిరస్మరణీయమైనది.
పైన ఉదహరించినవారు ఇంకా అనేకులు అనేక విధముల సహాయ, సహకార, ప్రోత్సాహాలు చేసారు వారందరికి సహస్రానేక నమస్కృతులు.