పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : 2018 భాగవత జయంత్యుత్సవాల పోటీలలో విజేతలు

హైదరాబాదులో జరిగినజయంత్యుత్సవాలలో

I) భాగవతరత్న 2018
2018 ఉత్సవాలు H5. . . 2018 ఉత్సవాలు H8
డా. కాకుమాను భూలక్ష్మి "ఆంధ్ర మహాభాగవతం - మహిళల మహనీయత" అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయములో, ఆచార్య తేళ్ళ సత్యవతి వారి పర్యవేక్షణలో, 2012లో పిహెచ్.డి పట్టాపొందారు. వారికి విళంబి నామ సంవత్సరం కృష్ణాష్టమి అనగా 2018- సెప్టంబరు, 2న, తెలుగు భాగవత ప్రచార సమితి వారిచే, శ్రీ తనికెళ్ళ భరణిగారి అమృత హస్తాల మీదుగా "భాగవతరత్న" పురస్కారం ప్రదానం చేయబడింది. పురస్కార పత్రంతో పాటు, సన్మాన పత్రం, ఆండ్రాయిడ్ చాబ్లెట్టు, చిరు సత్కార ప్రదానం చేయడం జరిగింది.

II) 2018 కృష్ణాష్టమి పోటీలు : : భాగవత సంస్కృతి (ఒక అధ్యయనము) 2వ ఆవృత్తి:-
2018 ఉత్సవాలు H9. . . 2018 ఉత్సవాలు H11. . . 2018 ఉత్సవాలు H13
ఈ పోటిలలో విజేతలకు తెలుగు భాగవత ప్రచార సమితి వారిచే, 2018- సెప్టంబరు, 2న, దేవనార్ ట్రస్టు అధ్యక్షులవారు పద్మశ్రీ డా. సాయిబాబా గౌడ్ వారి అమృత హస్తాలమీదుగా క్రింది విధంగా బహుమతి ప్రదానం చేయడమైనది.
1)శ్రీ. గుఱ్ఱంగడ్డ రఘువంశి వారికి - ప్రథమ బహుమతిగా నిర్ణయించబడిన నగదు బహుమతి (బేంకు చెక్కు), జయపత్రం, చిరు సన్మానం ప్రదానం చేయడమైనది.
2)శ్రీమతి ముద్దు లక్ష్మి వారికి - ద్వితీయ బహుమతిగా నిర్ణయించబడిన నగదు బహుమతి (బేంకు చెక్కు), జయపత్రం, చిరు సన్మానం ప్రదానం చేయడమైనది.
3)వడలి వెంకట అనంతరాం వారికి - తృతీయ బహుమతిగా నిర్ణయించబడిన నగదు బహుమతి (బేంకు చెక్కు), జయపత్రం, చిరు సన్మానం ప్రదానం చేయడమైనది.

2018 ఉత్సవాలు H15III) ఇదే సందర్భంలో శ్రీమతి మంథా భానుమతి వారికి క్రిందటి ఏడాది పాల్గొని అందుకోలేకపోయిన ధృవపత్రం ప్రదానం చేయడం జరిగింది.

IV) సింగపూరు నందు జరిగినజయంత్యుత్సవాలలో: (అ) వేదిక పైన భాగవత పద్యాలు, కథలు, చిత్రాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు, పాల్గొన్న వారికి ధృవపత్రాలు ప్రదానం చేయడం జరిగింది.(ఆ) అంతర్జాలంలో నిర్వహించిన పిల్లలకు చిత్రాలు, కథలు, పద్యపఠనలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించడం జరిగింది.

2018 ఉత్సవాలు V2(V) అంతర్జాల పిల్లల పోటీలలో విరవ పిల్లలలో విజేతలు: 
128 మంది పాల్గొన్న ఈ పోటీలలో, బొమ్మల పోటీ విజేతలు: 1.వరలక్ష్మి-8th class, 2.శ్రీ సాయి తేజ - 6th class, 3.విజయ ప్రకాష్ -6th class, 4.తనూజ - 7th class; మఱియు పద్యాల పోటీ విజేతలు : 1. విజయలక్ష్మీ, 2. కనకమహాలక్ష్మి, 3. ప్రతాప్, 4. సాయి శివ వెంకట వీరేంద్ర