పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2015 - ఢిల్లీ - మియాపూరు

2015,ఏప్రిల్-24 - శ్రీ వేంకటేశ్వరా విద్యాలయము, కొత్త ఢిల్లీ.
2015-02-15 - శ్రీ చింతా రామకృష్ణారావు వారి వద్ద, హైదరాబాదు.


2015,ఏప్రిల్-24 - శ్రీ వేంకటేశ్వరా విద్యాలయము, కొత్త ఢిల్లీ.

ఈ రామానుజ జయంతి . . 2015,ఏప్రిల్-24 నాకు మరపురాని రోజు. మా నల్లనయ్య అనుగ్రహం ప్రదర్శిత మైన శుభదినం. . పండితవరేణ్యులు, పూజ్యులు, పరమ భాగవతులు, అస్మద్గురుతుల్యులు ఏల్చూరి మురళీధర రావు వారి విద్యాలయంలో కీశే. అజ్జరపు వేంకటరావు (నిర్మలం) వారి రామచరితం పుస్తక ఆవిష్కరణ అని చూసి మేం ఇద్దరం వెళ్ళాం. . సభ ఆత్మీయతలను పంచుకుంటూ బహు మనోరంజకంగా జరిగింది. . ఆచార్యులు చంద్రశేఖరు వారి పదవీవిరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది . మాడభూషి వారు మరికొందరు మహానుభావులను వినే భాగ్యం కలిగింది. ఆంధ్ర మహాసభ రంగయ్యగారు వంటి విజ్ఞులు కూడా వచ్చారు.

వేంకటేశ్వర కాలేజీ-2 - వేంకటేశ్వర కాలేడి-1

ఏల్చూరి వారు ఔదార్యంతో నన్ను, నా భుజాన్ని అలంకరించి ఉన్న తెలుగుభాగవతం లాప్-టాప్ ను చూసి. . సభకు తెలుగుభాగవతం.ఆర్గ్ ను ఆప్యాయంగా పరిచయం చేసారు. పోతన, మహాభాగవతం విచ్చేశాయి; పోతన, నారయ, సింగయ, గంగనార్యలు విచ్చేసారు సభను పావనం చేసారు అని ఉద్ఘాటించారు. . తెలుగు ఆచార్యులు, పండితులు, తెలుగు విద్యార్థుల మధ్య . . . చాలా సంతోషం అయింది. ఇలా మా మురళీధర రావు, మాడభూషి గార్లను దర్శించే అదృష్టం కలిగింది. ఇది మా నల్లనయ్య అనుగ్రహంగా గ్రహించాను.


2015-02-15 - శ్రీ చింతా రామకృష్ణారావు వారి వద్ద, హైదరాబాదు.


2015-02-15న అనగా జయనామ సంవత్సర, మాఘ మాస బహుళ నవమి శుక్రవారం, శ్రీ చింతా రామకృష్ణారావు గారి గృహములో సత్సంగం సందర్భంగా శ్రీమాన్ చింతా రామకృష్ణా రావు గారు ఆత్మీయ సత్కారం చేసారు. ఆ విధంగా ఆత్మీయులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారు, శ్రీ రామమోహను గారు, శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నరాయణ రెడ్డి గారు ప్రభ్రుతుల తో కొద్ది సమయం ఆనంద పారవశ్యం చెందే అవకాశం చిక్కింది. శ్రీకృష్ణదేవరాయల పీఠం వద్ద అభినవ ఆంధ్ర భోజుల వారి దర్శన భాగ్యం కూడా లభించింది. అక్కడి కక్కడ నా శ్రేయోభిలాషులు కవి శ్రేష్ఠులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారు హార్దిక స్పందనతో చెప్పిన శార్దూల విక్రీడితం.
చూడండి నాపై వారి శ్రేయోభిలాషితం "శ్రే" ను 3 సార్లు యతి స్థానంలో ప్రయోగించారు.
శా.
"శ్రీద్భాగవతోత్తముల్ గణన సుశ్రేయోను సంధానకుల్
మామీదన్ దయఁ జూపి వచ్చితిరి యేమా భాగ్య మీనాడు మీ
ప్రేమన్ లోకులు భక్తి పూర్ణులగుటే శ్రేయంబు యోచింప మీ
క్షేమంబున్ గను బాలకృష్ణుడు సదా శ్రేయంబులన్ గూర్చుచోన్."


ఆ ఆత్మీయ స్తృతిచిహ్నంగా తీసుకున్న ఛాయాచిత్రాలు.


ఆత్మీయుల సమావేశం
 చింతా వారిచే సన్మానం -  అన్నపరెడ్డి వారిచే సన్మానం