పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016-04-10 పోతన భాగవత పూజా మహోత్సవము

:: జాతీయ మహాకవి బమ్మెర పోచనామాత్యుల వారి భాగవత పూజా మహోత్సవం ::
దేశ రాజధాని న్యూఢిల్లీలో

: వేదిక: ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణం : | | : సమయం: తేదీ. 2016-04-10; మధ్యాహ్నం:

పరమ భాగవతోత్తములు ప్రాచార్యులు ఏల్చూరి మురళీధరరావు గారు. శ్రీ వేంకటేశ్వరా కళాశాల, ఢిల్లీ ఆచార్యులు మరియు తెలుగు సాహితి, ఢిల్లీ కార్యదర్శి, వారు మన తెలుగు భాగవతం ద్వారా పోతనామాత్యులు మరియు వారి భాగవతం విశిష్ఠత, స్పూర్తి, సందేశాలు ఇక్కడ ప్రచారం జరగాలని; సంకల్పించి; నామకరణం చేసి; మార్గదర్శకం చేసి; బహుళ జయప్రదంగా జరిపించారు. కాని అనివార్య కారణాల వలన వారు వ్యక్తిగతంగా రాలేక పోయినా, సభ జయప్రదం కావటానికి మూలకారకులు మా నల్లనయ్య; తరువాత వారే. అడగగానే అంగీకరించి అతిథిగా విచ్చేసి; సభను అలంకరించి; అలరించిన విశిష్ఠ వ్యక్తి ప్రాచార్యులు శ్రీ మాడభూషి శ్రీధరాచార్యుల వారు, సహితీవేత్త, రచయిత ,ఇన్ఫర్మేషన్ కమిషనరు గారు చూపిన ఆదరాభిమానాలు మరువరానివి. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, డా. ఎమ్. వి. రామారావు గారు; శ్రీ తిలక్ గారు మున్నగు మహానుభావుల రూపంలో ఎంతో సహృదయంతో వేదికగా తమ ప్రాంగణం అందించి ఆదరించారు; పోతన భాగవత పద్య పఠన పోటీ నిర్వహింపజేసి మరెన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. దూరాభారం అనుకోకుండా మా భాగవత బంధువులు హైదరాబాదు నుండి శ్రీ బండి శ్రీనివాస్, శ్రీ ఉమామహేశ్; గురుగావ్ నుండి శ్రీ సీతారామ్ తరలి వచ్చి సభను జయప్రదంగా నిర్వహించారు. అలా అందరి సహకారంతో "జాతీయ మహాకవి పోతన భాగవత పూజా మహోత్సవ" కార్యక్రమం మంగళ ప్రదంగా జరిగింది. ఆ మథురస్మృతులను గుర్తుచేసే కొన్ని ఛాయాచిత్రాలు వీక్షించండి:-

భాగవత పూజా మహోత్సవం-1
సభ ప్రారంభింస్తూ. . .
భాగవత బంధువు శ్రీ బండి శ్రీనివాస్

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-invitation
ఆహ్వాన పత్రిక

- - - - -- -
భాగవత పూజా మహోత్సవం-2
సభా ప్రారంభంలో సత్కాలక్షేపంగా . . .
జయంతీ అయ్యర్ మ్యూజిక్ అకాడమీ ఢిల్లీ
విద్యార్థులు - అవినాష్, అవ్యక్త,
శివాని రాజేష్, మీరా నాయరు, శ్రియ కృష్ణల
సంగీత విభావరి

- - - - - - - -
భాగవత పూజా మహోత్సవం-3
వేదికను అలంకరించమని అతిథులను ఆప్వానిస్తూ. . .
చేతులారంగ . . పద్యం తలచుకుంటున్న భాగవత బంధువు శ్రీ సీతారాం

- - -- - - -
భాగవత పూజా మహోత్సవం-4
సభ ప్రారంభింస్తూ. . .
ప్రార్థన గీత ఆలాపన

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-5
ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ అద్యక్షులు, భాగవతులు
డా. ఎమ్. వి. రామారావు గారి సందేశాత్మక ప్రసంగం

- - - - - - -
భాగవత పూజా మహోత్సవం-6
ప్రాచార్య మాడభూషి శ్రీధరాచార్యులవారు. . .
భాగవత ప్రశస్తి స్పూర్తి ప్రకటించే అమూల్య సందేశం ఇచ్చారు
వారి చేతుల మీదుగా భాగవత పద్యాల పఠన పోటీ విజేతలు
ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక నగదు బహుమతులను అందుకున్నారు.

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-7
జ్ఞాపికలు అందుకున్న. . .
శాస్త్రీయ సంగీత గురు, శిష్యులు

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-8
ప్రాచార్యులు మాడభూషి శ్రీధరాచార్యులకు . .
సన్మానం చేస్తున్న భాగవత గణనాధ్యాయి
ఎడం ప్రక్కన నిలబడిన వారు పరమ భాగవతులు ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ. ఈశ్వర ప్రసాద్ గారు

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-9
ఎఇఎస్ అద్యక్షులు డా. ఎమ్, వి. రామారావు గారికి సన్మానం

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-10
ఎఇఎస్ అద్యక్షులు డా. ఎమ్, వి. రామారావు గారికి సన్మానం

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-11
ఆదర్శ దంపతులు . . .
భాగవత బంధువు శ్రీ ఆలమూరు సీతారాం వారి శ్రీమతి
సన్మానం చేస్తున్నది భాగవత గణనాధ్యాయి అర్థాంగి శ్రీమతి లలిత
ఛాయాచిత్రం తీస్తున్నది భాగవత బంధువు ఉమామహేశ్

- - - - - - -
భాగవత పూజా మహోత్సవం-12
సత్కారం అందుకుంటున్న. . .
భాగవత బంధువు శ్రీ ఉమామహేశ్

- - - - - -
భాగవత పూజా మహోత్సవం-13
ప్రముఖ రచయిత, పండితురాలు, డా. ప్రభల జానకి గారిని . . .
సత్కరిస్తున్న భాగవత గణనాధ్యాయి

- - - - -
భాగవత పూజా మహోత్సవం-14
పూజ్యులు, ప్రవచన కర్త, జ్యోతిష శాస్త్రజ్ఞుడు, పరమ భాగవతుడు
శ్రీమాన్ ప్రభల సుబ్రహ్మణ్యం గారు
దూరాభారం వయోభారం గణించకుండా రాజమండ్రి నుండి వచ్చి
భాగవతం స్పూర్తిని వ్యక్త పరచే తమ అమూల్య సందేశాలను అందించారు వారికి
భాగవత గణనాధ్యాయి సన్మానం చేస్తున్నారు

- - - - -
2016-04-10వ తారీఖున జాతీయ మహాకవి పోతన భాగవత పూజా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పోతన భాగవత పద్యాల పోటీలో ఎంపిక అయి, జయ పత్రాలు అందుకున్న విద్యార్థులు
దివిజ, 2వ తరగతి. ఆంధ్ర పాఠశాల. ఐ టి ఓ, న్యూఢిల్లీ.
డి. సాయి నందిని, 3వ తరగతి, ఆంధ్ర పాఠశాల, జనక్ పురి, న్యూఢిల్లీ,
టి ఎస్ ఎస్ శ్రీజ, 5వ తరగతి. ఆంధ్ర పాఠశాల. జనక్ పురి, న్యూఢిల్లీ.
బి. ఆదర్శ్, 5వ తరగతి, ఆంధ్ర పాఠశాల, పుష్పవిహార్, న్యూఢిల్లీ,
జి. మానస, 6వ తరగతి. ఆంధ్ర పాఠశాల. గాజీ పూర్, న్యూఢిల్లీ.
మనస్వి, 7వ తరగతి, ఆంధ్ర పాఠశాల, ఐ టి ఓ, న్యూఢిల్లీ,
కృష్ణ శ్రీ, 10వ తరగతి. ఆంధ్ర పాఠశాల. ఐ టి ఓ, న్యూఢిల్లీ.
కావ్య శ్రీ, 10వ తరగతి, ఆంధ్ర పాఠశాల, ఐ టి ఓ, న్యూఢిల్లీ,
- - - - -
భాగవత పూజా మహోత్సవం-15
పద్యాల పోటోలో ఎంపికైన విద్యార్థులకు జయపత్రం, నగదు బహుమతుల తోపాటు అందించిన జ్ఞాపిక ఛాయాచిత్రం

- - - - -
భాగవత పూజా మహోత్సవం-16
అతిథులకు, ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలకు అందించిన జ్ఞాపిక ఛాయాచిత్రం.