పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2017 భాగవత బంధువుల ఆత్మీయ సమాగమము(1) sgp-snigdha-1   sgp-snigdha-1సింగపూరులో 10-జూను-2017న. చక్కటి భాగవత ఆత్మీయ సమాగమం చేసుకున్నాం. ఆత్మీయ విషయాలు, భాగవత విశేషాలు ఎంతో సంతోషంగా పంచుకున్నాం. చి. సౌ. స్నిగ్థ, తన అమ్మగారు చి. సౌ. సరస్వతిగారు, చి.సౌ. విద్యాధరి చక్కటి సంగీత విద్వాంసులు. వారు తమ అమృత కంఠాలతో మనసులను అలరించారు. చక్కటి భోజనాలతో ఆత్మారాముని అలరించాము. మా నల్లనయ్య అనుగ్రహంతో ఇంత చక్కటి సాయంత్రం గడిపిన భాగవత సమాగమంలో పాల్గొన్న అదృష్టవంతులు:- ఆత్మీయ భాగవత బంధువు స్నిగ్థ, తన భర్త, అబ్బాయి కార్తికేయ, తల్లిదండ్రులు; భాగవత గణనాధ్యాయి, తన శ్రీమతి, చిన్నబ్బాయి, కోడలు, మనవలుvsp-RAparna-1   vsp-RAparna-2   vsp-RAparna-3   vsp-Radha(2) 2017- జూలై, 1 తారీఖున విశాఖపట్నంలో ఆత్మీయ భాగవత బంధువు శ్రీమతి రాచపూడి అపర్ణ దంపతులుతో ఆహ్లాదకర సమాగమం కుదిరింది. ఎన్నో విషయాలు చర్చించుకున్నాము. గణన విధానాలు గురించి చర్చించుకున్నాము. ఈ సందర్భంగా మథుర జ్ఞాపకాల ఛాయాచిత్రాలు తీసుకున్నాము.
(3) మరల 2017-జూలై, 6వ తారీఖున విశాఖపట్నంలో ఆత్మీయ భాగవత బంధువు శ్రీమతి పింగళి రాధ గారితో ఆత్మీయ సమాగమంVirava-RajaChandra-1   Virava-RajaChandra-2(4) 2017 - జూలై, 9వ తారీఖున కాకినాడ లో ఆత్మీయ భాగవత బంధువు, హిందూ టెంపుల్సు గైడు జాలగూడు వ్యవస్తాపకుడు శ్రీ రాజాచంద్రను కలిసి తెలుగుభాగవతం గురించి ట్రస్టు గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నాము. తన స్వగ్రామానికి విరవ గ్రామం తీసుకువెళ్ళ వారి రామాలయం, కుటుంబ సభ్యలను పరిచయం చేసారు.(5) miyapur kavisammelanam  2017-ఆగస్టు-17వ తారీఖున హైదరాబాదులోని మియాపూరులో ఆత్మీయ కవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి గారు, శ్రీ గుండా సుబ్బయ్య గారు, శ్రీ సి. రామోహన రావు గారు, శ్రీ, ఎమ్. శ్రీధర రావు గారు గణనాధ్యాయి సమ్మేళనం జరిగింది అనేక సాహిత్య విశేషాలు తెలుగు భాగవతం గురించి చర్చలు రసవత్తరంగా జరిగాయి. 
   

మహాకవి చింతా రామకృష్ణా రావు వారు ఆశువుగా చెప్పిన పద్యం వినిపించారు
శార్దూల విక్రీడితము
శ్రీకృష్ణుండు దయాంతరంగుండును రాశీభూతచైతన్యమున్
మీకుం దక్కెను నల్లనయ్య కృపతో మీ భాగ్యమేమందు నేన్
సాకారంబుగ పోతనన్ నిలిపి సంసారాంబుధిని మున్గుమా
కే కానంబడజేసిరా హరిని; లోకేశుండు మిమ్మున్ గనున్