పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2020 భాగవతరత్న పురస్కారాది (ఆన్ లైన్).

: :చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మన మందరం: :

  2020 అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములు వార్షికోత్సవములు ఆగష్టు 11 కృష్ణాష్టమి నాడు జయప్రదంగా శుభప్రదంగా జరుపుకున్నాము. ఈ సారి సింగపూర్ నుండి శ్రీమతి & శ్రీ. విద్యా భాస్కరుల నిర్వాహణలో ఆన్ లైన్ (వెబ్ నైర్ - యూట్యూబ్ లైవ్) విదానంలో జరుపుకున్నాము.. శ్రీ బండి శ్రీనివాస శర్మ గారు వ్యాఖ్యాతగా చక్కగా చేసారు
చి. శ్రావ్యరత్న ప్రార్థనా శ్లోకం, చి. ఆయుషి నృత్యం, చి. సౌ. విద్యాధరి గాత్రంతోనూ ప్రేక్షకులను ఆనందింపజేసారు.
భాగవతంలోని ప్రహ్లాద ఘట్టం మఱియు అచ్యుతురత్న భాగవత మాలా సామూహిక పారాయణలో సింగపూరు నుండి, భారతదేశం నుండి మా భాగవత బంధువులు భక్తి ఉత్సాహాలతో పాల్గొన్నారు . ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులు ఆస్వాదించారు

2020టాబ్

ఈ శార్వరీ నామ సంవత్సర (క్రీ.శ 2020) భాగవతరత్న పురస్కారం డా. గోదావరి వేంకట మురళీమోహన్ గారికి స్వామీజీ అమృతానంద సరస్వతీ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ భాగవత గణనాధ్యాయి, తెలుగు భాగవత ప్రచార సమితి అద్యక్షులు వారి అమృత హస్తాలమీదుగా ప్రదానం చేయడం జరిగింది. జ్ఞాపిక రూపేణా ఒక లెనోవా-A-10 టాబ్లెట్టు మఱియు చిరుతాంబూలాలతో సత్కారించడమైనది. డా. గోదావరి - ప్రాచార్య టి. ఎస్. గిరిప్రకాషు పర్యవేక్షణలో ★పోతన మహాభాగవతం - అలంకార వైభవం★ అను విషయంపై పిహెచ్.డి పట్టా, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయము, మధురై నుండి 2013లో పొందారు. వారు సంతోషం వ్యక్తం చేస్తూ... పోతన రచనా వైశిష్ఠ్యం, అలంకారా వైభవాలను చక్కగా వివరించారు.
తెలుగు భాగవత ప్రచార సమితిఇంత చక్కటి కార్యక్రమాని వీక్షించి ప్రోత్సహించిన వీక్షకులకు; భాగవతరత్న డా. గోదావరికి; కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ఆత్మీయ భాగవత బంధువులకు; నిర్వాహణ బాధ్యతలు, సాంకేతిక సహకారం, అందించిన మా ఆత్మీయ భాగవత బంధువులకూ; పురస్కార ఎంపిక మండలికీ; అందరకూ పేరుపేరునా కృతజ్ఞతలు

2020-డా. గోదావరి బిరుదు పత్రం2020-డా. గోదావరి సన్మాన పత్రం