పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2022 - భాగవత జయంతి

తెలుగు భాగవత ప్రచార సమితి వారు భాగవతరత్న పురస్కారం శుభకృత్ నామ సంవత్సరానికి తత్కాల సా.శ. 2022 నకు, ప్రదానానికి అభ్యర్థనలను సదరు మే నెల 30వ తారీఖున ఆహ్వానించారు. అందిన అభ్యర్థనలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు ప్రిన్సిపాల్ డా. తాడేపల్లి పతంజలి గారు, శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, ఆచార్య డా. ఆశాజ్యోతి గారు సూచనలు అందించారు. శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామి వారు "డా. రామక పాండురంగ శర్మ" గారికి ప్రదానం చేయమని నిర్ణయం అనుగ్రహించారు. ఆ ప్రకారం:
సదరు తె భా ప్ర స వారు కృష్ణాష్టమి (18.08.2022) నాడు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారూ, బ్రహ్మశ్రీ ప్రభల సుబ్రహ్మణ్య శర్మగారు మున్నగు అతిథి మహానుభావుల సమక్షంలో హైదరాబాదు రవీంద్రభారతి మినీహాలునందు జరిగిన భాగవత జయంత్యుత్వముల సభ యందు, శుభకృత్త నామ సంవత్సరమునకు (2022) "భాగవతరత్న పురస్కారం డా. రామక పాండురంగ శర్మ" గార్కి ప్రదానం చేయడం జరిగింది.
ఆ సభా విశేషాలు ::