పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం - 5-401-500

401

దానిచే నగ్గోపనయుల నొంపఁ
గానోపితిరయేని లదు సూ మెచ్చు”
ని ప్రధానునిఁ జూచి నియె, “మీనేర్పు
లెనయంగఁ జనుదెంచు నీచతుర్దశిని
లపెట్టుఁ డొక్క కోదండ యాగంబు
లఘు తద్దర్శనవ్యాజంబు నెఱపి
వారల రావించి డిమీరఁ ద్రుంచి
ధీరత నవ్వసుదేవు నణంచి
గ్రసేనుని కాజ్ఞ యొనరించి తక్కు
గ్రగణ్యతఁ గల్గు దువులం దఱిమి
హితులు మీరలె కాఁగ నేలుదు భూమి
తురాత్ముఁడగు జరాసంధుండు మెచ్చ”
నుచు నక్రూరుని నాదటం బిలిచి
ననుత! నందవ్రమునకు నీవు
యమున నరిగి యా రామునిం గృష్ణు
యకరంబగు ధనుర్యాగంబుఁ జూచు
నెసమునం దోఁదెమ్ము నీకల్గు నేర్పు
విపులమై మించు నా వేరంబు

హయరూపమున వచ్చిన కేశి యును దానవుని శ్రీకృష్ణుఁడు సంహరించుట

నియంతిపురమున రిగె, నాకేశి
నుజుండు నంత నంవ్రజంబునకును


[50] దీరు”

411

రూపమున నేగి లజడిసేయ
మున వాని గర్వము చూచి శౌరి
వ వచ్చెడి నోరఁ రమిడిత్రిప్పి
ఱిముఱి చెఱిచిన తఁడుర్వి వ్రాలె

నారదుఁడు శ్రీ కృష్ణునిఁ బ్రస్తుతి చేయుట

వెళ నారదుం రుదెంచి కృష్ణుఁ
బానతరమూర్తిఁ బ్రస్తుతి సేసె
కంసుండు నీ చేతఁ డముట్టు మఱియుఁ
గంసన్నిభులు పెక్కండ్రణంగుదురు
నియెడు నీ చేత గతిభారంబు”
నిపల్కి ప్రణమిల్లి రిగె నిజేచ్ఛ

మయాత్ముజుఁడైన వ్యోముఁడను వాఁడు గోపకులను మోసముతో హరించి కొండ గుహలో దాచగా శ్రీకృష్ణుఁడా గుహద్వారమును ఛేదించి గోపకుల విడిపించుట

రుల[51] మంచుఁ గొంఱు మూఁగియుండ
గఁగొంద ఱందు మంలవారుఁ గాఁగ
చోకులై గోపసూనులుఁ గొంద
రాసి తగరుల రియించి కొండ్రు
యీరీతి విహరించునెడఁ గృష్ణుఁ జూచి
దారుణాకృతి మయాత్మజుఁడు వ్యోముండు
యెడఁ జోరులండఁగి యా తగరు
లైయున్న బాలుర రిఁ గనుంగొనఁగ
కొనిచని చని యొక్క గుహ నిడి వాత[52]
గండ శైలంబుఁ దియించి మఱియు


[51] తగరు- పొట్టేలు
[52] వాత- ముఖద్వారం

421

యేతెంచు తఱి వాని హింసించె శౌరి
చేతుల కొలఁదియుం జెలరేఁగి మోది
శిల వోఁదన్ని వి[53] లోన నున్న
గోపకులఁ దెచ్చెఁ దనంతరంబ

అక్రూరుఁడు హలరామకృష్ణులను మధురకుఁ దోడ్కొని పోవుటకై నంద వ్రజమున కేతెంచుట

నాథ యా మరునాఁటి సాయమున
గురుబుద్ధి యైన యక్రూరుఁ డార్యుండు
రికిని లీల నిలాస్పదం బగుచు
రిలేని నంద వ్రమున కేతెంచి
కృష్ణులకు భక్తిఁ బ్రణమిల్లి వారి
పు కోలునకు వెగ్గళముగాఁ[54] బొదలి
నందుని యింట నన్నము భుజియించి
సండి గొనునట్టి ల్లాపసరణి


నుఁగంసుఁ డనిపిన లఁపెల్లఁ దెలుప
వినియాత్మలోన గోవిందుండు మెచ్చి
నందాదులకుఁ బయనంబెఱింగింప
నందాదులునుఁ బయనంబయినంత
వేఁకువ లేచి పూవిల్తుని చేతఁ
గాఁలఁబడు గోపిల నూరడించి
వడ నక్రూరురదంబు నెక్కి
లుఁడునుం దాను సంభ్రమముతో శౌరి


[53] గవి- గుహ
[54] వెగ్గళము- అత్యధికము

431
రకఁ[55] గదిసె గోకులు సేవింపఁ
లె నమ్మధురకుం ని వేల్పు లలర

యమునానదిలో స్నానమాడుటకు వెళ్ళిన యక్రూరునికి శ్రీకృష్ణుఁడు తన దివ్యదర్శన మనుగ్రహించి జ్ఞానోదయము కల్గించుట

తెరువున యమునలో తియ్యని నీరు
రితోషమున నాని[56] లకృష్ణు లచట
నిలిపిన రథముపై నెఱిఁ బవ్వళించి
సిన పగిది నేత్రాబ్జముల్ మూసి
రాలోన నక్రూరుఁ డానది యంద
నాస్యగతిఁ దీర్థమాడుచు మునిఁగి
యందులో బలయుక్తుఁగు కృష్ణుఁ గాంచి
యందంద నెఱగంది ప్పుడ లేచి
ముపై నున్న యారామకేశవులఁ
బ్రథిక వృత్తులఁ గాంచి భ్రమసె తోడుతనె
మునిఁగి క్రమ్మఱ లోన మోదంబుతోడ
వేష పర్యంకుఁ మ్ర వత్సాంకు
శంచక్ర గదాబ్జహితోరు హస్తు
శంసన్నిభ కంఠమమణి శస్తు
ల భూషణ మణిచ్ఛాయాభిరాము
కుశ మనోహర లధర శ్యాము
రిసించి పెక్కు చంముల నుతించె
రియు నంతర్హితుంయ్యె నా క్షణమ


[55] పదరక- త్వరపడక
[56] ఆను- భక్షించు, త్రాగు

441

అంతఁదీర్థంబాడి రుదెంచు భాగ్య
వంతునక్రూరు నవ్వనమాలి చూచి,
నీటిలోఁ దడవుంటి నీకెద్ది యైనఁ
బాటిల్లెనో కానఁడి విశేషంబు”
నావుఁడు “నీ దర్శనంబె విశేష
మేవంక” నని, నుతియించిన మెచ్చి

బలరామకృష్ణులు అక్రూరునితో మధురాపురి ప్రవేశించుట

తఁడును బలుఁడుఁ దో- రుదేరఁ గీర్తి
తుఁడు కృష్ణుఁడు మధురాపురంబునకు
చి యచ్చేరువ నందాదు లెల్ల
నొడికంబుగా[57] మున్నె యొనరించి యున్న
వాసమున నిల్చె, క్రూరుఁ డంత
దావీడు సొచ్చి మోమునఁ గంసునకు
రిరాక యెఱిఁగించె రియును నంత
పురిఁజూచు వేడుక పొంపిరివోవ

బలరామకృష్ణులు మధురానగర శోభను వీక్షించుచు దుండగుల శిక్షించి భక్తుల ననుగ్రహించుట

లయుక్తుఁ డగుచు గోకు లిరుమేల
లయంగఁ బురి సొచ్చి మాపటి వేళ
లువ లొసంగక వైపరీత్యములు
లికెడు రజకునిఁ బౌరులు చూడ
దండించి వానిచే వళవస్త్రములు
లుఁడునుఁ దాసు గోకులునుం దాల్చి


[57] ఒడికము- యుక్తము

451

నతుం డగుచు వాకుఁ డొప్పగించు
నానామణీ భూషణంబులుఁ దాల్చి
రుదుగాఁగ సుదాము నాలయంబునకు
రిగి వాఁడొసఁగు మాల్యములు ధరించి
అందమేదిన కుబ్జగు కాంతఁ దనకు
గంధ మిచ్చుటకుఁ జక్కదనం బొసంగి
కినుకమై జను లెఱింగించు మార్గమునఁ
ని యా ధనుర్యాగశాలవే సొచ్చి

కంసుని ధనుర్యాగశాలనుఁ బ్రవేశించిన శ్రీకృష్ణుఁడు ధనుస్సును నెక్కు పెట్టి విఱచుట

టఁ బూజించిన యాకంసహతకు
రుచిర చాపంబు నిరూఢియై నెత్తి
లీలఁగాఁగ సజ్యము సేసి విఱిచె
మున నహితాంతరంగముల్ బెదర
లఁగి యడ్డము వచ్చు కావలి వారిఁ
దొలఁగక యా వింటితునుకల చేతఁ
మోది కృష్ణుఁ డాలుఁడునుం దాను
డినేగి రాత్మనివాసంబు కడకు

సూర్యాస్తమయ, చంద్రోదయ వర్ణనము

యిట్టిశోభన వార్త యెఱిఁగించఁ బోవు
ట్టికైవడి భానుఁ పరాబ్ధిఁ గ్రుంకె
కంసువదన మిట్టగు న్ననయటుల
జోకఁదప్పుచుఁ దమ్మి సుఱ్ఱన స్రుక్కె

461

శౌరికంసునిఁ ద్రుంచి య్యనఁ గొంత
భారంబుఁ దీర్చు నిప్పటికని పొడము
నిరాగ మటు మీదికెగసి దీపించు
వునం జరమ సంధ్యారాగ మలరె
ట లీ గతి కంసనితల కొదవు
నుగతి బలువయ్యెనంధకారంబు
కంసుహారపు మౌక్తిము వెల్లి శౌరి
హింసించు వేళఁ చెల్లీరీతిఁ జెదరు
నితెల్పునట్టి యొయ్యారంబు మెఱయఁ
నుపట్టెఁ దారకాణములు మింట
సిన కృష్ణుపై నాత్మకరంబు
మెయింతు నిపుడ నీ యూహించు నటుల
నుయించె నమృతమయూఖుండు మేన
నొవిన కెం పొయ్య నొయ్యన జార

కంసుని కంటికి కునుకు పట్టకనే రాత్రి తెల్లవారుట

వేళ బలకృష్ణు చ్చోట నందు
నావాసమునఁ బాలున్నంబుఁ గుడిచి
యుండిరి కంసుండు నొదవెనే యిట్లు
గండంబనుచు నిద్రఁగానక యుండె

సూర్యోదయ వర్ణనము

రికిఁగాఁ గలుగు జయంబు సూచించు
రుదైన మరుని కాళములో యనఁగ


471

కుక్కుట గణము మిక్కుటముగా నిక్కి
కొక్కరకో యని కూయంగఁ దొణఁగె
యిదియిట్టె యుదయించు, నినుని చందమున
దువుల కభ్యుదముగల్గు నిపుడ
నిచూపి చెప్పంగరుదెంచు కరణిఁ
నుపట్టె రుచి యెక్కఁడు వేగుఁజుక్క[58]
శౌరికంసుని ద్రుంచున్నాహమెల్ల
వాక కనుఁగొనలయు నివ్వేళ
నియున్నతప్రదేశారోహణంబు
నొరించు గతి భానుఁడుదయాద్రి యెక్కె

కుహనా ప్రయుక్తితోఁ గంసుఁడు కొలువుఁదీర్చుట

రాజేంద్ర! యీ రీతి వి యుదయింప
రాజితం బగునట్టి రంగగేహమున
కొలువుండి కంసుండు కుహనాప్రయుక్తిఁ
పెట్టె మల్లయుద్ధప్రసంగంబు
మంలేశ్వరులు నమాత్యులుం గొలిచి
యుండిరా కంసుని యుభయ పార్శ్వముల
పొసఁగ నందాది గోకు లుపాయనము
లొసఁగి సేవించుచునుండి రచ్చోట
మొగిఁగూడి చాణూరముష్టిక ముఖ్యు
గుజెట్లు సన్నాహులైవచ్చునంత


[58] వేగుచుక్క- ఉదయం శుక్రుడు ఉదయించి కనబడు కాంతివంతమైన చుక్క

శ్రీ కృష్ణుఁడు కువలయాపీడమను మదగజమును దానిని తనపై యుసిఁగొల్పిన నంబష్ఠుని సంహరించుట

481

ణిత ప్రహత వాద్యరవంబు మించె
నంబు ముట్టునా జిబిజి వినుచు
రంగంబు చొరబాఱు రామునిం గృష్ణుఁ
భంగించు బుద్ధి నంష్ఠుండు చూచి
కులయాపీడంబుఁగొన వ్రేళ్ళఁ బొడిచి
వియించెఁ గృష్ణుపైఁ ఠినాత్ముడగుచు
వొడుపుఁ దప్పించుక యొయ్యన కాళ్ళ
డుమఁ గృష్ణుండు విన్నాణియై వెడలి
తోఁవట్టి కుదించి తూరి యెదిర్చి
యాఁలేక గజంబు వనిపై వ్రాల్చె
రు నమ్మద హస్తిదంతంబె తిగిచి
కొనిమోది యంబష్ఠకుని[59] నుర్వి వ్రాల్చె
యీరీతి నచట నయ్యిభము నంబష్ఠుఁ
బౌరుషంబున వ్రాల్చి ప్రబలుఁడై శౌరి
క్షించి రంగస్థమున కేగుటయు
నీక్షించి చాణూరుఁ డిట్లని పలికె

చాణూరుఁడు తన రాజైన కంసుని వినోదార్థము శ్రీ కృష్ణుని మల్ల యుద్ధమునకై నాహ్వానించుట

గోనందన! యిట్టి కొలువులోఁ గంస
భూతి మదినింపు పొంపిరి వోవ
వొరింతమే బాహుయుద్ధంబు, నిన్ను
నులెన్నుదురు భుజత్వంబు నందు


[59] అబష్ఠకుడు- మావటి, ఏనుగును పాలించు చాకలివాడు

491

తొలఁగక నీవు నాతోఁబెనంగుటకు
నెకొన్న కడిమిమైనిలిచితి వేని
రాముని తోడఁ బోరామి దీపించ
మాముష్టికుఁడు నిల్చుల్లయుద్ధమున”

పల్లెటూరి గొల్లపిల్లవారు మల్లయుద్ధ మహావీరులిద్దఱితో నెట్లు పోరాడగలరని గోవిందుఁడు నేర్పుగా బదులు చెప్పుట

నుటయు గోవిందుఁలవోక నవ్వు
లెయఁ జాణూరునివేపు మైఁ జూచి
చారులము, గొల్లవారి బాలకుల
మొర మీతోఁ బోరనోపుదు మెటుల?
యినను మానేర్చుటులఁ జూపఱకు
ప్రిముఁ గావింతు మోపిక” నని పలికి
న్నయుం దాను రయంబులో నలర
న్నద్ధులై రెల్లనులర్థిఁ జాడ
జలోచనుఁ డంతఁ జాణూరుఁ గదిసె
లుఁడు ముష్టికునిఁ జొప్పడ నెదుర్పడియె

శ్రీకృష్ణ చాణూరులు మల్లయుద్ధము సేయుట

రియుఁ జాణూరుండు వ్వేళ గిరియు
గిరియునుం దాఁకినక్రియ లావు మెఱయ
వొడియుచు జడియుచు నొయ్యన నొంపఁ
డఁగుచు నడఁగుచుఁ రకరి నఱిమి
రక చెరదక హు మండలములఁ
బ్రిదులక యదలక పెను మచ్చరముల