పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 11

1001
ద్రౌణిధిక్కృతియు, శాంనవ[278] సంస్థితియు,
రాణించు ధర్మజు రాజ్యాధిగమము,
శౌరిద్వారక ప్రవేశంబు సేయుటయు,
శ్రీమ్యుఁడగు పరీక్షితుని జన్మంబు,
ఆంబికేయుని యరణ్యప్రవేశంబు,
నంబుజాక్షుఁడు విజయంబు సేయుటయు,
పాండునందన మహాప్రస్థాన నిధియు,
పాంవమధ్యమపౌత్ర దిగ్జయము,
లిభంజనము, శృంగి నశాప గతియు,
నిఱేఁడు గంగకునేఁగి నిల్చుటయు,
లువొందు శుక దర్శనంబును నాఁగఁ
ప్రథమస్కంధ థలును మఱియు
నాదిఁబరీక్షితుండిగిన తెఱగు,
నాదృతుండైన ఖట్వాంగు మోక్షంబు,
నొప్పారు ధారణాయోగ లక్షణము,
ప్పరమేశుని వతార నుతియు,
బ్రహ్మదేవుండు తపంబొనర్చుటయు,
బ్రహ్మకు విష్ణుండు ప్రత్యక్షమగుట,
బ్రహ్మయు హరియును భాషించు తెఱఁగు,
బ్రహ్మనారదుల సంభాషణ క్రమము,


[278] శాంతనవుఁడు- శంతనుని కుమారుడు, భీష్ముఁడు

1011
నొరెడు దశలక్షణోదాహరణము
నువేరుఁ గల ద్వితీస్కంధ కథలు
పొసఁగి యలంకారపూర్ణమై చెలగి
మానమగు ప్రథమాశ్వాసమయ్యె

~~ x ~~