పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదాగమనంబు

  •  
  •  
  •  

1-86-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న చేతి వల్లకీతంత్రీ స్వనంబున-
తత నారాయణబ్ద మొప్ప,
నానన సంభూత రిగీతరవ సుధా-
ధారల యోగీంద్రతులు సొక్కఁ,
పిల జటాభార కాంతిపుంజంబుల-
దిశలు ప్రభాత దీధితి వహింపఁ,
నులగ్న తులసికా దామగంధంబులు-
గనాంతరాళంబు ప్పికొనఁగ,

1-86.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చె మింటనుండి వాసవీనందను
డకు మాటలాడఁ డఁకతోడ,
ద్రవిమలకీర్తిపారగుఁ, డారూఢ
యవిశారదుండు, నారదుండు.

టీకా:

తన = తన; చేతి = చేతిలో ఉండే; వల్లకీ = వీణ; తంత్రీ = తీగల; స్వనంబునన్ = శబ్దమువలన; సతత = ఎడతెగని; నారాయణ = నారాయణ యనే; శబ్దము = శబ్దము; ఒప్పన్ = అలంకరింపగా; ఆనన = నోటి నుంచి; సంభూత = వెలువడే; హరి = విష్ణువు యొక్క; గీత = పాటల; రవ = ధ్వని (యనే); సుధా = అమృత; ధారలన్ = ధారల వలన; యోగ = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠమైనవారి; తతులు = సమూహము; సొక్కన్ = పరవశించగ; కపిల = కపిల (రాగి) రంగుతో; జటా = జడల; భార = చుట్టల యొక్క; కాంతి = కాంతి; పుంజంబులన్ = సమూహములతో; దిశలు = దిక్కులు; ప్రభాత = ఉదయపు; దీధితి = వెలుగు; వహింపన్ = నింపుకొనగ; తను = శరీరమున; లగ్న = ధరింపబడిన; తులసికా = తులసి; దామ = దండ యొక్క; గంధంబులు = సువాసనలు; గగన = ఆకాశము; అంతరాళంబున్ = లోపలంతా; కప్పుకొనఁగ = వ్యాపించగ;
వచ్చెన్ = వచ్చెను; మింట = ఆకాశము; నుండి = నుండి; వాసవీనందను = వాసవి యొక్క {వాసవీనందనుడు - వాసవి యొక్క పుత్రుడు, వ్యాసుడు}; కడ = దగ్గర; కున్ = కు; మాటలాడన్ = మాట్లాడాలనే; గడఁక = ఉద్ధేశ్యము; తోడన్ = తో; భద్ర = క్షేమము; విమల = నిర్మలము యైన; కీర్తి = కీర్తి; పారగుఁడు = పొందినవాడు; ఆరూఢ = ప్రసిద్ధమైన; నయ = మేలైన; విశారదుండు = విద్వాంసుడు; నారదుండు = నారదుడు; కనియెన్ = చూసాడు; నారదుఁడు = నారదుడు.

భావము:

ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణనామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృతప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతు ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్ఠలు గలవాడు, సకల శాస్ర్తపురాణ విశారదుడు ఐన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు.

1-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెన్ నారదుఁ డంతన్
వియైక విలాసు, నిగమ విభజన విద్యా
నితోల్లాసున్, భవదుః
నిరాసున్, గురుమనోవికాసున్, వ్యాసున్.

టీకా:

కనియెన్ = చూసాడు; నారదుఁడు = నారదుడు; అంతన్ = అంతట; వినయ = వినయముతో; ఏక = కూడిన; విలాసు = నడవడిక కలిగినవాడిని; నిగమ = వేదములను; విభజన = విభజించు; విద్యా = విద్యవలన; జనిత = పుట్టిన; ఉల్లాసున్ = ఉల్లాసము గలవాడిని; భవ = సంసారపు; దుఃఖ = దఃఖములను; నిరాసున్ = తిరస్కరించినవాడిని; గురు = అధికముగ; మనస్ = మనస్సు; వికాసున్ = వికసించినవాడిని; వ్యాసున్ = వ్యాసుని.

భావము:

అలా వచ్చిన నారదమహర్షి వినయశీలుడూ, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడూ, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడూ అయిన వ్యాసమునీంద్రుణ్ణి చూసాడు.

1-88-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌ క్రమంబునం బూజించిన, నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేల మీటుచు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈవిధముగా; నిజ = తన; ఆశ్రమంబు = ఆశ్రమము; కున్ = కు; వచ్చిన = వచ్చినట్టి; నారదున్ = నారదుని; ఎఱింగి = గమనించి; లేచి = లేచి; వ్యాసుండు = వ్యాసుడు; విధివత్‌ క్రమంబునన్ = యధావిధిగా; పూజించినన్ = పూజించగా; అతండు = అతడు; లేనగవున్ = లేతనవ్వు; ఎగడెడి = మొలచు; మొగంబు = ముఖము; తోడన్ = తో; విపంచిక = వీణ; తంత్రి = తీగలు; వ్రేల = వేలుతో; మీటుచున్ = మీటుచు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీవిపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు.

1-89-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధావు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి
జ్ఞావు, కామముఖ్యరిపుట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని
ర్ణేవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కారుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!""

టీకా:

ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు}; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు.}.

భావము:

“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”

1-90-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినఁ బారాశర్యుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని పలికిన; పారాశర్యుండు = వ్యాసుడు {పారాశర్యుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు.

1-91-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పుట్టితి వజు తనువునఁ, జే
ట్టితివి పురాణపురుషు జనము, పదముల్
మెట్టితివి దిక్కులం, దుది
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!

టీకా:

పుట్టితివి = జన్మించావు; అజు = బ్రహ్మయొక్క; తనువునన్ = శరీరము వలన; చేపట్టితివి = స్వీకరించావు; పురాణ = పూర్వముల కెల్ల పూర్వమైన; పురుషు = వ్యక్తి - భగవంతుని; భజనము = సంకీర్తనము; పదముల్ = దారులను; మెట్టితివి = దాటావు; దిక్కులన్ = దిక్కులను; తుది = సారాంశము; ముట్టితివి = దర్శించావు; మహా = ఉత్తమమైన; ప్రబోధమునన్ = జ్ఞానమున; ముని = మునులలో; నాథా = శ్రేష్ఠుడా.

భావము:

“నారద మునీంద్రా! నీకు తెలియనిది ఏముంది. బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశలందు తిరిగావు. మహత్తరమైన తత్త్వజ్ఞానంలో అందెవేసిన చేయ్యి అనిపించుకొన్నావు.

1-92-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక, నీవు సూర్యునిభంగి మూఁడు లోకములం జరింతువు; వాయువు పగిది నఖిలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞుండ వగుటం జేసి.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండా; నీవు = నీవు; సూర్యుని = సూర్యుని; భంగిన్ = వలె; మూఁడు = మూడు; లోకములన్ = లోకములలోను; చరింతువు = తిరుగుతూ ఉంటావు; వాయువు = గాలి; పగిదిన్ = వలె; అఖిల = సమస్త; జనుల = మానవుల మనసుల; లోనన్ = లోను; మెలంగుదువు = మెలగుతూ ఉంటావు; సర్వజ్ఞుండవు = సర్వ జ్ఞానములు గలవాడివి; అగుటన్ = అగుట; చేసి = వలన.

భావము:

అంతేకాకుండా, నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలలోను సంచరిస్తూ ఉంటావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి.

1-93-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కెఱుఁగరాని ధర్మము
లోములను లేదు, బహువిలోకివి నీవున్,
నా కొఱఁత యెట్టి దంతయు
నాకున్ వివరింపవయ్య నారద! కరుణన్.""

టీకా:

నీకు = నీకు; ఎఱుఁగరాని = తెలియని; ధర్మము = ధర్మం; లోకములను = లోకాలలో; లేదు = లేదు; బహు = అనేక విషయాలు; విలోకివి = దర్శించిన వాడవు; నీవున్ = నీవు; నా = నాకు కలిగిన; కొఱఁతన్ = లోపము; ఎట్టిది = ఎటువంటిది; అది = అది; అంతయున్ = అంతా; నాకున్ = నాకు; వివరింపవయ్య = వివరముగాచెప్పుము; నారద = నారదుడా; కరుణన్ = కరుణతో.

భావము:

నారదా! నీకు తెలియని ధర్మం ఏ లోకంలోను లేదు. అనేక విషయాలను అవలోచించినవాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు.""

1-94-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నారదుం డిట్లనియె.

టీకా:

అనిన = అని పలికిన; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.

భావము:

అని అడిగిన వ్యాసమునీంద్రుడితో నారదుడు ఇలా అన్నాడు.

1-95-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుక గాని విష్ణు కథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక; నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!

టీకా:

అంచితము = పూజింప తగినవి; ఐన = అయినట్టి; ధర్మ = ధర్మముల; చయము = సమూహము; అంతయున్ = సమస్తమును; చెప్పితివి = వివరించితివి; అందున్ = వాని; లోనన్ = లో; ఇంచించుక = కొంచెములో కొంచెము; కాని = కూడ; విష్ణు = హరియొక్క; కథలు = కథలు; ఏర్పడన్ = తేటపడునట్లు; చెప్పవు = చెప్పవు; ధర్మముల్ = ధర్మములను; ప్రపంచించిన = వివరణములతో చెప్పిన; మెచ్చునే = మెచ్చుకొనునా; గుణ = గుణముల యొక్క; విశేషములు = విశిష్టతలు; ఎన్నినఁన్ = పొగడుటచే; కాక = కాకుండా; నీకున్ = నీకు; ఈ = ఈ; కొంచెము = లోటు, న్యూనత; వచ్చుట = కలుగుట; ఎల్లన్ = సమస్తమూ; హరిన్ = విష్ణుమూర్తిని; కోరి = కోరి; నుతింపమిన్ = స్తుతింపక పోవుటచేత; ఆర్య = ఆర్యులచే; పూజితా = పూజింపబడువాడా.

భావము:

“ఆర్యులచే పూజితుడా! వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే.

1-96-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు; శ్రీ
రినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు, శ్రీ
మై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.

టీకా:

హరి = శ్రీహరి; నామ = నామములను; స్తుతిసేయు = స్తుతించు; కావ్యము = కావ్యము; సువర్ణ = మంచిరంగుగల, బంగారు; అంభోజ = తామర పూవులు; హంస = హంసల; ఆవళీ = పంక్తులతో; సు = మంచి; రుచి = ప్రకాశముతో; భ్రాజితము = వెలుగుతున్నది; ఐన = అయినట్టి; మానస = మానస; సరస్ = సరోవరము; స్ఫూర్తిన్ = తీరుగ; వెలుంగొందు = ప్రకాశించును; శ్రీహరి = మహావిష్ణువు యొక్క; నామ = నామముల; స్తుతి = స్తుతించుట; లేని = లేనట్టి; కావ్యము = కావ్యము; విచిత్ర = విశేషముగ చిత్రింపబడిన; అర్థ = అర్థములు; ఆన్వితంబు = కూడుకొన్నది; అయ్యున్ = అయినప్పటికిని; శ్రీకరమై = శుభంకరమై; ఉండదు = ఉండదు; అయోగ్య = యోగ్యముకానిది; దుర్మద = దుర్గంధపూరితమైన; నదత్ = మ్రోతతో కూడుకున్న; కాకోల = బొంతకాకుల; గర్తము = గుంట; ఆకృతిన్ = వలె.

భావము:

పరాశర పుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ అది శుభకరంగా ఉండదు. పైగా కంపుకొడుతూ బొంతకాకుల గోలతో కూడిన చెత్తగుంటలా అయోగ్యమై ఉంటుంది.

1-97-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
రిత్యాగము సేయుఁ; గావున హరిన్ భావించుచుం, బాడుచున్,
ముల్ సేయుచు, వీనులన్ వినుచు, నశ్రాంతంబు గీర్తించుచుం,
సుల్ సాధులు ధన్యులౌదురుగదా త్త్వజ్ఞ! చింతింపుమా.

టీకా:

అపశబ్దంబులన్ = వ్యాకరణ విరుద్ధమైన లేదా గ్రామ్య పదాలతో; కూడియున్ = కలిసి ఉన్నప్పటికి; హరి = విష్ణుమూర్తి; చరిత్ర = చరిత్రల; ఆలాపముల్ = పలుకులు; సర్వ = సమస్త; పాప = పాపములను; పరిత్యాగమున్ = పూర్తిగ విడిచిపోవుటను; చేయున్ = చేయును; కావున = అందువలన; హరిన్ = విష్ణువుని; భావించుచున్ = ధ్యానము చేస్తూ; పాడుచున్ = (లీలలు) గానము చేస్తూ; జపముల్ = జపాలు; చేయుచున్ = చేయుస్తూ; వీనులన్ = చెవులారా; వినుచున్ = వింటూ; అశ్రాంతంబు = ఎడతెగకుండగ; కీర్తించుచున్ = పొగుడుతూ; తపసుల్ = తాపసులు; సాధులు = మంచివారు; ధన్యులు = సార్థకులు; ఔదురు = ఔతారు; కదా = కదా; తత్త్వజ్ఞ = తత్త్వజ్ఞానము గలవాడా; చింతింపుమా = ఆలోచించుకోవయ్యా.

భావము:

తత్త్వవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు అసాధు పదాలతో కూడుకొన్నప్పటికీ, చక్కగా లేనప్పటికీ; సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా.
అనంతుని ఛందో దర్పణ గ్రంధంలో అప్శబ్దం ఇలా నిర్ణయింపబడింది
ఆ.
నుఁగొనంగ నాదివులకావ్యంబుల
లితమైన లక్ష్యక్షణముల
రూఢిగాని పెఱవిరోధోక్తు లపశబ్ద
సంజ్ఞికంబు లండ్రు గతిఁ గృష్ణ!
వివరణ: అపశబ్దము అంటే కుసంధి, దుస్సంధి, చుట్టుఁబ్రావ, వైరివర్గము, కాకుదోషము, కుఱచకాకు, దుష్ప్రయోగము అని చెప్పబడింది.సౌజన్యం- ఆంధ్రభాగరతి.కాం

1-98-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికం బైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థకంబులు; గావున,మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకల దిగంత ధవళకీర్తివి, సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబుకొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులంజేసి పృథగ్దర్శనుం డైనవాని మతి పెనుగాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను నావ చందంబున నెలవు సేర నేరదు; కామ్యకర్మంబు లందు రాగంబు గల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండ వగు నీవు వగచుట తగ; దది యెట్టు లనిన, వార లదియే ధర్మం బని జుగుప్సితంబు లగు కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు; గావున, బుద్ధి మోహంబు జనియింపక తత్వజ్ఞుండవై వ్యధా వియోగంబు సేయు"మని మఱియు నిట్లనియె.

టీకా:

మునీంద్రా = మునులలో శ్రేష్ఠుడా; నిర్గత = విడచిన; కర్మంబు = కర్మకలది; ఐ = అయి; నిరుపాధికంబు = ఉపాధి లేనిది; ఐన = అయినట్టి; జ్ఞానంబు = జ్ఞానము; హరి = హరి; భక్తి = భక్తి; లేకున్న = లేకపోయినచో; విశేషంబుగ = ప్రత్యేకముగా; శోభితంబు = ప్రకాశించునది; కాదు = కాదు; ఫలంబున్ = ఫలితమును; కోరక = ఆశించక; కర్మంబు = కర్మము; ఈశ్వరు = హరి; కున్ = కి; సమర్పణంబు = సమర్పించుట; చేయక = చేయక; ఉన్నన్ = పోయినచో; అది = అది; ప్రశస్తంబు = మంచిది; ఐ = అయి; ఉండదు = ఉండదు; భక్తి = భక్తి; హీనంబులు = లేనివి; అయిన = అయినట్టి; జ్ఞాన = జ్ఞానములోని; వాచా = వాక్కులోని; కర్మ = కర్మలోని; కౌశలంబులు = నేర్పరితనము; నిరర్థకంబులు = ప్రయోజనం లేనివి; కావున = అందువలన; మహా = గొప్ప; అనుభావుండవు = అనుభవము పొందినవాడవు; యథార్థ = సత్యమును; దర్శనుండవు = దర్శించువాడవు; సకల = సమస్త; దిక్ = దిక్కుల; అంత = అంతట; ధవళ = మెరుస్తున్న, తెల్లని; కీర్తివి = కీర్తి గలవాడవు; సత్య = సత్యమునందు; రతుండవు = ఆసక్తి గలవాడవు; ధృత = ధరించిన; వ్రతుండవున్ = వ్రతముగల వాడవును; అగు = అయినట్టి; నీవు = నీవు; నిఖిల = సమస్త; బంధ = బంధముల; మోచనంబు = విముక్తి; కొఱకున్ = కోసము; వాసుదేవుని = భగవంతుని {వాసుదేవుడు - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః - సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత}; లీలా = లీలలయొక్క; విశేషంబులు = విశేషములు; భక్తి = భక్తి; తోడన్ = తో; వర్ణింపుము = వర్ణింపుము; హరి = హరియొక్క; వర్ణనంబు = వర్ణనము; చేయక = చేయకుండా; ప్రకార = విధములలో, విధానములలో; అంతరంబునన్ = బేధములతోను; అర్థ = అర్థములలో; అంతరంబులు = బేధములను; వీక్షించి = దర్శించి; తత్ = వాటిని; వివక్షా = చెప్పటంకోసం; కృత = చేసిన; రూప = రూపములును; నామంబులన్ = నామములును; చేసి = వలన; పృథక్ = పెక్కు విధములైన, మరలమరల; దర్శనుండు = దృష్టికలవాడు, చూచువాడు; ఐన = అయినట్టి; వాని = వానియొక్క; మతి = బుద్ధి; పెను = ప్రచండమైన (సుడి); గాలి = గాలివీచుట; చేతన్ = చేత; త్రిప్పంబడి = త్రిప్పబడుతూ; తప్పన్ = తప్పిపోయి; చను = వెళ్ళు; నావ = పడవ; చందంబున = వలె; నెలవు = రేవును; సేర = చేరుట; నేరదు = చేయలేదు; కామ్య = ఫలితమును ఆశించి చేయు; కర్మంబులు = కర్మలు; అందున్ = లో; రాగంబు = ఆసక్తి; కల = కలిగినట్టి; ప్రాకృత = అజ్ఞాన, పామర; జనులు = జనములు; కున్ = కు; నియమించిన = విధించిన; ధర్మంబులు = ధర్మములు; చెప్పి = చెప్పి; శాసకుండవు = శాసించినవాడవు; అగు = అయినట్టి; నీవు = నీవు; వగచుట = బాధపడుట; తగదు = తగదు; అది = అది; ఎట్టుల = ఏవిధముగా; అనినన్ = అన్నట్లైతే; వారలు = వారు; అదియే = అదే; ధర్మంబు = ధర్మము; అని = అనుకొని; జుగుప్సితంబులు = అసహ్యములు; అగు = అయినట్టి; కామ్య = ఫలితమును ఆశించి చేయు; కర్మంబులు = కర్మలు; చేయుచున్ = చేయుచు; తత్త్వజ్ఞానంబు = తత్త్వజ్ఞానమును; మఱతురు = మరచి పోవుదురు; కావున = అందువలన; బుద్ధిన్ = బుద్ధిలో; మోహంబున్ = మోహము; జనియింపక = పుట్టకుండగ; తత్త్వ = తత్త్వము యొక్క; అజ్ఞుండవు = జ్ఞానము కలవాడవు; ఐ = అయి; వ్యధా = దుఃఖము యొక్క; వియోగంబు = ఎడబాటును; చేయుము = చేయుము; అని = అని పలికి; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.

భావము:

వ్యాస మునివర్యా! కర్మవాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్షలేని నిష్కామకర్మమయినా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని, వాక్కు కాని కర్మకాని అవి యెంత గొప్పవైనను భక్తిలేనినాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షీ! నీవు మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమ పరాయణుడవు, మానవు లందరికీ భవబంధవిముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ, ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకు వేళ్ళాడేవాడి మనసు, ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలా రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్త్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించు” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు.

1-99-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఱిఁగెడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు; గుణానురక్తుఁడై
తెకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగ చెప్పవే.

టీకా:

ఎఱిఁగెడు = ఎరుక; వాఁడు = కలవాఁడు; కర్మ = కర్మముల; చయము = సమూహము; ఎల్లను = సమస్తమును; మాని = మానేసి; హరి = హరియొక్క; స్వరూపమున్ = స్వరూపమును; నెఱయన్ = నిండుగ; ఎఱింగి = తెలిసికొని; ఆ = దాని; వలన్ = మూలమున; నేరుపున్ = నేర్పును; చూపు = చూపును; గుణ = గుణములందు; అనురక్తుఁడు = ఆసక్తి కలిగినవాడు; ఐ = అయి; తెఱకువ = వివేకము; లేక = లేకుండా; క్రుమ్మరుచున్ = తిరుగుచు; దేహ = దేహమును; ధన = ధనమును; ఆది = మొదలగు; అభిమాన = అభిమానము; యుక్తుఁడు = కూడినవాడు; ఐ = అయినప్పటికి; ఎఱుఁగని = తెలియని; వాని = వాని; కిన్ = కి; తెలియన్ = తెలియునట్లు; ఈశ్వర = ఈశ్వరుని; లీలలు = లీలలు; ఎఱుంగ = తెలియ; చెప్పవే = చెప్పుము.

భావము:

“మునీంద్రా వ్యాసా ! కామ్యకర్మ లన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైనవాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై, హరి స్వరూపాన్ని తెలిసికోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైనవాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలావిలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి.

1-100-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
నివడి సేవసేసి పరిపాకముఁ వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన, మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్.

టీకా:

తన = తనయొక్క; కుల = కులము యొక్క; ధర్మమున్ = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; దానవవైరి = విష్ణువు {దానవులశత్రువు - దానవులకు శత్రువు, హరి}; పద = పాదములనే; అరవిందముల్ = పద్మములను; పనిపడి = పనిగట్టుకు; సేవ = భక్తి; చేసి = చేసి; పరిపాకమున్ = సిద్ధిని; పొందక = పొందకుండగ; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; చచ్చిన = చనిపోయిన; మఱు = తరువాతి; మేనన్ = జన్మలో (శరీరంలో); ఐనన్ = అయినను; అది = అది; సిద్ధి = సిద్ధి; వహించున్ = పొందును; తదీయ = అతని; సేవన్ = భక్తిని; పాసినన్ = విడిచిన; కుల = కులము; ధర్మ = ధర్మము; గౌరవము = గౌరవము(లతో); సిద్ధి = సిద్ధి; వహించునె = పొందునా; ఎన్ని = ఎన్ని; మేనులన్ = జన్మలకైనా.

భావము:

ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలో నైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు.

1-101-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగావున నెఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయం దగుఁ; గాలక్రమంబున సుఖదుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు; దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ దిరుగుచున్న జీవులకు నెయ్యది వొందరా దట్టి మేలు సిద్ధించుకొఱకు హరిసేవ సేయవలయు; హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కండు; క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తి రసవశీకృతుం డయి విడువ నిచ్చగింపఁడు; మఱియును.

టీకా:

అది = అందు; కావునన్ = వలన; ఎఱుక = జ్ఞానము; కలవాఁడు = ఉన్నవాడు; హరి = హరి; సేవ = భక్తి; కున్ = కి; ప్రయత్నంబు = ప్రయత్నము; చేయన్ = చేయుట; తగున్ = తగును; కాలక్రమంబున = కాలక్రమములో; సుఖ = సుఖమును; దుఃఖములు = దుఃఖమును; ప్రాప్తంబులు = ప్రాప్తములు; అయినను = అయినప్పటికిని; హరి = విష్ణువు యొక్క; సేవ = భక్తి; విడువన్ = విడుచుట; తగదు = తగినదికాదు; దానన్ = దాని; చేసి = వలన; ఊర్థ్వంబునన్ = పైలోకములందు; బ్రహ్మ = బ్రహ్మము; పర్యంతంబున్ = వరకును; క్రింద = క్రింద; స్థావర = చైతన్యము (కదలిక) లేని జీవుల; పర్యంతంబున్ = వరకును; తిరుగుచున్న = చరించుచున్న; జీవులు = ప్రాణులు; కున్ = కును; ఎయ్యది = ఏదైతే; పొందన్ = పొందుటకు; రాదు = రాదో, కష్టసాధ్యమో; అట్టి = అటువంటి; మేలు = శుభములు; సిద్ధించు = కలుగుట; కొఱకున్ = కోసము; హరి = హరియొక్క; సేవన్ = సేవించుట; సేయవలయు = చేయవలయును; హరి = హరియొక్క; సేవకుండు = భక్తుడు; అగు = అయినట్టి; వాఁడు = వాడు; జననంబున్ = జన్మను; ఒందియున్ = పొందినప్పటికిని; అన్యుని = ఇతరుల; క్రియన్ = వలె; సంసారంబునన్ = సంసారములో; చిక్కండు = చిక్కుకొనడు; క్రమ్మఱన్ = తిరిగి; హరి = హరియొక్క; చరణ = పాదముల; స్మరణంబున్ = సంస్మరణము; చేయుచున్ = చేయుచు; భక్తి = భక్తి; రస = రసమునకు; వశీకృతుండు = పరవశుడు, లొంగిని వాడు; అయి = అయి; విడువన్ = విడుచుటకు; ఇచ్చగింపఁడు = ఇష్టపడడు; మఱియును = ఇంకనూ.

భావము:

అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైనా, శ్రీహరి సేవను విడిచిపెట్టటం తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్థిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు.

1-102-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను-
వేఱేమియును లేదు విశ్వమునకు
వవృద్ధిలయము లా రమేశుచే నగు-
నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున
నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ-
భువన భద్రమునకై పుట్టినట్టి
రికళాజాతుండ ని విచారింపుము,-
మణతో హరిపరాక్రమము లెల్ల

1-102.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుతిసేయు మీవు; వినికియుఁ, జదువును,
దాన, మతుల నయముఁ, పము, ధృతియుఁ,
లిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ
మలనాభుఁ బొగడఁ లిగెనేని.

టీకా:

విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని, భగవంతుని; చేన్ = చేతనే; అగున్ = అగును; నీవు = నీవు; ఎఱుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్ = నోటిద్వారానే; ఎఱిఁగింపబడ్డది = చెప్పబడినది; యేకదేశమునన్ = అంశముగ; ఈ = ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై = కొరకు; పుట్టినట్టి = అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని = అని; విచారింపుము = తెలిసికొనుము; రమణ = ప్రీతి; తోన్ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్ = సమస్తము;
వినుతిసేయుము = కీర్తింపుము; ఈవు = నీవు; వినికియున్ = వినుటయు; చదువును = స్త్రోత్రమును; దానము = దానమును; అతుల = మిక్కిలి; నయమున్ = నీతియు; దపమున్ = తపస్సు; ధృతియున్ = ధైర్యమును; కలిమి = సంపద; కిన్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; ఫలము = ఫలితము; కాదె = కాదా; పుణ్యశ్లోకున్ = భగవంతుని {పుణ్యశ్లోకుడు - పుణ్యాత్ములచే కీర్తింపబడువాడు, విష్ణువు}; కమలనాభున్ = భగవంతుని {కమల నాభుడు - కమలము నాభియందు కలవాడు}; పొగడన్ = కీర్తించుట; కలిగెనేని = (చేయ) కలిగితే, జరిగినచో;

భావము:

ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.