పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-103-వ.

మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటిదాసికిం బుట్టి, పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి, యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు.

1-104-క.

మితో నెల్లప్పుడుఁ
బావమునఁ బనులు సేసి, బాలురతో నే
యాలకుఁ బోక, యొక జం
జాటంబును లేక, భక్తి లుపుదు ననఘా!

1-105-క.

మంళమనుచును వారల
యెంగిలి భక్షింతు, వాన కెండకు నోడన్,
ముంల నిలుతును నియతిని,
వెంలి క్రియఁ జనుదు నురు వివేకముతోడన్.

1-106-వ.

ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నా యందుఁ గృపసేసి రంత.

1-107-శా.

వారల్ కృష్ణు చరిత్రముల్ చదువఁగా, ర్ణింపఁగాఁ, బాడఁగా,
నా రావంబు సుధారసప్రతిమమై శ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై.

1-108-వ.

ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండ నై, బ్రహ్మరూపకుండ నయిన నా యందు స్థూలసూక్ష్మం బయిన యీ శరీరంబు నిజ మాయాకల్పితం బని యెఱింగితి; యమ్మహాత్ము లగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార లై; రివ్విధంబున.

1-109-మ.

చారంబులు లేక, నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై,
లత్వంబును మాని, నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని
ష్కటత్వంబున, దీనవత్సలతతోఁ, గారుణ్య సంయుక్తులై
యుదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్.

1-110-వ.

ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి; నీశ్వరుని యందు సమర్పితం బయిన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధం బగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు; ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు; నివ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబు లై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపి యుండు; నీశ్వరుని యందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకం బై, యీశ్వర సంతోషణంబును, భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణ గుణనామ వర్ణనస్మరణంబులు సేయుదురు; ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్నసంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి, నమస్కారంబు సేసి, మంత్రమూర్తియు మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుం డగు.

1-111-క.

వ్విధమునఁ జేయఁగ,
దావకులవైరి నాకుఁ నయందలి వి
జ్ఞాము నిచ్చెను, మదను
ష్ఠాము నతఁ డెఱుఁగు, నీవు లుపుము దీనిన్.

1-112-క.

మునికులములోన మిక్కిలి
వినుకులు గలవాఁడ వీవు, విభుకీర్తులు నీ
నుదినముఁ బొగడ వినియెడి
ములకున్ దుఃఖమెల్ల శాంతిం బొందున్.""

1-113-వ.

ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె.

1-114-మ.

"విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో
యిన, బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్
నె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద
త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్.""

1-115-వ.

అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె "దాసీపుత్త్రుండ నయిన యేను భిక్షులవలన హరిజ్ఞానంబు గలిగి యున్నంత.

1-116-సీ.

మ్ము నేలినవారి మందిరంబునఁ గల-
నులెల్లఁ గ్రమమున క్తిఁ జేసి
న పరాధీనతఁ లఁపదు; సొలసితి-
లసితి నాఁకొంటి నుచు వచ్చి
మాపును రేపును మా తల్లి మోహంబు-
సొంపార ముద్దాఁడు, చుంచు దువ్వు,
దేహంబు నివురు, మోదించుఁ, గౌఁగిటఁ జేర్చు,-
ర్మిలి నన్నిట్టు రసి మనుప,

1-116.1-ఆ.

నేను విడిచి పోక యింట నుండితినయ్య,
మోహిఁగాక, యెఱుక మోసపోక,
మాఱు చింత లేక, మౌనినై యేనేండ్ల
వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు.

1-117-వ.

అంత.

1-118-క.

నము వెలువడి తెరువునఁ
జెరక మాతల్లి రాత్రిఁ జీఁకటివేళన్
మొవుం బిదుఁకగ, నొకఫణి
భాగముఁ గఱచెఁ ద్రొక్కఁడి మునినాథా!

1-119-క.

నీలాయతభోగఫణా
వ్యాళానలవిష మహోగ్రహ్నిజ్వాలా
మాలావినిపాతితయై
వ్రాలెన్ ననుఁ గన్నతల్లి సుమతి మీఁదన్.

1-120-ఉ.

ల్లి ధరిత్రిపై నొఱగి ల్లడపాటునుఁ జెంది చిత్తముం
ల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి, కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక, సంగము వాసె మేలు రా
జిల్లె, నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధిఁ జేర్చుచున్.

1-121-వ.

ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులుఁ, బురంబులుఁ, బట్టణంబులు, గ్రామంబులుఁ, బల్లెలు, మందలుఁ, గిరాత పుళిందనివాసంబులు, నుపవనంబులుఁ, జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబు లైన సరోవరంబులు దాఁటి చనుచు; క్షుత్పిపాసాసమేతుండ నై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై, నీరుద్రావి గతశ్రముండనై.

1-122-క.

సాలావృక, కపి, భల్లుక,
కోలేభ, లులాయ, శల్య, ఘూక, శరభ, శా
ర్దూల, శశ, గవయ, ఖడ్గ,
వ్యాళాజగరాది భయద నమధ్యమునన్

1-123-వ.

దుస్తరంబులైన నీలవేణు, కీచక, గుల్మ, లతాగహ్వరంబుల పొంత నొక్క రావిమ్రాని డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.