పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మజుడు భీష్ముని కడ కేగుట

  •  
  •  
  •  

1-205-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లు ధర్మసూనుఁడు
మొసి నిరాహారభావమున దేవనదీ
యుఁడు గూలిన చోటికిఁ
నియెఁ బ్రజాద్రోహ పాప లితాత్ముండై.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ధర్మసూనుఁడు = ధర్మరాజు {ధర్మసూనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; మొనసి = పూనుకొని; నిరాహార = ఆహారము స్వీకరింపని; భావమునన్ = నిర్ణయముతో; దేవనదీతనయుఁడు = భీష్ముడు {దేవనదీతనయుడు - గంగదేవి పుత్రుడు, భీష్ముడు}; తనయుఁడు = పుత్రుడు, భీష్ముడు}; కూలిన = పడి ఉన్న; చోటు = ప్రదేశాని; కిన్ = కి; చనియెన్ = వెళ్ళాడు; ప్రజా = ప్రజలకు; ద్రోహ = చేసిన ద్రోహము అనే; పాప = పాపంచే; చలిత = చలించిన; ఆత్ముండు = మనసు కలవాడు; ఐ = అయి.

భావము:

ఈ విధంగా, ప్రజాద్రోహం వల్ల కలిగిన పాపానికి చలించిన మనసు కలవాడు అయిన ధర్మరాజు, నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకు వెళ్లాడు.

1-206-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అయ్యవసరంబునం దక్కిన పాండవులును, ఫల్గున సహితుం డైన పద్మలోచనుండును గాంచన సమంచితంబు లయిన రథంబు లెక్కి ధర్మజుం గూడి చనిన, నతండు గుహ్యక సహితుం డయిన కుబేరుని భంగి నొప్పె; నిట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభసహితులై కురుక్షేత్రంబున కేఁగి, దివంబున నుండి నేలం గూలిన దేవతతెఱంగున సంగ్రామ రంగపతితుం డైన గంగానందనునకు నమస్కరించి; రంత బృహదశ్వ, భరద్వాజ, పరశురామ, పర్వత, నారద, బాదరాయణ, కశ్యపాంగిరస, కౌశిక, ధౌమ్య, సుదర్శన, శుక, వసిష్ఠాద్యనేక రాజర్షి, బ్రహ్మర్షులు, శిష్య సమేతులై చనుదెంచినం జూచి సంతసించి, దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయానికి; తక్కిన = మిగతా; పాండవులును = పాండవులును; ఫల్గున = అర్జునునితో; సహితుండు = కూడిన వాడు; ఐన = అయినట్టి; పద్మలోచనుండును = కృష్ణుడును; కాంచన = బంగారము; సమంచితంబులు = పొదగబడినవి; అయిన = అయిన; రథంబులు = రథాలను; ఎక్కి = అధిరోహించి; ధర్మజున్ = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కూడి = తో కలిసి; చనినన్ = వెళ్ళగా; అతండు = అతడు; గుహ్యక = యక్షులతో; సహితుండు = కూడినవాడు; అయిన = అయినట్టి; కుబేరుని = కుబేరుడి; భంగిన్ = లాగ; ఒప్పెన్ = ప్రకాశిస్తున్నాడు; ఇట్లు = ఈ విధంగా; పాండవులు = పాండవులు; పరిజనులు = పరివారం; కొలువన్ = సేవిస్తూ ఉండగా; పద్మనాభ = కృష్ణుని {పద్మనాభుడు - పద్మము నాభి యందు గలవాడు, కృష్ణుడు, విష్ణుసహస్రనామాలలో 48వ నామం, 196వ నామం, 346వ నామం}; సహితులు = తోకూడినవారు; ఐ = అయి; కురుక్షేత్రంబు = కురుక్షేత్రమున; కున్ = కు; ఏఁగి = వెళ్ళి; దివంబున = స్వర్గము; నుండి = నుండి; నేలన్ = నేలమీదకు; కూలిన = పడిపోయిన; దేవత = దేవత; తెఱంగునన్ = వలె; సంగ్రామరంగ = యుద్ధక్షేత్రంలో; పతితుండు = పడి ఉన్నవాడు; ఐన = అయిన; గంగానందనున = భీష్మున {గంగానందనుడు - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు}; కు = కు; నమస్కరించిరి = నమస్కరించారు; అంత = అంతట; బృహదశ్వ = బృహదశ్వుడు; భరద్వాజ = భరద్వాజుడు; పరశురామ = పరశురాముడు; పర్వత = పర్వతుడు; నారద = నారదుడు; బాదరాయణ = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు}; కశ్యప = కశ్యపుడు; ఆంగిరస = ఆంగిరసుడు; కౌశిక = విశ్వామిత్రుడు; ధౌమ్య = ధౌమ్యుడు; సుదర్శన = సుదర్శనుడు; శుక = శుకుడు; వసిష్ఠ = వసిష్ఠుడు; ఆది = మొదలగు; అనేక = అనేకులయిన; రాజర్షి = రాజర్షులు; బ్రహ్మర్షులు = బ్రహ్మర్షులు; శిష్య = శిష్యులతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; చనుదెంచినన్ = రాగా; చూచి = చూసి; సంతసించి = సంతోషించి; దేశ = దేశము యొక్క; కాల = కాలము యొక్క; విభాగ = విభాగాల వివరాలు; వేది = తెలిసినవాడు; ఐన = అయినట్టి; భీష్ముండు = భీష్ముడు; వారలకున్ = వారికి; పూజనంబులున్ = పూజలు; చేయించి = చేయించి.

భావము:

కృష్ణార్జునులు, భీమ నకుల సహదేవులు బంగారు రథాలు అధిరహించి ధర్మరాజు వెంట వెళ్లారు. అప్పుడు ధర్మజుడు గుహ్యకులతో కూడిన కుబేరుడి లాగ ప్రకాశించాడు. ఈ విధంగా పాండవులు తమ పరివారంతోపాటు, శ్రీకృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ దివినుంచి భువికి కూలిన దేవతలా యుద్ధరంగంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడికి నమస్కరించారు. ఇంతలో బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి రావటం చూసి ఆనందించి, దేశకాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యుడు వచ్చిన వారందరిని సత్కరింపజేసాడు.

1-207-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాయాంగీకృతదేహుం
డై ఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాఁ డని ప్ర
జ్ఞాత్తచిత్తమున గాం
గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్.

టీకా:

మాయాంగీకృతదేహుండు = మాయచేత స్వీకరించిన దేహము కలవాడు; ఐ = అయిన; అఖిలేశ్వరుఁడు = అఖిలేశ్వరుడు - సర్వులకు ఈశ్వరుడు; మనుజుఁడు = మానవుడుగా; ఐనాఁడు = అవతరించాడు; అని = అని; ప్రజ్ఞా = పాటవంతో; ఆయత్త = కూడిన; చిత్తంబునన్ = మనసుతో; గాంగేయుఁడు = భీష్ముడు {గాంగేయుడు - భీష్ముడు, గంగ యొక్క పుత్రుడు}; పూజనము = పూజ; చేసెన్ = చేసెను; కృష్ణున్ = కృష్ణుడిని {కృష్ణుడు - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దో నశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, కృష్ణుడు, నల్లనివాడు, 4. కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోనశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు}; జిష్ణున్ = కృష్ణుడిని {జిష్ణుడు - జయశీలము గలవాడు, కృష్ణుడు.}.

భావము:

సర్వేశ్వరుడు అయిన పరమేశ్వరుడు మాయా మానవ దేహంతో జయశీలుడైన కృష్ణుడిగా అవతరించి అరుదెంచాడనే ప్రజ్ఞానంతో కూడిన వాడై గాంగేయుడు కృష్ణుణ్ణి పూజించాడు.

1-208-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు గంగానందనుండు వినయప్రేమ సుందరు లయిన పాండునందనులం గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె.

టీకా:

మఱియు = ఇంకనూ; గంగానందనుండు = భీష్ముడు {గాంగానందనుడు - భీష్ముడు, గంగ యొక్క పుత్రుడు}; వినయ = వినయముతోను; ప్రేమ = ప్రేమతోనుకూడి; సుందరులు = అందమైన వారు; అయిన = అయినట్టి; పాండునందనులన్ = పాండవులను; కూర్చుండన్ = కూర్చోమని; నియోగించి = నియమించి; మహా = మిక్కిలి; అనురాగ = అనురాగముచే; జనిత = పుట్టిన; బాష్పసలిల = కన్నీటి; సందోహ = సమూహము; సమ్మిళిత = కూడిన; లోచనుండు = కన్నులుగలవాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = అన్నాడు.

భావము:

అటుపిమ్మట, భీష్మాచార్యుడు వినయ ప్రేమలతో చక్కటివారైన పాండవులను దగ్గర కూర్చో పెట్టుకొన్నాడు. అపారమైన అనురాగంతో పొంగిపొరలే బాష్పధారలతో నిండిన కన్నులు కలవాడై ఇలా అన్నాడు.

1-209-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రణిసురులు, హరియు, ర్మంబు దిక్కుగా
బ్రదుకఁ దలఁచి మీరు హువిధముల
న్నలార! పడితి రాపత్పరంపర
లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదు?

టీకా:

ధరణిసురులు = బ్రాహ్మణులును {ధరణిసురుడు - ధరణి (భూమిమీది) సురుడు (దేవత), బ్రాహ్మణుడు}; హరియున్ = కృష్ణుడును; ధర్మంబున్ = ధర్మమును; దిక్కుగాన్ = శరణముగ; బ్రదుకన్ = బ్రతుకవలెనని; తలఁచి = అనుకొని; మీరు = మీరు; బహు = అనేకమైన; విధములన్ = రకములుగా; అన్నలార = నాయనలారా; పడితిరి = పడ్డారు; ఆపత్ = ఆపదలు; పరంపరలు = ఒకదానిమీదింకొకటి; ఇట్టి = ఇటువంటి; చిత్ర = చిత్రమైన; కర్మము = పని; ఎందున్ = ఎక్కడ; కలదు = ఉంది.

భావము:

“నాయనలారా! పాండవులారా! భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను, ధర్మాన్ని నమ్ముకొని జీవించే మీరు కష్టాలు ఎన్నో పడ్డారు. ఇటువంటి విచిత్రమైన విషయం ఇంకా ఏముంటుంది.

1-210-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంస మింత లేదు మృగశాపవశంబునఁ బాండు భూవిభుం
డంము నొంది యుండ మిము ర్భకులం గొనివచ్చి, కాంక్షతో
నింలవారిఁగాఁ బెనిచె, నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
గొంతి; యనేక దుఃఖములఁ గుందుచు నుండును భాగ్య మెట్టిదో?

టీకా:

సంతసము = సంతోషము; ఇంతన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మృగ = లేడి రూపంలో ఉన్న ముని యొక్క; శాప = శాపము; వశంబునన్ = వలన; పాండు = పాండు; భూవిభుండు = రాజు; అంతమున్ = మరణమును; ఒంది = పొంది; ఉండన్ = ఉండగ; మిమున్ = మిమ్మల్ని; అర్భకులన్ = పసిబిడ్డలను; కొనివచ్చి = తీసుకొని వచ్చి; కాంక్ష = బలీయమైన కోరిక; తోన్ = తో; ఇంతలవారిఁగాన్ = ఇంతవారిగా; పెనిచెన్ = పెంచింది; ఎన్నఁడున్ = ఎప్పుడుకూడా; సౌఖ్యముపట్టున్ = ఏమాత్రము సుఖమును; కానదు = ఎరుగదు; ఈ = ఈ; గొంతి = కుంతి {గొంతి - కుంతి - కుంతల దేశ ఇంతి}; అనేక = అనేకమైన; దుఃఖములన్ = బాధలతో; కుందుచున్ = కృంగిపోతూ; ఉండును = ఉంటుంది; భాగ్యము = అదృష్టం; ఎట్టిదో = ఎలాంటిదో.

భావము:

పాపం! మీ తల్లి కుంతీదేవికి ఏమాత్రం సంతోషం లేదు; పాండురాజు లేడిరూపంలో ఉన్న ముని శాపకారణంగా మరణించడంతో, పసికందులైన మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది; ఇంతవాళ్ళని చేసింది; ఏ ఒక్కరోజూ సౌఖ్యమన్న మాట ఎరుగదు; ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కానీ జీవితమంతా కష్టాలతోనే గడిచింది.

1-211-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు, కాల మన్నియుం
జేయుచుఁ నుండుఁ, గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.

టీకా:

వాయు = గాలికి; వశంబులు = ప్రభావానికి లోనైనవి; ఐ = అయి; ఎగసి = ఎగిరి; వారిధరంబులు = మేఘములు {వారిధరములు - నీటిని కలిగియుండునవి, మేఘములు}; మింటన్ = ఆకాశములో; కూడుచున్ = కలుస్తు; పాయుచున్ = విడిపోతు; ఉండు = ఉండే; కైవడిన్ = విధంగా; ప్రపంచము = లోకము; సర్వమున్ = అంతా; కాల = కాలము చేత; తంత్రము = అల్లబడిన, మాయకు; ఐ = లోబడినవి అయి; పాయుచున్ = విడిపోతూ; కూడుచుండున్ = కలుస్తూ; ఒక = ఒక; భంగిన్ = విధంగా; చరింపదు = జరుగదు; కాలము = కాలము; అన్నియున్ = అన్నింటినీ; చేయుచున్ = చేస్తూ; ఉండున్ = ఉంటుంది; కాలము = కాలము; విచిత్రము = విచిత్రమైనది; దుస్తరము = దాటుటకు వీలుకానిది; ఎట్టివారి = ఎటువంటి వారి; కిన్ = కైనా,.

భావము:

ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ, విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ, విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా జరగదు. కాలమే అన్నింటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు.

1-212-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజఁట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో
ద్వేకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోకుఁడైన చక్రియఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁడ
య్యాజికిఁదోడు వచ్చునఁట, యాపద గల్గు టిదేమి చోద్యమో.

టీకా:

రాజు = రాజు; అఁట = అట; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; సురరాజ = ఇంద్రుని; సుతుండు = పుత్రుడు; అఁట = అట; అర్జునుడు {ధన్వి - ధనుస్సు ధరించు వాడు, అర్జునుడు}; శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకము = వెరపు కలిగించునది; ఐన = అయినట్టి; గాండివము = గాండీవము; అతని విల్లు = ధనుస్సు; అఁట = అట; సారథి = రథం నడిపించు వాడు; సర్వ = సమస్త; భద్ర = శుభములను; సంయోజకుఁడు = కలిగించువాడు; ఐన = అయిన; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; అఁట = అట; ఉగ్ర = భయంకరమైన; గదా = గదను; ధరుఁడు = ధరించువాడు; ఐన = అయి నట్టి; భీముఁడు = భీముడు; ఆ = ఆ; యాజి = యజ్ఞము చేసినవాని, ధర్మరాజు; కిఁన్ = కి; తోడు = తోడుగా; వచ్చున్ = వచ్చును; అఁట = అట; ఆపద = విపత్తు; కల్గుట = కలుగుట; ఇది = ఇది; ఏమి = ఏమి; చోద్యమో = చిత్రమో.

భావము:

ధర్మజు అంతటివాడు రాజు; ఇంద్రుడి కుమారుడూ మహావీరుడూ అయినట్టి అర్జునుడు యోద్ధ; శత్రుభయంకరమైనట్టి గాండీవం అతని ధనుస్సు; సమస్త శుభాలనూ కలిగించే శ్రీకృష్ణుడు రథసారథి; చండ ప్రచండమైన గదాదండం ధరించే భీముడు కొండంత అండ; అయినా ఇంతటి మహా మహిమాన్వితమైన సహాయ సంపత్తులు ఉన్నా ఈ పాండవులు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేసి మొదలైన ఆపదలు ఎన్నో పొందారు; ఎంత ఆశ్చర్యం!

1-213-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
తనిమాయలకు మహాత్ములు విద్వాంసు
డఁగి మెలగుచుందు రంధు లగుచు.

టీకా:

ఈశ్వరుండు = ఈశ్వరుడు, కృష్ణుడు {ఈశ్వరుడు - సర్వనియామకుడు, స్వభావము చేతనే ఈశత్వము కలవాడు, పంచకృత్యములను (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) చేయుటకు కర్తృత్వము కలవాడు, విష్ణువు, శివుడు, భగవంతుడు}; విష్ణుఁడు = విష్ణువు, కృష్ణుడు; ఎవ్వేళ = ఏసమయమునకు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; ఏమి = ఏమి; సేయున్ = చేయునో; పురుషుఁడు = మానవుడు; ఏమి = ఏమి; యెఱుఁగున్ = తెలియగలడు; అతని = అతనియొక్క; మాయలు = మహిమలు; కు = కి; మహాత్ములు = గొప్పవారు {మహాత్ములు - గొప్ప ఆత్మ కలవారు, గొప్పవారు}; విద్వాంసులు = పండితులు; అడఁగి = లొంగి; మెలగుచూ = చరిస్తూ; ఉందురు = ఉంటారు; అంధులు = గ్రుడ్డివారు; అగుచున్ = అవుతూ.

భావము:

పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.

1-214-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున దైవతంత్రంబైన పనికి వగవం బని లేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు, తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు; నతని రహస్యప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుం డెఱుంగు; మఱియు దేవర్షి యగు నారదుండును, భగవంతుం డగు కపిలమునియు, నెఱుంగుదురు; మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుం డగు మాతులేయుం డని తలంచి దూత, సచివ, సారథి, బంధు, మిత్ర, ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొఱంత లేదు; రాగాదిశూన్యుండు, నిరహంకారుండు, నద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు, నయిన యీశ్వరునకు నతోన్నతభావ, మతివైషమ్యంబు లెక్కడివి, లే; వయిన భక్తవత్సలుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు.

టీకా:

కావునన్ = అందువలన; దైవ = దేవునిచేత; తంత్రంబు = పన్నబడినది; ఐన = అయినట్టి; పని = ఘటన; కిన్ = కి; వగవన్ = చింతించే; పని = అవసరము; లేదు = లేదు; రక్షకులు = రక్షించువారు; లేని = లేనట్టి; ప్రజలన్ = ప్రజలను; ఉపేక్షింపక = అశ్రద్ధ చేయక; రక్షింపన్ = రక్షించుటకు; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పుండరీకము (తెల్లతామర)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సాక్షాత్కరించిన = ప్రత్యక్షముగా; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుడు - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,}; తేజః = ప్రభావము; నిరూఢుండు = ప్రకటింపబడినవాడు; కాక = కాకుండా; యాదవులు = యాదవులు; అందున్ = లో; గూఢుండు = రహస్యముగ చరించువాడు; ఐ = అయి; తన = తన; మాయ = మాయ; చేతన్ = చేత; లోకంబుల = లోకములను; మోహ = మోహము యొక్క; అతిరేకంబున్ = అతిశయించుటను; ఒందించు = కలుగజేయును; అతని = అతని యొక్క; రహస్య = రహస్యమైన; ప్రకారంబులు = పద్ధతులు; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయినట్టి; పరమేశ్వరుండు = శివుడు; ఎఱుంగున్ = తెలియగలుగును; మఱియు = ఇంకనూ; దేవర్షి = దేవర్షి; అగు = అయినట్టి; నారదుండును = నారదుడును; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; అగు = అయినట్టి; కపిల = కపిలుడు అను; మునియు = మునియు; ఎఱుంగుదురు = తెలియగలరు; మీరు = మీరు; కృష్ణుండు = కృష్ణుడు; దేవకీ = దేవకి యొక్క; పుత్త్రుండు = కొడుకు; అగు = అయిన; మాతులేయుండు = మేనమామ కొడుకు, మేనబావ; అని = అని; తలంచి = భావించి; దూత = రాయబారి; సచివ = మంత్రి; సారథి = రథసారథి; బంధు = చుట్టము; మిత్ర = స్నేహితుడు అను; ప్రయోజనంబుల = వివిధవిధములుగ; నియమింతురు = నియమిస్తూ; ఇన్నిటన్ = ఇన్నిటివలన; కొఱంత = లోటు; లేదు = లేదు; రాగ = రాగము (రాగవిద్వేషాలు); ఆది = మొదలగునవి; శూన్యుండున్ = లేనివాడును; నిరహంకారుండున్ = అహంకారము లేనివాడును; అద్వయుండున్ = కష్టసుఖాలు లాంటి ద్వంద్వాలకు అతీతుడునూ; సమదర్శనుండున్ = సమస్తమును హెచ్చు తగ్గులు లేక చూచువాడును; సర్వాత్మకుండున్ = సర్వమునందు ఆత్మరూపమున యుండువాడును; అయిన = అయినప్పటికీ; ఈశ్వరున = ప్రభువు, కృష్ణున; కున్ = కు; నత = తక్కువ; ఉన్నత = ఎక్కువ యను; భావ = భావము; మతి = బుద్ధి; వైషమ్యంబులు = విషమమైనవి, బేధములు; ఎక్కడివి = ఎక్కడవి; లేవు = లేవు; అయిన = అయినప్పటికీ; భక్త = భక్తులయందు; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; కావునన్ = అగుటచేతను; ఏకాంత = ఏకాంతమను స్థితిని చేరిన; భక్తులు = భక్తులు; కున్ = కు; సులభుండు = సుఖముగా లభించువాడు; ఐ = అయి; ఉండున్ = ఉంటాడు.

భావము:

అందుచేత, దైవసంకల్పం వల్ల జరిగినదానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటంకోసం శ్రీహరి పుండరీకాక్షరూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం తెలియబడకుండా, యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపుడైన కపిలమహర్షికి కొంత తెలుసు; నాయనలార! మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని తలచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు ఆయన్ని వినియోగించుకొన్నారు. అయినా అందువల్ల ఎలాంటి లోపం రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారం లేని వాడు, ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు ఐన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయభేదాలు ఎక్కడివి; అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అగుటచేత ఆత్మీయులైన భక్తులకు అందుబాటులో ఉంటాడు.

1-215-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి-
యెవ్వని నామ మూహించి పొగడి
కాయంబు విడుచుచుఁ గామ కర్మాది ని-
ర్మూలనుండై యోగి ముక్తి నొందు
ట్టి సర్వేశ్వరుం ఖిలదేవోత్తంసుఁ-
డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు
నందాఁక నిదె మహార్షుఁడై వికసిత-
దనారవిందుఁడై చ్చె నేఁడు

1-215.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాల్గుభుజములుఁ గమలాభ యనయుగము
నొప్పఁ గన్నుల ముంగట నున్నవాఁడు
మానవేశ్వర! నా భాగ్యహిమఁ జూడు
మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి."

టీకా:

అతి = ఎక్కువ; భక్తిన్ = భక్తితో; ఎవ్వని = ఎవని; అందున్ = అందు; చిత్తమున్ = మనసు; చేర్చి = నిలిపి; యెవ్వని = ఎవని; నామము = నామమును; ఊహించి = స్మరించి; పొగడి = స్తుతించి; కాయంబున్ = శరీరమును; విడచుచున్ = విడిచిపెట్టుచు; కామ = కామము; కర్మ = కర్మము; ఆది = మొదలగునవి; నిర్మూలనుండు = వేళ్ళతో సహా పెకిలించ బడినవాడు; ఐ = అయ్యి; యోగి = యోగి; ముక్తిన్ = ముక్తిని; ఒందున్ = పొందుతాడో; అట్టి = అటువంటి; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వర - సర్వమునకు ఈశ్వరుడు, కృష్ణుడు}; అఖిల దేవోత్తంసుఁడు = కృష్ణుడు {అఖిలదేవోత్తసుండు - సమస్త దేవతలలోను ఉన్నతుడు, కృష్ణుడు}; ఏ = ఏ; వేళన్ = సమయంలో; ప్రాణంబులు = ప్రాణములను; ఏను = నేను; విడుతున్ = వదులుతానో; అందాఁక = ఆ సమయము దాకా; ఇదె = ఇదిగో; మహా = గొప్ప; హర్షుఁడు = ఆనందము కలవాడు; ఐ = అయి; వికసిత = వికసించిన; వదన = ముఖము అనే; అరవిందుఁడు = పద్మముగలవాడు; ఐ = అయి; వచ్చెన్ = వచ్చాడు; నేఁడు = ఇవాళ;
నాల్గు = నాలుగు; భుజములున్ = భుజములును; కమల = కమలములు; అభ = వంటి; నయన = కళ్ళు; యుగము = జంట; ఒప్పన్ = ప్రకాశిస్తుండగా; కన్నుల = కళ్ళ; ముంగటన్ = ముందర; ఉన్నవాడు = ఉన్నాడు; మానవేశ్వర = రాజా; నా = నాయొక్క; భాగ్య = భాగ్యము యొక్క; మహిమన్ = గొప్పతనము; చూడుము = చూడుము; ఏమి = ఏమి; సేసితినో = చేసానో; పుణ్యము = పుణ్యము; ఇతనిన్ = ఇతని; గూర్చి = కోసము.

భావము:

మిక్కిలి భక్తియుక్తుడైన యోగి ఏ దేవుని యందు చిత్తం లగ్నంచేసి, ఏ దేవుని పవిత్రనామం ఉచ్చరిస్తూ తనువు చాలించి, కామాది కర్మఫలాన్ని నిర్మూలించి, మోక్షాన్ని పొందుతాడో, అటువంటి దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో విచ్చేసి నాలుగు చేతులతో తామరరేకుల వంటి కళ్ళతో, నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజా! నాభాగ్యం పండింది. ఈ మహానుభావుడి కోసం ఏ పుణ్యం చేసుకున్నానో. “

1-216-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుం డయిన కురుకుంజరుని వచనంబు లాకర్ణించి, మును లందఱు వినుచుండ, ధర్మనందనుడు మందాకినీనందనువలన నరజాతిసాధారణంబు లగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును, రాగవైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దానధర్మంబులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థకామ మోక్షంబులును, నానావిధోపాఖ్యానేతిహాసంబులును, సంక్షేపవిస్తార రూపంబుల నెఱింగె; నంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణు లైన యోగీశ్వరులచేత వాంఛితంబగు నుత్తరాయణంబు సనుదెంచిన, నది దనకు మరణోచితకాలం బని నిశ్చయించి.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ధనంజయ = అర్జునిచేత; సంప్రాపిత = పొందజేయబడిన; శర = అమ్ములు కల; పంజరుండు = పంజరము (శరీరము) కలవాడు; అయిన = అయినట్టి; కురుకుంజరుని = భీష్ముని {కురుకుంజరుడు - కురువంశానికి ఏనుగు వంటి (పెద్ద) వాడు, భీష్ముడు}; వచనంబులు = ఉపదేశములు; ఆకర్ణించి = విని; మునులు = మునులు; అందఱున్ = అందరూ; వినుచుండన్ = వింటూ ఉండగా; ధర్మనందనుడు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; మందాకినీనందను = భీష్ముని {మందాకినీనందనుడు - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు}; వలనన్ = నుండి; నర = మానవ; జాతి = జాతియొక్క; సాధారణంబులు = సాధారణముగా వర్తించునవి; అగు = అయిన; ధర్మంబులును = ధర్మములును; వర్ణా = కులముల యొక్క {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రమములోని వారికి వర్తించు {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హపత్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి నాలుగు ఆశ్రమములు}; ధర్మంబులును = ధర్మములును; రాగ = రాగము (ఆసక్తి) {రాగవైరాగ్యోపాధులు - వేదాంతశాస్త్ర సాంకేతిక పదాలు. రాగముతో అనురక్తులగుదురు, వైరైగ్యము రాగ రాహిత్యము విరక్తి, ఉపాధి ధర్మచింత ఆధారము కారణము ఆధారము}; వైరాగ్య = వైరాగ్యము (అనాసక్తత); ఉపాధుల = ఉపాధి (ఆధారము) లు; తోన్ = తో; కూడిన = కూడిన; ప్రవృత్తి = ఐహికమునకైన (స్వర్గాది భోగములకైన); నివృత్తి = మోక్షమునకైన; ధర్మంబులును = ధర్మములును; దాన = దానము వలన; ధర్మంబులును = ధర్మములును; రాజ = రాజరికము వలన; ధర్మంబులును = ధర్మములును; స్త్రీ = స్త్రీల యొక్క; ధర్మంబులును = ధర్మములును; శమ = శాంతి; దమ = ఇంద్రియ నిగ్రహము; ఆదికంబులును = మొదలైనవి; హరి = హరికి; తోషణంబులు = సంతోషము కలిగించునవి; అగు = అయిన; ధర్మంబులును = ధర్మములును; ధర్మ = ధర్మమును; అర్థ = అర్థమును; కామ = కామమును; మోక్షంబులును = మోక్షములును; నానా = అనేక; విధ = రకముల; ఉపాఖ్యాన = ఉపాఖ్యానములూ; ఇతిహాసంబులూ = ఇతిహాసములూ; సంక్షేప = సంగ్రహముూ; విస్తార = వివరమూ అయిన; రూపంబులన్ = రూపముల వలన; ఎఱింగెన్ = తెలుసుకొనెను; అంత = అంతట; రథిక = రథికులు {రథికులు - రథముపై నుండి యుద్ధము చేయు వీరులు}; సహస్రంబులు = వేలమంది; కున్ = కి; గమికాఁడు = అధిపత్యము చేయగలవాడు, మొనగాడు; ఐన = అయినట్టి; భీష్ముండు = భీష్ముడు; స్వచ్ఛంద = స్వతంత్రమైన, తమకు ఇష్టము వచ్చినప్పుడే; మరణులు = మరణించు శక్తిగలవారు; ఐన = అయినట్టి; యోగి = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; చేతన్ = చేత; వాంఛితంబు = కోరదగినది; అగు = అయిన; ఉత్తరాయణంబు = ఉత్తరాయణము; సనుదెంచినన్ = వచ్చిన; అది = అది; తనకున్ = తనకు; మరణ = మరణించుటకు; ఉచిత = తగిన; కాలంబు = కాలము; అని = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని.

భావము:

ఈ విధంగా శరీరము నిండా అర్జునుడు వేసిన బాణములు కలవాడైన కురుకుల పితామహుడు పలికిన పలుకులను, అక్కడకి వచ్చిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు గంగానందను డైన భీష్మాచార్యుని వలన మానవజాతికి ఆవశ్యకాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజ ధర్మాలు, స్త్రీ ధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, శమదమాదులు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు, నానావిధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైన వన్నీ కొన్ని సంక్షేపంగా కొన్ని వివరంగా విన్నాడు. తర్వాత అతిరథ మహారథులకు శిరోభూషణ మైన భీష్ముడు స్వచ్ఛందమరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకొన్నాడు.
గమనిక:-  తండ్రి శంతనమహారాజు నుండి భీష్ముడు స్వచ్ఛందమరణాన్ని వరంగా పొందాడు.

1-217-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్.

టీకా:

ఆలాపంబులు = సంభాషణములు; మాని = మానివైచి; చిత్తము = మనసును; మనీషా = ప్రజ్ఞకు; ఆయత్తమున్ = లొంగినదిగా; చేసి = చేసి; దృక్ = చూపుల; జాలంబున్ = సమూహమును, వలను; హరి = కృష్ణుని; మోము = ముఖము; పైన్ = మీద; పఱపి = నిలిపి ఉంచి; తత్ = అతని; కారుణ్య = దయతోకూడిన; దృష్టిన్ = దృష్టితో; వినిర్మూలీ = పూర్తిగానిర్మూలనము; భూత = చేయబడిన; శర = అమ్ములవలన కలిగిన; వ్యధా = బాధల యొక్క; నిచయుఁడు = సమూహముగలవాడు; ఐ = అయి; మోదించి = మిక్కిలి సంతోషము పొంది; భీష్ముండు = భీష్ముడు; సంశీలంబు = మంచి నడత; ఒప్పన్ = ఒప్పుచుండగ; నుతించెన్ = స్తుతించెను; కల్మష = పాపములనే; గజ = ఏనుగుల; శ్రేణీ = సమూహమును; హరిన్ = హరించువానిని, కృష్ణుని; శ్రీహరిన్ = శ్రీకృష్ణుని.

భావము:

అటుపిమ్మట గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకొని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు; కమలాక్షుని దాక్షిణ్యపూరిత కటాక్షవీక్షణం వల్ల ఆయనకి బాణాల బాధలన్ని ఉపశమించాయి; అంతట శాంతశీలుడైన శంతనపుత్రుడు సంతోషించి కలుషాలనే గజసమూహాన్ని చించి చెండాడే యదు సింహుణ్ణి నుతించాడు.