పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-262-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ యష్టోత్తర శత షోడశసహస్ర సౌవర్ణసౌధకాంతం బయిన శుద్ధాంతభవనంబు సొచ్చి హరి తన మనంబున.

టీకా:

తదనంతరంబ = ఆ తరువాత; అష్టోత్తరశతషోడశసహస్ర = పదహారు వేలనూట ఎనిమిది, సహస్ర +షోడశ +శత +అష్ట *; సౌవర్ణ = బంగారు; సౌధ = మేడలలో; కాంతంబు = కాంతలున్నవి, భార్యలు ఉన్నవి; అయిన = అయినట్టి; శుద్ధాంత = అంతఃపుర; భవనంబు = భవనములు; చొచ్చి = ప్రవేశించి; హరి = కృష్ణుడు; తన = తనయొక్క; మనంబున = మనసులో.

భావము:

పిమ్మట గోవిందుడు పదహారువేల నూటయెనిమిది స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకొన్నాడు.

1-263-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భామాభవనంబు మున్నుసొర వేఱొక్కర్తు లోఁగుందునో
సురాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో
విలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్
ప్రటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూవ్యక్తుఁడై భార్గవా!

టీకా:

ఒక = ఒక; భామా = భార్య యొక్క; భవనంబు = భవనము; మున్ను = ముందుగ; చొరన్ = చేరితే; వేఱొకర్తు = ఇంకొకామె; లోన్ = మనసులో; కుందునో = క్రుంగునేమో; సుకర = సుఖకరములైన; ఆలాపములు = మాటలు; ఆడదో = పలుకదేమో; సొలయునో = వైముఖ్యమును పొందునేమో; సుప్రీతిన్ = బాగా ప్రేమతో; వీక్షింపదో = చూడదేమో; వికలత్వంబునన్ = చెదిరినమనసుతో; ఉండునో = ఉండునేమో; అనుచున్ = అనుకొనుచు; ఆ = ఆ; వేళన్ = సమయములో; వధూ = భార్యల; గేహముల్ = గృహములు; ప్రకట = ప్రకటింపబడిన; ఆశ్చర్య = ఆశ్చర్యకరమైన; విభూతిన్ = వైభవముతో; చొచ్చె = ప్రవేశించెను; బహు = అనేకములైన; రూప = రూపములతో; వ్యక్తుఁడు = వ్యక్తమైనవాడు, కనిపించినవాడు; ఐ = అయి; భార్గవా = శౌనకా {భార్గవుడు - భృగువు వంశములో పుట్టినవాడు, శౌనకుడు, శుక్రుడు, పరశురాముడు}.

భావము:

భృగువంశోద్భవుడవైన శౌనకా! ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరొకామె కుందుతుందేమో; తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో; సొక్కిపోతుందేమో; ప్రేమతో వీక్షించదేమో; వైకల్యం వహిస్తుందేమో అని అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు.

1-264-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున.

టీకా:

ఆ = ఆ; సమయంబున = సమయమున.

భావము:

ఆవిధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన నందనందనుణ్ణి చూసి.

1-265-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిశువులఁ జంకలనిడి తను
కృతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్
నలు జాఱఁగ సిగ్గున
శిముఖు లెదురేఁగి రపుడు లజాక్షునకున్.

టీకా:

శిశువులన్ = పిల్లలను; చంకలన్ = చంకలో; ఇడి = ఉంచి, ఎత్తుకొని; తను = శరీరము; కృశతలు = చిక్కిపోవుటలు; విరహ = ఎడబాటు అనే; అగ్నిన్ = అగ్నిని; తెలుప = తెలుపుతుండగ; గృహ = ఇంటి; గేహళులన్ = గుమ్మములలో; రశనలు = మొలనూళ్లు; జాఱఁగ = జారిపోతుండగ; సిగ్గున = లజ్జవలన; శశిముఖులు = స్త్రీలు {శశిముఖి - చంద్రునివంటి ముఖము కల స్త్రీ}; ఎదుర = ఎదురుగ; ఏఁగిరి = వెళ్ళిరి; అపుడు = ఆ సమయమున; జలజాక్షున్ = కృష్ణుని {జలజాక్షుడు - జలజ (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు, విష్ణువు}; కున్ = కి.

భావము:

ఆ చంద్రముఖు లందరు చంటిబిడ్డలను చంకలలో ఎత్తుకొని, విరహతాపంవల్ల చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గున లేచి కాంచీకలాపాలు జారిపోగా సిగ్గుతో యదుచంద్రునికి ఎదురువచ్చారు.

1-266-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా
తుఁడయ్యెన్ మును సేరెఁ బో తొలుత మత్కాంతుండు నా శాలకే
నిరాలభ్య సుఖంబు గంటి" నని తారింటింట నర్చించి ర
య్యతివల్ నూఱుఁబదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్.

టీకా:

పతి = భర్త; నా = నాయొక్క; ఇంటి = ఇంటి; కిన్ = కి; మున్ను = ముందు; వచ్చెన్ = వచ్చెను; ఇదె = ఇదిగో; నా = నాయొక్క; ప్రాణేశుఁడు = భర్త {ప్రాణేశుడు - ప్రాణములకు ఈశుడు (ప్రభువు), భర్త}; అస్మత్ = మాయొక్క; గృహా = ఇంటికి; ఆగతుఁడు = వచ్చినవాడు; అయ్యెన్ = ఆయెను; మును = ముందుగ; సేరెన్ = చేరెను; పో = కదా; తొలుత = ముందు; మత్ = నాయొక్క; కాంతుండు = ప్రియుడు; నా = నాయొక్క; శాల = ఇంటి; కిన్ = కి; ఏన్ = నేను; ఇతర = ఇంకొక విధమున; అలభ్య = లభ్యము కానట్టి; సుఖంబున్ = సుఖమును; కంటిని = చూసితిని; అని = అని; తారు = తాము; ఇంటింటన్ = అన్ని ఇళ్ళలోను; అర్చించిరి = పూజించిరి; ఆ = ఆ; అతివల్ = స్త్రీలు; నూఱుఁ బదారువేలు నెనమండ్రు = నూటపదహారువేల ఎనమిదిమంది, నూఱు + పదారు * వేలు + ఎనమండ్రు; ఆ = ఆ; వేళన్ = సమయములో; ఆత్మ = తమ; ఈశ్వరున్ = భర్తను.

భావము:

పదహారువేల నూట యెనిమిదిమంది రమణీమణులు”యిదుగో నా భర్త తొట్టతొలుత నా యింటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి ఆర్చించారు.

1-267-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలం జూచి హరి యిట్లనియె.

టీకా:

వారలన్ = వారిని; చూచి = చూసి; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ శుభ సమయంలో ప్రేమాస్పదుడైన శ్రీకృష్ణుడు ఆ కామినీమణులను ఇలా క్షేమసమాచారాలు అడిగాడు.

1-268-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్
వంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?
తొవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?
మల్ గావు గదా? భవన్నిలయముల్ ల్యాణయుక్తంబులే?

టీకా:

కొడుకుల్ = కొడుకులు; భక్తి = భక్తితో; విధేయులు = లొంగినవారు; ఔదురు = అవుతారు; కదా = కదా; కోడండ్రు = కోడళ్ళు; మీ = మీ యొక్క; వాక్యముల్ = మాటలు; గడవన్ = దాటుటకు; చాలక = సరిపోకుండగ; ఉందురా = ఉంటారా; విబుధ = పండితులకు; సత్కారంబున్ = మర్యాదలు; కావింతురా = చేయుదురా; తొడవుల్ = ఆభరణములు; వస్త్రములున్ = బట్టలు; పదార్థ = పదార్థములు; రస = రసముల; సందోహంబులున్ = సమూహములు; చాలునా = సరిపోవుచున్నవా; కడమల్ = కొరతలు; కావున్ = కలుగుట లేదు; కదా = కదా; భవత్ = మీయొక్క; నిలయముల్ = ఇండ్లలో; కల్యాణ = శుభములు; యుక్తంబులే = కూడినవేనా.

భావము:

“మీ కొడుకులు వినయవినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా; మీ కోడళ్లు మీ మాటలు జవదాటకుండ ఉన్నారా; బాగా చదువుకున్న విద్వాంసు లరుదెంచి నప్పుడు సత్కారాలు చేస్తున్నారా; నగలు, చీరలు, రసవంతాలైన మధర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా; మీకు ఎట్టి లోటూ వాటిల్లటం లేదు కదా.

1-269-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిలక మేటికి లేదు తిలకనీతిలకమ!-
పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి!
స్తూరి యలఁదవా స్తూరికాగంధి!-
తొడవులు దొడవవా తొడవుతొడవ!
లహంసఁ బెంపుదే లహంసగామిని!-
కీరముఁ జదివింతె కీరవాణి!
తలఁ బోషింతువా తికాలలిత దేహ!-
రసి నోలాడుదే రసిజాక్షి!

1-269.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన!
గురుల నాదరింతె గురువివేక!
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!
నుచు సతులనడిగెచ్యుతుండు."

టీకా:

తిలకము = నుదిటి బొట్టు; ఏటి = ఎందుల; కిన్ = కు; లేదు = లేదు; తిలకనీ = తిలకము ధరించువారిలో, స్త్రీలలో; తిలకమా = గౌరవింపదగినదానా; పువ్వులున్ = పువ్వులను; తుఱుమవా = ధరింపవా; పువ్వున్ = పువ్వులవంటి; బోఁడి = శరీరము కలదానా; కస్తూరి = కస్తూరి అనే శ్రేష్ఠ మైన సుగంధం; అలఁదవా = రాయవా; కస్తూరికా = కస్తూరివంటి; గంధి = వాసన కలదానా; తొడవులు = ఆభరణములు; తొడవవా = ధరింపవా; తొడవు = ఆభరణములకే; తొడవ = ఆభరణమా; కలహంసన్ = (మధుర కంఠధ్వని) కలహంసలను; పెంపుదే = పెంచుతున్నావా; కలహంస = చక్కటిహంస; గామిని = నడక కలదానా; కీరమున్ = చిలుకలకు; చదివింతె = మాటలు చెప్పుతావా; కీర = చిలుకపలుకుల వంటి; వాణి = కంఠము కలదానా; లతలన్ = లతలను; పోషింతువా = పెంచుతావా; లతికా = పూలతీగవలె; లలిత = సుకుమార; దేహ = దేహము కలదానా; సరసిన్ = కొలనులో; ఓలాడుదే = జలకాలాడుదే; సరసిజ = పద్మముల వంటి; అక్షి = కన్నులు ఉన్నదానా;
మృగి = లేడి; కిన్ = కి; మేఁతల్ = గడ్డి, మేతలు; ఇడుదె = ఇచ్చెదవా; మృగ = లేడి; శాబ = పిల్లకి వంటి; లోచన = కన్నులు ఉన్నదానా; గురులన్ = గురువులను, పెద్దలను; ఆదరింతె = ఆదరించెదవా; గురు = గొప్ప; వివేక = వివేకము కలదానా; బంధుజనులన్ = బంధువులను; ప్రోతె = రక్షింతువా; బంధు = బంధువులకు; చింత = తలచినవి; ఆమణి = ఇచ్చుదానా; అనుచున్ = అంటూ; సతులన్ = భార్యలను; అడిగెన్ = అడిగెను; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - నాశము లేని వాడు, విష్ణువు}.

భావము:

నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకోవా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తూరి రాసుకోవా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తె! ఆభరణాలు అలంకరించుకోవా? హంసనడకల చిన్నదాన! కలహంసలని పెంచుతున్నావా? చిలుకపలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగె అంతటి సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బందుప్రేమకి పేరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?” అంటూ ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు.

1-270-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యడిగిన వారలు హరిం బాసిన దినంబు లందు శరీరసంస్కార కేళీవిహార హాస వనమందిరగమన మహోత్సవదర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున.

టీకా:

అని = ఆ విధముగా; అడిగినన్ = అడుగగా; వారలు = వారు; హరిన్ = కృష్ణుని; పాసిన = ఎడబాటు చెందిన; దినంబులు = రోజులు; అందున్ = లో; శరీర = శరీరములను; సంస్కార = చక్కదిద్దు కొనుటలు; కేళీ = సరదాలకి; విహార = విహరించుటలు; హాస = నవ్వుటలు; వన = వనములకు; మందిర = మందిరములకు; గమన = వెళ్ళుటలు; మహోత్సవ = మహోత్సవములను; దర్శనంబులు = చూడబోవుటలు; ఒల్లని = అంగీకరింపని; ఇల్లాండ్రు = భార్యలు; కావున = అగుట మూలమున.

భావము:

ఆ కాంత లంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు, లీలా విలాసాలు, పరిహాస భాషణాలు, ఉద్యాన విహారాలు, ఆలయ గమనాలు, మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని ఇల్లాండ్రు. అందువల్ల వారు.

1-271-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిరి చాంచల్యముతోడిదయ్యుఁ దనకున్ జీవేశ్వరుం డంచు నే
పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులం
యుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్ ల్యాణబాష్పంబు లా
ణశ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తానురాగంబులన్.

టీకా:

సిరి = లక్ష్మి; చాంచల్యము = చంచలత్వము; తోడిది = కూడినది; అయ్యున్ = అయినప్పటికి; తన = తన; కున్ = కు; జీవేశ్వరుండు = భర్త, జీవమునకు ఈశ్వరుడు; అంచున్ = అనుచు; ఏ = ఏ; పురుషశ్రేష్ఠున్ = కృష్ణుని {పురుషశ్రేష్ఠుడు - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు}; వరించెన్ = వరించెను; అట్టి = అటువంటి; పరమున్ = అందరికన్న పైన ఉన్నవానిని; బుద్ధిన్ = బుద్ధిశాలిని; విలోకంబులన్ = చూపులతో; కర = చేతుల; యుగ్మంబులన్ = జంటలతో; కౌఁగిలించిరి = ఆలింనగనము చేసిరి; సతుల్ = సత్ప్రవర్తన కల స్త్రీలు; కల్యాణ = ఆనందపు; బాష్పంబులు = కన్నీళ్ళు; ఆభరణ = ఆభరణముల; శ్రేణులుగాన్ = వరుసలుగా; ప్రతిక్షణ = క్షణక్షణము; నవ = కొత్తగా; ప్రాప్త = పొందబడిన; అనురాగంబులన్ = అనురాగములతో.

భావము:

తన జీవితేశ్వరుడని ఏ పురుషోత్తముణ్ణి వరించి, చంచల స్వాభావం కలదైన శ్రీదేవి ఒక్క క్షణం కూడ వదలిపెట్టకుండా ఉందో, అటువంటి పరమాత్ముణ్ణి ముందు మనస్సుతో, తరువాత చూపులతో, అటుపిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కల్యాణ బాష్పాలు అణిముత్యాల సరాలుగా జాలువారుతుండగ, క్షణక్షణం క్రొత్తదనంతో కూడిన అనురాగంతో గట్టిగా కౌగిలించుకొన్నారు.

1-272-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంబాణుని నీఱు సేసిన ర్గునిం దన విల్లు వ
ర్జించి మూర్ఛిలఁ జేయఁ జాలు విశేష హాస విలోక నో
దంచి దాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవున్
సంలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా!

టీకా:

పంచబాణుని = మన్మథుని {పంచబాణుడు - 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, పాఠ్యంతరమున 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు}; నీఱు = భస్మము; సేసిన = చేసిన; భర్గునిన్ = శివుని; తన = తనయొక్క; విల్లు = ధనస్సు; వర్జించి = వదిలివేసి; మూర్ఛిల్లన్ = మూర్చ పోవునట్లు; చేయన్ = చేయుటకు; చాలు = సరిపడ; విశేష = విశిష్టమైన; హాస = నవ్వులు; విలోకన = చూపులు; ఉదంచిత = మిక్కిలి శోభ కలిగిన; ఆకృతులు = ఆకారములు కలవారు; అయ్యున్ = అయినప్పటికిని; కాంతలు = స్త్రీలు; దంభ = కపట; చేష్టలన్ = చేష్టలతో; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. మధు అను రాక్షసుని జయించినవాడు విష్ణువు, 3. మనసును రంజింపజేయువాడు, 4. మాధవి భర్త, 5. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు,}; సంచలింపఁగన్ = మనసుని చలింపగా; చేయన్ = చేయుటకు; ఏమియున్ = ఏమాత్రము; చాలరు = చాలనివారు; ఐరి = అయిరి; బుధోత్తమా = జ్ఞానులలో శ్రేష్ఠుడా, శౌనకుడా.

భావము:

ఓ సుధీసత్తమా! మన్మథుడిని మూడోకంటి మంటతో నుసి చేసిన మహేశ్వరుని సైతం విల్లు పడేసి మూర్ఛపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహర మైన దేహాలు కల వాళ్ళు అయి కూడ ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయ లేకపోయారు.

1-273-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున సంగవిరహితుం డైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన విలోకులయిన లోకులు లోక సామాన్య మనుష్యుం డని తలంతు; రాత్మాశ్రయయైన బుద్ధి యాత్మ యందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందక యుండుఁ; బరస్పర సంఘర్షణంబులచే వేణువులవలన వహ్నిఁ బుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజులగు రాజుల కన్యోన్యవైరంబులు గల్పించి నిరాయుధుండై సంహారంబు సేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ బ్రాకృతమనుష్యుండునుం బోలె సంచరించుచుండె నా సమయంబున.

టీకా:

ఈ = ఈ; విధంబున = విధముగ; సంగ = సంబంధము, బంధనములు; విరహితుండు = లేనివాడు; ఐన = అయినట్టి; కంసారి = కృష్ణుడు {కంసారి - కంసునకు శత్రువు, కృష్ణుడు}; సంసారి = సంసార బంధములు ఉన్నవాని; కైవడి = వలె; విహరింపన్ = చరించుచుండగ; అజ్ఞాన = అజ్ఞానముతోకూడిన; విలోకులు = దృష్టికలవారు; అయిన = అయినట్టి; లోకులు = ప్రజలు; లోక = లోకములో; సామాన్య = సామాన్యముగా ఉండు; మనుష్యుండు = మానవుడు; అని = అని; తలంతురు = అనుకొందురు; ఆత్మా = ఆత్మను; ఆశ్రయ = ఆశ్రయించినది; ఐన = అయినట్టి; బుద్ధి = బుద్ధి; ఆత్మ = ఆత్మ; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; ఆనంద = ఆనందము; అదులు = మొదలగువాటి; తోడన్ = తో; కూడని = కూడకుండగా ఉండు; తెఱంగునన్ = విధముగ; ఈశ్వరుండు = హరి; ప్రకృతి = ప్రకృతి; తోడన్ = తో; కూడియున్ = కూడి ఉన్నప్పటికిని; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణంబులు = గుణములు; ఐన = అయినట్టి; సుఖ = సుఖములను; దుఃఖంబులన్ = దుఃఖములను; చెందక = సంబంధములేక; ఉండున్ = ఉండును; పరస్పర = ఒకదానికొకటి; సంఘర్షణంబుల = రాసుకొనుట, ఒరసికొనుట; చేన్ = చేత; వేణువుల = వెదుళ్ళు; వలనన్ = వలన; వహ్నిన్ = అగ్నిని; పుట్టించి = పుట్టించి; వనంబులన్ = అడవులను; దహించు = కాల్చివేయు; మహా = గొప్ప; వాయువు = గాలి; చందంబున = వలె; భూమి = భూమండలము; కిన్ = నకు; భార = బరువు పెరుగుటకు; హేతువులు = కారణములు; ఐ = అయి; అనేక = లెక్కకుమించిన; అక్షౌహిణులు = అక్షౌహిణులు; తోడన్ = తో; ప్రవృద్ధ = బాగుగా పెరిగిన; తేజులు = తేజస్సుకలవారు; అగు = అయిన; రాజులు = రాజులు; కున్ = కి; అన్యోన్య = వారిలోవారికి; వైరంబులు = శత్రుత్వములు; కల్పించి = కలుగజేసి; నిరాయుధుండు = ఆయుధములు లేనివాడు; ఐ = అయి; సంహారంబున్ = సంహారమును; చేసి = చేసి; శాంతుండు = శాంతిపొందినవాడు; ఐ = అయి; పిదపన్ = తరువాత; కాంతా = స్త్రీల; మధ్యంబునన్ = మధ్యలో; ప్రాకృత = సామాన్య; మనుష్యుండునున్ = మానవుని; పోలెన్ = వలె; సంచరించుచు = తిరుగుతూ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

భావము:

ఈ విధంగా సర్వసంగ పరిత్యాగియైన కంసారి, సంసారిలాగా విహరించటం చూసి, మూర్ఖులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతిగుణాలైన సుఖదుఃఖాలను పొందకుండా ఉంటాడు. వెదురు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి. అగ్ని పుట్టించి. అరణ్యాలను దహించే మహాప్రభంజనం వలె వాసుదేవుడు, అనేక అక్షౌహిణీ సైన్యాలతో భూమికి బరువుచే టైన, ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్యకలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్టసంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనము మధ్యలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు.

1-274-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తు లీశ్వరుని మహత్త్వము
మి మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి
స్థితి నెఱుఁగక కాముకుఁ డని
ములు సలుపుదురు తిగిచి మణులు సుమతీ!

టీకా:

యతులు = ఇంద్రియములను నియమించినవారు; ఈశ్వరుని = కృష్ణుని; మహత్త్వము = గొప్పదనము యొక్క; మితమున్ = పరిమాణమును, హద్దులను; ఎఱుఁగని = తెలిసికొనలేని; భంగిన్ = విధముగ; అప్రమేయుఁడు = మితము లేనివాడు; అగు = అయినట్టి; హరి = కృష్ణుని; స్థితిన్ = స్థితిని; ఎఱుఁగక = తెలిసికొనలేక; కాముకుఁడు = కామ ప్రకోపముతో నుండువాడు; అని = అని; రతములు = సురతములు; సలుపుదురు = చేయుదురు; తిగిచి = ఆకర్షించి; రమణులు = స్త్రీలు; సుమతీ = మంచి బుద్ధి కలవాడా.

భావము:

ఓ బుద్ధిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్వాన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.

1-275-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఎల్లప్పుడు మా యిండ్లను
ల్లభుఁడు వసించు; నేమ ల్లభలము శ్రీ
ల్లభున" కనుచు గోపీ
ల్లభుచే సతులు మమతలఁ బడి రనఘా!""

టీకా:

ఎల్లప్పుడు = ఎప్పుడు; మా = మా యొక్క; ఇండ్లను = ఇండ్ల యందే; వల్లభుఁడు = భర్త; వసించు = ఉండును; నేమ = మేమే; వల్లభలము = ప్రియ మైన వారము; శ్రీవల్లభు = కృష్ణున {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) వల్లభుడు (భర్త), విష్ణువు}; కున్ = కు; అనుచున్ = అంటూ; గోపీవల్లభు = కృష్ణుడు {గోపీవల్లభుడు - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు}; చేన్ = చేత; సతులు = భార్యలు; మమత = మమకార మనెడి; వలన్ = వలలో; పడిరి = తగలు కొనిరి; అనఘా = పాపము లేనివాడా.

భావము:

పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని వలపుల వలలో చిక్కుకొన్నారు.”

1-276-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పిన విని శౌనకుండు సూతున కిట్లనియె.

టీకా:

అని = అని; చెప్పిన = చెప్పగ; విని = వినిన; శౌనకుండు = శౌనకుడు; సూతున = సూతున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా చెప్పిన సూతుని మాటలు విని శౌనకుడు ఇలా అన్నాడు.

1-277-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గురునందనుండు సక్రోధుఁడై యేసిన-
బ్రహ్మశిరోనామబాణవహ్నిఁ
గంపించు నుత్తరర్భంబు గ్రమ్మఱఁ-
ద్మలోచనుచేతఁ బ్రతికె నండ్రు;
ర్భస్తుఁ డగు బాలుఁ గంసారి యే రీతి-
బ్రతికించె? మృత్యువు యము వాపి
నియించి యతఁడెన్ని సంవత్సరములుండె?-
నెబ్భంగి వర్తించె? నేమిసేసె?

1-277.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము, శుకుఁడు వచ్చి విజ్ఞానపద్ధతి
తని కెట్లు సూపె తఁడు పిదపఁ
న శరీర మే విధంబున వర్జించె
విప్రముఖ్య! నాకు విస్తరింపు."

టీకా:

గురు = ద్రోణుని; నందనుండు = కొడుకు, అశ్వత్థామ; సక్రోధుఁడు = క్రోధముతో ఉన్నవాడు; ఐ = అయ్యి; యేసిన = ప్రయోగించిన; బ్రహ్మశిరస్ = బ్రహ్మశిరస్సు అను; నామ = పేరు కల; బాణ = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నికి; కంపించు = వణికిపోతున్న; ఉత్తర = ఉత్తరయొక్క; గర్భంబున్ = గర్భమును; క్రమ్మఱన్ = మరల; పద్మలోచను = కృష్ణుని; చేతన్ = వలన; బ్రతికెను = బ్రతికెను; అండ్రు = అందురు; గర్భస్తుఁడు = గర్భములో ఉన్నవాడు; అగు = అయినట్టి; బాలున్ = పిల్లవానిని; కంసారి = కృష్ణుడు; ఏ = ఏ; రీతి = విధముగ; బ్రతికించెన్ = బ్రతికించెను; మృత్యువు = మరణము వలన; భయమున్ = భయమును; వాపి = పోగొట్టి; జనియించి = పుట్టి; అతఁడు = అతడు; ఎన్ని = ఎన్ని; సంవత్సరములు = ఏండ్లు; ఉండెన్ = ఉండెను; ఏ = ఏ; భంగిన్ = విధముగ; వర్తించెన్ = చరించెను; ఏమి = ఏమి; చేసెన్ = చేసెను;
వినుము = వినుము; శుకుఁడు = శుకుడు; వచ్చి = వచ్చి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; పద్ధతిన్ = మార్గమును; అతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఎట్లు; సూపె = చూపెను; అతఁడు = అతడు; పిదపన్ = తరువాత; తన = తనయొక్క; శరీరము = శరీరము; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; వర్జించెన్ = విడిచిపెట్టెను; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యుడా; నాకు = నాకు; విస్తరింపు = వివరింపుము.

భావము:

“ బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూతమహర్షీ! అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామకమైన మహాస్త్రం మంటలకు, తపించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును దేవకీ నందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను. తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారిపడకుండా ఎలా రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించిన ఆ బాలుడు భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఏ విధంగా ప్రవర్తించాడు? ఏయే ఘనకార్యాలు చేసాడు? చివరకి తన తనువును ఏ విధంగా త్యజించాడు? ఈ విషయాలన్నీ నాకు వివరించు.”

1-278-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన సూతుం డిట్లనియె;ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రి తాఖిల జంబూద్వీప రాజ్యంబు నార్జించియు; మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు; నంగనా, తురంగ, మాతంగ, సుభట, కాంచ నాది దివ్యసంపదలు సంపాదించియు; వీరసోదర, విప్ర, విద్వజ్జన వినోదంబులఁ బ్రమోదించియు, వైభవంబు లలవరించియుఁ; గ్రతువు లాచరించియు; దుష్టశిక్షణ శిష్టరక్షణంబు లొనరించియు; ముకుందచరణారవింద సేవారతుండై సమస్త సంగంబు లందు నభిలాషంబు వర్జించి యరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు.

టీకా:

అనినన్ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; చతుస్ = నాలుగు; సముద్ర = సముద్రములచే; ముద్రిత = ఆవరింపబడిన; అఖిల = సమస్తమైన; జంబూ = జంబూ; ద్వీప = ద్వీపపు; రాజ్యంబున్ = రాజ్యమును; ఆర్జించియు = సంపాదించినప్పటికి; మిన్ను = ఆకాశమును; ముట్టిన = అంటిన; కీర్తిన్ = కీర్తిని; ఉపార్జించియు = సముపార్జించినప్పటికిని; అంగనా = స్త్రీలు; తురంగ = గుఱ్ఱములు; మాతంగ = ఏనుగులు; సుభట = మంచి యోధులు; కాంచన = బంగారము; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; సంపదలు = సంపదలు; సంపాదించియున్ = సంపాదించినప్పటికిని; వీర = వీరులైన; సోదర = సోదరులు; విప్ర = బ్రాహ్మణులు; విద్వత్ = విద్వాంసులైన; జన = జనుల వలన; వినోదంబులన్ = వినోదములతో; ప్రమోదించియున్ = మిక్కిలి సంతోషించినప్పటికిని; వైభవంబులు = వైభవములను; అలవరించియున్ = పొందియున్; క్రతువులు = యజ్ఞములు; ఆచరించియున్ = చేసినప్పటికిని; దుష్ట = దుష్టులను; శిక్షణ = శిక్షించుట; శిష్ట = శిష్టులను; రక్షణంబులు = రక్షించుటలు; ఒనరించియున్ = ఏర్పరిచినప్పటికిని; ముకుంద = హరియొక్క; చరణ = పాదములనే; అరవింద = పద్మముల; సేవా = భక్తిమీద; రతుండు = మిక్కిలి ప్రేమ కలవాడు; ఐ = అయి; సమస్త = సమస్తమైన; సంఘంబులు = సంబంధములు; అందున్ = ఎడల; అభిలాషంబు = కోరికలను; వర్జించి = వదిలివేసి; అరిషడ్వర్గంబున్ = అరిషడ్వర్గములు {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు}; జయించి = జయించి; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచు.

భావము:

అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ”ధర్మనందనుడు నాలుగు సముద్రాల నడుమ గల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాన్నంటే అఖండకీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమాశ్వాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వీరాధివీరులైన తన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యావినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకొన్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై, సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై, అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన సాగించాడు.

1-279-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు
నివి నొందని కైవడి ర్మసుతుఁడు
సంపదలు పెక్కుఁ గలిగియుఁ క్రిపాద
సేవనంబులఁ బరిపూర్తి సెందకుండె.

టీకా:

చందన = మంచిగంధం; ఆదులన్ = మొదలగు వాని వలన; ఆఁకటన్ = ఆకలితో; స్రగ్గువాఁడు = కుంచించుకొని పోవు వాడు; తనివిన్ = సంతృప్తిని; ఒందని = పొందని; కైవడిన్ = విధముగ; ధర్మసుతుఁడు = ధర్మరాజు {ధర్మసుతుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సంపదలు = సంపదలు; పెక్కున్ = చాలా; కలిగియున్ = కలిగి ఉన్నప్పటికిని; చక్రి = చక్రాయుధుని, హరి {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; పాద = పాదములను; సేవనంబులన్ = కొలచుట యందు; పరిపూర్తి = సంతృప్తి; చెందక = చెందకుండగ; ఉండెన్ = ఉండెను.

భావము:

మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడ, శ్రీకృష్ణ భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా సేవించాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడుట.

1-280-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతం గొన్ని దినంబులకు నభిమన్యుకాంతాగర్భంబు నందున్నడింభకుండు దశమమాసపరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు.

టీకా:

అంతన్ = అంతట; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్ = కి; అభిమన్యు = అభిమన్యుని {అభిమన్యుకాంత - ఉత్తర, అభిమన్యుని భార్య}; కాంతా = భార్యయొక్క; గర్భంబున్ = గర్భము; అందున్ = లోపల; ఉన్న = ఉన్నటువంటి; డింభకుండు = పిల్లవాడు; దశమ = పదవ; మాస = నెల; పరిచ్ఛేద్యుండు = దాటినవాడు; ఐ = అయి; గర్భ = గర్భముయొక్క; అంతరాళంబున = లోపల; దురంతంబు = అంతములేనిది; ఐన = అయినట్టి; అశ్వత్థామ = అశ్వత్థామ; బాణ = బాణముయొక్క; అనలంబునన్ = అగ్నివలన; దందహ్యమానుండు = దహింపబడుచున్న వాడు; ఐ = అయి; తల్లడిల్లుచున్ = తల్లడిల్లుతూ.

భావము:

ఇంతలో కొన్నాళ్ళకు, అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండాయి. పదవనెల ప్రవేశించింది. ఇంతలో కడుపులోని శిశువు గురుపుత్రుడు అశ్వత్థామ అస్త్రపు అగ్నిజ్వాలలకు కమిలి, కమిలిపోతూ ఇలా ఆక్రోశించసాగాడు.