పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గర్భస్థకుని విష్ణువు రక్షించుట

  •  
  •  
  •  

1-281-ఉ.

"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
య్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!

1-282-క.

చిచ్చఱకోలవశంబునఁ
చ్చి బహిర్గతుఁడఁ గాని మయమునను దా
నుచ్చలిత గర్భవేదనఁ
చ్చును మా తల్లి ఘోర సంతాపమునన్.

1-283-క.

చెచ్చెర బాణజ్వాలలు
చ్చిన విష్ణుండు గావచ్చు ననుచుఁ దా
ముచ్చటలు సెప్పు సతులకు
నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో.

1-284-శా.

రాఁడా చూడ సమస్తభూతములలో రాజిల్లు వాఁ డిచ్చటన్
లేఁడా? పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా
కీఁడా? నేఁ డభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత ముం
గాఁడా? యెందఱిఁ గావఁ డీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో?"

1-285-వ.

అని గతాగతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున.

1-286-సీ.

మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని-
పై నున్న పచ్చని టమువాఁడు;
గండభాగంబులఁ గాంచన మణి మయ-
కరకుండలకాంతి లయువాఁడు;
రవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి-
న్నుల నునుఁ గెంపు లుగువాఁడు;
బాలార్కమండల ప్రతిమాన రత్న హా-
క విరాజిత కిరీటంబువాఁడు;

1-286.1-తే.

కంకణాంగద వనమాలికా విరాజ
మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.

1-287-వ.

ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁజెఱచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన.

1-288-మ.

"దఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ
ప్రమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ
యుం డెవ్వఁడొకో?"" యటంచు మదిలోఁ ర్చించుచున్ శాబకుం
డెదురై చూడ నదృశ్యుఁ డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!