పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-497-మ.

తుసీసంయుతదైత్యజిత్పదరజస్తోమంబుకంటెన్ మహో
జ్జ్వమై, దిక్పతిసంఘసంయుతజగత్సౌభాగ్యసంధాయియై,
లిదోషావళి నెల్లఁ బాపు, దివిషద్గంగాప్రవాహంబు లో
లికిం బోయి, మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్.

1-498-క.

చిత్తము గోవిందపదా
త్తముఁ గావించి, మౌనియై తనలో నే
త్తఱము లేక, భూవర
త్తముఁడు వసించె ముక్తసంగత్వమునన్.

1-499-వ.

ఇట్లు పాండవపౌత్రుండు ముకుంద చరణారవింద వందనానందకందాయమాన మానసుండై విష్ణుపదీతీరంబునఁ బ్రాయోపవేశంబున నుండుట విని, సకలలోక పావనమూర్తులు మహానుభావులు నగుచుఁ దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులైన యత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వసిష్ఠ, పరాశర, చ్యవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కవష, కణ్వ, కలశసంభవ, వ్యాస, పర్వత, నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షిపుంగవులునుఁ; గాండర్షులయిన యరుణాదులును; మఱియు నానాగోత్రసంజాతులైన మునులును; శిష్య ప్రశిష్య సమేతులై చనుదెంచిన, వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి, పూజించి, దండప్రణామంబు లాచరించి, కూర్చుండ నియోగించి.

1-500-క.

క్రమ్మఱ నమ్మునివిభులకు
మ్మనుజేంద్రుండు మ్రొక్కి ర్షాశ్రుతతుల్
గ్రమ్మఁగ ముకుళితకరుఁడై
మ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్.

1-501-ఉ.

""పిక లేక చచ్చిన మహోరగముం గొని వచ్చి కోపినై
తాసు మూపుఁపై నిడిన దారుణచిత్తుఁడ; మత్తుఁడన్; మహా
పాపుఁడ; మీరు పాపతృణపావకు; లుత్తము లయ్యలార! నా
పాము వాయు మార్గముఁ గృపావరులార! విధించి చెప్పరే.

1-502-ఉ.

భూసురపాదరేణువులు పుణ్యులఁజేయు నరేంద్రులన్ ధరి
త్రీసురులార! మీచరణరేణుకణంబులు మేను సోఁక నా
చేసిన పాపమంతయు నశించెఁ; గృతార్థుఁడ నైతి; నెద్ది యేఁ
జేసిన ముక్తి పద్ధతికిఁజెచ్చెరఁ బోవఁగఁ వచ్చుఁ జెప్పరే.

1-503-క.

భీరతర సంసార
వ్యాకులతన్ విసిగి దేహ ర్జన గతి నా
లోకించు నాకుఁ దక్షక
కాకోదరవిషము ముక్తికారణ మయ్యెన్.

1-504-క.

పారు నహంకార
వ్యాపారము లందు మునిఁగి ర్తింపంగా
నాపాలిటి హరి భూసుర
శావ్యాజమున ముక్తసంగుం జేసెన్.

1-505-మ.

రుగాధీశువిషానలంబునకు మే నొప్పింతు శంకింప; నీ
శ్వసంకల్పము నేఁడు మానదు; భవిష్యజ్జన్మజన్మంబులన్
రి చింతారతియున్, హరిప్రణుతి, భాషాకర్ణ నాసక్తియున్,
రిపాదాంబుజ సేవయుం గలుగ మీ ర్థిం బ్రసాదింపరే?

1-506-క.

చూడుఁడు నా కల్యాణము;
పాడుఁడు గోవిందుమీఁది పాటలు దయతో;
నాడుఁడు హరిభక్తులకథ;
లే హముల లోన ముక్తి కేఁగఁగ నిచటన్.

1-507-క.

మ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో
మ్మా నా కెదుర గంగ! మ్యతరంగా!""

1-508-వ.

అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరంబు లందును హరిపాదభక్తి సౌజన్యంబులు సంధిల్లుం గాత మని, గంగాతరంగిణీ దక్షిణకూలంబునం బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి, రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసార బంధంబునకుం దప్పించి, చిత్తంబు హరికి నొప్పించి, పరమ భాగవతుండైన పాండవపౌత్రుండు ప్రాయోపవిష్టుండై యున్న సమయంబున.

1-509-క.

త్తిలి పొగడుచు సురలు వి
త్తలముననుండి మెచ్చి లరుల వానల్
మొత్తములై కురిసిరి నృప
త్తముపై భూరి భేరి బ్దంబులతోన్.

1-510-వ.

ఆ సమయంబున సభాసీనులయిన ఋషు లిట్లనిరి.

1-511-మ.

""క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు; మీ తాత లు
గ్ర పోధన్యులు; విష్ణుపార్శ్వపదవిం గామించి రాజన్యశో
భి కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు
న్నతులై; నీవు మహోన్నతుండవు గదా నారాయణధ్యాయివై.

1-512-మ.

సుధాధీశ్వర! నీవు మర్త్య తనువున్ ర్జించి; నిశ్శోకమై,
వ్యనచ్ఛేదకమై, రజోరహితమై ర్తించు లోకంబు స
ర్వమత్వంబునఁ జేరునంతకు; భవద్వాక్యంబులన్ వించు నే
దెకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్.""

1-513-వ.

అని యిట్లు పక్షపాత శూన్యంబులును; మహనీయ, మాధుర్య, గాంభీర్య, సౌజన్య, ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు; మూఁడులోకంబులకు నవ్వలిదైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునం దేజరిల్లుచున్నఋషులం జూచి, భూవరుండు నారాయణకథాశ్రవణ కుతూహలుం డయి నమస్కరించి యిట్లనియె.

1-514-క.

""ఏడు దినంబుల ముక్తిం
గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార
క్రీన మే క్రియ నెడతెగుఁ,
జూడుఁడు మాతండ్రులార! శ్రుతివచనములన్.

1-515-శా.

ప్రాప్తానందులు, బ్రహ్మబోధన కళాపారీణు, లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు, మీర, లార్యులు, దయాళుత్వాభిరాముల్, మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా!
ప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం ర్చించి భాషింపరే.""

1-516-వ.

అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ బ్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున.