పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-517-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతినిమేషము పరబ్రహ్మంబు నీక్షించి-
దిఁ జొక్కి వెలుపల ఱచువాఁడు;
మలంబుమీఁది భృంముల కైవడి మోము-
పై నెఱపిన కేశటలివాఁడు;
గిఱి వ్రాసి మాయ నంగీకరించని భంగి-
సనంబుఁ గట్టక చ్చువాఁడు;
సంగిగాఁ డని వెంటఁ జాటు భూతములు నా-
బాలుర హాస శబ్దములవాఁడు;

1-517.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిత పద, జాను, జంఘోరు, ధ్య, హస్త,
బాహు, వక్షోగళానన, ఫాల, కర్ణ,
నాసికా, గండ, మస్తక, యన యుగళుఁ
డైన యవధూతమూర్తి వాఁ రుగుదెంచె.

టీకా:

ప్రతి = ప్రతి ఒక్క; నిమేషము = రెప్పపాటు కాలమందును; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; ఈక్షించి = చూసి; మదిన్ = మనసులో; చొక్కి = పరవశుడై; వెలుపల = బాహ్య ప్రపంచమును; మఱచు = మరచిపోవు; వాఁడు = వాడు; కమలంబు = పద్మము; మీఁది = మీది; భృంగముల = తుమ్మెదల; కైవడిన్ = వలె; మోము = ముఖము; పైన్ = మీద; నెఱపిన = పరచబడిన; కేశ = వెంట్రుకల; పటలి = గుంపు; వాఁడు = కలవాడు; గిఱి = గీత; వ్రాసి = గీసినట్లు; మాయన్ = మాయను; అంగీకరించని = అంగీకరింపని; భంగి = విధముగ; వసనంబున్ = వస్త్రము; కట్టక = కట్టుకోకుండగ; వచ్చు = ఉండు; వాఁడు = వాడు; సంగి గాఁడు = ఏమీ పట్టని వాడు; అని = అని; వెంటన్ = వెంటపడి; చాటు = చాటుతున్న; భూతములు = సర్వభూతములు; నా = అన్నట్లు; బాలుర = పిల్లల; హాస = నవ్వుల; శబ్దంబుల = శబ్దముల; వాఁడు = వాడు;
మహిత = గొప్పవి యైన; పద = పదములు; జాను = మోకాళ్ళు; జంఘ = పిక్కలు; ఉరు = తొడలు; మధ్య = నడుము; హస్త = చేతులు; బాహు = భుజములు; వక్షస్ = ఛాతి; గళ = కంఠము; ఆనన = ముఖము; ఫాల = ఫాలము; కర్ణ = చెవులు; నాసిక = ముక్కు; గండ = చెక్కిళ్ళు; మస్తక = తల; నయన = కళ్ళ; యుగళుడు = జంట ఉన్న వాడు; ఐన = అయినట్టి; అవధూత = దిగంబరమైన; మూర్తి = స్వరూపము - ఆకారము; వాడు = కలవాడు; అరుగుదెంచెన్ = వచ్చెను.

భావము:

ఆ సమయంలో దైవయోగంవల్ల, ప్రతిక్షణమూ పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయటి ప్రపంచాన్ని మరచినవాడూ, కమలం మీద తుమ్మెదల్లాగా ముఖంపైన ముంగురులు ముసురుతున్న వాడూ, గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడూ, సర్వసంగ పరిత్యాగియైన మహాయోగి ఇతడని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు వెంటనంటి వస్తున్నవాడూ, సహజ సుందరాలైన చరణాలూ, జంఘలూ, ఊరువులూ, నడుమూ, చేతులూ, భుజాలూ, వక్షస్థ్సలమూ, కంఠమూ, ముఖమూ, లలాటమూ, వీనులూ, కన్నులూ, నాసికా, చెక్కిళ్లూ, శిరస్సూ కలిగిన ఒక అవధూతమూర్తి అనుకోకుండా అచ్చటికి విచ్చేసాడు.

1-518-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని లోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు, గోరికల్
గోనివాఁడు, గూటువలఁ గూడనివాఁడు, వృథా ప్రపంచముం
జేనివాఁడు, దైవగతిఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై
నేనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు, వెండియున్.

టీకా:

ఈరు = ఈయరు; అని = అని; లోకులన్ = ప్రజలను; కినిసి = కోపించి; ఎగ్గులు = నిందలు; పల్కని = పలుకని; వాఁడు = వాడు; కోరికల్ = కోరికలు ఏమియు; కోరని = అడగని; వాఁడు = వాడు; కూటు = గుంపులు; జన సమ్మర్థము ఉన్న చోటులు; వలన్ = వలలో; కూడని = కలవని; వాఁడు = వాడు; వృథా = వ్యర్థముగ; ప్రపంచమున్ = ప్రాపంచిక విషయములను; చేరని = కూడని; వాఁడు = వాడు; దైవ = దైవము; గతిన్ = వలన; చేరిన = వచ్చినది; లాభమున్ = దొరికినది; సూచి = చూసి; తుష్టుఁడు = సంతృప్తితో కూడిన సంతోషము కలవాడు; ఐ = అయి; నేరని = చేతగాని; వాని = వాని; చందమునన్ = వలె ఉండి; నేర్పులు = తెలివి; సూపెడు = చూపు; వాఁడు = వాడు; వెండియున్ = ఇంకను.

భావము:

ఈయలేదని ఎవరినీ కోపంతో ఎగ్గులు పలకడు, కావాలని ఏ కోరికలూ కోరడు. ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదికి మనస్సు పోనీయడు. దైవవశం వల్ల తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకునిలా కనబడుతాడు.

1-519-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మహాత్ము షోడశాబ్ద వయోరూప,
మన, గుణ, విలాస, కౌశలములు,
ముక్తికాంత సూచి మోహిత యగునన
నితర కాంత లెల్ల నేమి సెప్ప.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ము = ఆత్మ కలవాని; షోడశ = పదహారు (16); అబ్ద = సంవత్సరముల; వయస్ = ఈడు; రూప = రూపము; గమన = నడవడిక; గుణ = గుణములు; విలాస = శోభ, ప్రకాశము; కౌశలములు = నేర్పరితనములు; ముక్తి = ముక్తి అను; కాంత = స్త్రీ; చూచి = చూసి; మోహిత = మోహింపబడినది; అగున్ = అగును; అనన్ = అనగా; ఇతర = ఇతర; కాంతలు = స్త్రీలు; ఎల్లన్ = అందరి గురించి; ఏమి = ఏమి; సెప్పన్ = చెప్పగలము.

భావము:

ఆ మహాత్ముని పదహారేళ్ల నవయౌవనం చూస్తే ఆ సుందర గమనం గమనిస్తే, ఆ గుణవిశేషాలు ఆలోకిస్తే, ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతరకాంతల విషయం వేరే చెప్పే దేముంది.

1-520-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై
బ్రహ్మభావముననుఁ ర్యటింప,
వెఱ్ఱి యంచు శుకుని వెంట నేతెంతురు
వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు.

టీకా:

వెఱ్ఱి = కపట; తనము = స్వభావము; మాని = మాని; విజ్ఞాన = విజ్ఞానమునే; మూర్తి = స్వరూపముగా కలవాడు; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మము తానే; భావమునను = అను భావముతో; పర్యటింపన్ = చరించుచుండ; వెఱ్ఱి = ఉన్మాదుడు; అంచున్ = అనుచు; శుకుని = శుకమహర్షి; వెంటన్ = వెంటపడి; ఏతెంతురు = వస్తూ ఉంటారు; వెలఁదులు = ఆడవారును; అర్భకులును = పిల్లలును; వెఱ్ఱులు = తెలివితక్కువ వారు; అగుచున్ = అగుచు.

భావము:

వెఱ్ఱిలోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో, బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీశుకుణ్ణి వెఱ్ఱివాడని భావించి ఏదో వెఱ్ఱెత్తినట్టు స్త్రీలూ, బాలకులూ ఆయన వెంటబడి పరుగెత్తుకొంటూ వస్తుంటారు.

1-521-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లమ్మహానుభావుని ప్రభావంబు లెఱుంగుదురు కావున నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్థానంబు సేసిరి; పాండవపౌత్రుండు నా యోగిజనశిఖామణికి నతిథి సత్కారంబులు గావించి దండప్రణామంబుసేసి పూజించె; మఱియు గ్రహ నక్షత్ర తారకా మధ్యంబునం దేజరిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబున గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగొని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వ్యాస = వ్యాసుని; నందనుండు = కుమారుడు; ఐన = అయినట్టి; శుకుండు = శుకుడు; అరుగుదెంచినన్ = వచ్చిన; అందలి = అక్కడి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహా = గొప్ప; అనుభావుని = అనుభవములు కలవాని; ప్రభావంబులు = గొప్పతనములు; ఎఱుంగుదురు = తెలిసినవారు; కావున = అగుటవలన; నిజ = తమ; ఆసనంబులు = ఆసనములు; డిగ్గి = దిగి; ప్రతి = ఎదురేగుటకు; ఉత్థానంబున్ = లేచుట; లేచి ఎదురేగుటలు; చేసిరి = చేసిరి; పాండవపౌత్రుండున్ = పరీక్షిన్మహారాజును; ఆ = ఆ; యోగి = యోగులగు; జన = జనులలో; శిఖా = శిఖలోని; మణి = రత్నము వంటి వాని; ఉత్కృష్టుని; కిన్ = కి; అతిథి = అతిథి; సత్కారంబులు = గౌరవములు; కావించి = పూర్తిచేసి; దండప్రణామంబు = సాష్టాంగ నమస్కారము {దండప్రణామము - సాష్టాగ నమస్కారము, దండము వలె భూమిపై పడి నమస్కరించుట}; చేసి = చేసి; పూజించెన్ = పూజించెను; మఱియున్ = ఇంకనూ; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు {నక్షత్రములు - అశ్విని ఆది నక్షత్రములు (తారకల సమూహములు) ఇవి 27}; తారక = తారకలు; మధ్యంబునన్ = మధ్యలో; తేజరిల్లు = ప్రకాశించుచున్న; రాకా = పౌర్ణమి నాటి; సుధాకరుండునున్ = చంద్రుని {సుధాకరుడు - సుధ (వెన్నెల)ని ఆకరుడు (కలుగ జేయువాడు), సుధా (అముతముతో కూడిన) కరుడు (కిరణములు కలవాడు), చంద్రుడు}; పోలెన్ = వలె; బ్రహ్మర్షి = బ్రహ్మర్షులు; దేవర్షి = దేవర్షులు; రాజర్షి = రాజర్షులు; మధ్యంబునన్ = మధ్యలో; గూర్చుండి = కూర్చుండి; విరాజమానుండు = విరాజిల్లుతున్నవాడు; ఐన = అయినట్టి; శుక = శుకుడను; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కనుంగొని = చూసి.

భావము:

ఈ విధంగా వేదవ్యాస నందనుడైన శుకయోగీంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్త్వం తెలిసిన అక్కడి మునివర్యులంతా తమతమ ఆసనాల నుంచి లేచి ఎదురువచ్చారు. పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారాలు కావించాడు. సాష్టాంగ దండప్రణామం చేసి పూజించాడు. గ్రహనక్షత్ర తారకా సమూహం నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమా చంద్రుడులాగా బ్రహ్మర్షి దేవర్షి మధ్యలో కూర్చుండి విరాజిల్లే శుకయోగీంద్రుని చూచి ...

1-522-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఫాము నేలమోపి భయక్తులతోడ నమస్కరించి, భూ
పాకులోత్తముండు గరద్మములన్ ముకుళించి, ”నేఁడు నా
పాలిటి భాగ్య మెట్టిదియొ పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేకు నీవు వచ్చితి వివేకవిభూషణ! దివ్యభాషణా!

టీకా:

ఫాలమున్ = నుదుటిని; నేలన్ = నేలపై; మోపి = ఆన్చి; భయ = భయమును; భక్తుల = భక్తియును; తోడన్ = తోకూడి; నమస్కరించి = నమస్కరించి; భూ = భూమికి {భూపాలోత్తముడు - భూపాలు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు}; పాలక = పాలకుల; కుల = వంశములో; ఉత్తముండు = శ్రేష్ఠుడు; పరీక్షిన్మహారాజు; కర = చేతులు అను; పద్మములన్ = పద్మములను; ముకుళించి = ముడిచి; నేఁడు = ఇవేళ; నా = నా; పాలిటి = పాలిటి; భాగ్యము = భాగ్యము; ఎట్టిదియొ = ఎలాంటిదో; పావన = పవిత్రమైన; మూర్తివి = ఆకారము కలవాడవు; పుణ్య = పుణ్యములవలన; కీర్తివి = ప్రసిద్ధి పొందినవాడవు; ఈ = ఈ; వేళ = సమయము; కున్ = నకు; నీవు = నీవు; వచ్చితి = వచ్చితివి; వివేక = వివేకము అను; విభూషణ = విశిష్ట అలంకారము కలవాడా; దివ్య = జ్ఞాన పూరితము లగు; భాషణా = భాషణములు చేయువాడా.

భావము:

కురుకులావతంసమైన పరీక్షిత్తు మళ్లీ క్షోణితలాన వెన్నుదురు సోకేటట్లుగా ప్రణామంచేసి కరకమలాలు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు-”మహానుభావా! శుకదేవా! నా అదృష్టమేమో గాని పావనమూర్తివీ, పుణ్యకీర్తివీ, విజ్ఞాన విభూషణుడవూ, దివ్యభాషణుడవూ అయిన నీవు సమయానికి విజయం జేశావు.

1-523-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధూతోత్తమ! మంటి, నేఁడు నిను డాయం గంటి, నీవంటి వి
ప్రరుం బేర్కొను నంతటన్ భసిత మౌఁ బాపంబు నా బోటికిన్,
దాలోకన, భాషణార్చన, పదప్రక్షాళన, స్పర్శనా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే?

టీకా:

అవధూత = అవధూతలలో {అవధూత - పైపొరలు తొలగినవాడు, బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు}; స్థూలార్థము దిగంబరుడు; సూక్ష్మార్థము జీవులలో వసించు పరబ్రహ్మము చుట్టును కల మాయ అను పొరలు తొలగినవాడు}; ఉత్తమ = శ్రేష్ఠుడా; మంటి = బ్రతికితిమి; నేఁడు = ఇవేళ; నినున్ = నిన్ను; డాయన్ = దగ్గరలో; కంటి = చూడకలిగితిమి; నీ = నీ; వంటి = వంటి; విప్ర = బ్రాహ్మణ; వరున్ = శ్రేష్ఠుని; పేర్కొనున్ = తలచిన; అనుకొనిన; అంతటన్ = అంతటనే; భసితము = భస్మము; ఔన్ = అగును; పాపంబున్ = పాపములు; నా = నా; బోటి = వంటి వాని; కిన్ = కి; భవత్ = తమను; ఆలోకన = చూచుట; భాషణ = మాట్లాడుట; అర్చన = పూజించుట; పద = పదముల; ప్రక్షాళన = కడుగుట; స్పర్శన = స్పర్శించుట; ఆది = మొదలగు; విధానంబుల = పద్ధతుల వలన; ముక్తి = ముక్తి; చేన్ = చేతిలో; పడుట = పడుట; దొరకుట; చింతింపంగన్ = ఆలోచించిన; ఆశ్చర్యమే = ఆశ్చర్యమా ఏమి.

భావము:

అవధూతశిరోమణీ! నేను ధన్యుణ్ణయితిని. నేడు నీవు నా వద్దకు రావడం చూచితిని. నీవంటి బ్రాహ్మణ శ్రేష్ఠుని నామం ఉచ్చరించినంత మాత్రమున పాపాలన్నీ భస్మీపటల మౌతాయి. ఇక నిన్ను దర్శించుట, నీ మాటలు వినుట, నిన్ను అర్చించుట, నీ కాళ్లు కడిగుట, నిన్ను స్పృశించుట మున్నగు విధానాలు లభించడం వలన నా వంటి వానికి మోక్షం సంప్రాప్తించుటలో ఆశ్చర్య మేముంది.

1-524-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిచేతను దనుజేంద్రులు
రఁ ద్రుంగెడు భంగి నీ పస్పర్శముచే
గురుపాతకసంఘంబులు
పొరిమాలుఁ గదయ్య యోగిభూషణ! వింటే.

టీకా:

హరి = భగవంతుని; చేతను = వలనను; దనుజ = రాక్షస; ఇంద్రులు = రాజులు; ధరన్ = భూమి మీదకు; త్రుంగెడు = తెగిపడుట; భంగిన్ = వలె; నీ = నీ; పాద = పాదముల; స్పర్శము = స్పర్శ - తగులుట; చేన్ = చేత; గురు = మిక్కిలి బరువైన; పాతక = పాపపు; సంఘంబులు = సమూహములు; పొరిమాలున్ = రూపుమాసిపోవును - నశించును; కదా = కదా; అయ్య = తండ్రీ; యోగి = యోగులకు; భూషణ = అలంకారమా; వింటే = వింటే.

భావము:

ఓ యోగీశ్వరా! శుకా! భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరులు నశించిపోయినట్లే, పరమయోగివైన నీ పాదస్పర్శ వలన పాపాలు అన్నీ భస్మీభూత మవుతాయి కదా!

1-525-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిన్ మేనమఱందియై, సచివుఁడై, యే మేటి మాతాతలన్
లిమిం గాచి సముద్ర ముద్రిత ధరం ట్టంబుఁ గట్టించె, న
య్యఘుం, డీశుఁడు, చక్రి, రక్షకుఁడు గాన్యుల్ విపద్రక్షకుల్
రే? వేఁడెద భక్తి నా గుణనిధిం, గారుణ్యవారాన్నిధిన్.

టీకా:

ఎలమిన్ = సంతోషముగ; మేనమఱంది = మేనమరిది; ఐ = అయి; సచివుఁడు = మంత్రి; ఐ = అయి; ఏ = ఏ; మేటి = శ్రేష్ఠుడు – గొప్పవాడు; మా = మా; తాతలన్ = తాతలను; బలిమిన్ = బలముగ; గట్టిగా; కాచి = కాపాడి; సముద్ర = సముద్రములచే; ముద్రిత = చుట్టబడిన; ధరన్ = భూమిని; పట్టంబున్ = పట్టము; కట్టించెన్ = కట్టించెను; పట్టాభిషిక్తులను చేసెను; ఆ = ఆ; అలఘున్ = చిన్న కానివాడు; గొప్పవాడు; ఈశుఁడు = ప్రభువు; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; రక్షకుఁడు = రక్షించువాడు; కాక = అంతేగాని; అన్యుల్ = ఇతరులు; విపత్ = ఆపదల నుండు; రక్షకుల్ = రక్షించువారు; కలరే = కలరా ఏమి; లేరు; వేఁడెదన్ = ప్రార్థించెదను; భక్తిన్ = భక్తితో; ఆ = ఆ; గుణ = గుణముల; నిధిన్ = పాతర వంటివాని; కారుణ్య = దయకు; వారాన్నిధిన్ = సముద్రుని.

భావము:

ఏ మహానుభావుడు ప్రియమైన మరదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను చతుస్సముద్ర ముద్రితమైన ధరణీచక్రానికి చక్రవర్తులను చేసాడో, ఆ మహాత్ముడు, ఆ లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదరాభిమానాలతో ఆదుకొనే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు? ఆ భక్తులపాలిటి పెన్నిధిని ఆ కారుణ్యవారాన్నిధిని భక్తితో వేడుకొంటాను.