పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంస వధ

  •  
  •  
  •  

10.1-1375-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను
ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ క్షించి పౌరప్రజా
సంఘాతంబులు తల్లడిల్ల హరి కంప్రాణహింసార్థి యై
లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.

టీకా:

జంఘాలత్వము = మిక్కిలి వేగమైన నడక; తోన్ = తోటి; నగ = కొండ; ఉపరి = మీద; చరత్ = తిరుగుతున్న; సారంగ = జింకను; హింస = చంపెడి; ఇచ్చన్ = కోరికతో; ఉల్లంఘింపన్ = దూకవలెనని; గమకించు = ఉత్సహించునట్టి; సింహము = సింహము; క్రియన్ = వలె; లక్షించి = పూని; పౌర = పురములోని; ప్రజా = జనుల యొక్క; సంఘాతంబులు = సమూహములు; తల్లడిల్ల = కలత చెందుతుండగా; హరి = కృష్ణుడు; కంస = కంసుని యొక్క; ప్రాణ = ప్రాణములను; హింసా = పోగొట్టవలెనని; అర్థి = కోరువాడు; ఐ = అయ్యి; లంఘించెన్ = దూకెను; తమగంబు = గద్దె; మీది = పై; కిన్ = కి; రణ = యుద్ధము నందు; ఉల్లాసంబు = ఉత్సాహము; భాసిల్లగన్ = ప్రకాశించగా.

భావము:

కొండశిఖరాన తిరిగే జింకను చంపడానికి, పిక్కబలంతో కుప్పించి దూకే సింహకిశోరం లాగున, శ్రీకృష్ణుడు కంసుని సంహరించాలని తలచినవాడై గురి చూసి మంచె మీదికి యుద్ధోత్సాహంతో దూకాడు. కొలువులో ఉన్న ప్రజలు అందరూ తల్లడిల్లారు.

10.1-1376-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గమున కెగురు యదు స
త్తగణ్యునిఁ జూచి ఖడ్గరుఁడై యెదిరెం
గమివారలు వీరో
త్తగణవిభుఁ డనఁగఁ గంసరణీపతియున్.

టీకా:

తమగమున్ = మంచెపైకి; ఎగురు = దుముకు; యదు = యదువంశపు; సత్తమ = శ్రేష్ఠులలో; గణ్యునిన్ = ఎన్నదగినవానిని; చూచి = చూసి; ఖడ్గ = కత్తి; ధరుడు = పట్టినవాడు; ఐ = అయ్యి; ఎదిరెన్ = ఎదిరించెను; తమ = వారి యొక్క; గమి = సమూహము; వారలు = వారు; వీర = వీరులలో; ఉత్తమ = శ్రేష్ఠుడు; గణ = రాజ్యమునకు; విభుడు = ప్రభువు; అనగన్ = అనునట్లుగా; కంస = కంసుడు అనెడి; ధరణీపతి = రాజు {ధరణీపతి - రాజ్యమునకు ప్రభువు, రాజు}.

భావము:

తానున్న గద్దెమీదకి ఎగిరి దూకుతున్న యాదవ మహావీరుడు శ్రీకృష్ణుడిని చూసి మథురను ఏలే కంసుడు ఖడ్గాన్ని చేపట్టి ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుడు గొప్పవీరుడైన ప్రభువు అని ప్రశంసించారు.

10.1-1377-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో
క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లాల్పాంతవేళాపత
న్నక్షత్రంబుల భంగి రాల రణసంరంభంబు డిందించి రం
క్షోణిం బడఁద్రొబ్బెఁ గృష్ణుఁడు వెసం గంసున్ నృపోత్తంసునిన్.

టీకా:

పక్షీంద్రుండు = గరుత్మంతుడు {పక్షీంద్రుడు - పక్షులలో శ్రేష్ఠుడు, గరుత్మంతుడు}; ఉరగమున్ = పామును; పట్టు = పట్టుకొనెడి; విధము = రీతి; ఒప్పన్ = వలె; కేశ = జుట్టు; బంధంబున్ = ముడిని; లోక = ప్రజలందరకు; క్షోభంబు = కలవరపాటు; కన్ = కలుగునట్లు; పట్టి = పట్టుకొని; మౌళి = శిఖ యందలి; మణులు = రత్నములు; కల్పాంత = ప్రళయ; వేళా = సమయమునందు; పతన్ = పడెడి; నక్షత్రంబుల = నక్షత్రముల; భంగిన్ = వలె; రాలన్ = రాలుతుండగా; రణ = యుద్ధ; సంరంభంబున్ = ఆటోపమును; డిందించి = అణచివేసి; రంగ = మల్లరంగస్థల; క్షోణిన్ = ప్రదేశమునందు; పడన్ = పడిపోవునట్లుగా; ద్రొబ్బెన్ = తోసెను; కృష్ణుడు = కృష్ణుడు; వెసన్ = శీఘ్రముగ; కంసున్ = కంసుని; నృప = రాజులలో; ఉత్తంసునిన్ = గొప్పవానిని.

భావము:

పక్షులకు ప్రభువైన గరుత్మంతుడు పామును ఎలా పట్టుకుంటాడో, అలా శ్రీకృష్ణుడు కంసుడి జుట్టుముడి పట్టుకున్నాడు. సభలోని జనులంతా భయభ్రాంతులు అయ్యారు. ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజల నేలరాలిపోయాయి. కంస మహారాజు యుద్ధ సన్నాహం అణగించి, యదువల్లభుడు మల్లరంగస్థలంమీదకి పడద్రోసాడు.

10.1-1378-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంచాగ్రంబుననుండి రంగధరణీధ్యంబునం గూలి యే
సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా
బంత్వంబును బొంది యున్న విమతుం ద్మాక్షుఁ డీడ్చెన్ వడిం
బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై.

టీకా:

మంచ = గద్దె; అగ్రంబునన్ = మీద; నుండి = నుండి; రంగధరణీ = రంగస్థలము; మధ్యంబునన్ = నట్టనడిమి యందు; కూలి = పడిపోయి; ఏ = ఎట్టి; సంచారంబును = కదలికలు; లేక = లేకుండ; చిక్కి = దొరికిపోయి; జనులు = ప్రజలు; ఆశ్చర్యంబును = ఆశ్చర్యమును; పొందగా = పడుతుండగా; పంచత్వంబును = మరణించుటను; పొంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; విమతున్ = పగవానిని; పద్మాక్షుడు = కృష్ణుడు; ఈడ్చెన్ = లాగెను; వడిన్ = వేగముగా; పంచాస్యంబు = సింహము {పంచాస్యము - విస్తీర్ణమైన ముఖము కలది, సింహము}; గజంబున్ = ఏనుగును; ఈడ్చు = ఈడ్చుకుపోవు; పగిదిన్ = విధముగా; బాహా = భుజముల; బల = బలముయొక్క; ఉల్లాసి = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

మంచెమీది నుంచి మల్లక్రీడారంగ మధ్యలోకి వచ్చి పడిన కంసుడు ఎలాంటి కదలికలు లేక కట్టెలాగ బిగుసుకు పోయి అక్కడికక్కడే మరణించాడు. అక్కడి జనుల ఆ దుర్మతి సంహారాన్ని అబ్బురపడుతూ చూసారు. సింహం ఏనుగును ఎలా ఈడుస్తుందో అలా కలువ కన్నులున్న కృష్ణుడు భుజబలవిజృంభణంతో కంసుడిని ఈడ్చాడు.

10.1-1379-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోప్రమోద నిద్రా
భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్
దోగతిఁ జూచి యైన వి
శేరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!

టీకా:

రోష = కోపమునందు; ప్రమోద = సంతోషమునందు; నిద్రా = నిద్ర యందు; భాషా = మాట్లాడుట యందు; అశన = ఆహారము తినుట యందు; పాన = తాగుటందు; గతులన్ = నడచుట యందును; పాయక = విడువకుండ; చక్రిన్ = కృష్ణుని; దోష = తప్పుడు; గతిన్ = విధానమున; చూచి = చూసి; ఐనన్ = ఉన్నప్పటికిని; విశేష = విశిష్ట మైన; రుచిన్ = తేజస్సుతో; కంసుడు = కంసుడు; అతనిన్ = అతనిని; చెందెన్ = లీనమయ్యెను; నరేంద్రా = రాజా.

భావము:

ఓ మహారాజా పరీక్షిత్తూ! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, మాటలు మాట్లాడుతున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, నీరు త్రాగుతున్నప్పుడు, చక్రాయుధు డైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే అయినప్పటికీ వదలకుండా తలచి తలచి అతడు భగవంతుడిని పొంది ఉత్తమగతి అందుకున్నాడు.

10.1-1380-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున.

టీకా:

ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అలా కంసుని సంహరించిన సమయంలో . .