పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రాజలోక పలాయనంబు

  •  
  •  
  •  

10.1-1758-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో
చుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చనూర్చుచున్
మొమునఁ దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచునున్న చైద్యుతోఁ
"తుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే."

టీకా:

మగిడి = వెనుదిరిగి; చలించి = బెదిరిపోయి; పాఱుచును = పారిపోవుచు; మాగధ = జరాసంధుడు; ముఖ్యులున్ = మున్నగువారిని; కూడి = కలిసి; ఒక్క = ఒక; చోన్ = చోట; వగచుచున్ = దుఃఖించుచు; ఆలిన్ = భార్యను; కోల్పడిన = పోగొట్టుకున్న; వాని = వాడి; క్రియన్ = వలె; కడున్ = చాలా; వెచ్చనూర్చుచున్ = వేడినిట్టూర్పులు విడుస్తు; మొగమునన్ = ముఖముమీద; దప్పిదేరన్ = శ్రమము కనబడుతుండ; తమ = వారి; ముందటన్ = ఎదురుగా; పొక్కుచున్న = తపించుచున్న; చైద్యున్ = శిశుపాలుని; తోన్ = తోటి; పగతుర = శత్రువుల; చేతిన్ = చేతికి; లోబడకన్ = చిక్కకుండ; ప్రాణము = ప్రాణాల; తోడుతన్ = తోటి; ఉన్నవాడవే = ఉన్నావా.

భావము:

కృష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశిపాలుడిని చూచారు. “పోన్లే; శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా” అని ఓదార్చేరు.

10.1-1759-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియును.

టీకా:

అని = అని; మఱియును = ఇంకను.

భావము:

కృష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ,

10.1-1760-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ;
బ్రతుకు గలిగెనేని భార్య గలదు;
బ్రతికితీవు; భార్యట్టు దైవమెఱుంగు;
గవ వలదు చైద్య! లదు వలదు."

టీకా:

బ్రతుకవచ్చు = జీవింపగలము; ఒడలన్ = ఒంట్లో; ప్రాణంబులు = ప్రాణములు; ఉండినన్ = ఉన్నచో; బ్రతుక = జీవించి ఉండుట; కలిగెనేనిన = జరిగినచో; భార్య = భార్య; కలదు = ఎక్కడనైన దొరకును; బ్రతికితివి = జీవించి ఉన్నావు; నీవు = నీవు; భార్యన్ = భార్యను; పట్టు =విషయము; దైవము = దేవునికే; ఎఱుంగు = తెలియునులే; వగవన్ = విచారించుట; వలదు = వద్దు; చైద్య = శిశుపాలుడా; వలదువలదు = వద్దేవద్దు.

భావము:

ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శిశుపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతక వచ్చును. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించ వద్దు.

10.1-1761-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము, దేహధారి స్వతంత్రుండు గాఁడు, జంత్రగానిచేతి జంత్రపుబొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపుఁ; దొల్లి యేను మథురాపురంబుపైఁ బదియేడు మాఱులు పరాక్రమంబున విడిసి, సప్తదశవారంబులు చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలుచేతం బట్టుబడి కృష్ణుండు గరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి; క్రమ్మఱ నిరువదిమూ డక్షౌహిణులం గూడుకొని పదునెనిమిదవ మాఱు దాడిచేసి శత్రువులం దోలి విజయంబు చేకొంటి; నిట్టి జయాపజయంబులందు హర్షశోకంబులం జెంద నే నెన్నండు; నేటి దినంబున నీ కృష్ణు నెదిరి పోర మన రాజలోకం బెల్ల నుగ్రాక్షుం గూడికొని పోరిన నోడుదు; మింతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి లోకంబులు పరిభ్రమించుచుండు; నదియునుం గాక.

టీకా:

వినుము = శ్రద్ధగా వినుము; దేహధారి = పురుషుడు {దేహధారి - శరీరము ధరించినవాడు, పురుషుడు}; స్వతంత్రుడు = స్వతంత్రత కలవాడు; కాడు = కాలేడు; జంత్రగాని = సూత్రధారి {యంత్రము (ప్ర) - జంత్రము (వి)}; చేతి = చేతిలోని; జంత్రపుబొమ్మ = కీలుబొమ్మ; కైవడిన్ = వలె; ఈశ్వర = భగవంతుని; తంత్ర = పాలనకు; పరాధీనుండు = ఆధీనుడు; ఐ = అయ్యి; సుఖ = సుఖములను; దుఃఖంబులు = దుఃఖములు; అందు = లో; నర్తనంబులు = నాట్యములు; సలుపున్ = చేయుచుండును; తొల్లి = పూర్వము; ఏను = నేను; మథురాపురంబు = మథురానగరి; పైన్ = మీదికి; పదియేడు = పదిహేడు (17); మాఱులు = పర్యాయములు; పరాక్రమంబునన్ = శౌర్యముతో; విడిసి = చుట్టుముట్టి, దాడిచేసి; సప్తదశ = పదిహేడు (17); వారంబులున్ = పర్యాయములు; చక్రి = కృష్ణుని; చేతన్ = చే; నిర్మూలిత = నాశనముచేయబడిన; బల = సేనా; చక్రుండను = సమూహము గలవాడను; ఐ = అయ్యి; కామపాలు = బలరాముని; చేతన్ = చేతిలో; పట్టుబడి = చిక్కుకొని; కృష్ణుండు = కృష్ణుడు; కరుణ = దయ; చేసి = చూపి; విడిపించి = విడుదల చేయించి; పుచ్చినన్ = పంపగా; వచ్చి = వచ్చి; క్రమ్మఱన్ = మరల; ఇరువదిమూడు = ఇరవైమూడు (23); అక్షౌహిణులన్ = అక్షౌహిణులసేనలు; కూడుకొని = కూడగట్టుకొని; పదునెనిమిదవ = పద్దెనిమిదవ (18); మాఱు = సారి; దాడిచేసి = దండెత్తి; శత్రువులన్ = పగవారిని; తోలి = తఱిమి; విజయంబున్ = విజయమును; చేకొంటిన్ = పొందితిని; ఇట్టి = ఇటువంటి; జయ = గెలుపు; అపజయంబులు = ఓటములు; అందున్ = అందు; హర్ష = సంతోషము; శోకంబులన్ = దుఃఖములను; చెందన్ = పొందను; నేన్ = నేను; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; నేటి = ఇవాళ్టి; దినంబునన్ = రోజు; ఈ = ఈ యొక్క; కృష్ణున్ = కృష్ణుడిని; ఎదిరి = ఎదిరించి; పోరన్ = యుద్ధము చేసినచో; మన = మన యొక్క; రాజ = రాజుల; లోకంబు = సమూహము; ఎల్లను = అంత; ఉగ్రాక్షున్ = పరమశివుని {ఉగ్రాక్షుడు - ఉగ్రమైన కన్నులు కలవాడు, శివుడు}; కూడుకొని = కూడగట్టుకొని; పోరినన్ = యుద్ధముచేసినను; ఓడుదుము = ఓడిపోదుము; ఇంతియ = ఇంతే; కాక = కాకుండ; దైవ = దేవుని నిర్ణయమునకు; యుక్తంబు = తగినది; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; లోకంబులున్ = సర్వలోకములు; పరిభ్రమించుచున్ = తిరుగుతు; ఉండును = ఉండును; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

"ఇంకా విను. పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడి చేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కితే కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం కలిసి పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక

10.1-1762-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్య విఖ్యాతి వి
క్రములన్ గెల్చిరి యాదవుల్ హరి భుజార్వంబునన్ నేడు; కా
ము మేలై చనుదెంచెనేని మనమున్ క్షించి విద్వేషులన్
రక్షోణి జయింత; మింతపనికై శంకింప నీ కేటికిన్."

టీకా:

తమ = వారి; కున్ = కి; కాలము = కాలము; మంచిది = అనుకూలమైనది; ఐన = కాగా; మనలన్ = మనలను; త్రైలోక్య = ముల్లోకములకు; విఖ్యాతి = ప్రసిద్ధిచెందిన; విక్రములన్ = పరాక్రమము కలవారిని; గెల్చిరి = జయించిరి; యాదవుల్ = యదువంశమువారు; హరి = కృష్ణుని; భుజా = భుజబలము యొక్క; గర్వంబునన్ = అతిశయముచేత; నేడు = ఇవాళ; కాలము = కాలము; మేలు = మనకి అనుకూలము; ఐ = అయ్యి; చనుదెంచినేని = వచ్చినచో; మనమున్ = మనముకూడ; లక్షించి = గురిపెట్టి; విద్వేషులన్ = శత్రువులను; సమరక్షోణిన్ = యుద్ధభూమిలో; జయింతము = గెలుతుము; ఇంత = ఇంతమాత్రపు; పని = విషయము; కై = కోసము; శంకింపన్ = సంకోచపడుట; నీవు = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.

భావము:

ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసి వస్తే మనం కూడ పగవారిని యుద్ధం లో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు.”