పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : పిప్పలాయన భాషణ

  •  
  •  
  •  

11-57-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రవర! విను జగన్నాథుని చారిత్ర-
మెఱిఁగింతు నీమది కింపు మిగుల
సదుద్భవస్థితియ కారణంబయి-
దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు-
జ్వాలల ననలుండుఁ నని పగిది
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు-
పొరయక సుషిరంబుఁ బొందు, సత్య

11-57.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఁగ సత్త్వరజస్తమోయగుణంబు,
హదహంకారరూపమై హిమ వెలయు
చేతనత్వంబు గలదేని జీవ మందు,
రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును.

టీకా:

నరవర = రాజా {నరవరుడు - నరులకు ప్రభువు, రాజు}; విను = వినుము; జగన్నాథుని = శ్రీమన్నారాయణుని {జగన్నాథుడు - సర్వలోకాలకి ఈశ్వరుడు, విష్ణువు}; చారిత్రము = చరిత్రము; ఎఱిగింతున్ = తెలిపెదను; నీ = నీ యొక్క; మది = మనస్సున; కిన్ = కు; ఇంపు = ఇష్టము, నచ్చుట; మిగులన్ = అతిశయించునట్లుగా; లసత్ = చక్కటి; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయించుటలకు; కారణంబు = కారణభూతమైనది; అయి = ఐ; దేహ = శరీరపు; ఇంద్రియ = ఇంద్రియాలు; ఆదులన్ = మున్నగువానియంది; తిరము = స్థిరము; కాగన్ = అగునట్లు; జొనుపున్ = ప్రవేశించును; ఎప్పుడు = ఎప్పటికి; పరంజ్యోతి = పరమాత్మ; స్వరూపంబున్ = స్వరూపమును; జ్వాలలన్ = మంటలు; అనలుండున్ = అగ్నిని; చనని = ఆక్రమించలేని; పగిది = విధముగ; ఇంద్రియంబులున్ = ఇంద్రియాలు; ఆత్మన్ = ఆత్మను; ఎనయవు = ఆక్రమించలేవు; శబ్దంబు = నాదము; పొరయక = చేయలేదుకదా; సుషిరంబున్ = మురళిని {సుషిరము - బెజ్జము కలది, పిల్లనగ్రోవి మొదలగునది}; పొందున్ = లోగొనుట; సత్యము = సత్యము; అనగన్ = అంటే.
సత్త్వ = సత్వగుణము; రజస్ = రజోగుణము; తమస్ = తమోగుణములచే; మయ = నిండిన; గుణంబు = గుణత్రయము; మహత్ = మహత్తు; అహంకార = అహంకారములో; రూపము = రూపములు కలది; ఐ = అయ్యి; మహిమన్ = గొప్పతో; వెలయు = ప్రసిద్ధముగు; చేతనత్వంబున్ = చైతన్యముతో; కలదేని = కూడి ఉన్నచో; జీవము = జీవము; అందురు = అంటారు; ఇదియ = ఇదే; సత్ = సత్తు; అసత్ = అసత్తు; స్వరూపము = స్వరూపము; ఐ = అయ్యి; ఎన్నబడును = భావింపబడును.

భావము:

“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.

11-58-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె.

టీకా:

దీని = దీని; కిన్ = కి; పెక్కు = అతీతము; ఐనది = అయినదానిని; పరమాత్మ = పరమాత్మ; కాన్ = అయినట్లుగా; ఎఱింగి = తెలిసికొని; కమలసంభవ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మున్నగువారు; నుతియింతురు = స్తుతించెదరు; ఇట్టి = ఇటువంటి; పరమాత్మ = పరమాత్మ; స్థావర = అచరములు; జంగమంబులన్ = చరములందు; అధిష్ఠించి = వసించి; వృద్ధి = పెరుగుట; క్షయంబులన్ = తరుగుటలను; పొందక = పొందకుండగ; నిమిత్తమాత్రంబునన్ = నిమిత్తమాత్రంగా; తరు = చెట్లు; లతా = లతలు; ఆదులున్ = మున్నగువాని; అందున్ = లో; జీవంబు = జీవముగ; లేక = లేదా; తత్ = వాని; అంతరస్థుండు = లోపల ఉండువాడు; ఐ = అయ్యి; వర్తించున్ = మెలగుతుండును; అంత = వానిలో; సర్వేంద్రియా = సమస్త ఇంద్రియములచే; ఆవృతంబు = ఆవరింపబడినది; ఐన = అయినట్టి; ఆకారంబు = స్వరూపము; నష్టంబు = నశించినది; ఐనన్ = కాగా; మనంబునున్ = మనస్సును; పాసి = వదలి; శ్రుతి = వినికిడి; విరహితుండు = ఏమాత్రము లేనివాడు; ఐ = అయ్యి; తిరుగుచుండున్ = ప్రవర్తించుచుండును; నిర్మల = స్వచ్ఛమైన; ఙ్ఞానదృష్టి = ఙ్ఞానదృష్టి; కల = కలిగిన; వాని = వాడి; కిన్ = కి; భాను = సూర్యుని {భానుడు - ప్రకాశించువాడు, సూర్యుడు}; ప్రభా = కాంతి; జాలంబులున్ = పుంజములు; తోచిన = దర్శించిన; క్రియను = విధముగ; సుఙ్ఞానవంతుడు = విఙ్ఞాని; హరి = విష్ణు; భక్తి = భక్తి; చేత = వలన; గుణ = త్రిగుణముల; కర్మా = సంచితకర్మాదుల; అర్థంబులు = చెందినవి; ఐన = అయిన; చిత్త = చిత్తమునందలి; దోషంబులున్ = పాపములను; భంజించి = నశింపజేసి; భగవత్సదనంబు = పరమపదమును; చేరును = చేరును; అనిన = అని చెప్పగా; విని = విని; రాజు = విదేహమహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు.

11-59-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురుషుం డే యే కర్మము
రువడిఁ గావించి పుణ్యరుఁడై మనుఁ? దా
దురితములుఁ దొరఁగి మురరిపు
ణయుగం బెట్లు సేరు? న్మునివర్యా! "

టీకా:

పురుషుండు = మానవుడు; ఏయే = ఎలాంటి ఎలాంటి; కర్మమున్ = కర్మలను; పరువడిన్ = పూని; కావించి = ఆచరించి; పుణ్యపరుడు = పుణ్యవంతుడు; ఐ = అయ్యి; మనున్ = విలసిల్లును; తాన్ = తాను; దురితములు = పాపములు; తొరగి = తొలగిపోయి; మురరిపు = హరి; చరణ = పాదముల; యుగంబున్ = జంటను; ఎట్లు = ఏ విధముగ; చేరున్ = చేరును; సత్ = శ్రేష్ఠమైన; ముని = మునులలో; వరేణ్యా = ఎన్నదగినవాడా.

భావము:

“మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురవైరి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.”