పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : పరమాత్ముని లీలలు

  •  
  •  
  •  

2-109-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్
వెయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు; మ
య్యఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
దెలియఁగ నేర్తుమే తవిలి; దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్.

టీకా:

తలకొని = పూనుకొని; ఆ = ఆ; మహాత్మకుడు = భగవంతుడు {మహాత్మకుడు - గొప్ప ఆత్మ కలవాడు}; తాల్చిన = ధరించిన; ఆ = ఆ; అవతార = అవతారములు; కర్మమముల్ = చేసిన పనులు; వెలయఁగన్ = ప్రకాశముగ; అస్మత్ = నేను; ఆదులము = నాబోటి వారము; వేయి = అనేక; విధంబులన్ = విధములుగ; సన్నుతింతుము = స్తుతింతుము; ఆ = ఆ; అలఘున్ = భగవంతుని {అలఘున్ - తక్కువన్నది లేని వాడు}; అనంతునిన్ = భగవంతుని {అనంతుడు – అంతము లేని వాడు}; చిదచిదాత్మకునిన్ = భగవంతుని {చిదచిదాత్మకుడు - చిత్ ఆచిత్ ఆత్మకుడు, చేతనా అచేతనములు తానే అయిన వాడు}; ఆద్యున్ = భగవంతుని {ఆద్యుడు - సమస్తమునకు మూలము అయిన వాడు}; అనీశున్ = భగవంతుని {అనీశుడు - తనకు ఏ ప్రభువు లేని వాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 626వ నామం}; ఈశ్వరున్ = భగవంతుని {ఈశ్వరుండు - అధిపతి}; తెలియఁగన్ = తెలిసికొనుట; నేర్తుమే = చేయగలమా ఏమి; తవిలి = లగ్నుడనై; దివ్య = దివ్యమైన; చరిత్రన్ = చరిత్ర కలవాని; కిన్ = కి; ఏను = నేను; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

జగద్రక్షణకు పూనుకొని ఆ యా అవతారాలలో ఆ మహాత్ముడు చేసిన పనులను, నాలాంటి వాళ్ళం అందరం వేల రకాలుగా వినుతిస్తూ వుంటాం. మహామహుడు, తుది లేనివాడు, చిదచిత్స్వరూపడు, మొదటివాడు, తనకు ప్రభువు లేనివాడు, తానే ప్రభువైనవాడు అయిన ఆ దేవదేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.

2-110-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందుఁ గల్పించు దాఁ
రిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ
ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ
శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్.

టీకా:

పరమాత్ముడు = భగవంతుడు {పరమాత్మ – పరమ మైన ఆత్మ కల వాడు}; అజుఁడు = భగవంతుడు {అజుడు – పుట్టుక లేని వాడు}; జగంబున్ = విశ్వమును; ప్రతి = ప్రతి యొక్క; కల్పంబున్ = కల్పము; అందున్ = అందును; కల్పించున్ = సృష్టించును; తాన్ = తానే; పరిరక్షించున్ = పరిరక్షించును; త్రుంచున్ = నాశనము చేయును; అట్టి = అటువంటి; అనఘున్ = భగవంతుని {అనఘుడు - పాపము లేని వాడు}; బ్రహ్మాత్ము = భగవంతుని {బ్రహ్మాత్మున్ - బ్రహ్మపదార్థమే తానైన వాడు}; నిత్యున్ = భగవంతుని {నిత్యున్ - నిత్యమును ఉండువాడు}; జగద్భరితున్ = భగవంతుని {జగద్భరితుడు - విశ్వమును భరించు వాడు}; కేవలున్ = భగవంతుని {కేవలుడు - సర్వంసహా కేవలము తానే అయిన వాడు}; అద్వితీయునిన్ = భగవంతుని {అద్వితీయుడు - తనకి సముడు లేదా ఉత్తముడు లేని వాడు}; విశుద్ధజ్ఞానున్ = భగవంతుని {విశుద్ధజ్ఞాను - పరిశుద్ధమైన జ్ఞానము కల వాడు}; సర్వాత్మున్ = సమస్తములోను ఆత్మగా ఉండు వాడు; ఈశ్వరున్ = భగవంతుని; ఆద్యంతవిహీనున్ = భగవంతుని {ఆద్యంతవిహీనుడు - ఆది అంతము ఏమాత్రము లేని వాడు}; నిర్గుణునిన్ = భగవంతుని {నిర్గుణుడు - గుణములు (మూడును) లేనివాడు}; శశ్వన్మూర్తిన్ = భగవంతుని {శశ్వన్మూర్తి - శశ్వత్ మూర్తి, శాశ్వతమే మూర్తీభవించిన వాడు}; చింతించెదన్ = ధ్యానించెదను.

భావము:

పరమాత్ముడు, పుట్టుకలేని వాడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండినవాడు, కేవలుడు, సాటిలేనివాడు, నిర్మలమైన జ్ఞానం కలవాడు, సర్వాంతర్యామీ, తుదిమొదళ్లు లేనివాడూ, గుణరహితుడూ, నిత్యుడూ అయిన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను.

2-111-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సగతిన్ మునీంద్రులు ప్రన్నశరీరహృషీకమానస
స్ఫుణ గలప్పు డవ్విభుని భూరికళాకలితస్వరూపముం
మిడి చూతు; రెప్పుడుఁ గుర్క తమోహతిచేత నజ్ఞతం
బొసిన యప్పు డవ్విభునిమూర్తిఁ గనుంగొనలేరు నారదా!"

టీకా:

సరస = చక్కటి; గతిన్ = విధముగ; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ప్రసన్న = నిర్మలమైన; శరీరమున్ = దేహమును; హృషీకన్ = ఇంద్రియములును; మానసన్ = మనస్సు; స్ఫురణన్ = స్ఫురణలు; కలప్పుడు = కలిగినప్పుడు; ఆ = ఆ; విభుని = ప్రభువు, భగవంతుని; భూరి = అనంతమైన; కళా = కళలతో; కలిత = కూడిన; స్వరూపమున్ = స్వరూపమును; తరిమిడి = శ్రీఘ్రమే; చూతురు = దర్శింతురు; ఎప్పుడున్ = ఎప్పుడైతే; కుతర్కన్ = కుతర్కము అనే; తమస్ = చీకటి; హతిన్ = కమ్ముట; చేతన్ = చేత; అఙ్ఞతన్ = అఙ్ఞానము అను; పొరసినన్ = కలిగిన; అప్పుడున్ = అప్పుడు; ఆ = ఆ; విభుని = ప్రభువు, భగవంతుని; మూర్తిన్ = స్వరూపమును; కనుంగొనన్ = తెలిసికొన; లేరు = లేరు; నారదా = నారదుడా.

భావము:

నారదమునీశ్వరా! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్ముని మహితకళావిలసితమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు కుతర్కము అనే తమస్సు కమ్ముకుని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు.”

2-112-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వెండియు నిట్లను "ననఘా! యమ్మహనీయతేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకం బగు నాదిపురుషు రూపంబగు; నందుఁ గాలస్వభావంబు లను శక్తు లుదయించె; నందుఁ గార్యకారణరూపం బయిన ప్రకృతి జనించెఁ; బ్రకృతివలన మహత్తత్త్వంబును దానివలన నహంకారత్రయంబునుఁ బుట్టె నందు రాజసాహంకారంబువలన నింద్రియంబులును, సాత్వికాహంకారంబువలన నింద్రియగుణ ప్రధానంబు లైన యధిదేవతలునుఁ, దామసాహంకారంబువలన భూతకారణంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రంబులునుం బొడమెఁ; బంచతన్మాత్రంబులవలన గగనానిల వహ్ని సలిల ధరాదికంబైన భూతపంచకంబు గలిగె; నందు జ్ఞానేంద్రియంబు లయిన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులునుఁ గర్మేంద్రియంబులైన వాక్పాణి పాదపాయూపస్థంబులును మనంబును జనియించె; నన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె; నతని వలన స్వయంప్రకాశుండయిన స్వరాట్టు సంభవించె; నందుఁ జరాచర రూపంబుల స్థావరజంగమాత్మకంబయిన జగత్తు; గలిగె నందు సత్వరజస్తమోగుణాత్మకుల మయిన విష్ణుండును హిరణ్యగర్భుడ నయిన యేనును రుద్రుండునుఁ గలిగితి; మందు సృష్టిజననకారణుం డయిన చతుర్ముఖుండు పుట్టె; వాని వలన దక్షాదులగు ప్రజాపతులు దొమ్మండ్రు గలిగిరి; అందు భవత్ప్రముఖులైన సనకసనందనాది యోగీంద్రులును, నాకలోక నివాసు లయిన వాసవాదులును, ఖగలోకపాలకులగు గరుడాదులును, నృలోకపాలకులగు మను మాంధాతృ ప్రముఖులును, రసాతలలోకపాలకు లగు ననంత వాసుకి ప్రభృతులును, గంధర్వ సిద్ధ విద్యాధర చారణ సాధ్య రక్షోయక్షోరగ నాగలోకపాలురును మఱియు ఋషులునుఁ, బితృదేవతలును, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశు మృగాదులును, నుద్భవించిరి; ఇట్టి జగత్ప్రథమోద్భవంబు మహత్తత్త్వసృష్టి యనంబడు; ద్వితీయం బండసంస్థితం బనం దగుఁ; దృతీయంబు సర్వభూతస్థం బన నొప్పు; నందైశ్వర్య తేజో బల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగు; మప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు; దత్కర్మంబులు లెక్కపెట్ట నెవ్వరికిని నలవిగా; దయినను నాకుం దోఁచి నంత నీ కెఱింగించెద; వినుము.

టీకా:

అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; అనఘా = పాపములు లేనివాడా; ఆ = ఆ; మహనీయున్ = మహనీయుని; తేజస్ = తేజస్సునకు; నిధిన్ = నిధిగ కలవాని; మొదలి = మొదటి; అవతారంబున్ = అవతారము; సహస్ర = వేల; శీర్ష = శిరస్సులు; ఆది = మొదలైనవి; యుక్తంబున్ = కలిగినది; అయిన్ = అయిన; ప్రకృతి = ప్రకృతితో, స్వభావములతో; ప్రవర్తకంబు = తిరుగునది; అగున్ = అయినట్టి; ఆది = పురాణ; పురుషు = పురుషుని; రూపంబు = స్వరూపము; అగున్ = అగును; అందున్ = దానిలో; కాల = కాలము; స్వభావంబులున్ = స్వభావములు; అను = అనే; శక్తులు = శక్తులు; ఉదయించెన్ = పుట్టినవి; అందున్ = వాని యందు; కార్య = కార్యము; కారణ = కారణముల; రూపంబు = స్వరూపము; అయిన = అయినట్టి; ప్రకృతి = ప్రకృతి; జనించెన్ = జనించినది; ప్రకృతి = ప్రకృతి; వలనన్ = వలన; మహత్తత్త్వంబునున్ = మహత్తత్త్వంబును; దాని = దాని; వలనన్ = వలన; అహంకార = అహంకార {అహంకారత్రయములు - సాత్విక, రాజస, తామస అహంకారములు}; త్రయంబునున్ = త్రయమును; పుట్టెన్ = పుట్టినవి; అందున్ = వానిలో; రాజస = రాజస; అహంకారంబు = అహంకారము; వలనన్ = వలన; ఇంద్రియంబులునున్ = ఇంద్రియములును; సాత్విక = సాత్విక; అహంకారంబు = అహంకారము; వలనన్ = వలన; ఇంద్రియ = ఇంద్రియ; గుణ = గుణములు; ప్రధానంబులు = ప్రధానముగా కలవి; ఐన = అయినట్టి; అధిదేవతలునున్ = అధిదేవతలును; తామస = తామస; అహంకారంబు = అహంకారము; వలనన్ = వలన; భూత = (పంచ) భూతములకు; కారణంబులున్ = కారణములు; అయిన = అయినట్టి; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శము; రూప = రూపము; రస = రసము; గంధ = గంధముల; తన్మాత్రంబులునున్ = తన్మాత్రములును; పొడమెను = జనించినవి; పంచతన్మాత్రంబులన్ = పంచతన్మాత్రములు {పంచతన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు (గుణములు)}; వలనన్ = వలన; గగన = ఆకాశము; అనిల = వాయువు; వహ్ని = అగ్ని; సలిల = నీరు; ధరా = భూమి; అధికంబున్ = మొదలైనవి; ఐన = అయినట్టి; భూతపంచకంబున్ = భూతపంచకములు {భూతపంచకములు - ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి}; కలిగెన్ = కలిగినవి; అందున్ = అందులో; జ్ఞానేంద్రియంబులు = జ్ఞానేంద్రియములు {జ్ఞానేంద్రియములు - చర్మమము, కన్ను, చెవి, నాలుక, ముక్కు}; అయిన = అయినట్టి; త్వక్ = చర్మము; చక్షుస్ = కన్ను; శోత్ర = చెవి; జిహ్వ = నాలుక; ఘ్రాణంబులునున్ = ముక్క అనునవియును; కర్మేంద్రియంబులు = కర్మేంద్రియములును {కర్మేంద్రియములు - నోరు, చేయి, కాలు. గుదము, ఉపస్థు}; ఐన = అయిన; వాక్ = నోరు; పాణి = చేయి; పాద = కాలు; పాయు = గుదము; ఉపస్థంబులునున్ = ఉపస్థులును; మనంబునున్ = మనస్సును; జనియంచెన్ = పుట్టినవి; అన్నిటన్ = అన్నిటి; సంఘాతంబునన్ = చక్కటి కలయికచే; విశ్వరూపుండు = విశ్వరూపము కలవాడు; ఐన = అయినట్టి; విరాట్పురుషుండున్ = విరాట్పురుషుడు; పుట్టెన్ = పుట్టెను; అతని = అతని; వలనన్ = వలన; స్వయం = తనంత తానే; ప్రకాశుండు = ప్రకాశించేవాడు; అయిన = అయినట్టి; స్వరాట్టు = బ్రహ్మ; సంభవించెన్ = పుట్టెను; అందున్ = అందులో; చర = చరించు; అచర = చరించని; రూపంబులన్ = స్వరూపములతో; స్థావర = కదలలేని; జంగమ = కదలగల; ఆత్మకంబు = లక్షణములు కలది; అయిన = అయినట్టి; జగత్తు = ప్రపంచము; కలిగెన్ = కలిగినది; అందు = అందులో; సత్వ = సత్వ; రజస్ = రజస్; తమో = తమో; గుణాత్మకులము = గుణములు కల వారము; అయిన = అయినట్టి; విష్ణుండును = విష్ణువును; హిరణ్య = బంగారు {హిరణ్యగర్భుడు - బంగారు అండమున కలిగినవాడు, బ్రహ్మ}; గర్భుండన్ = అండమున కలిగివాడను; అయిన = అయినట్టి; ఏనును = నేనును; రుద్రుండునున్ = శివుడును; కలిగితిమి = పుట్టితిమి; అందున్ = అందులో; సృష్టిన్ = సృష్టికి; జనన = పుట్టుటకు; కారణుండు = కారణమైనవాడు; అయిన = అయినట్టి; చతుర్ముఖుండు = చతుర్ముఖబ్రహ్మ; పుట్టెన్ = పుట్టెను; వాని = వాని, అతని; వలనన్ = వలన; దక్ష = దక్షుడు; ఆదులు = మొదలగు; అగున్ = అయిన; ప్రజాపతులు = ప్రజాపతులు {ప్రజాపతులు - నవబ్రహ్మలు - భృగువు, పులస్థ్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి}; తొమ్మండ్రు = తొమ్మిదిమంది; కలిగిరి = జన్మించిరి; అందున్ = వానిలో; భవత్ = మీతో; ప్రముఖులు = మొదలగు ప్రముఖులు; ఐన = అయినట్టి; సనక = సనకుడు; సనందన్ = సనందుడు; ఆది = మొదలైనవారు; యోగి = యోగులలో; ఇంద్రులునున్ = శ్రేష్ఠులును; నాక = స్వర్గ {నాకలోకము – దుఃఖము లేని లోకము}; లోక = లోకమున; నివాసులు = నివాసులు, దేవతలు; అయిన = అయినట్టి; వాసవ = దేవేంద్రుడు; ఆదులును = మొదలగువారును; ఖగ = ఆకాశ; లోక = లోకమునకు; పాలకులు = పాలించువారు; అగున్ = అయినట్టి; గరుడ = గరుడడు; ఆదులును = మొదలగువారును; నృ = నర, మానవ; లోక = లోకమునకు; పాలకులు = పాలించువారు; అగున్ = అయినట్టి; మను = మనువులు; మాంధాత్రు = మాంధాత; ప్రముఖులును = మొదలగు ప్రముఖమైన వారును; రసాతల = రసాతల; లోక = లోకమునకు; పాలకులు = పాలించువారు; అగున్ = అయినట్టి; అనంత = అనంతుడు, శేషుడు; వాసుకి = వాసుకి; ప్రభ్రుతులును = మొదలగు ప్రముఖులును; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధులు; విద్యాధర = విద్యాధరులు; చారణ = చారణులు; సాధ్య = సాధ్యులు; రక్షస్ = రాక్షసులు; యక్ష = యక్షులు; ఉరగ = పాములు; నాగ = నాగ; లోక = లోకమునకు; పాలురును = పాలించువారును; మఱియున్ = ఇంకను; ఋషులునున్ = ఋషులును; పితృదేవతలునున్ = పితృదేవతలును; దైత్య = దైత్యులు; దానవ = దానవులు; భూత = భూతములు; ప్రేత = ప్రేతములు; పిశాచ = పిశాచములు; కూష్మాండ = కూష్మాండులును; పశు = పశువులును; మృగ = జంతువులును; ఆదులును = మొదలగునవియును; ఉద్భవించిరి = జనించిరి; ఇట్టి = ఇటువంటి; జగత్ = సృష్టికి; ప్రథమ = మొట్టమొదట; ఉద్భవంబున్ = ఉద్భవించుటను; మహత్తత్త్వ = మహత్తత్త్వ; సృష్టి = సృష్టి; అనంబడున్ = అంటారు; ద్వితీయంబున్ = రెండవది; అండసంస్థితంబున్ = అండసంస్థితము; అనందగున్ = అనవచ్చును; తృతీయంబున్ = మూడవది; సర్వ = సర్వ; భూతస్థంబున్ = భూతస్థంబు; అనన్ = అనగా; ఒప్పున్ = ఒప్పి ఉండును; అందు = వానిలో; ఐశ్వర్య = ఐశ్వర్యము; తేజస్ = తేజస్సు; బల = బలము; సంపన్నులు = సంపదలు కలవారును; ఐన = అయినట్టి; పురుషులు = పురుషులు; సర్వ = సమస్తమునకు; ఆత్ముండున్ = ఆత్మ అయినవాడు; ఐన = అయినట్టి; నారాయణుని = విష్ణువుని {నారాయణు - నారములు అందు వసించువాడు, భగవంతుడు}; అంశ = అంశతో; సంభవులున్ = పుట్టినవారు; కాన్ = అయినట్లు; ఎఱుంగుము = తెలియుము; ఆ = ఆ; పుండరీకాక్షుని = భగవంతుని; లీలా = లీలతో; అవతారంబులున్ = అవతారములు; అనంతంబులున్ = అనేకము; తత్ = అతని; కర్మంబులున్ = చేసిన పనులు; లెక్కపెట్టన్ = లెక్కించుటకు; ఎవ్వరికిని = ఎవరికైనను; అలవిన్ = వీలు; కాదు = కాదు; అయినను = అయినప్పటికిని; నాకున్ = నాకు; తోఁచిన్ = వచ్చిన; అంతన్ = అంతా; నీకున్ = నీకు; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినుము = వినుము.

భావము:

అని నారదమహర్షికి చెప్పి మళ్లీ బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. “వేల తలలు, వేల నేత్రాలు, వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. ఆ అవతార స్వరూపం నుండి కాలము, స్వభావము అనే రెండు శక్తులు పుట్టాయి. అందులోనుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి నుండి మహత్తత్త్వం పుట్టింది. దానినుండి రాజసాహంకారం, సాత్త్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారులు పుట్టాయి. వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు పుట్టాయి. సాత్త్వికాహంకారం నుండి ఇంద్రియగుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు. తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం. స్పర్శం, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు పుట్టాయి. ఆ తన్మాత్రలనుండి ఆకాశం. వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వా, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలూ మనస్సూ పుట్టాయి. వీటన్నిటి చేరికవల్ల విశ్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతని నుండి స్వయంప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతనిలో నించి చరాచర రూపాలతో స్థావరజంగమాత్మకం అయిన జగత్తు పుట్టింది. అందుండి సత్త్వగుణ స్వరుపూడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేనూ, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండి సృష్టి ఉత్పత్తికి హేతువైన నాలుగు ముఖాల బ్రహ్మ (చతుర్ముఖబ్రహ్మ) ఉద్భవించాడు. ఆయనవల్ల దక్షుడు మొదలైన తొమ్మిది మంది ప్రజాపతులు పుట్టారు. నీవు, సనకుడు, సనందుడు మొదలైన యోగీశ్వరులు, స్వర్గలోకంలో వుండే ఇంద్రాదులు, పక్షిలోక రక్షకులైన గరుడాదులు, మానవలోకాన్ని పాలించే మనువు, మాంధాత మొదలగు వారు, రసాతలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మొదలైన వారు, ఇంకా గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు, ఆయా ఆ జాతులను పాలించేవారు, ఋషులు, పితృదేవతలు, దైత్యులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరియు అన్ని పశుమృగాదులు ఉద్భవించాయి. ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహత్తత్త్వ సృష్టి అంటారు. రెండవది అండగతమైన సృష్టి, మూడవది సమస్త భూతగతమైన సృష్టి, అందులో ఐశ్వర్యము, తేజస్సు, బలము గల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీ మన్నారాయణుని అంశ యందు పుట్టినవారుగా తెలుసుకో. ఆ అరవిందాక్షుని లీలావతారాలకు అంతం లేదు. ఆయన ఆచరించే మంచి పనులు లెక్కించడం ఎవరికీ శక్యం గాదు. అయినను, నాకు తోచినంత వరకు నీకు వినిపించెదను, విను.