పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కశ్యపుని రుద్రస్తోత్రంబు

  •  
  •  
  •  

3-461-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణీ! యొక్క ముహూర్త ముండు మిది సంధ్యాకాల మిక్కాల మం
యన్ భూతగణావృతుం డగుచుఁ గామారాతి లీలన్ వృషే
శ్వ యానంబున సంచరించుట నభావ్యం బయ్యె నీ యుగ్రవే
మింపంగ నిషిద్ధకర్మ మగు నేలా ధర్మమున్ వీడఁగన్?

టీకా:

తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసున కలామె, స్త్రీ}; ఒక్క = ఒక; ముహూర్తము = ముహూర్త కాలము {ముహూర్తము - సుమారు 45 నిమిషములు}; ఉండుము = ఉండుము; ఇది = ఇది; సంధ్యా = సంధ్యా; కాలము = సమయము; ఈ = ఈ; కాలము = సమయము; అందున్ = లో; అరయన్ = తరచి చూసిన; భూత = భూతాది {భూతగణములు - భూతములు ప్రేతములు పిశాచములు మొదలగు వాని సమూహములు}; గణ = గణములచే; ఆవృతుండు = చుట్టూ చేరినవాడు; అగుచున్ = అవుతూ; కామారాతి = శివుడు {కామారాతి - కాముని (మన్మథుని) కి శత్రువు, శివుడు}; లీలన్ = లీలగా; వృష = వృషభ; ఈశ్వర = రాజ; యానంబునన్ = వాహనములో; సంచరించుటన్ = తిరుగుచుండుట చేత; అభావ్యంబు = తగనిది; అయ్యెన్ = అయి ఉన్నది; ఈ = ఈ; ఉగ్ర = తీవ్రమైన; వేళ = సమయములో; రమింపగన్ = సంభోగము; నిషిద్ధ = నిషిద్దమైన; కర్మము = పని; అగు = అయినది; ఏలా = ఎందులకు; ధర్మమున్ = ధర్మమును; వీడగన్ = విడిచిపెట్టుట.

భావము:

ఓ తరుణీమణీ! ముహూర్తకాలం ఆగు. ఇది సంధ్యాసమయం. ఇప్పుడు మన్మథుడికి శత్రువైన పరమ శివుడు నంది వాహనంపై భూత గణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ ఉగ్రవేళలో కలయిక నిషేధించబడింది. ఎందుకు ధర్మాన్ని అతిక్రమించాలి. ఒక్క ముహూర్తకాలం పాటు ఆగు.

3-462-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందానన! వీఁడె నీ మఱఁది లీలాటోపరుద్రక్షమా
ఝంఝానిలధూతపాంసుపటలచ్ఛన్నుండు ధూమ్రైకదు
ర్భవిద్యోతితకీర్ణభీషణజటాద్ధుండు భస్మావలి
ప్తరుచిస్ఫారసువర్ణవర్ణుఁ డగుచున్ భాసిల్లు నత్యుగ్రుఁ డై.

టీకా:

అరవిందానన = స్త్రీ {అరవిందానన - అరవిందము (పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ}; వీడె = ఇతడే; నీ = నీ యొక్క; మఱది = మరిది {కశ్యపుని సోదరుడు శివుడు - రుద్రులును ప్రజాపతులును బ్రహ్మదేవుని దేహమునుండే పుట్టిరి కనుక పరమశివుడు కశ్యపుడు అన్నదమ్ములు అనుటకు తగినది అందుచేత శివుడు దితికి మరిది అనుట చెల్లినది}; లీలా = విహారము నందలి; ఆటోప = సన్నాహమునన్; రుద్ర = స్మశాన; క్షమా = భూమిలో; చర = చలించుచున్న; ఝంఝా = పెను {ఝంఝా -ఝంఝం అని చప్పుడు చేస్తున్నది, ఝంఝామారుతము}; అనిల = గాలిచే; ధూత = ఎగురగొట్టబడిన; పాంసు = ధూళిరేణువుల; పటలిన్ = పొరలచేత; ఛన్నుండు = కప్పబడినవాడు; ధూమ్ర = బూడిదరంగుతో; ఏక = అసహాయ; దుర్భర = భరింపరాని; విద్యోతిత = మిక్కిలి ప్రకాశము కలిగి; కీర్ణ = చెదరిన; భీషణ = భయంకరమైన; జటా = జటల యొక్క; బద్దుడు = చుట్టలు ఉన్నవాడు; భస్మా = వీబూది; అవలిప్త = పూసుకొన్న; రుచిన్ = కాంతివలన; స్ఫార = అధికమైన; సువర్ణ = మంచిరంగుతో; వర్ణుడు = రంగు వేయబడినవాడు; అగుచున్ = అవుతూ; భాసిల్లున్ = ప్రకాశించుచున్నాడు; అతి = మిక్కిలి; ఉగ్రుడు = తీవ్రత కలవాడు; ఐ = అయి.

భావము:

కాంతా! అడుగో, అటు చూడు. నీ మరిది రుద్రుడు (రుద్రుడూ, కశ్యపుడూ బ్రహ్మదేవుని పుత్రులు, అందుచేత సోదరులు) రుద్రభూమినుండి సుడిగాలుల వల్ల చెలరేగిన ధూళితో నిండిన దేహంతో కలవాడై, కావిరంగుచే ప్రకాశిస్తూ భయంకరంగా చెదరి కదలుతున్న జటాజూటంతో, తెల్లని విభూతి పూతలతో, బంగారు కాంతులతో వెలిగిపోతున్నాడు.

3-463-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల సుధాకర రవి లో
ముల వికసింపఁ జేసి మధికరోషం
బునఁ జూచుచున్నవాఁ డదె
నితా! బంధుత్వ మరయ లవదు సుమ్మీ.

టీకా:

అనల = అగ్ని; సుధాకర = చంద్రుడు; రవి = సూర్యుడు (అను మూడు); లోచనములన్ = కన్నులను; వికసింపన్ = పెద్దవి; చేసి = చేసి; సమధిక = మిక్కిలి; రోషంబునన్ = రోషముతో; చూచున్ = చూస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; అదె = అదిగో; వనితా = స్త్రీ; బంధుత్వము = బంధుత్వము ఉందని; అరయన్ = చూడ, తరచిచూచుట; వలవదు = వద్దు; సుమ్మీ = సుమా.

భావము:

అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఆ రుద్రుని నేత్రాలు. ఆ త్రినేత్రుడు ఆ కన్నులు పెద్దవి చేసి మన వైపు అధిక రోషంతో చూస్తున్నాడు. ఆయన మన బంధువే కదా ఫరవాలేదు అని అనుకో వద్దు సుమా.

3-464-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నికిఁ దలపోయ హితా
హితులును సమ్మాన్యులును విహీనులు నతిగ
ర్హితులును లే రీశుఁడు సమ
తియును నిఖిలైకభూతయుఁ డై యుండన్.

టీకా:

అతని = అతని; కిన్ = కి; తలపోయ = ఆలోచించిన; హితా = ఇష్టులు; అహితులును = అయిష్టులు; సమ్మాన్యులును = గౌరవింప దగినవారును; విహీనులును = అతి నీచులును; అతిగర్హితులునున్ = మిక్కిలి నిందార్హులును; లేరు = లేరు; ఈశుడు = ఈశ్వరుడు; సమ = సమత్వ; మతియును = భావము కలవాడును; నిఖిలైక = సమస్తమైన; భూత = భూతము లందును; మయుండు = నిండి ఉండువాడును; ఐ = అయి; ఉండన్ = ఉండుటవలన.

భావము:

రుద్రునికి మిత్రులూ, శత్రువులూ; మాన్యులూ, సామాన్యులూ; నచ్చినవారూ, నచ్చనివారూ అనే భేదాలు లేవు. ఆయన సమబుద్ధి కలవాడు, సర్వ ప్రాణుల యందు తాను అంతర్యామిగా ఉంటాడు.

3-465-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున, మద్భ్రాత భవ
ద్దేరుఁ డని తరుణి! నీ మదిం జూడకుమా
దేవాదిదేవుఁ ద్రిజగ
త్పాను నిఖిలైకనేత గవంతు హరున్.

టీకా:

కావున = అందుతేత; మత్ = నా యొక్క; భ్రాత = సోదరుడు; భవత్ = నీ యొక్క; దేవరుడు = మరిది యేకదా; అని = అని; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసున కలామె, స్త్రీ}; నీ = నీ యొక్క; మదిన్ = మనసులో; చూడకుమా = చూడొద్దు; దేవాదిదేవున్ = పరమ శివుడు {దేవాదిదేవుడు - దేవుళ్ళకే దేవుడు, పరమ శివుడు}; త్రిజగత్పావనున్ = పరమ శివుడు {త్రిజగత్పావనుడు - ముల్లోకములను పవిత్రము చేయకలవాడు, పరమ శివుడు}; నిఖిలైకనేతన్ = పరమ శివుడు {నిఖిలైకనేత - సమస్తమునకు కల ఏకైక అధినేత, శంకరుడు}; భగవంతున్ = పరమ శివుడు {భగవంతుడు - మహిమాన్వితుడు, పరమ శివుడు}; హరున్ = పరమ శివుడు {హరుడు - లయకారుడు, పరమ శివుడు}.

భావము:

ఓ వనితా! మా సోదరుడైన ఆ దేవదేవుని మరది గదా అని మనస్సులో ఫరవాలేదు అనుకో వద్దు. ఆయన సర్వేశ్వరుడు; పరాత్పరుడు; త్రిలోకపావనుడు; పాప హరుడు.

3-466-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దురతోన్యస్తం బైన పుష్పమాలికయునుం బోలె నమ్మహాత్ముని చరణారవింద వందనాభిలాషిణి యైన యవిద్యాదేవి ననుసరించి వర్తింతు; మదియునుంగాక.

టీకా:

ఏమునున్ = మేమును; సత్ = మంచి; పురుషులు = పురుషులు; ఐనన్ = అయినట్టి; విజ్ఞానవంతులును = మంచి జ్ఞానము కలవారును; భుక్త = అనుభవించేసిన; భోగంబున్ = సుఖము; ఐ = అయిన వెంట; దురత = దూరముగా; న్యస్తంబున్ = విసిరివేయబడిన; ఐన = అయినట్టి; పుష్ప = పూల; మాలికయునున్ = మాలను; పోలెన్ = వలె; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములను; వందనా = సేవించ; అభిలాషిణి = కోరుతుండేది; ఐన = అయిన; అవిద్యా = మాయ (అవిద్య) అనబడు; దేవి = దేవతను; అనుసరించి = అనుసరిస్తూ; వర్తింతుము = నడచుచుందుము; అదియునున్ = అంతే; కాక = కాకుండా;

భావము:

మేము గాని, ఎంతో మంచివారైన విద్వాంసులు గాని, అ మహాత్ముని అవిద్యారూపకమైన మాయకు లోబడి ప్రవర్తిస్తుంటాము. ఆ మాయ కూడా అనుభవించి విడిచిన పుష్పమాలికవలే, దూరంగా ఉండి కూడా ఆ మహాత్ముని పాదపద్మాలను సేవించాలనే ఆసక్తి కలిగి ఉంటుంది. అటువంటి మాయదేవిని అనుసరిస్తూ మేము ఉంటాను. అంతే కాదు, ఇంకా విను.

3-467-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల-
రు లాత్మపద వైభములఁ దనరి
రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును-
విశ్వనేత్రి యగు నవిద్య యెపుఁడు
నెవ్వని మహిమంబు లిట్టివట్టివి యని-
ర్కింప లేవు వేదంబు లయిన
నెవ్వని సేవింతు రెల్ల వారును సమా-
నాధికరహితుఁ డై లరు నెవ్వఁ

3-467.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దేవునిఁద్రిపురసంహారకరుని
స్థిమాలాధరుండు బిక్షాశనుండు
భూతిలిప్తాంగుఁ డుగ్రపరేభూమి
వాసుఁ డని హాస్య మొనరించు వారు మఱియు.

టీకా:

ఎవ్వని = ఎవని; కరుణన్ = దయవలన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దిక్పాల = దిక్పాలకులురైన {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ దిక్కునకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి దిక్కునకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు -వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; వరులు = శ్రేష్ఠులు; ఆత్మ = తమ; పద = పదవుల; వైభవములన్ = వైభవములందు; తనరి = అతిశయించి; ఎవ్వని = ఎవని; ఆజ్ఞన్ = ఆజ్ఞని; వహించి = ధరించి; వర్తించును = ప్రవర్తించుదురు; విశ్వ = విశ్వమునకు; నేత్రి = రాణి {నేత (పు) - నేత్రి (స్త్రీ)}; అగు = అయిన; అవిద్య = మాయ, అవిద్య; ఎపుడు = ఎప్పుడును; ఎవ్వని = ఎవరి; మహిమంబుల్ = మహిమలు; ఇట్టివి = ఇటువంటివి; అట్టివి = అటువంటివి; అని = అని; తర్కింపన్ = విచారింప; లేవు = లేవు; వేదంబులున్ = వేదములు; అయినన్ = అయినప్పటికిని; ఎవ్వనిన్ = ఎవరిని; సేవింతురు = సేవిస్తుంటారో; ఎల్లవారును = అందరును; సమాన = సమానులు కాని; అధిక = అధికులు కాని; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; అలరున్ = విలసిల్లును; ఎవ్వడు = ఎవరు; అట్టి = అటువంటి;
దేవునిన్ = పరమ శివుని {దేవుడు - దివ్యమైనవాడు, శివుడు}; త్రిపురసంహారకునిన్ = పరమ శివుని {త్రిపురసంహారకుడు, త్రిపురాసురుని సంహరించినవాడు, శివుడు}; అస్థిమాలాధరుండు = అస్థిమాలాధరుడు {అస్థిమాలాధరుడు - అస్థి (ఎముకలు) మాలలను ధరించువాడు, శివుడు}; భిక్షాశనుండు = భిక్షాశనుడు {భిక్షాశనుడు - భిక్షమెత్తుకొని ఆశనుడు (తినువాడు), శివుడు}; భూతిలిప్తాంగుడు = భూతిలిప్తాంగుడు {భూతిలిప్తాంగుడు - భూతి (బూడిద, విభూతి)ను లిప్త పూసుకొనిన) అంగుడు (దేహము కలవాడు), శివుడు}; ఉగ్రపరేతభూమివాసుడు = ఉగ్రపరేతభూమివాసుడు {ఉగ్రపరేతభూమివాసుడు - ఉగ్ర (భయంకరమైన) పరేత (శ్మశాన) భూమి యందు వాసుడు (వసించువాడు), శివుడు}; అని = అని; హాస్యమున్ = వేళాకోళము; ఒనరించు = చేయు; వారు = వారు; మఱియున్ = ఇంకనూ.

భావము:

ఎవరి అనుగ్రహంవల్ల బ్రహ్మదేవుడు, ఇంద్రాది దిక్పాలకులు తమతమ పదవులను అధిష్టించి అతి వైభవంగా ఉంటున్నారో, ఎవరి ఆజ్ఞకు లోబడి ఈ సమస్త ప్రపంచానికీ రాణి అనదగిన మాయ ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవరి గొప్పదనం ఎంతటిదో వేదాలు కూడా నిరూపించలేవో, ఎవరిని అందరూ సేవిస్తారో, ఎవరు తనతో సాటివారూ, తనకంటే మేటివారూ లేనివారో అటువంటి దేవదేవుని, త్రిపురాసుర సంహారుని, హరుని, అస్ధిమాలాధరునీ, ఆది భిక్షువుని, బూడిద పూసుకునేవాడనీ, శ్మశానవాసి అనీ, అపహాస్యం చేసేవారు పరమ నిర్భాగ్యులు.

3-468-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శునకభోగ్యమును నిహ
దూరము నైన తనువు పాథేయముగా
నెఱి నమ్మి వస్త్ర మాల్యా
ణంబు లలంకరించు పామర జనులన్

టీకా:

ధరన్ = భూమిమీద; శునక = కుక్కలు; భోగ్యమును = భోగముగ తినునది; ఇహ = ఈ లోకమునకును; పర = పర లోకమునకును; దూరము = దూరము; ఐనన్ = అయినట్టి; తనువు = దేహము; ఉపాథేయము = జీవములకు ఆధారము {ఉపాథేయము - ఉపాథి (జీవనమునకు ఆధారమైన) భూతము (సాధనము)}; కాన్ = అగునని; నెఱన్ = బాగా; నమ్మి = నమ్మి; వస్త్ర = వస్త్రములతో; మాల్య = మాలలుతోను; ఆభరణంబులన్ = ఆభరణములతోను; అలరించు = అలంకరించు; పామర = తెలియని వారైన; జనులన్ = జనులను.

భావము:

కుక్కలకూ, నక్కలకూ, ఆహారంకాదగినదీ, ఇహ పరాలకు దూరం అయినట్టిదీ అయిన శరీరాన్ని శాశ్వతమని నమ్ముకొని, దానిని వస్త్రాలతోనూ, పూలదండలతోనూ, ఆభరణాలతోనూ, అలంకరించుకునే వారు మూర్ఖులు.

3-469-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్భాగ్యులుగా మదిఁ
ను" మని యీరీతిఁ బ్రియకుఁ శ్యపుఁ డెఱిగిం
చి దితి గ్రమ్మఱఁ బలికెను
సిజసాయకవిభిన్నమానస యగుచున్.

టీకా:

ఘన = మిక్కిలి; నిర్భాగ్యులున్ = దరిద్రులు; కాన్ = అగునని; మదిన్ = మనసులో; కనుము = చూడుము; అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; ప్రియకున్ = ప్రియమైన భార్యకు; కశ్యపుడు = కశ్యపుడు; ఎఱిగించినన్ = తెలుపగా; దితి = దితి; క్రమ్మఱన్ = మరల; పలికెన్ = పలికెను; మనసిజ = మన్మథుని {మనసిజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; సాయక = బాణములతో {సాయక - సాయపడునవి (మన్మథునికి), బాణములు}; విభిన్న = బాగాకొట్టబడిన; మానస = మనసు కలది; అగుచున్ = అవుతూ.

భావము:

అట్టి శివ వ్యతిరేకులు పరమ దౌర్భాగ్యులని తెలుసుకొ” అని తన ప్రియసతి అయిన దితికి కశ్యపప్రజాపతి తెలిపాడు. కాని ఆమె మన్మథుని బాణాలచే దెబ్బతిన్న మనస్సు కలది అయి, కశ్యపునితో ఇంకా అలా మాట్లాడ సాగింది.