పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

5.1-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

-

శ్రీర కరుణా సాగర!
ప్రాటలక్ష్మీ కళత్ర! వ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా!

టీకా:

శ్రీకర = శ్రీకృష్ణ {శ్రీకర - శుభకరమైనవాడ, శ్రీకృష్ణ}; కరుణాసాగర = శ్రీకృష్ణ {కరుణా సాగర - దయాసముద్రుడ, శ్రీకృష్ణ}; ప్రాకటలక్ష్మీకళత్ర = శ్రీకృష్ణ {ప్రాకట లక్ష్మీ కళత్ర - ప్రాకట (ప్రసిద్ధమైన) లక్ష్మీదేవికి కళత్ర (భర్త), శ్రీకృష్ణ}; భవ్యచరిత్రా = శ్రీకృష్ణ {భవ్య చరిత్రా - దివ్యమైన వర్తనలు గలవాడ, శ్రీకృష్ణ}; లోకాతీత = శ్రీకృష్ణ {లోకాతీత - భువనములకు అతీతమైనవాడ, శ్రీకృష్ణ}; గుణాశ్రయ = శ్రీకృష్ణ {గుణాశ్రయ - త్రిగుణములకు ఆశ్రయమైనవాడ, శ్రీకృష్ణ}; గోకులవిస్తార = శ్రీకృష్ణ {గోకుల విస్తార - గోకులమునకు వృద్ధికారక, శ్రీకృష్ణ}; నందగోపకుమారా = శ్రీకృష్ణ {నంద గోప కుమారా - నందుడనెడి గోపకుని పుత్రుడ, శ్రీకృష్ణ}.

భావము:

సంపదలను కలిగించే శ్రీకృష్ణా! దయాసముద్రా! లక్ష్మీదేవికి భర్తవు అనే ప్రసిద్ధి కలవాడా! దివ్యమైన నడవడి కలవాడా! లోకాలకు అతీతమైన గుణాలకు ఆశ్రయమైనవాడా! గోసమూహాన్ని విస్తరింపజేసినవాడా! నందుడనే గోపకుని కుమారా!

5.1-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సకలపురాణార్థ జ్ఞాన విఖ్యాతుండగు సూతుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

టీకా:

సకల = సమస్తమైన; పురాణ = పురాణము లందలి; అర్థ = విషయముల; జ్ఞాన = విజ్ఞానములు కలిగియుండుట యందు; విఖ్యాతుండు = ప్రసిద్ధమైనవాడు; అగు = అయిన; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; మహా = గొప్ప; మునుల్ = మునుల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అన్ని పురాణాలలోని విషయ విజ్ఞానం చేత ప్రసిద్ధుడైన సూత మహర్షి శౌనకాది మహామునులతో ఇలా అన్నాడు.