పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

6-37-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమర్పింతంబుగా నా యొనర్పం బూనిన షష్ఠస్కంధంబునకుఁ గథాప్రారంభక్రమం బెట్టిదనిన, హరి చరణస్మరణ పరిణామ వినోదులయిన శౌనకాదులకు నిఖిల పురాణేతిహాస నిర్ణయ విఖ్యాతుండైన సూతుం డిట్లనియె.

టీకా:

సమర్పితంబుగా = సమర్పింబడినదిగా; నా = నాచేత; ఒనర్పన్ = చేయుటకు; పూనిన = నిశ్చయించుకొన్న; షష్ఠ = ఆరవ (6); స్కంధంబున్ = స్కంధమున; కున్ = కు; కథా = కథ యొక్క; ప్రారంభ = మొదలు; క్రమంబు = విధానము; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అనగా; హరి = నారాయణుని; చరణ = పాదముల; స్మరణ = సంస్మరించెడి; పరిణామ = అనుభవముతో; వినోదులు = వినోదించెడివారు; అయిన = అయినట్టి; శౌనక = శౌనకుడు; ఆదుల్ = మొదలగు వారి; కున్ = కి; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణ; ఇతిహాస = ఇతిహాసముల; నిర్ణయ = నిర్ణయించుటలో; విఖ్యాతుండు = ప్రసిద్ధుడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

(శ్రీకృష్ణునకు) అంకితంగా నేను రచించబోయే షష్ఠస్కంధానికి కథాప్రారంభం ఎటువంటిదంటే... శ్రీహరి పాద సంస్మరణం వల్ల సంతోషించు శౌనకాది మునులకు సమస్త పురాణాల, ఇతిహాసాల విశేషాలను వివరించి చెప్పడంలో కీర్తి గడించిన సూతుడు ఇలా అన్నాడు.

6-38-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమణీ రమణ కథా
పారాయణ చిత్తుఁడగుచుఁ లికెఁ బరీక్షి
ద్భూమణుఁ డాదరంబున
సూరిజనానందసాంద్రు శుకయోగీంద్రున్.

టీకా:

శ్రీరమణీరమణ = నారాయణుని {శ్రీరమణీ రమణుడు - శ్రీరమణీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు}; కథా = కథలను; పారాయణ = పారాయణ చేసెడి {పారాయణము - నిష్ఠగా పూని ఒక పూజా కార్యక్రమము వలె చదువుట}; చిత్తుడు = మనసు గలవాడు; అగుచున్ = అవుతూ; పలికెన్ = అనెను; పరీక్షిత్ = పరీక్షుత్తు యనెడి; భూరమణుడు = మహారాజు {భూరమణుడు - భూమికి రమణుడు (భర్త), రాజు}; ఆదరమునన్ = ఆదరముతో; సూరి = జ్ఞానులైన; జన = వారి; ఆనంద = ఆనందమును; సాంద్రు = మిక్కిలి కలిగించు వాడు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివానిని.

భావము:

“లక్ష్మీపతి అయిన శ్రీహరి కథలను పారాయణం చేసే మనస్సు కలిగిన పరీక్షిన్నరేంద్రుడు పండితులకు ఆనందాన్ని కలిగించే శుకమహర్షితో ఇలా అన్నాడు.

6-39-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"డ్గుణైశ్వర్య శాశ్వతమూర్తి వయినట్టి-
మునినాథ! దయతోడ ముక్తిపదము
మున్నుగా నేమార్గమున వినిపించితి-
వాయ నపవర్గ భూరిమహిమఁ
గ్రమయోగసంభవ బ్రహ్మంబుతోఁగూడ-
నుబొంద నగు నని వినుతి కెక్క
ఱియు సత్త్వరజ స్తమః ప్రభావంబులఁ-
డిఁదియై యున్నట్టి ర్మచయము

6-39.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పటప్పటి కడఁగని ట్టి ప్రకృతి
లుగు పురుషుని భోగార్థటన దేహ
కారణా రంభ రూపమార్గంబు మొదలు
మాటిమాటికి నన్నియుఁ దేపడఁగ

టీకా:

షడ్గుణైశ్వర్యాది = ఆరు గుణములు ఈశ్వర లక్షణములు గలిగిన {షడ్గుణములు - భగవంతుని షడ్గుణములు - ఐశ్వర్యాది - 1ఐశ్వర్యము 1వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము} { అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7వశిత్వము 8ఈశత్వము}; శాశ్వత = జనన మరణాతీత మైన; మూర్తివి = స్వరూపమవు; ఐనట్టి = అయినటువంటి; ముని = మునులలో; నాథ = నాయకుడా; దయ = కృప; తోడన్ = తోటి; ముక్తిపదము = మోక్షమును చెందుటను; మున్నుగాన్ = ముందుగా; ఏ = ఏ; మార్గమునన్ = విధముగా; వినిపించితివి = చెప్పితివి; అరయన్ = విచారించగా; అపవర్గ = ముక్తిమార్గము యొక్క; భూరి = అత్యధికమైన; మహిమన్ = గొప్పదనమును; క్రమ = క్రమమార్గమైన; యోగ = అష్టాంగయోగము వలన; సంభవ = కలిగెడి; బ్రహ్మంబు = పరబ్రహ్మ; తో = తోటి; కూడన్ = కూడెడి; అనువొందన్ = అవకాశము; అగును = సాధ్యము; అని = అని; వినుతికెక్క = ప్రసిద్ధముగను; మఱియు = ఇంకను; సత్త్వరజస్తమ = త్రిగుణముల; ప్రభావంబులన్ = ప్రభావములను; కడిది = బలవత్తరమైనది; ఐ = అయినది; ఉన్నట్టి = అటువంటి; కర్మ = కర్మముల; చయమున్ = సమూహమును; అప్పటప్పటికి = ఎప్పటి కప్పుడు; అడగని = అణగనిది.
అట్టి = అయిన; ప్రకృతి = స్వభావము; కలుగు = ఉండెడి; పురుషుని = మానవుని; భోగ = అనుభవించుటకు; ఘటన = అయినట్టి; దేహ = శరీరమునకు; కారణ = కారణ మైనట్టి; ఆరంభ = మొదటి; రూప = రూపముల; మార్గంబు = విధానములు; మొదలు = మొదలైనవాటిని; మాటిమాటికిన్ = మరల మరల; అన్నియున్ = సమస్తమును; తేటపడగ = తేటతెల్లముగ తెలియునట్లు.

భావము:

ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలతో; అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వశిత్వం అనే ఆరు ఈశ్వర లక్షణాలతో నిరంతరం వెలుగొందే మునీశ్వరా! ముందుగా ముక్తిమార్గాన్ని నాకు చక్కగా వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన మానవుడు క్రమంగా జ్ఞానయోగం ద్వారా బ్రహ్మసాయుజ్యాన్ని పొందుతాడని వెల్లడించావు. మానవుడు సత్త్వరజస్తమో గుణాల ప్రభావం వల్ల ప్రకృతికి లొంగిపోయి అనేక దుష్కర్మలను ఆచరిస్తాడు. అందుకు ఫలితంగా మాటిమాటికి దేహాలు ధరించి సంసార బంధాలలో చిక్కుకొంటాడు. దీనినే ప్రవృత్తిమార్గం అంటారు. ఈ మార్గాన్ని కూడా నాకు తేటతెల్లంగా తెలిపావు.

6-40-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు ననేక పాపలక్షణంబులగు నానావిధ నరకంబులును వాని కాద్యంతంబులును, స్వాయంభువ సంబంధి యగు మన్వంతరంబును, బ్రియవ్రతోత్తానపాదుల వంశంబును, దచ్చరిత్రంబును, ద్వీప వర్ష సముద్రాద్రి నద్యుద్యానవనస్పతులును, భూమండల సంస్థాపనంబును, వాని పరిమాణంబును, జ్యోతిశ్చక్రచలన ప్రకారంబును, విభుండయిన పరమేశ్వరుం డెవ్విధంబున నిర్మించె నా విధంబంతయు నెఱింగించినాడ; విప్పుడు.

టీకా:

మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; పాప = పాపముల యొక్క; లక్షణంబులు = ఫలితములు; అగు = అయిన; నానావిధ = రకరకముల; నరకంబులును = నరకములును; వానికి = వాటికి; ఆద్యంతంబులును = తుదిమొదళ్ళు, వివరములు; స్వాయంభువ = స్వాయంభువునికి; సంబంధి = సంబంధించినవి; అగు = అయిన; మన్వంతరంబును = మన్వంతరమును; ప్రియవ్రత = ప్రియవ్రతుని; ఉత్తానపాదుల = ఉత్తానపాదుల యొక్క; వంశంబును = వంశములను; తత్ = వాని; చరిత్రంబును = చరిత్రలును; ద్వీప = సప్తద్వీపములు; వర్ష = వర్షములు; సముద్ర = సప్తసముద్రములు; నది = నదులు; ఉద్యాన = ఉద్యానవనములు; వనస్పతులును = వృక్షములును; భూమండల = భూమండలము; సంస్థాపనంబును = ఏర్పాటును; వాని = వాని యొక్క; పరిమాణంబులు = కొలతలు; జ్యోతిశ్చక్ర = జ్యోతిర్మండలము; చలన = తిరిగెడి; ప్రకారంబును = విధమును; విభుండు = భగవంతుడు; అయిన = అయినట్టి; పరమేశ్వరుండు = నారాయణుడు; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; నిర్మించెన్ = ఏర్పరచెనో; ఆ = ఆ యొక్క; విధంబున్ = విధము; అంతయున్ = అంతా; ఎఱింగించినాడవు = తెలిపితివి; ఇప్పుడు = ఇప్పుడు.

భావము:

ఇంకా అనేక పాపాలకు ఫలస్వరూపాలైన నానావిధ నరకాలను కూడా ఆద్యంతం అభివర్ణించావు. బ్రహ్మ మానసపుత్రుడైన స్వాయంభువ మనువు చరిత్రం వివరించావు. ఆ మన్వంతర వృత్తాంతం కూడ విశదీకరించావు. స్వాయంభువ మనువు కుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశాలను, వారి వారి చరిత్రలను వివరించావు. సప్తద్వీపాలను, సప్తసముద్రాలను, నవవర్షాలను, నదులను, ఉద్యానాలను, వృక్షవిశేషాలను, కులపర్వతాలను వర్ణించి చెప్పావు. సకల లోకాధీశ్వరుడైన భగవంతుడు ఈ భూమండలాన్ని ఎలా సంస్థాపించాడో, జ్యోతిశ్చక్రం ఉనికిని, చలనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసాడో ఆయా సంగతులన్నీ తెలియజేశావు. ఇప్పుడు...

6-41-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిఁది వేదనలకుఁ గారణంబై యుండు
గుఱుతులేని నరక కూపరాశి
పాలుగాక నరుఁడు బ్రతికెడు మార్గంబు
రమపుణ్య! తెలియఁ లుకవయ్య!"

టీకా:

కడిది = అశక్యమైన; వేదనల్ = బాధల; కున్ = కు; కారణంబు = కారణమ; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; గుఱుతు = అంతు; లేని = లేని; నరక = నరకము యనెడి; కూప = గోతుల; రాశి = సమూహము; పాలుగాక = చెందకుండ; నరుడు = మానవుడు; బ్రతికెడు = బయటపడెడి; మార్గంబున్ = దారిని; పరమపుణ్య = అతి పుణ్యవంతుడా; తెలియన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము; అయ్య = తండ్రి.

భావము:

పుణ్యాత్మా! మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరకకూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉంటే దానిని నాకు తెలియజెప్పు”.

6-42-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినం బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నర = నరులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రుని వంటి వాడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

అని అడిగిన పరీక్షిన్నరేంద్రునితో శుకమహర్షి ఇలా అన్నాడు.

6-43-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కట్టా! త్రికరణ మెఱుఁగక
పుట్టిన దురితముల నపుడ పొలియింపని యా
ట్టఁడి దేహం బుడిగినఁ
గొట్టాడును బిట్టు నరకకూపంబులలోన్.

టీకా:

కట్టా = అయ్యో; త్రికరణమున్ = త్రికరణశుద్ధి {త్రికరణములు - మనోవాక్కాయములు మూడు}; ఎఱుగక = తెలియక; పుట్టిన = కలిగిన; దురితములన్ = పాపములను; అపుడ = అప్పుడు; పొలియింపని = పోగొట్టుకొనని; ఆ = ఆ యొక్క; కట్టడి = క్రూరమైన; దేహంబున్ = శరీరము; ఉడిగిన = తొలగిపోగా; కొట్టాడును = కొట్టుమిట్టాడును; బిట్టు = మిక్కిలిగ; నరక = నరకములనెడి; కూపంబుల్ = గోతుల; లోన్ = లోపల.

భావము:

“అయ్యో! మనస్సు, వాక్కు, శరీరం అనే త్రికరణాలతో చేసిన పాపాలకు ప్రతిక్రియ చెయ్యకుండా చనిపోయిన మూర్ఖుడు నరకకూపాలలో పడి నానాబాధలను అనుభవిస్తాడు.

6-44-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావునఁ గాలకింకర వికారము గానకమున్న మృత్యు దు
ర్భానఁ జిత్తమున్ వెడఁగుపాటును జెందకమున్న మేనిలో
జీము వెల్గుచుండఁ దన చెల్వము దప్పకమున్న పన్నుగాఁ
బానచిత్తుఁడై యఘముఁ బాయు తెఱం గొనరింపఁ గాఁదగున్.

టీకా:

కావునన్ = అందుచేత; కాలకింకర = యమకింకరుల; వికారమున్ = తెగులు; కానక = ఎదురుకాక; మున్న = ముందే; మృత్యు = మరణము యనెడి; దుర్భావన = భరింపరాని భావము; చిత్తమునన్ = మనసులో; వెడగుపాటును = తడబాటుపడు, తల్లడపడు; చెందక = చెందుటకు; మున్న = ముందే; మేని = శరీరము; లోన్ = అందు; జీవము = ప్రాణము; వెల్గుచుండన్ = ప్రకాశించుతుండగా; తన = తన యొక్క; చెల్వము = తెలివి; తప్పక = తప్పిపోక; మున్న = ముందే; పన్నుగా = సిద్ధముగా; పావన = పవిత్రమైన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; అఘమున్ = పాపములను; పాయు = తొలగించుకొనెడి; తెఱంగున్ = విధమును; ఒనరింపన్ = సిద్ధపరచుకొనుట; తగున్ = సరియైనది.

భావము:

అందువల్ల యమకింకరుల భయంకర స్వరూపాలు కళ్ళముందు కనిపించక ముందే, చచ్చిపోతామనే భావంతో మనస్సు చీకాకు పడక ముందే, తనలోని ప్రాణశక్తి ఆరిపోక ముందే, దేహం పటుత్వాన్ని కోల్పోక ముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకొనే మార్గాన్ని అవలంబించాలి.

6-45-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాలం బెడగని పాపము
మూముఁ జెఱుపంగవలయు మును రోగములం
దేలిన దోషము నెఱుఁగుచు
వాలాయము దాని నడఁచు వైద్యుని భంగిన్."

టీకా:

కాలంబున్ = కాలమును; ఎడగని = విషయము తెలిసికొని; పాపము = పాపము; మూలమున్ = మూలకారణమును; చెఱుపంగవలయు = చెరిపివేసుకొన వలయును; మును = ముందుగానే; రోగములన్ = జబ్బులను; తేలిన = కనబడిన; దోషమున్ = దోషములవలన; ఎఱుగుచు = తెలిసికొనుచు; వాలాయము = అవశ్యము; దానిన్ = దానిని; అడచు = అణచివేయు; వైద్యుని = వైద్యుని; భంగిన్ = విధముగ.

భావము:

వైద్యుడు రోగాలకు మూలకారణాన్ని కనిపెట్టి దానిని చక్కబరచటానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువులను తెలుసుకొని కాలాతీతం కాకుండా నశింపజేసుకోవాలి”.

6-46-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నవుడు నాతని నియె భూకాంతుండు-
  "నుకలి వినుకలి లిగినట్టి
పాపము దనకు నొప్పని దని కని చాలఁ-
రితప్తుఁడయ్యుఁ గ్రమ్మఱ నొనర్చు
మూఢాత్మునకు దోషమోచనం బెయ్యది-
యారయ నెఱిఁగింపు దియుఁగాక
లుష మొక్కొకచోటఁ గావించు నొకచోటఁ-
గావింపకుండుఁ దత్కర్మమెఱిగి

6-46.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యిట్టి జనుఁడు పుణ్య మేరీతిఁ జేసిన
ది ఫలింపనేర ని తలంతు
లిలమందు మేని లినంబుఁ బోకుండ
జము గ్రుంకుబెట్టు తియుఁ బోలె."

టీకా:

అనవుడు = అనగా; ఆతని = అతని; కిన్ = కి; అనియెన్ = చెప్పెను; భూకాంతుడు = రాజు, పరీక్షితు; కనుకలి = చూచుటవలన; వినుకలి = వినుటవలన; కలిగిన = కలిగెడి; అట్టి = అటువంటి; పాపము = పాపము; తన = తన; కున్ = కు; ఒప్పనిది = సరిపడనిది; అని = అని; కని = తెలిసికొని; చాలన్ = మిక్కిలి; పరి = అధికమైన; తప్తుడు = బాధపడువాడు; క్రమ్మఱన్ = మరల; ఒనర్చు = చేసెడి; మూఢాత్మున్ = తెలివితక్కువవాని; కున్ = కి; దోష = (ఆ) దోషముల నుండి; మోచనంబు = విమోచనము, విడుదల; ఎయ్యది = ఏదో; ఆరయన్ = తెలియునట్లు; ఎఱిగింపుము = తెలుపుము; అదియున్ = అంతే; కాక = కాకుండగ; కలుషము = పాపము; ఒక్కక = ఒకో; చోటన్ = స్థలములో; కావించున్ = చేయును; ఒకచోటన్ = ఒకో; చోటన్ = స్థలములో; కావింపకుండున్ = చేయకుండును; తత్ = ఆయా; కర్మము = కర్మలను; ఎఱిగి = తెలిసి;.
ఇట్టి = ఇటువంటి; జనుడు = మానవుడు; పుణ్యము = పుణ్యమును; ఏరీతిన్ = విధముగా; చేసినన్ = చేసినప్పటికి; అది = అది; ఫలింపన్ = ఫలితమునిచ్చుట; నేరదు = చేయలేదని; అని = అని; తలంతు = భావించెదను; సలిలము = నీటి; అందున్ = లో; మేని = దేహము; మలినంబున్ = మలినములు; పోకుండ = తుడిచివేయ బడకుండ; గజము = ఏనుగు; క్రుంకుపెట్టు = స్నానము చేయు; గతియున్ = విధమును; పోలెన్ = వలె.

భావము:

అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు అతనితో ఇలా అన్నాడు. “పాపకృత్యాలను కన్నులార కని, వీనులార విని మానవుడు పాపాలు చేయటం నరక హేతువని తెలుసుకొంటాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. అలా పశ్చాత్తాపం చెంది కూడా అలవాటు ప్రకారం మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమమూఢుని పాపాలకు పరిహారం ఉంటుందా? అంతేకాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేస్తాడు. ఒక్కొక్క సందర్భాలలో చేయడానికి వెనుకాడుతాడు. ఇటువంటి చంచల హృదయుడు పుణ్యాలు చేయనే చేయడు. ఒకవేళ చేసినా లాభం ఉండదని నా నమ్మకం. అది గజస్నానం వలె నిరర్థకమే అవుతుంది. ఏనుగు నీళ్ళలో మునిగి వచ్చినా దాని ఒంటిమీది బురద అలాగే ఉంటుంది”.

6-47-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను;

భావము:

ఈవిధంగా పరీక్షిత్తు పలుకగా శుకుడు ఇలా అన్నాడు.

6-48-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కర్మము కర్మముచేతను
నిర్మూలము గాదు తెలియనేరక తా నే
ర్మము జేసినఁ దత్ప్రతి
ర్మం బొనరింప వలయుఁ లుషవిదూరా!

టీకా:

కర్మము = కర్మలు; కర్మము = కర్మలు; చేతను = చేత; నిర్మూలనము = నాశనము; కాదు = కాదు; తెలియన్ = తెలిసికొన; నేరక = లేక; తాను = తను; ఏ = ఏ విధమైన; కర్మమున్ = కర్మని; చేసినన్ = చేసినప్పటికి; తత్ = దానికి; ప్రతి = విరుగుడు; కర్మంబున్ = కర్మలను; ఒనరింపవలయున్ = చేయవలెను; కలుషవిదూరా = పాపములకు మిక్కిలి దూరముగా ఉండువాడ.

భావము:

“పుణ్యాత్మా! ఒక కర్మం మరొక కర్మం చేయడంతో నిర్మూలనం కాదు. అంటే తెలిసి చేసిన దుష్కర్మ దోషం తర్వాత చేసిన సత్కర్మ వల్ల పరిహారం కాదు. చేసిన దుష్కర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది. పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కాని పాపాలు పరిహారం కావు.

6-49-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హివు గల కుడుపు మఱి రు
గ్వితులఁ బొడమంగ నీని విధమున నతి స
ద్వ్రతుఁ డైనవాఁడు నిర్మల
తిచే నఘరాశి నెల్ల ట్టము జేయున్.

టీకా:

హితవు = ఇష్టము; కల = కలిగినట్టి; కుడుపు = ఆహారము; మఱి = ఇంక; రుగ్వితతులన్ = రోగముల సమూహములను; పొడమంగనీని = పుట్టనీయని; విధమునన్ = అట్లు; అతి = మిక్కిలి; సత్ = మంచి; వ్రతుడు = నియమనిష్ఠలుగలవాడు; ఐన = అయినట్టి; వాడు = వాడు; నిర్మల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుచేత; అఘ = పాపపు; రాశిని = సమూహము; ఎల్లన్ = సమస్తమును; మట్టము = నాశనము; చేయున్ = చేసివేయును.

భావము:

హితకరమైన భోజనం రోగాలను పారద్రోలి మానవునకు ఆరోగ్యాన్ని కలిగించిన విధంగా పెద్దల ఉపదేశానుసారం సత్ప్రవర్తనను అలవరచుకొన్నవాడు నిర్మలమైన హృదయం కలిగి పాపాల నన్నింటినీ పటాపంచలు చేసుకొంటాడు.

6-50-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున బ్రహ్మచర్యమున దానమునన్ శమ సద్దమంబులన్
మున సత్యశౌచముల న్నియమాది యమంబులం గృపా
నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తను వాక్యజంపు పా
పుగురిఁ ద్రుంతు రగ్ని శతర్వ వనంబుల నేర్చుకైవడిన్.

టీకా:

]తపమునన్ = తపస్సువలన కాని; బ్రహ్మచర్యమునన్ = బ్రహ్మచర్యము వలన కాని; దానమునన్ = దానములు వలన కాని; శమ = శమమువలన కాని; సత్ = సత్యమైన; దమంబులన్ = దమములవలన కాని; జపమునన్ = జపమువలన కాని; సత్య = సత్యము; శౌచములన్ = శుచిత్వముల వలన కాని; సత్ = మంచి; నియమ = నియమములు; ఆది = మొదలగు; యమంబులన్ = యమముల వలన కాని; కృపానిపుణులు = దయామతులు; ధర్మవర్తనులు = ధర్మమార్గానుయాయులు; నిక్కము = నిజముగ; హృత్ = మనసువలన; తను = శరీరమువలన; వాక్య = మాటలవలన; జంపు = పుట్టినట్టిదైన; పాపపు = పాపము లనియెడు; గుదిన్ = గుదిబండను; త్రుంతురు = తుంచివేయుదురు; అగ్ని = నిప్పు; శతపర్వ = వెదురు; వనంబులన్ = అడవులను; ఏర్చు = కాల్చివేయు; కైవడిన్ = విధముగా.

భావము:

దయార్ద్ర హృదయులు, ధర్మవర్తనులు అయినవారు తపస్సు, బ్రహ్మచర్యం, దానం, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, జపం, సత్యం, శుచిత్వం, యమనియమాలు మొదలైన ఉత్తమ గుణాలను అలవరచుకొని మనోవాక్కాయకర్మలకు సంబంధించిన పాప సమూహాన్ని అగ్నిదేవుడు వెదురు పొదలను దహించివేసినట్లు దహించి వేస్తారు.

6-51-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియుం గాక.

టీకా:

అదియున్ = అంతే; కాక = కాకుండు.

భావము:

అంతే కాకుండా...

6-52-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా
నం మరందపాన కలనారత షట్పదచిత్తు లౌచు గో
విం పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం
జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచు కైవడిన్.

టీకా:

కొందఱు = కొంతమంది; పుణ్యవర్తనులు = పుణ్యమార్గనుసారులు; గోపకుమార = కృష్ణమూర్తి {గోపకుమారుడు - (నంద) గోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు}; పద = పాదములు యనెడి; అరవింద = పద్మదళముల; జా = పుట్టిన; ఆనంద = ఆనంద మనెడి; మరంద = తేనెను; పానకలన = తాగుట యందు; ఆరతన్ = ఆతృత గల; షట్పద = తుమ్మెదలవంటి; చిత్తులు = మనసులు గలవారు; ఔచున్ = అగుచూ; గోవింద = గోవిందుని యెడల; పరాయణుల్ = లగ్నమైనవారు; విమల = స్వచ్ఛమైన; వేషులు = వర్తన గలవారు;దోషమున్ = పాపములను; అడంతురు = అణచివేయుదురు; ఆత్మలన్ = తమ ఆత్మలను; చెందిన = పొందిన; భక్తి = భక్తి; చేతన్ = చేత; రవి = సూర్యుడు; చేకొని = పూనుకొని; మంచున్ = మంచుతెరలను; అడంచు = అణచివేయు; కైవడిన్ = వలె.

భావము:

కొందరు పుణ్యాత్ములుంటారు. వారు కృష్ణుని పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించటంలో తుమ్మెదలవంటి హృదయాలు కలవారు. నిరాడంబర వేషులై తమ హృదయాలలో పెంపొందిన భక్తిచేత సూర్యుడు మంచును హరించినట్లు సమస్త దోషాలను రూపుమాపుకొంటారు.

6-53-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిభక్తిచేతఁ గొందఱు
రిమార్తురు మొదలుముట్ట పాపంబుల ని
ష్ఠుతర కరముల సూర్యుం
రుదుగఁ బెనుమంచుఁ బించ డఁచిన భంగిన్.

టీకా:

హరి = విష్ణుమూర్తిపైన; భక్తి = భక్తి; చేతన్ = వలన; కొందఱు = కొంతమంది; పరిమార్తురు = నాశనము చేసెదరు; మొదలుముట్ట = సంపూర్ణముగా; పాపంబులన్ = పాపములను; నిష్ఠురతర = అతి తీవ్రమైన {నిష్ఠుర - నిష్ఠురతర - నిష్ఠురతమ}; కరములన్ = కిరణములచేత; సూర్యుండు = సూర్యుడు; అరుదుగా = అపూర్వముగా; పెను = పెద్ద; మంచున్ = మంచును; పించమడచిన = గర్వభంగము చేసిన; భంగిన్ = విధముగా.

భావము:

మరికొందరు తమ భక్తి ప్రభావంతో సూర్యుడు తన ప్రచండ కిరణాలతో కారుచీకట్లను పారద్రోలినట్లు ఘోరమైన పాపాలను మొదలంటూ నిర్మూలిస్తారు.

6-54-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దంతిపురనాథ! విను మొక
మంన మెఱిఁగింతు శమ దమంబులు నంహో
వంతు శుభవంతుఁ జేయవు
కంతుని గురుభక్తి ముక్తిఁ లిగించు గతిన్.

టీకా:

దంతిపురనాథ = పరీక్షిత్తు {దంతిపుర నాథుడు - దంతిపురము (హస్తినాపురము) నకు నాథుడు (రాజు), పరీక్షిత్తు}; వినుము = వినుము; ఒక = ఒక; మంతనము = రహస్యమును; ఎఱిగింతు = తెలిపెదను; శమ = శమము; దమంబులు = దమములు; అంహోవంతు = పాపము కలవానిని; శుభవంతున్ = శుభునిగా; చేయవు = చేయవు; కంతునిగురు = విష్ణుమూర్తిపైని {కంతుని గురువు - కంతుడు (మన్మథుడు) యొక్క గురువు (తండ్రి), విష్ణువు}; భక్తి = భక్తి; ముక్తిన్ = మోక్షమును; కలిగించు = కలుగజేయు; గతిన్ = విధముగా.

భావము:

హస్తినాపుర ప్రభువువైన ఓ పరీక్షిన్మహారాజా! ఒక రహస్యం చెప్తాను విను. శ్రీహరి భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడా హరి భక్తివలె పాపాత్ముణ్ణి పుణ్యాత్ముడిగా మార్చలేవు.

6-55-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికి నర్థముఁ బ్రాణ ర్పితంబుగ నుండు-
వాని కైవల్య మెవ్వనికి లేదు
నజలోచను భక్తరుల సేవించిన-
వాని కైవల్య మెవ్వనికి లేదు
వైకుంఠ నిర్మల వ్రతపరుండై నట్టి-
వాని కైవల్య మెవ్వనికి లేదు
రసిజోదరు కథాశ్రవణ లోలుం డైన-
వాని కైవల్య మెవ్వనికి లేదు

6-55.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లేదు తపముల బ్రహ్మచర్యాది నియతి
మ దమాదుల సత్యశౌముల దాన
ర్మ మఖముల సుస్థిర స్థానమైన
వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము.

టీకా:

హరి = నారాయణుని; కిన్ = కి; అర్థమున్ = ప్రయోజనములు; ప్రాణము = ప్రాణములు; అర్పితంబుగన్ = అర్పణజేసి; ఉండు = ఉండెడి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; వనజలోచను = నారాయణుని {వనజ లోచనుడు - పద్మనేత్రుడు, హరి}; భక్త = భక్తిలో; పరులు = లగ్నమైనవారిని; సేవించిన = కొలచిన; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; వైకుంఠ = నారాయణుని ఎడల {వైకుంఠుడు - వైకుంఠమున నుండువాడు, హరి}; నిర్మల = స్వచ్ఛమైన; వ్రత = దీక్ష యందు; పరుండు = లగ్నమైన వాడు; ఐనట్టి = అయినట్టి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; సరసిజోదరు = నారాయణుని {సరసిజోదరుడు - సరసిజము (పద్మము) ఉదరుడు (ఉదరమున గలవాడు), హరి}; కథ = కథలను; శ్రవణ = వినుట యందు; లోలుండు = మునిగిన; ఐన = అయినట్టి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు.
లేదు = లేదు; తపములన్ = తపస్సులందు; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము; ఆది = మొదలైన; నియతిన్ = నియమములందు; శమ = శమము; దమ = దమము; ఆదులన్ = మొదలైనవాని యందు; సత్య = సత్యము; శౌచములన్ = శౌచము లందు; దాన = దానములు; ధర్మ = ధర్మములు; మఖములన్ = యజ్ఞము లందు; సుస్థిర = మిక్కిలి స్థిరమైన; స్థానము = స్థానము; ఐన = అయినట్టి; వైష్ణవ = విష్ణుభక్తి యొక్క; జ్ఞాన = జ్ఞానము చేత; జనిత = కలిగెడి; నిర్వాణపదము = మోక్షమార్గము.

భావము:

ఎవరైతే శ్రీహరికి తమ అర్థాన్ని, ప్రాణాన్ని సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తి వల్ల లభించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్ల కాని, బ్రహ్మచర్యాది నియమాల వల్ల కాని, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్లకాని, సత్యపరిపానం వల్ల కాని, శుచిత్వం వల్ల కాని, దానధర్మాల వల్ల కాని, యజ్ఞాలు చేయటం వల్ల కాని ప్రాప్తించదు.

6-56-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ నెన్నఁడుఁ జేటు లేట్టి ముక్తి
ర్త్మ మీ లోకమందు నెవ్వరికిఁ గలదు?
సాధులును బుణ్యశీలురు జ్జనులును
రిపరాయణ తత్పరు యినఁ గాక.

టీకా:

అరయన్ = తరచిచూసిన; ఎన్నడున్ = ఎప్పటికిని; చేటు = నాశన మగుట; లేనట్టి = లేనటువంటి; ముక్తి = మోక్ష; వర్త్మము = పథము; ఈ = ఈ; లోకము = లోకము; అందున్ = లో; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి; కలదు = ఉన్నది; సాధులును = సాధులును; పుణ్యశీలురు = పుణ్యవంతులును; సజ్జనులును = మంచివారును; హరి = నారాయణుని; పరాయణ = ఎడల; తత్పరులు = లగ్నమైన వారు; అయిన = అయితే; కాక = తప్ప.

భావము:

సాధుస్వభావులు, పుణ్యమూర్తులు, సజ్జనులు, హరిభక్తి పరాయణులు అయిన వారికే తప్ప పునరావృత్తి లేని శాశ్వత మోక్షం ఈ లోకంలో మరెవ్వరికీ లభించదు.

6-57-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుదుగ నరహరి భక్తిం
బొయని యా పురుషు సుకృత పుంజంబులు వేఁ
ఱుఁ బుణ్యుఁ జేయ నేరవు
వర మధుఘటముఁ బెక్కు దులుం బోలెన్.

టీకా:

అరుదుగ = అపూర్వముగా; నరహరి = నారాయణుని {నరహరి - నరసింహావతారము ఎత్తినవాడు, హరి}; భక్తిన్ = భక్తిని; పొరయని = పొందని; ఈ = ఈ; పురుషు = మానవుని; సుకృత = మంచిపనుల; పుంజములు = సమూహములు; వేమఱు = అనేకసార్లు; పుణ్యున్ = పుణ్యవంతునిగా; చేయన్ = చేయుటకు; నేరవు = చాలవు; నరవర = రాజా {నరవరుడు - నరులలో ఉత్తముడు, రాజు}; మధు = మద్యపు; ఘటము = కుండను; పెక్కు = అనేకమైన; నదులున్ = నదులను; పోలెన్ = వలె.

భావము:

రాజా! ఎన్ని పుణ్యాలు చేసినా హరిభక్తి లేనినాడు అన్నీ నిరుపయోగాలే. ఎన్ని నదులు కలిసినా మద్యభాండాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తి లేని పుణ్యకార్యాలు వేలకు వేలు చేసినా పాపాత్ముడైన నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు.

6-58-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తముఁ గృష్ణపాదజలజంబుల యందు మనంబు నిల్పు సు
వ్రతులు దదీయ శుద్ధ గుణరాగులుఁ గాలుని యుగ్రపాశ సం
తుల ధరించు తత్సుభటకౌఘములం గలలోనఁ గాన రే
తులను దుష్టకర్మములు గైకొని వారలఁ జెందనేర్చునే?

టీకా:

సతతము = ఎల్లప్పుడు; కృష్ణ = కృష్ణుని; పాద = పాదములు యనెడి; జలజంబులన్ = పద్మముల; అందున్ = అందు; మనంబున్ = మనసును; నిల్పు = నిలిపెడి; సు = చక్కటి; వ్రతులు = దీక్ష గలవారు; తదీయ = అతని; శుద్ధ = పరిశుద్ధమైన; గుణ = సుగుణము లందు; రాగులు = అనురాగము గలవారు; కాలుని = యముని; యుగ్ర = భయంకరమైన; పాశ = పాశముల; సంహతులన్ = గట్టిగా కొట్టుటను; ధరించు = ధరించెడి; తత్ = అతని; సుభటక = గొప్పభటుల; ఓఘములన్ = సమూహములను; కల = స్వప్నము; లోనన్ = లోనైనను; కానరు = పొందరు; ఏ = ఏ; గతులను = విధముగను; దుష్ట = పాపపు, చెడ్డ; కర్మములు = కర్మలు; కైకొని = చేపట్టి; వారలన్ = వారిని; చెందన్ = చేరుటను; నేర్చునే = కలుగునా.

భావము:

ఎల్లప్పుడు శ్రీకృష్ణుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేసిన మహాభక్తులు, ఆ వాసుదేవుని సుగుణాలలో ఆసక్తి కలిగినవారు యముణ్ణి కాని, యమపాశాలను ధరించిన యమభటుల సమూహాలను కాని కలలో కూడా కనుగొనరు. అటువంటి మహానుభావులను, మహాభక్తులను ఎటువంటి పాపకర్మాలు ఏమాత్రం ఆవహింపవు.

6-59-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీ యర్థంబునకుం బురాతనంబగు నొక్క యితిహాసంబు గలదు; అది విష్ణుదూత యమదూత సంవాదం బనంబడు; దాని నెఱింగింతు; ఆకర్ణింపుము

టీకా:

కావునన్ = అందుచేత; ఈ = ఈ; అర్థంబున్ = విషయమున; కున్ = కు; పురాతనంబు = పూర్వకాలపుది; అగు = అయిన; ఒక్క = ఒక; ఇతిహాసము = కథ; కలదు = ఉన్నది; అది = అది; విష్ణుదూత = విష్ణుదూతల; యమదూత = యమదూతల; సంవాదంబు = సంభాషణ, చర్చ; అనంబడున్ = అనెడిది; దానిన్ = దానిని; ఎఱింగింతి = తెలిపెద; ఆకర్ణింపుము = శ్రద్ధగా వినుము.

భావము:

కావున ఈ విషయాన్ని వివరించే ఒకానొక పురాతనమైన ఇతిహాసం ఉంది. దానిని ”విష్ణుదూత యమదూతల సంవాదం” అంటారు. దానిని నీకు వినిపిస్తాను.