పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-246-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లతి భయంకరంబైన తపంబు చేయుచు, నెడతెగక భగవన్మంత్రంబులు నుడువుచుఁ బ్రజాసర్గ కాములై యున్న య చ్చిన్ని బాలుర కడకు నారదుండు చనుదెంచి, పూర్వవిధంబునం బలుకుచు నిట్లనియె; భ్రాతృవత్సలులై యున్న మీరలు వేదాంతసారం బొలుకు చున్న నా వచనంబు లాదరించి, తోఁబుట్టువులు చనిన మార్గంబునఁ జనుండు; ఎవ్వరేనిం దమ యగ్రజులు చనిన మార్గంబునం దామునుం దప్పక వర్తింతు రేని నట్టివారిని విశేషధర్మం బెఱింగిన వారండ్రు; సతతంబును బుణ్యబంధువు లైన దేవతలం గూడి సుఖంబుండుం" డని బల్కి, నారదుండు చనియె; వారలును సర్వకర్మంబుల యందు నిర్మోహితులై పరమపదంబునకు నాస్పదంబు లైన దేవర్షి వాక్యంబుల నాశ్రయించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; భయంకరము = భీకరము; ఐన = అయిన; తపంబు = తపస్సు; చేయుచున్ = చేస్తూ; ఎడతెగక = నిరంతరాయముగా; భగవత్ = భగవంతుని యొక్క; మంత్రంబులు = మంత్రములను; నుడువుచు = పలుకుతూ; ప్రజాసర్గ = సంతాన సృష్ఠి యందు; కాములు = కోరిక గలవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ; చిన్ని = చిన్నవారైన; బాలుర = పిల్లల; కడ = వద్ద; కు = కు; నారదుండు = నారదుడు; చనుదెంచి = వచ్చి; పూర్వ = ఇంతకుముందు; విధంబునన్ = వలెనే; భాత్రు = సోదరుల యెడ; వత్సలులు = అనురాగము గలవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; మీరలు = మీరు; వేదాంత = వేదాంతముల; సారంబు = సారాంశము; ఒలుకుచున్న = పొంగిపొర్లుతున్న; నా = నా యొక్క; వచనంబులు = మాటలు; ఆదరించి = అంగీకరించి; తోబుట్టువులు = సోదరులు; చనిన = వెళ్ళిన; మార్గంబునన్ = దారిలోనే; చనుండు = వెళ్ళండి; ఎవ్వరేనిన్ = ఎవరైనాసరే; తమ = తమ యొక్క; అగ్రజులు = అన్నలు; చనిన = వెళ్ళిన; మార్గంబునన్ = దారిలో; తామునున్ = తము కూడ; తప్పక = విడువక; వర్తింతురేని = నడతురేని; అట్టివారిని = అటువంటివారిని; విశేష = విశిష్టమైన; ధర్మంబు = ధర్మములు; ఎఱిగినవారు = తెలిసినవారు; అండ్రు = అంటారు; సతతంబును = ఎల్లప్పుడును; పుణ్య = పుణ్యవంతులకు; బంధువులు = బంధువులు; ఐన = అయినట్టి; దేవతలన్ = దేవతలను; కూడి = కలిసి; సుఖంబున్ = సుఖముగా; ఉండుండు = ఉండండి; అని = అని; పల్కి = పలికి; నారదుండు = నారదుడు; చనియె = వెళ్ళెను; వారలును = వారు కూడ; సర్వ = అఖిల; కర్మంబుల = కర్మముల; అందున్ = ఎడను; నిర్మోహితులు = మోహము లేనివారు; ఐ = అయ్యి; పరమపదంబున్ = మోక్షపదమున; కున్ = కు; ఆస్పదంబులు = మూలస్థానములు; ఐన = అయినట్టి; దేవర్షి = దేవఋషి; వాక్యంబులన్ = మాటలను; ఆశ్రయించి = అండగొని.

భావము:

ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ ఎడతెగకుండా భగవంతుని మంత్రాలను ఉచ్చరిస్తూ సృష్టి చేయాలనే కోరికతో ఉన్న ఆ కుమారుల దగ్గరకు నారద మహర్షి వచ్చి మునుపటిలాగానే ఇలా పలికాడు. “అన్నల మీద ఎంతో ప్రేమ కలిగిన మీరు వేదాంత సారాన్ని వివరించే నా మాటలను వినండి. మీ తోబుట్టువులు వెళ్ళిన మార్గంలోనే నడవండి. లోకంలో అన్నల మార్గాన్ని అవలంబించినవాళ్ళు విశేష ధర్మజ్ఞులుగా ప్రశంసలు అందుకుంటారు. పుణ్యపురుషులైన వారికి ఆత్మబంధువులైన దేవతలు ఉండే లోకానికి వెళ్ళి కలకాలం సుఖంగా ఉండండి” అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. శబలాశ్వులు సృష్టి చేయాలనే కర్మ వ్యామోహాన్ని వదలిపెట్టి పరమపదానికి అవసరమైన నారదుని హితోపదేశాన్ని ఆమోదించారు.

6-247-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు లజ్జతోడ శబళాశ్వులు పూర్వజు లేగినట్టి యా
చొప్పున నెన్నఁడుం దిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిం
ప్పక పోయిరయ్య! గుణధాములు; నేఁడును మళ్ళరేమి నేఁ
జెప్పెదఁ గాక రాక కడ చేరిన రాత్రులఁ బోలి భూవరా!

టీకా:

అప్పుడు = అప్పుడు; లజ్జ = సిగ్గు; తోడ = తోటి; శబళాశ్వులు = శబళాశ్వులు; పూర్వజులు = ముందు పుట్టిన వారు, అన్నలు; ఏగిన = వెళ్ళిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; చొప్పున = విధముగనే; ఎన్నడున్ = ఎప్పటికిని; తిరిగి = వెనుకకుతిరిగి; చూడని = చూడనట్టి; త్రోవ = దారిని; విశేష = విశిష్టమైన; పద్ధతిన్ = పద్ధతిని; తప్పక = విడువక; పోయిరి = వెళ్ళిరి; అయ్య = తండ్రి; గుణధాములు = సుగుణము లనెడి వెలుగులు గలవారు; నేడును = ఈనాటికిని; మళ్ళరు = వెనుకకు తిరిగి రారు; ఏమి = ఏమి; నేన్ = నేను; చెప్పెదగాక = చెప్పగలను; రాకకడ = పౌర్ణమిని; చేరిన = చేరినట్టి; రాత్రులన్ = రాత్రులను; పోలి = వలె.

భావము:

రాజా! సద్గుణవంతులైన శబలాశ్వులు తమ నడవడికి సిగ్గుపడి, తమ అన్నలు పోయిన మార్గాన్ని అనుసరించి పునరావృత్తి లేని మోక్షాన్ని కాంక్షించి జరిగిపోయిన రాత్రులు తిరిగిరానట్లు తిరుగులేని పరమపదాన్ని అందుకొన్నారు.

6-248-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షున కా కాలంబున
క్షితమై యుండెఁ బెక్కు లాగుల నుత్పా
క్షోభంబులు వానికి
రూక్షవ్యధ నొంది యా పురుష నాశంబున్.

టీకా:

దక్షున్ = దక్షుని; కు = కి; ఆ = ఆ; కాలంబున = సమయములో; లక్షితము = ఎదురుపడినవి; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; పెక్కు = అనేక; లాగుల = రకముల; ఉత్పాత = ఉపద్రవముల; క్షోభంబులు = కల్లోలములు; వాని = వాటి; కి = కి; రూక్ష = తీక్షణమైన; వ్యధన్ = బాధను; ఒంది = పొంది; ఆ = ఆ; పురుష = పురుష ప్రయత్నమునకు కలిగిన; నాశంబున్ = నాశనమును.

భావము:

దక్షప్రజాపతికి ఆ సమయంలో అనేక విధాలైన అపశకునాలు గోచరించాయి. తన కుమారులు ప్రజాసృష్టికి పరాఙ్ముఖులయ్యారని తెలుసుకున్నాడు. అతని మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది.

6-249-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదకృత మని యెఱిఁగి మ
హారోషముతోడ నేగి యాతనిఁ గని దుః
ఖారూఢ చిత్తుఁడై మది
నూడిలం దెరువు లేక యుగ్రుం డగుచున్.

టీకా:

నారద = నారదునిచేత; కృతము = జరిగినది; అని = అని; ఎఱిగి = తెలిసి; మహా = గొప్ప; రోషము = కినుక; తోడన్ = తోటి; ఏగి = వెళ్ళి; ఆతనిన్ = అతనిని; కని = చూసి; దుఃఖ = దుఃఖముచేత; ఆరూఢ = నిండిన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; మదిన్ = మనసును; ఊరడిలన్ = ఊరడిల్లుటకు; తెరువు = దారి; లేక = లేక; ఉగ్రుండు = కోపముతో మండిపడుతున్నవాడు; అగుచున్ = అగుచూ.

భావము:

ఇదంతా నారదుని పని అని తెలిసికొని వెళ్ళి నారదుని చూసి దుఃఖాన్ని ఆపుకొనలేక అతని మీద కోపంతో మండిపడ్డాడు.

6-250-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోము జేవుఱింప ముడిపడ బొమదోయి
చూపు వెంట మంట సుడిగొనంగఁ
బెదవు లడరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు
క్షుఁ డాగ్రహించి పసిఁ బలికె.

టీకా:

మోము = ముఖము; జేవురింపన్ = ఎఱ్ఱబడగా; ముడిపడన్ = ముడిచివేయగ; బొమదోయి = కనుబొమలజంట యొక్క; చూపు = కనుచూపు; వెంట = వెంట; మంట = మంటలు; సుడిగొనంగ = సుడితిరుగ; పెదవులు = పెదవులు; అడర = అదరగ; పండ్లు = పళ్ళు; పెటపెట = పెటపెట మని; కొఱుకుచున్ = కొరుకుతూ; దక్షుడు = దక్షుడు; ఆగ్రహించి = కోపించి; తపసిన్ = మునిని (నారదుని) తోటి; పలికె = అనెను.

భావము:

ముఖం ఎఱ్ఱబడగా, కనుబొమలు ముడివడగా, చూపులలో మంటలు చెలరేగగా, పెదవులు అదరగా పండ్లు పటపట కొరుకుతూ దక్షుడు నారదునితో ఇలా అన్నాడు.

6-251-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నెయఁగ సాధురూపమున నీ వతిబాలుర కాత్మజాళికిం
ఱుకున భిక్షుమార్గ మగు కందువ చెప్పితి వేల? ధూర్తవై
ఱుఁగక యుండవచ్చునె? కుమారుల నీ దురితంబు పొంద; ని
న్నొఱఁలగఁ ద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవహ్నులన్.

టీకా:

నెఱయగ = నేర్పుగా; సాధు = సాధువు; రూపమున = వలె; నీవు = నీవు; అతిబాలుర = చిన్నపిల్లల; కు = కు; ఆత్మజ = నాబిడ్డల; ఆళికిన్ = సమూహమున; కిన్ = కి; కఱుకునన్ = కరుకుగా; భిక్షు = సన్యాసుల; మార్గము = దారి; అగు = అయిన; కందువ = జాడ; చెప్పితివి = చెప్పావు; ధూర్తవు = తిట్ట దగిన వాడవు; ఐ = అయ్యి; మఱుగక = సంతాపము పొందక; ఉండవచ్చునె = ఉండగలమా; కుమారులన్ = పుత్రులను; ఈ = ఇలాంటి; దురితంబు = కలతను; పొంద = పొందగా; నిన్ను = నిన్ను; ఒఱలగన్ = విలపించునట్లు; త్రోతు = తోసెదను; నాదు = నా యొక్క; సమద = మదించిన; ఉగ్ర = భయంకరమైన; మహా = గొప్ప; ఆగ్రహ = కోపముతో కూడిన; శాప = శాపము యనెడి; వహ్నులన్ = మంటలలోకి.

భావము:

“నీవు సాధురూపంలో వచ్చి నా పుత్రులైన పసివారికి మోక్షధర్మాన్ని ఉపదేశించి సన్న్యాసులుగా ఎందుకు మార్చావు? ధూర్తుడవైన నిన్ని ఉపేక్షించవచ్చునా? నా కుమారులకు ఈ గతి పట్టించిన నిన్ను నా శాపాగ్నికి ఆహుతి చేస్తాను.

6-252-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది యెట్లంటేని, దేవర్షి పితృ ఋణంబులు దీర్పక కర్మవిచారంబు చేయని బాలుర మనంబులకు నైహికేచ్ఛలయందు నైరాశ్యంబు గలుగంజేసి నివృత్తిమార్గం బుపదేశించి, వారలకు నుభయలోకముల యందుఁ జెందఁ గల శ్రేయోహాని నొనర్చితి; విట్టి పాతకంబున భాగవతోత్తములలో లజ్జాహీనుండవై యశోహానిం బొంది చరింపుదు గాక; నిరపరాధులై వైరంబులేని నా పుత్రుల పట్ల ద్రోహకృత్యం బొనర్చిన నీవు దప్పఁ దక్కిన భాగవతోత్తములు సకల భూతానుగ్రహ పరవశులు; అతి కుతూహలంబున నీచేత స్నేహపాశ నికృంతనంబైన మిత్రభేదంబె కాని తదుపశమనంబు గాకుండెడు; ఇంతనుండియుఁ బురుషుండు విషయ తీక్ష్ణత్వంబు లనుభవింపక కాని తెలియకుండెడు; జ్ఞానంబు తనంతటనె కాని యొరులచే బోధింపఁబడి తెలియరాకుండెడి; నిరంతరంబును లోకసంచారియైన నీకు నే లోకంబునను నునికిపట్టు లేకుండుం గాక" యని నిర్దయుండై శాపం బిచ్చె; నంత నారదుండు తత్క్రోధవాక్యంబుల కలుగక "యట్ల కాని" మ్మని సమ్మతించి చనియె; నిట్టి శాంతభావం బెవ్వనివలనం గలుగు, నతండు సర్వాతీతుండయిన సర్వేశ్వరుం డనంబడు; మఱియు దక్షుండు దన మనోరథంబు విఫలంబగుటం జేసి యతి దుఃఖిత మనస్కుడై పొగలుచున్నఁ, బితామహుండు చనుదెంచి, మఱియుఁ బ్రజాసర్గోపాయం బుపదేశించిన నా ప్రజాపతి ప్రియభామయైన యసిక్ని యందుఁ బిత్రువత్సల లైన పుత్రికల నఱువదుండ్రం బుట్టించి; వారిలో ధర్మునకుం బదువురను, కశ్యపునకుం బదమువ్వురను, జంద్రునకు నిఱువదేడ్వురను, భూతునకు నాంగిరసునకుఁ గృశాశ్వునకు నిద్దఱేసిచొప్పున నార్వురను, తార్క్షుండను నామాంతరంబుఁ దాల్చిన కశ్యపునకు మరలఁ గడమ నలువురను నీ క్రమంబున నిచ్చె వారి నామంబు లాకర్ణింపుము.

టీకా:

అది = అది; ఎట్లు = ఏ విధముగ; అంటేని = అంటివేని; దేవ = దేవతల {దేవఋణము - వేదోక్త కర్మలనాచరించుట ద్వారా తీర్చుకొనునది}; ఋషి = ఋషుల {ఋషిఋణము - వేద శాస్త్రాధ్యయనముల ద్వారా తీర్చుకొనునది}; పితృ = పితరుల {పితృఋణము - ప్రజాసృష్టి ద్వారా తీర్చుకొనునది}; ఋణంబులు = ఋణములను; తీర్పక = తీర్చకుండగ; కర్మ = వేదోక్త కర్మలందు; విచారంబుచేయని = నేర్పు పొందని; బాలుర = పిల్లల; మనంబుల = మనసుల; కున్ = కి; ఐహిక = ఇహలోకపు; ఇచ్ఛల = వాంఛల; అందు = ఎడల; నైరాశ్యంబున్ = వైముఖ్యమును; కలుగన్ = ఏర్పడునట్లు; చేసి = చేసి; నివృత్తి = ముక్తి; మార్గంబు = మార్గము; ఉపదేశించి = ఉపదేశించి; వారల = వారి; కున్ = కి; ఉభయలోకములు = ఇహపరలోకములు రెంటి; అందు = లోను; చెందగల = అందుకొనగల; శ్రేయో = శ్రేయస్సుల; హాని = నాశనమును; ఒనర్చితివి = చేసితివి; ఇట్టి = ఇటువంటి; పాతకంబున = మిక్కిలి పాపము వలన; భాగవత = భాగవతులలో; ఉత్తముల = శ్రేష్ఠుల; లో = లోను; లజ్జ = సిగ్గు; హీనుండవు = లేనివాడవు; ఐ = అయ్యి; యశస్ = కీర్తికి; హానిన్ = నాశనమును; పొంది = పొంది; చరింపుదువుగాక = తిరిగెదవుగాక; నిరపరాధులు = తప్పుచేయనివారు; ఐ = అయ్యి; వైరంబు = శత్రుత్వము; లేని = లేనట్టి; నా = నా యొక్క; పుత్రుల = కుమారుల; పట్ల = ఎడల; ద్రోహ = కీడుచేయు; కృత్యంబు = పని; ఒనర్చిన = చేసినట్టి; నీవు = నీవు; తప్ప = తప్పించి; తక్కిన = మిగిలిన; భాగవత = భాగవతులలో; ఉత్తములు = శ్రేష్ఠులు; సకల = సర్వ; భూత = ప్రాణులను; అనుగ్రహ = అనుగ్రహించెడి; పరవశులు = ఆసక్తి గలవారు; కావున = కనుక; నిరంతరంబును = ఎల్లప్పుడును; లోక = లోకము లందు; సంచారి = తిరిగెడువారు; ఐన = అయిన; నీవు = నీవు; కున్ = కు; ఏ = ఏ; లోకంబునను = లోకములోను; ఉనికిపట్టు = నివాసస్థానము; లేకుండుంగాక = లేకపోవుగాక; అని = అని; నిర్దయుండు = దయ లేనివాడు; ఐ = అయ్యి; శాపంబు = శాపము; ఇచ్చెను = ఇచ్చెను; అంత = అంతట; నారదుండు = నారదుడు; తత్ = ఆ; క్రోధవాక్యంబుల = శాపమున; కు = కు; అలుగక = కినుక వహింపక; అట్ల = అలాగే; కానిమ్ము = కానియ్యి; అని = అని; సమ్మతించి = అంగీకరించి; చనియెన్ = వెళ్ళిపోయెను; ఇట్టి = ఇటువంటి; శాంతభావంబు = శాంతమైన స్వభావము; ఎవ్వని = ఎవరి; వలనన్ = అందు; కలుగున్ = ఉండునో; అతండు = అతడు; సర్వాతీతుండు = సమస్తమునకు అతీతమైనవాడు; అయిన = అయినట్టి; సర్వేశ్వరుండు = భగవంతుడు; అనంబడు = అనబడును; మఱియు = ఇంకను; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; మనోరథంబు = కోరికలు; విఫలంబు = తీరకపోవుట; అగుటన్ = జరుగుట; చేసి = వలన; అతి = మిక్కిలి; దుఃఖిత = శోకముగల; మనస్కుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; పొగలుచున్న = కుములుచుండగ; పితామహుండు = బ్రహ్మదేవుడు {పితామహుడు - తండ్రులకు తండ్రి, బ్రహ్మ}; చనుదెంచి = వచ్చి; మఱియు = ఇంకను; ప్రజాసర్గ = సంతానము పుట్టించెడి; ఉపాయంబు = ఉపాయమును; ఉపదేశించిన = ఉపదేశించగా; ఆ = ఆ; ప్రజాపతి = ప్రజాపతి; ప్రియ = ఇష్ట; భామ = భార్య; ఐన = అయిన; అసిక్ని = అసిక్ని; అందు = అందు; పితృ = తండ్రి యెడల; వత్సలలు = వాత్సల్యము గలవారు; ఐన = అయిన; పుత్రికలన్ = కుమార్తెలను; అఱువదుండ్రన్ = అరవైమందిని; పుట్టించి = పుట్టించి; వారి = వారి; లో = లో; ధర్మున్ = ధర్ముని; కున్ = కి; పదువురను = పదిమందిని; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; పదమువ్వురను = పదముగ్గురను; చంద్రున్ = చంద్రుని; కు = కి; ఇఱువదేడ్వురను = ఇరవై ఏడుమందిని; భూతున్ = భూతున; కున్ = కు; అంగిరసున్ = అంగిరసున; కున్ = కు; కృశాశ్వున్ = కృశాశ్వున; కున్ = కు; ఇద్దఱేసి = ఇద్దరేసి; చొప్పున = వంతున; ఆర్వురను = ఆరుగురిని; తార్క్షుండు = తార్క్షుడు; అను = అనెడి; నామాంతరంబు = ఇంకొక పేరు; దాల్చిన = ధరించిన; కశ్యపున్ = కశ్యపుని; కు = కి; మరల = మళ్ళీ; కడమ = చివరి; నలువురను = నలుగురను; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగ; ఇచ్చె = వివాహమున నిచ్చెను; వారి = వారి యొక్క; నామంబులు = పేర్లు; ఆకర్ణింపుము = వినుము.

భావము:

ఎందుకంటే దేవఋణం, ఋషిఋణం, పితృఋణం తీరనివారు, కర్మలలో ఆరితేరనివారు అయిన నా కుమారులను ఐహిక సుఖాలకు విముఖులను చేశావు. వారికి ప్రవృత్తి మార్గం మీద వెగటు పుట్టించి నివృత్తి మార్గం ఉపదేశించి ఇహపర సుఖాలకు దూరం చేశావు. నా బిడ్డల శ్రేయస్సును నాశనం చేశావు. కనుక దీనికి ఫలితంగా ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ అప్రతిష్ఠను పొందుదువు గాక! ఎటువంటి లోపం లేనివారు, ఏ పాపం ఎరుగనివారు, ఎవరితోను వైరం పెట్టుకోనివారు అయిన నా కుమారులకు ద్రోహం చేసినందుకు లోకానుగ్రహ బుద్ధి కలిగిన తక్కిన భాగవతోత్తముల వలె కాకుండా లోక సంచారివై ఒకచోట నిలుకడ లేకుండా ఉందువు గాక!” అని దక్షుడు నిర్దాక్షిణ్యంగా నారదుణ్ణి శపించాడు. నారదుడు దక్షుని క్రోధవచనాలకు కోపం తెచ్చుకోకుండా అలాగే కానిమ్మంటూ ఆ శాపాన్ని స్వీకరించి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి శాంత స్వభావం కలవారే పరమేశ్వర స్వరూపులుగా భావింపబడతారు. ప్రజాసృష్టి జరగాలనే తన మనోరథం సిద్ధించనందుకు దక్షుడు మిక్కిలి విచారించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ప్రజాసృష్టికి తగిన శక్తిని అతనికి అనుగ్రహించాడు. అనంతరం దక్షప్రజాపతి తన అర్ధాంగి అయిన అసిక్ని యందు అరవై మంది కుమార్తెలను పొందాడు. వారంతా తమ తండ్రిమీద అమితమైన ఆదరాభిమానాలు కలవారు. దక్షుడు తన కుమార్తెలలో పదిమందిని ధర్మునికి, పదముగ్గిరిని కశ్యప ప్రజాపతికి, ఇరవై ఏడుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసాడు. మిగిలిన కుమార్తెలలో భూతునికి ఇద్దరిని, ఆంగిరసునికి ఇద్దరిని, కృశాశ్వునికి ఇద్దరిని, తార్క్షునికి (కశ్యపునికి నామాంతరం) నలుగురిని ఇచ్చి పెండ్లి చేసాడు.

6-253-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి పుణ్యవతులొ? యీ చేడియలు చెప్ప
వతు లేనియట్టి వతులయ్యుఁ
డుప పడసి రెట్టి డుపునఁ బుట్టిరో
డిఁది త్రిజగ మెల్లఁ డుపు గాఁగ.

టీకా:

ఎట్టి = ఎటువంటి; పుణ్యవతులొ = పుణ్యవతులో; ఈ = ఈ; చేడియలు = స్త్రీలు; చెప్ప = చెప్పుటకు; సవతు = సాటి; లేనియట్టి = లేనట్టి; సవతులు = సపత్నులు; అయ్యు = అయినప్పటికిని; కడు = ఎక్కువ మందిని; పడసిరి = (సంతానము) పొందిరి; ఎట్టి = ఎటువంటి; కడుపునన్ = తల్లి కడుపున; పుట్టిరో = జన్మించినారో; కడిది = దుర్లభమైన; త్రిజగము = ముల్లోకములు; ఎల్లన్ = సర్వమును; కడుపు = తమ కడుపున మోసినవారు; కాగ = అగునట్లు.

భావము:

దక్షుని కుమార్తెలు ఎంతటి పుణ్యవతులో చెప్పలేను. సవతులై కూడా సాటిలేని సతీమతల్లులై సంసారం చక్కదిద్దుకున్నారు. వారి తల్లి కడుపు చల్లగా ముల్లోకాలను కడుపులో మోసి కన్నారు.

6-254-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వార లెవ్వ రనిన భానువు, లంబయుఁ, గకుప్పు, జామియు, విశ్వయు, సాధ్యయు, మరుత్వతియు, వసువు, ముహూర్తయు, సంకల్పయు, ననం బదుగురు ధర్మునకుఁ బత్నులై కొడుకులం బడసిరి; వార లెవ్వ రంటేని భానువునకు వేదఋషభుండు పుట్టె; నతనికి నింద్ర సేనుం డుదయించె; లంబకు విద్యోతుండు గలిగె; నతనికి స్తనయిత్నువు లనువారు పుట్టిరి; కకుబ్దేవికి సంకుటుండు పుట్టె; సంకుటునకుం గీటకుండు పుట్టె; కీటకునకు దుర్గాభిమానిను లయిన దేవతలు జన్మించిరి; జామిదేవికి దుర్గ భూముల కధిష్ఠాన దేవతలు జనియించిరి; వారికి స్వర్గుండును, నందియు జన్మించిరి; విశ్వ యను దానికి విశ్వేదేవగణంబు జనియించె; వార లపుత్రుకులనం బరఁగిరి; సాధ్య యనుదానికి సాధ్యగణంబులు పుట్టె; వానికి నర్థసిద్ధి యను వాఁడు పుట్టె; మరుత్వతి యనుదానికి మరుత్వంతుఁడు, జయంతుం డను వార లుదయించి; రందు జయంతుండు వాసుదేవాంశజుం డైన యుపేంద్రుం డనంబడి వినుతి నొందె; ముహూర్త యనుదానికి సకల భూతంబులకు నాయాకాలంబులం గలిగెడు నాయా ఫలాఫలంబుల నిచ్చు మౌహర్తికు లనియెడు దేవగణంబులు పుట్టిరి; సంకల్ప యనుదానికి సంకల్పుం డుదయించె; నా సంకల్పునకుఁ గాముండు జనియించె; వసు వనుదానికి ద్రోణుండును, బ్రాణుండును, ధ్రువుండును, నర్కుండును, నగ్నియు, దోషుండును, వస్తువును, విభావసువును నన నెనమండ్రు వసువు లుదయంబు నొంది; రందు ద్రోణునకు నభిమతి యను భార్య యందు హర్ష శోక భయాదులు పుట్టిరి; ప్రాణునకు భార్య యైన యూర్జస్వతి యందు సహుఁడును, నాయువును, బురోజవుండును ననువారలు గలిగిరి; ధ్రువునకు భార్య యగు ధరణి యందు వివిధంబులగు పురంబులు పుట్టె; నర్కునకు భార్య యగు వాసన యందుఁ దర్షాదు లుదయించి; రగ్నికి భార్యయైన వసోర్ధార యందు ద్రవిణకాదులు పుట్టిరి; మఱియుఁ గృత్తికలకు స్కందుండు గలిగె; నా స్కందునకు విశాఖాదు లుదయించిరి; దోషునకు శర్వరి యను భార్య యందు హరికళ యగు శింశుమారుం డుదయించె వస్తువునకు నాంగిరస యందు విశ్వకర్మ యను శిల్పాచార్యుం డుదయంబందె; నా విశ్వకర్మకు నాకృతి యను సతియందుఁ జాక్షుషుం డను మనువు జనియించె; నా మనువు వలన విశ్వులు సాధ్యు లనువారలు పుట్టిరి; విభావసునకు నుష యను భార్య యందు వ్యుష్టియు, రోచియు, నాతపుండును జనించి; రందు నాతపునికిఁ బంచయాముం డను దివసాభిమాన దేవత జనియించె; శంకరాంశజుం డయిన భూతునకు సురూప యను భార్య యందుఁ గోట్ల సంఖ్యలైన రుద్రగణంబు లుదయించిరి; మఱియు రైవతుండు, నజుండు, భవుండు, భీముండు, వాముండు, నుగ్రుండు, వృషాకపియు నజైకపాత్తు, నహిర్బుధ్న్యుండు, బహురూపుండు, మహాంతుండు ననువారలును, రుద్రపారిషదులును నతిభయంకరు లయిన ప్రేతులును వినాయకులును బుట్టి; రంగిరసుం డను ప్రజాపతికి స్వధ యను భార్యయందుఁ బిత్రుగణంబులు పుట్టిరి; సతి యను భార్యకు నధ్వర వేదాభిమాన దేవతలు పుట్టరి; కృశాశ్వునకు నర్చి యను భార్యయందు ధూమ్రకేశుం డను పుత్రుం డుదయించె; వేదశిరునకు ధిషణ యను భార్య యందు దేవలుఁడును, వయనుండును, మనువునుం బుట్టిరి; తార్క్షునకు వినత కద్రువ పతంగి యామిని యన నలువురు భార్య లందుఁ బతంగికిఁ బక్షులు పుట్టె; యామినికి శలభంబులు పుట్టె; వినతకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనం బయిన గరుడుండును, సూర్యునకు సారధి యైన యనూరుండును జనియించిరి; కద్రువకుఁ బెక్కు తెఱంగు లగు భుజంగమంబులు పుట్టె; చంద్రునకుఁ గృత్తికాది నక్షత్రంబులు భార్యలయినను వారల యందుఁ జంద్రుండు రోహిణి యందు మాత్రము మోహితుం డగుటంజేసి దక్షశాపంబున క్షయరోగగ్రస్తుండై సంతానంబు పడయనేరఁ డయ్యె; నంత దక్ష ప్రసాదంబున క్షయపీడితంబు లగు షోడశకళల మరలం బొందె; మఱియును.
అసక్ని దక్షుడు దంపతుల వంశవృక్షం

టీకా:

వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అనిన = అనగా; భానువు = భానువు; లంబయు = లంబ; కకుప్పు = కకుప్పు; జామియు = జామి; విశ్వయు = విశ్వ; సాధ్యయు = సాధ్య; మరుత్వతియు = మరుత్వతి; వసువు = వసువు; ముహూర్తయు = ముహూర్త; సంకల్పయున్ = సంకల్ప; అనన్ = అనెడి; పదుగురు = పదిమంది; గురు = గొప్పవాడైన; ధర్మున్ = ధర్ముని; కున్ = కి; పత్నులు = భార్యలు; ఐ = అయ్యి; కొడుకులన్ = పుత్రులను; పడసిరి = పొందిరి; వారలు = వారు; ఎవ్వరంటేని = ఎవరంటే; భానువున్ = భానువు; కు = కు; వేదఋషభుండు = వేదఋషభుడు; పుట్టెన్ = జనించెను; అతని = అతని; కి = కి; ఇంద్రసేనుండు = ఇంద్రసేనుడు; ఉదయించె = పుట్టెను; లంబ = లంబ; కు = కు; విద్యోతుండు = విద్యోతుడు; కలిగె = జనించెను; అతని = అతని; కి = కి; స్తన = స్తనుడు; ఇత్నువులు = ఇత్నువు; అను = అనెడి; వారు = వారు; పుట్టిరి = కలిగిరి; కకుబ్దేవి = కకుప్ దేవి; కి = కి; సంకుటుండు = సంకుటుడు; పుట్టె = పుట్టెను; సంకుటున్ = సంకుటుని; కున్ = కి; కీటకుండు = కీటకుడు; పుట్టె = పుట్టెను; కీటకున్ = కీటకుని; కు = కి; దుర్గ = దుర్గము లందు; అభిమానులు = ఆపేక్ష కలిగినవారు; అయిన = ఐన; దేవతలు = దేవతలు; జన్మించిరి = పుట్టిరి; జామిదేవి = జామిదేవి; కి = కి; దుర్గ = ప్రవేశింప శక్యము కాని; భూములు = ప్రదేశములు; కు = కు; అధిష్ఠాన = అధికారము గల; దేవతలు = దేవతలు; జనియించిరి = పుట్టిరి; వారి = వారి; కి = కి; స్వర్గుండును = స్వర్గుడు; నందియు = నంది; జన్మించిరి = పుట్టిరి; విశ్వ = విశ్వ; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; విశ్వేదేవ = విశ్వేదేవ; గణంబు = సమూహములు; జనించె = పుట్టెను; వారలు = వారు; అపుత్రకులు = పుత్రులు లేనివారు; అనన్ = అని; పరిగిరి = ప్రసిద్ధులైరి; సాధ్య = సాధ్య; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సాధ్య = సాధ్యుల; గణంబులు = సమూహములు; పుట్టె = పుట్టెను; వాని = వాని; కిన్ = కి; అర్థసిద్ధి = అర్థసిద్ధి; అను = అనెడి; వాడు = వాడు; పుట్టె = పుట్టెను; మరుత్వతి = మరుత్వతి; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; మరుత్వంతుడు = మరుత్వంతుడు; జయంతుండు = జయంతుడు; అను = అనెడి; వారలు = వారు; ఉదయించిరి = పుట్టిరి; జయంతుండు = జయంతుడు; వాసుదేవ = నారాయణుని; అంశజుండు = అంశతో పుట్టినవాడు; ఐన = అయిన; ఉపేంద్రుండు = ఉపేంద్రుడు; అనంబడి = అని తెలియబడి; వినుతి = ప్రసిద్ధి; ఒందె = పొందెను; ముహూర్త = ముహూర్త; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సకల = సర్వ; భూతముల = జీవుల; కున్ = కు; ఆయా = ఆయా; కాలంబులన్ = కాలానుసరమై; కలిగెడున్ = కలిగెడి; ఆయా = ఆయా; ఫలాఫలములను = మంచి చెడు ఫలితములను; ఇచ్చు = ఇచ్చెడి; మౌహర్తికులు = మౌహర్తికులు; అనియెడు = అనెడు; దేవ = దేవతల; గణంబులు = సమూహములు; పుట్టిరి = పుట్టిరి; సంకల్ప = సంకల్ప; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; సంకల్పుండు = సంకల్పుడు; ఉదయించెన్ = పుట్టెను; ఆ = ఆ; సంకల్పున్ = సంకల్పుని; కున్ = కి; కాముండు = కాముడు; జనియించె = పుట్టెను; వసువు = వసువు; అను = అనెడి; దాని = ఆమె; కి = కు; ద్రోణుండును = ద్రోణుడు; ప్రాణుండును = ప్రాణుడు; ధ్రువుండును = ధ్రువుండు; అర్కుండును = అర్కుండు; అగ్నియు = అగ్ని; దోషుండును = దోషుండు; వస్తువును = వస్తువు; విభావసువును = విభావసువు; అనన్ = అనగా; ఎనమండ్రు = ఎనిమిదిమంది; వసువులు = వసువులు {అష్టవసువులు - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమముకూడ కలదు)}; ఉదయంబునొందిరి = పుట్టిరి; అందు = వారిలో; ద్రోణున్ = ద్రోణుని; కున్ = కి; అభిమతి = అభిమతి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; హర్ష = హర్షుడు; శోక = శోకుడు; భయ = భయుడు; ఆదులు = మొదలగువారు; పుట్టిరి = పుట్టిరి; ప్రాణున్ = ప్రాణుని; కున్ = కి; భార్య = భార్య; ఐన = అయిన; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అందు = అందు; సహుడును = సహుడు; ఆయువును = ఆయువు; పురోజవుండునున్ = పురోజవుడు; అను = అనెడి; వారలు = వారు; కలిగిరి = పుట్టిరి; ధ్రువున్ = ధ్రువుని; కున్ = కి; భార్య = భార్య; అగు = అయిన; ధరణి = ధరణి; అందు = అందు; వివిధంబులు = అనేక రకములు; అగు = అయిన; పురంబులు = పురములు; పుట్టెన్ = పుట్టెను; అర్కున్ = అర్కుని; కు = కి; భార్య = భార్య; అగు = అయిన; వాసన = వాసన; అందు = అందు; తర్ష = తర్షుడు; ఆదులు = మొదలగువారు; ఉదయించిరి = పుట్టిరి; అగ్ని = అగ్ని; కి = కి; భార్య = భార్య; ఐన = అయిన; వసోర్ధార = వసోర్ధార; అందు = అందు; ద్రవిణక = ద్రవిణకుడు; ఆదులు = మొదలగువారు; పుట్టిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; కృత్తికల = కృత్తికల; కు = కు; స్కందుండు = స్కందుడు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; స్కందున్ = స్కందున; కు = కు; విశాఖ = విశాఖుడు; ఆదులు = మొదలగువారు; ఉదయించిరి = పుట్టిరి; దోషున్ = దోషుని; కు = కి; శర్వరి = శర్వరి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; హరి = నారాయణుని; కళ = అంశ; అగు = అయిన; శింశుమారుండు = శింశుమారుడు; ఉదయించె = పుట్టెను; వస్తువున్ = వస్తువు; కున్ = కు; ఆంగిరస = ఆంగిరస; అందు = అందు; విశ్వకర్మ = విశ్వకర్మ; అను = అనెడి; శిల్పాచార్యుండు = శిల్పాచార్యుడు; ఉదయంబందెన్ = పుట్టెను; ఆ = ఆ; విశ్వకర్మ = విశ్వకర్మ; కున్ = కు; ఆకృతి = ఆకృతి; అను = అనెడి; సతి = భార్య; అందున్ = అందు; చాక్షుషుండు = చాక్షుషుడు; అను = అనెడి; మనువు = మనువు; జనియించెన్ = పుట్టెను; ఆ = ఆ; మనువు = మనువు; వలన = వలన; విశ్వులు = విశ్వులు; సాధ్యులు = సాధ్యులు; అను = అనెడి; వారు = వారు; పుట్టిరి = పుట్టిరి; విభావసున్ = విభావసువున; కున్ = కు; ఉష = ఉష; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; వ్యుష్టియు = వ్యుష్టి; రోచియున్ = రోచి; ఆతపుండును = ఆతపుడు; జనించిరి = పుట్టిరి; అందున్ = అందు; ఆతపుని = నాతపుని; కి = కి; పంచయాముండు = పంచయాముడు; అను = అనెడి; దివస = పగలుని; అభిమాన = అభిమానించెడి; దేవత = దేవత; జనియించె = పుట్టెను; శంకర = ఆదిశంకరుని; అంశజుండు = అంశతో పుట్టిన వాడు; అయిన = అయిన; భూతున్ = భూతుని; కు = కి; సురూప = సురూప; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; కోట్ల = కోట్లకొద్దీ; సంఖ్యలు = సంఖ్యలలో నుండు వారు; ఐన = అయిన; రుద్రగణంబులు = రుద్రగణములు; ఉదయించిరి = పుట్టిరి; మఱియు = ఇంకను; రైవతుండు = రైవతుడు; అజుండు = అజుడు; భవుండు = భవుడు; భీముండు = భీముడు; వాముండు = వాముడు; ఉగ్రుండు = ఉగ్రుడు; వృషాకపియున్ = వృషాకపి; అజైకపాత్తున్ = అజైకపాత్తు; అహిర్భుధ్న్యుండు = అహిర్భుధ్న్యుండు; బహురూపుండు = బహురూపుడు; మహాంతుండున్ = మహాంతుడు; అను = అనెడి; వారలు = వారు; రుద్రపారిషదులును = రుద్రునికి అనుచరులు, ప్రమథగమములు; అతి = మిక్కిలి; భయంకరులు = భీకరులు; అయిన = అయిన; ప్రేతులను = ప్రేతములు; వినాయకులును = వినాయకులు; పుట్టిరి = పుట్టిరి; అంగిరసుండు = అంగిరసుడు; అను = అనెడి; ప్రజాపతి = ప్రజాపతి; కి = కి; స్వధ = స్వధ; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పితృగణంబులు = పితృగణములు; పుట్టిరి = పుట్టిరి; సతి = సతి; అను = అనెడి; భార్య = భార్య; కు = కు; అద్వర = అధర్వణ; వేద = వేదము నందు; అభిమాన = ఆపేక్ష కలిగిన; దేవతలు = దేవతలు; పుట్టిరి = పుట్టిరి; కృశాశ్వున్ = కృశాశ్వున; కున్ = కి; అర్చి = అర్చి; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; ధూమ్రకేశుండు = ధూమ్రకేశుడు; అను = అనెడి; పుత్రుండు = కుమారుడు; ఉదయించె = పుట్టెను; వేదశిరున్ = వేదశిరున; కు = కి; ధిషణ = ధిషణ; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; దేవలుడును = దేవలుడు; వయనుండును = వయనుడు; మనువునున్ = మనువు; పుట్టిరి = పుట్టిరి; తార్క్షున్ = తార్క్షుని, (కశ్యపుని నామాంతరం తార్క్షుడు); కు = కి; వినత = వినత; కద్రువ = కద్రువ; పతంగి = పతంగి; యామిని = యామిని; అన = అని; నలువురు = నలుగురు; భార్యలు = భార్యలు; అందు = వారిలో; పతంగి = పతంగి; కిన్ = కి; పక్షులు = పక్షులు; పుట్టె = పుట్టెను; యామిని = యామిని; కి = కి; శలభంబులు = శలభములు; పుట్టె = పుట్టెను; వినత = వినత; కు = కు; సాక్షాత్కరించిన = ప్రత్యక్ష; యజ్ఞాధిపతి = నారాయణుని {యజ్ఞాధిపతి - యజ్ఞములకు అధిపతి, విష్ణువు}; కి = కి; వాహనంబు = వాహనము; అయిన = అయినట్టి; గరుడుండును = గరుడుడు; సూర్యున్ = సూర్యుని; కు = కి; సారథి = సారథి; ఐన = అయినట్టి; అనూరుండును = అనూరుడు; జనియించిరి = పుట్టిరి; కద్రువ = కద్రువ; కున్ = కు; పెక్కు = అనేకమైన; తెఱగులు = విధములైనవి; అగు = అయినట్టి; భుజంగమంబులు = పాములు; పుట్టె = పుట్టెను; చంద్రున్ = చంద్రున; కున్ = కు; కృత్తిక = కృత్తిక; ఆది = మొదలైన; నక్షత్రంబులు = నక్షత్రములు; భార్యలు = భార్యలు; అయినను = అయినప్పటికిని; వారల = వారి; అందు = లో; చంద్రుండు = చంద్రుడు; రోహిణి = రోహిణి; అందు = ఎడల; మాత్రము = మాత్రము; మోహితుండు = ప్రేమగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దక్ష = దక్షుని; శాపంబునన్ = శాపమువలన; క్షయరోగ = క్షయరోగమున; గ్రస్తుడు = లోనైనవాడు; ఐ = అయ్యి; సంతానంబు = సంతానమును; పడయనేరడు = పొందలేని వాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట; దక్ష = దక్షుని; ప్రసాదంబున = అనుగ్రహమున; క్షయపీడితంబులు = క్షయచే బాధింపబడునవి; అగు = అయిన; షోడశ = పదహారు; కళలన్ = కళలను; మరలన్ = మళ్ళీ; పొందె = పొందెను; మఱియును = ఇంకను.

భావము:

వారెవరంటే భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అనే పదిమంది దక్షుని కుమార్తెలు ధర్మునకు భార్యలై కొడుకులను కన్నారు. వారెవరంటే భానువుకు వేదఋషభుడు పుట్టాడు. అతనికి ఇంద్రసేనుడు జన్మించాడు. అంబకు విద్యోతుడు పుట్టాడు. అతనికి స్తనుడు, ఇత్నువు అనే కుమారులు కలిగారు. కకుబ్దేవికి సంకుటుడు పుట్టాడు. అతనికి కీకటుడు జన్మించాడు. కీకటునకు దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. జామిదేవికి దుర్గభూములకు అధిష్ఠాన దేవతలు జన్మించారు. వారికి స్వర్గుడు, నంది పుట్టారు. విశ్వకు విశ్వేదేవతలు జన్మించారు. వారు సంతానం లేనివారయ్యారు. సాధ్యకు సాధ్యగణాలు పుట్టారు. వానికి అర్థసిద్ధి అనేవాడు జన్మించాడు. మరుత్వతికి మరుత్వతుడు, జయంతుడు అనేవారు కలిగారు. వారిలో జయంతుడు శ్రీమన్నారాయణుని అంశతో పుట్టి ఉపేంద్రుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందాడు. ముహూర్తకు సకల ప్రాణులకు ఆయా కాలాలలో కలిగే ఆయా ఫలితాలాను ఇచ్చే మౌహూర్తికులు అనే దేవసమూహం పుట్టింది. సంకల్పకు సంకల్పుడు జన్మించాడు. ఆ సంకల్పునకు కాముడు పుట్టాడు. వసువుకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనిమిదిమంది వసువులు పుట్టారు. వారిలో ద్రోణునకు అభిమతి అనే భార్య వల్ల హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు పుట్టారు. ప్రాణునకు ఊర్జస్వతి అనే భార్య వల్ల సహుడు, ఆయువు, పురోజవుడు అనే కుమారులు కలిగారు. ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు కలిగాయి. అర్కునికి వాసన అనే భార్య వలన తర్షుడు మొదలైనవారు జన్మించారు. అగ్నికి వసోర్ధార అనే భార్యవల్ల ద్రవిణకుడు మొదలైనవారు పుట్టారు. కృత్తికలకు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. దోషునకు శర్వరి అనే భార్య వల్ల విష్ణువు యొక్క అంశ అయిన శింశుమారుడు పుట్టాడు. వస్తువుకు ఆంగిరస అనే భార్య వల్ల విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు పుట్టాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అనే భార్య వల్ల చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువు వల్ల విశ్వుడు, సాధ్యులు అనేవాళ్ళు పుట్టారు. విభావసునకు ఉష అనే భార్య వల్ల వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు జన్మించారు. వారిలో ఆతపునికి పంచయాముడు అనే దినాధిదేవత పుట్టాడు. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల కోట్లకొలది రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. అంగిరసుడు అనే ప్రజాపతికి స్వధ అనే భార్య వల్ల పితృగణాలు పుట్టారు. సతి అనే భార్యకు అధర్వవేదాన్ని అభిమానించే దేవతలు పుట్టారు. కృతాశ్వునకు అర్చిస్సు అనే భార్య వల్ల ధూమ్రకేశుడు అనే కుమారుడు కలిగాడు. వేదశిరస్సుకు ధిషణ అనే భార్య వల్ల దేవలుడు, వయునుడు, మనువు జన్మించారు. కశ్యపునితి తార్క్షుడు అను నామాంతరం కలదు. అతనికి వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. అందులో పతంగికి పక్షులు పుట్టాయి. యామినికి శలభాలు పుట్టాయి. వినత తనకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనమైన గరుత్మంతుని, సూర్యునికి సారథి అయిన అనూరుని కన్నది. కద్రువకు రకరకాల పాములు జన్మించాయి. చంద్రునికి కృత్తిక మొదలైన నక్షత్రాలు భార్యలు. చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. ఇంకా...

6-255-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామితప్రదుఁ డైన శ్యపు కౌగిఁట-
ముచ్చట దీర్తు రే ముద్దరాండ్రు;
ఖిల లోకములకు వ్వలై జగ మెల్లఁ-
బూజింప నుందు రే పువ్వుఁబోండ్లు;
లియు రై పుత్రులు పౌత్రులు త్రిజగంబు-
లేలంగఁ జూతు రే యిందుముఖులు;
ముంగొంగు పసిడి యై మూల్గు పుణ్యంబుల-
విఱ్ఱవీఁగుదు రెట్టి వింతరాండ్రు;

6-255.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారి కలగంప కడుపుల నేరుపఱప
రిది బిడ్డలఁ బడసిన బిరుదు సతుల
నాములు నన్వయంబులు నీ నంబు
పూనఁ జెప్పుదు వినవయ్య! మావేంద్ర!

టీకా:

కామిత = కోరినవి; ప్రదుడు = ఇచ్చెడివాడు; ఐన = అయిన; కశ్యపు = కశ్యపుని; కౌగిట = కౌగిట యందు; ముచ్చట = ముచ్చటలు; తీర్తురు = తీర్చెదరు; ఏ = ఏ; ముద్దరాండ్రు = ముగ్ధలు; అఖిల = సమస్తమైన; లోకముల = లోకముల; కున్ = కు; అవ్వలు = తల్లులు; ఐ = అయి; జగము = జగత్తు; ఎల్లన్ = అంతయును; పూజింపన్ = సేవించుతుండగా; ఉందురు = ఉండెదరు; ఏ = ఏ; పువ్వుబోండ్లు = స్త్రీలు {పువ్వుబోణి - పువ్వుల వంటి సున్నితమైనామె, స్త్రీ}; బలియురు = బలవంతులు; ఐ = అయ్యి; పుత్రులు = కుమారులు; పౌత్రులు = మనుమలు; త్రిజగంబులు = ముల్లోకములు; ఏలంగ = పరిపాలించుతుండగ; చూతురు = చూస్తుంటారు; ఏ = ఏ; ఇందుముఖులు = స్త్రీలు {ఇందుముఖి - ఇంద (చంద్రుని) వంటి ముఖి (ముఖముగలామె), స్త్రీ}; మున్ = ముందరివైపు; కొంగు = కొంగునగల; పసిడి = బంగారము; ఐ = అయ్యి; మూల్గు = పోగుపడెడి; పుణ్యంబుల = పుణ్యములతో; విఱ్ఱవీగుదురు = గర్వించెదరు; ఎట్టి = ఎటువంటి; వింతరాండ్రు = వింతస్త్రీలు;
వారి = వారి యొక్క; కలగంప = కలగూరగంప (అనేకరకములైన); కడుపులన్ = గర్భముల; ఏరుపఱుపన్ = తరచిచూసిన; అరిది = దుర్లభమైన; బిడ్డలన్ = సంతానమును; పడసిన = పొందిన; బిరుదు = ప్రసిద్ధమైన; సతుల = స్త్రీల; నామములున్ = పేర్లు; అన్వయంబులు = వంశములు; నీ = నీ యొక్క; మనంబు = మనసున; పూనన్ = పట్టునట్లు; చెప్పుదు = చెప్పెదను; విను = వినుము; అయ్య = తండ్రి; మానవేంద్ర = రాజా.

భావము:

రాజా! ఏ ముద్దరాండ్రు కోరిన కోరికలను తీర్చే కశ్యపుని కౌగిలిలో ముచ్చటలు తీరుస్తారో, ఏ పూబోడులు సర్వలోకాలకు తల్లులై లోకులందరి పూజలు అందుకుంటారో, ఏ చంద్రముఖులు తమ కొడుకులు, మనుమలు ముల్లోకాలను పాలించడాన్ని చూస్తారో, ఏ వింత కాంతలు ముంగొంగు బంగారమైన పుణ్యాలతో పొంగి పోతుంటారో ఆ దక్షప్రజాపతి పుత్రికలైన సతీమతల్లుల అంతులేని సంతాన సౌభాగ్యాలను లెక్కింపలేము. ఆ పుణ్యస్త్రీల పేర్లను, వంశాలను నీ మనస్సు కెక్కేవిధంగా చెప్తాను. విను.

6-256-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితియున్ దితి గాష్ఠయున్ దను య్యరిష్టయుఁ దామ్రయు
న్ననఁ గ్రోధవశాఖ్యయున్ సురసాఖ్యయున్ సురభిన్ మునిన్
మొలుగాఁ దిమియున్నిళాఖ్య సుముఖ్య యా సరమాదిగా
ముదిత లెన్నఁగఁ గన్న సంతతి ముజ్జగంబుల భూవరా!


“(తరలము.) అదితియున్..... ” పద్యం మాఱుగా
“6-256/1-వ.
అదితియు దితియుఁ గాష్ఠయు నరిష్ఠయు సారసయు నిళయు మునియుఁ గ్రోధవశయుఁ దామ్రయు సురభియు సరమయుననఁ బదమువ్వురు గల రందు.”
అను వచనము వ్రాఁతప్రతులఁ గానిపించెడి.
(దనువు తిమి పేర్లు లేవు)
- తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

అదితియున్ = అదితి; దితి = దితి; కాష్ఠయున్ = కాష్ఠ; తనువు = తనువు; అరిష్ట = అరిష్ట; తామ్రయున్ = తామ్ర; అదనన్ = మరియు; క్రోధవశాఖ్యయున్ = క్రోధవశ అను పేరు గలామె; సురసాఖ్యయున్ = సురస అను పేరు గలామె; సురభిన్ = సురభి; మునిన్ = ముని; మొదలుగాన్ = ముందుగా; తిమియున్ = తిమి; ఇళాఖ్య = ఇళ అను పేరు గలామె; సుముఖ్య = బహుముఖ్యురాలు; ఆ = ఆ; సరమ = సరమ; ఆదిగా = మొదలైన; ముదితలు = స్త్రీలు; ఎన్నగన్ = ప్రసిద్ధముగ; కన్న = పొందిన; సంతతి = సంతానము; ముజ్జగంబులన్ = ముల్లోకములను; భూవర = రాజా.

భావము:

రాజా! అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమ అనే పదముగ్గురు కశ్యపుని భార్యల సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి.

6-257-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చాలంగఁ దిమికిని లచరంబులు పుట్టె-
శ్వాపదంబులు పుట్టె రమ యందు;
సురభికి మహిషాది సురభులు జనియించెఁ-
దామ్రకు శ్యేన గృధ్రములు గలిగె;
మునికి నప్సరసల మూఁకలు జనియించె-
ని గనె భూరుహమును; గ్రోధ
శ కుద్భవిల్లె దుర్వార సర్పంబులు; -
రి యాతుధానులు సుస కరయ

6-257.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుప్పతిల్లిరి; గంధర్వు లొక్క మొగి న
రిష్టకు సుతు; ల్దనువునకుఁ ద్రిదశ రిపులు
దియునెనమండ్రు నై నట్టి విదితబలులు
వారి నామాన్వయంబులఁ గోరి వినుము.

టీకా:

చాలంగన్ = మిక్కిలిగా; తిమి = తిమి; కి = కి; జలచరంబులు = నీట తిరుగు జంతువులు {జలచరంబులు - నీట తిరుగు జంతువులు}; పుట్టె = పుట్టెను; మఱి = మరి; శ్యాపదులు = పులులు మొదలగు ఘాతక జంతువులు; సరమ = సరమ; కునున్ = కు; ప్రజలు = సంతానము; సురభి = సురభి; కి = కి; మహిష = ఎద్దు; ఆది = మొదలైన; సురభులు = చీలిన గిట్టలు గల జంతువులు {సురభులు - చీలిన గిట్టలు గల జంతువులు}; జనియించె = పుట్టెను; తామ్ర = తామ్ర; కు = కు; శ్యేన = డేగ; గృధ్రములు = గద్దలు; కలిగె = పుట్టెను; ముని = ముని; కిన్ = కి; అప్సరసల = అప్సరసల; మూకలు = సమూహములు; జనియించె = పుట్టెను; ఇళ = ఇళ; కనె = పడసెను; భూరుహములను = చెట్లను; క్రోధవశ = క్రోధవశ; కు = కు; ఉద్భవిల్లె = జనించెను; దుర్వార = వారింపరాని; సర్పంబులు = పాములు; సరి = చక్కగా; యాతుధానులు = ఒక జాతి పిశాచములు; సురస = సురస; కున్ = కు; అరయ = చూడగా; ఉప్పతిల్లిరి = పుట్టిరి;
గంధర్వులు = గంధర్వులు; ఒక్క = ఒక్క; మొగిన్ = వరుసగా; అరిష్ట = అరిష్ట; కు = కు; సుతుల్ = పుత్రులు; తనువున్ = తనువున; కు = కు; త్రిదశరిపులు = రాక్షసులు (దేవతల శత్రువులు) {త్రిదశరిపులు - రాక్షసులు (దేవతల శత్రువులు)}; పదియునేనమండ్రు = పద్దెనిమిదిమంది (18); ఐనట్టి = అయినట్టి; విదిత = ప్రసిద్ధమైన; బలులు = బలము గలవారు; వారి = వారి యొక్క; నామ = పేర్లు; అన్వయంబులు = వంశములు; కోరి = పూని; వినుము = వినుము.

భావము:

తిమికి తిమింగలాలు మొదలైన జలచరాలు జన్మించాయి. సరమకు పులులు మొదలైన క్రూరజంతువులు జన్మించాయి. సురభికి ఎద్దులు మొదలైన పశుసంతతి కలిగింది. తామ్రకు డేగలు, గ్రద్దలు మొదలైన పక్షి సమూహం జన్మించింది. మునికి అప్సరసలు పుట్టారు. ఇళ వృక్షాలను కన్నది. క్రోధవశకు భయంకరమైన సర్పాలు జన్మించాయి. సురసకు యాతుధానులు అనబడే పిశాచులు జన్మించారు. అరిష్టకు గంధర్వులు పుట్టారు. దనువుకు దేవతల శత్రువులు, బలవంతులు అయిన పద్దెనిమిది మంది దానవులు జన్మించారు. వారి పేర్లు, వంశాలను చెప్తాను. విను.

6-258-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్విమూర్ధుండును, శంబరుండును, నరిష్టుండును, హయగ్రీవుండును, విభావసుండును, నయోముఖుండును, శంకుశిరుండును, స్వర్భానుండును, గపిలుండును, నరుణియుఁ, బులోముండును, వృషపర్వుండును, నేకచక్రుండును, ననుతాపకుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, దుర్జయుండును, విప్రచిత్తియు ననువారలు వీరలలోన స్వర్భానునకు సుభద్ర యను కన్యక పుట్టె; దాని నముచి వివాహం బయ్యె; వృషపర్వునకు శర్మిష్ఠ యను కూఁతురు పుట్టె; దాని నహుష పుత్రుండైన యయాతి పెండ్లియయ్యె; వైశ్వానరునకు నుపదానవి, హయశిరస, పులోమ, కాలక యను నలువురు పుత్రిక లుదయించి; రందు నుపదానవి హిరణ్యాక్షునకుం బత్ని యయ్యె; హయశిరసను గ్రతువు వివాహంబయ్యె; పులోమ కాలకలను నిరువురను గశ్యపప్రజాపతి చతుర్ముఖుని వాక్యంబునఁ గైకొనియె; నా యిరువురకును సమరకోవిదు లయిన దానవులు పౌలోమ కాలకేయు లనం బుట్టిరి; మఱియు నా యిరువురకును నఱువదివేల రాక్షసులు జన్మించిరి; వారు యజ్ఞకర్మంబులకు విఘాతకులై వర్తింప వారి నింద్రునకుం బ్రియంబుగా నీ పితామహుం డగు నర్జునుండు వధించె మఱియు విప్రచిత్తి సింహిక యనుదాని యందు రాహు ప్రముఖంబుగాఁ గల కేతు శతంబును బడసె; వారలు గ్రహత్వంబుఁ గైకొనిరి; మఱియుం బురాణపురుషుండైన శ్రీమన్నారాయణుండు దన యంశంబునఁ బరమభాగ్యవతి యయిన యదితి గర్భంబున నుదయించె; నా యదితి వంశంబును విదితంబుగా వినిపించెద సావధానుండవై వినుము; వివస్వంతుడును, నర్యముండును, బూషుండును, ద్వష్టయు, సవితయు, భగుండును, ధాతయు, విధాతయు, వరుణుండును, మిత్రుండును, శక్రుండును, నురుక్రముండును నను ద్వాదశాదిత్యులు జన్మించి రందు వివస్వంతునకు శ్రాద్ధదేవుం డను మనువు సంజ్ఞాదేవి యందు నుదయించె; మఱియు యముండు యమియు నను నిరువురు మిథునంబుగా నుదయంబు నొందిరి. వెండియు నా సంజ్ఞాదేవి బడబా స్వరూపంబు నొంది యశ్వనీదేవతలం గనియె; ఛాయాదేవి యందు శనైశ్చరుండును, సావర్ణి యను మనువును దపతి యను కన్యకయుం బుట్టిరి; యా తపతిని సంవరణుండు వరియించె; నర్యమునకు మాతృక యను పత్నియందుఁ జర్షణు లుదయించిరి; వారి మూలంబున మనుష్యజాతి యీలోకంబున స్థిరంబుగా నుండు నట్లు బ్రహ్మదేవునిచేఁ గల్పింపంబడె; పూషుండు భర్గునిఁ జూచి దంతంబులు వివృతంబులుగా నగిన, నతండు క్రోధించి దంతంబు లూడనడచిన నాఁటనుండియు, భగ్నదంతు డయి యనపత్యుండయి పిష్టాదులు భక్షించుచుండె; ద్వష్టకు దైత్యానుజ యైన రచన యను కన్యకకు నధిక బలాఢ్యుం డగు విశ్వరూపుండు పుట్టె; నంత నా దేవతలు, బృహస్పతి గోపించి తలంగి పోయినం, దమకు నా విశ్వరూపుని నాచార్యునింగా వరియించి" రని చెప్పిన విని శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

ద్విమూర్ధుండును = ద్విమూర్ధుడు; శంబరుండును = శంబరుడు; అరిష్టుండును = అరిష్టుడు; హయగ్రీవుండును = హయగ్రీవుడు; విభావసుండును = విభావసుడు; అయోముఖుండును = అయోముఖుడు; శంకుశిరుండును = శంకుశిరుడు; స్వర్భానుండును = స్వర్భానుడు; కపిలుండునున్ = కపిలుండు; అరుణియున్ = అరుణి; పులోముండును = పులోముండు; వృషపర్వుండునున్ = వృషపర్వుండు; ఏకచక్రుండునున్ = ఏకచక్రుండు; అనుతాపకుండును = అనుతాపకుండు; ధూమ్రకేశుండును = ధూమ్రకేశుండు; విరూపాక్షుండును = విరూపాక్షుండు; దుర్జయుండును = దుర్జయుండు; విప్రచిత్తియున్ = విప్రచిత్తి; అను = అనెడి; వారలు = వారు; వీరల = వీరి; లోన = లో; స్వర్భానున్ = స్వర్భానున; కు = కు; సుభద్ర = సుభద్ర; అను = అనెడి; కన్యక = కుమార్తె; పుట్టె = పుట్టెను; దానిన్ = ఆమెను; నముచి = నముచి; వివాహంబయ్యె = వివాహమాడెను; వృషపర్వున్ = వృషపర్వున; కు = కు; శర్మిష్ఠ = శర్మిష్ఠ; అను = అనెడి; కూతురు = పుత్రిక; పుట్టె = పుట్టెను; దానిన్ = ఆమెను; నహుష = నహుషుని; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; యయాతి = యయాతి; పెండ్లియయ్యె = వివాహమాడెను; వైశ్వానరున్ = వైశ్వానరున; కునున్ = కు; ఉపదానవి = ఉపదానవి; హయశిరస = హయశిరస; పులోమ = పులోమ; కాలక = కాలక; అను = అనెడి; నలువురు = నలుగురు (4); పుత్రికలు = కుమార్తెలు; ఉదయించిరి = పుట్టిరి; అందునున్ = వారిలో; ఉపదానవి = ఉపదానవి; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షున; కున్ =కు; పత్ని = భార్య; అయ్యె = అయ్యెను; హయశిరసను = హయశిరసను; క్రతువు = క్రతువు; వివాహంబయ్యె = వివాహమాడెను; పులోమ = పులోమ; కాలకలను = కాలకలను; ఇరువురను = ఇద్దరిని (2); కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; చతుర్ముఖుని = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - చతుర్ (నాలుగు) ముఖుడు (ముఖములు గలవాడు), బ్రహ్మ}; వాక్యంబునన్ = మాట ప్రకారము; కైకొనియెన్ = చేపట్టెను; ఆ = ఆ; ఇరువురు = ఇరువుర; కునున్ = కు; సమర = యుద్ధము చేయుటలో; కోవిదులు = మిక్కిలి నేర్పరులు; అయిన = అయిన; దానవులు = రాక్షసులు; పౌలోమ = పొలోములు; కాలకేయులు = కాలకేయులు; అనన్ = అనగా; పుట్టిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ఇరువురు = ఇద్దరి (2); కునున్ = కు; అఱువదివేల = అరవైవేల (60,000); రాక్షసులు = రాక్షసులు; జన్మించిరి = పుట్టిరి; వారు = వారు; యజ్ఞకర్మంబుల్ = యజ్ఞకర్మముల; కు = కు; విఘాతకులు = చెరుపుచేయువారు; ఐ = అయ్యి; వర్తింపన్ = నడచుచుండగా; వారిన్ = వారిని; ఇంద్రున్ = ఇంద్రున; కున్ = కి; ప్రియంబుగా = ప్రియ మగునట్లు; నీ = నీ యొక్క; పితామహుండు = తాత; అగు = అయిన; అర్జునుండు = అర్జునుడు; వధించె = సంహరించెను; మఱియు = ఇంకను; విప్రచిత్తి = విప్రచిత్తి; సింహిక = సింహిక; అను = అనెడి; దాని = ఆమె; అందు = అందు; రాహు = రాహువు; ప్రముఖంబుగాన్ = మొదలైనవారై; కల = ఉన్నట్టి; కేతు = కేతువు; శతంబును = నూరుమందిని (100); పడసె = పొందెను; వారలు = వారు; గ్రహత్వంబున్ = గ్రహములుగా యుండుటను; కైకొనిరి = చేపట్టిరి; మఱియున్ = ఇంకను; పురాణపురషుండు = ఆదిపూరుషుడు {పురాణపురుషుడు - పురాణ (అతిపూర్వకాలపు, ఆదినుండి ఉన్నవాడైన) పురుషుడు, విష్ణువు}; ఐన = అయిన; శ్రీమన్నారాయణుండు = విష్ణుమూర్తి {శ్రీమన్నారాయణుడు - శ్రీమత్ (శ్రీమంతమైన) నారాయణుడు, విష్ణువు}; తన = తన యొక్క; అంశంబునన్ = అంశతో; పరమ = బహుమిక్కిలి; భాగ్యవతి = భాగ్యవంతురాలు; అయిన = అయిన; అదితి = అదితి; గర్భంబునన్ = గర్భములో; ఉదయించెన్ = పుట్టెను; ఆ = ఆ; అదితి = ఆదితి యొక్క; వంశంబును = వంశమును; విదితంబుగా = తేటతెల్లముగా; వినిపించెద = చెప్పెదను; సావధానుండవు = సావధానుడవు; ఐ = అయ్యి; వినుము = వినుము; వివస్వంతుడునున్ = వివస్వతుడు; అర్యముండునున్ = అర్యముడు; పూషుండునున్ = పూషుడు; త్వష్టయు = త్వష్ట; సవితయు = సవిత; భగుండును = భగుడు; ధాతయు = ధాత; విధాతయు = విధాత; వరుణుండును = వరుణుడు; మిత్రుండును = మిత్రుడు; శక్రుండును = శక్రుడు, ఇంద్రుడు; ఉరుక్రముండునున్ = ఉరుక్రముడు; అను = అనెడి; ద్వాదశాదిత్యులు = పన్నెడుమంది అదితి పుత్రులు {ద్వాదశాదిత్యులు - 1వివస్వతుడు 2అర్యముడు 3పూషుడు 4త్వష్ట 5సవిత 6భగుడు 7ధాత 8విధాత 9వరుణుడు 10మిత్రుడు 11శుక్రుడు 12ఉరుక్రముడు అనెడు పన్నెడుమంది అదితి పుత్రులు}; జన్మించిరి = పుట్టిరి; అందు = అందు; వివస్వంతున్ = వివస్వంతున; కు = కు; శ్రాద్ధదేవుండు = శ్రాద్ధదేవుడు; అను = అనెడి; మనువు = మనువు; సంజ్ఞాదేవి = సంజ్ఞాదేవి; అందు = అందు; ఉదయించె = పుట్టెను; మఱియు = ఇంకను; యముండు = యముడు; యమి = యమి; అను = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); మిథునంబుగాను = మిథునముగా; ఉదయంబున్ = పుట్టుకను; ఒందిరి = పొందిరి; వెండియున్ = ఇంకను; ఆ = ఆ; సంజ్ఞాదేవి = సంజ్ఞాదేవి; బడబ = ఆడుగుఱ్ఱము యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; ఒంది = పొంది; అశ్వనీదేవతలన్ = అశ్వనీదేవతలను; కనియె = పొందెను; ఛాయాదేవి = ఛాయాదేవి; అందు = అందు; శనైశ్చరుండును = శనీశ్వరుడు; సావర్ణి = సావర్ణి; అను = అనెడి; మనువును = మనువు; తపతి = తపతి; అను = అనెడి; కన్యకయున్ = పుత్రిక; పుట్టిరి = పుట్టిరి; ఆ = ఆ; తపతిన్ = తపతిని; సంవరణుండు = సంవరణుడు; వరియించె = వివాహమాడెను; అర్యమున్ = అర్యమున; కు = కు; మాతృక = మాతృక; అను = అనెడి; పత్ని = పత్ని; అందు = అందు; చర్షణులు = చర్షణులు; ఉదయించిరి = పుట్టిరి; వారి = వారి; మూలంబునన్ = వలన; మనుష్య = మానవ; జాతి = జాతి; ఈ = ఈ; లోకంబునన్ = లోకములో; స్థిరంబుగాన్ = స్థిరముగా; ఉండునట్లు = ఉండేట్లు; బ్రహ్మదేవుని = బ్రహ్మదేవుని; చేన్ = చేత; కల్పింపంబడె = సృష్టింపబడెను; పూషుండు = పూషుడు; భర్గునిన్ = పరమశివుని; చూచి = చూసి; దంతంబులు = దంతములు; వివృతంబులుగా = తెరువబడునట్లుగా; నగినన్ = నవ్వగా; అతండు = అతడు; క్రోధించి = కోపించి; దంతంబులు = దంతములు; ఊడనడచిన = ఊడగొట్టిన; నాట = దినము; నుండియు = నుండి; భగ్నదంతుడు = దంతములు ఊడిన వాడు; అయి = అయ్యి; అనపత్యుండు = సంతతి లేని వాడు; అయి = అయ్యి; పిష్ట = పిష్టము, పిండి; ఆదులు = మొదలైనవానిని; భక్షించుచుండెన్ = తినుచుండెను; త్వష్ట = త్వష్ట; కు = కు; దైత్యానుజ = దైత్యుల సోదరి; ఐన = అయిన; రచన = రచన; అను = అనెడి; కన్యక = పుత్రిక; కున్ = కు; అధిక = మిక్కిలి; బల = బలము గలవారిలో; ఆఢ్యుండు = శ్రేష్ఠుడు; అగు = అయిన; విశ్వరూపుండు = విశ్వరూపుడు; పుట్టెన్ = పుట్టెను; అంతన్ = అంతట; ఆ = ఆ; దేవతలున్ = దేవతలను; బృహస్పతి = బృహస్పతి; కోపించి = కోపగించి; తలంగిపోయినన్ = వెళ్లిపోగా; తమ = తమ; కున్ = కు; ఆ = ఆ; విశ్వరూపునిన్ = విశ్వరూపుని; ఆచార్యునింగా = గురువుగా; వరియించిరి = ఎన్నుకొనిరి; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = విని; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రున; కున్ = కు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రుండు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని దనువుకు పద్దెనిమిది మంది కుమారులు. వీరిలో స్వర్భానునికి సుప్రభ అనే కుమార్తె జన్మించింది. ఆమెను నముచి వివాహం చేసుకున్నాడు. వృషపర్వునికి శర్మిష్ఠ అనే కూతురు పుట్టింది. ఆమెను నహుషుని కుమారుడైన యయాతి పెండ్లి చేసుకున్నాడు. వైశ్వానరునికి ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అనే నలుగురు కుమార్తెలు కలిగారు. వారిలో ఉపదానవి హిరణ్యాక్షునికి భార్య అయింది. హయశిరను క్రతువు వివాహం చేసుకున్నాడు. పులోమ, కాలక అనే ఇద్దరిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం కశ్యప ప్రజాపతి భార్యలుగా స్వీకరించాడు. పులోమకు పౌలోముడు, కాలకకు కాలకేయుడు పుట్టారు. వారు యుద్ధనిపుణులైన దానవులు. ఆ ఇద్దరికి అరవై వేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞకార్యాలకు ఆటంకం కలిగిస్తుండగా నీ తాత అయిన అర్జునుడు వారిని సంహరించి ఇంద్రునికి సంతోషాన్ని కలిగించాడు. విప్రచిత్తి సింహిక అనే భార్య వల్ల రాహువు, కేతువు మొదలైన నూరుగురు కుమారులను కన్నాడు. వారు గ్రహాలుగా మారారు. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడు తన అంశతో అదితికి కుమారుడై పుట్టాడు. ఆ అదితి వంశాన్ని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను. అదితికి వివస్వతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే కుమారులు కలిగారు. వారు ద్వాదశాదిత్యులుగా పిలువబడ్డారు. వారిలో వివస్వంతునికి సంజ్ఞాదేవి అనే భార్య వల్ల శ్రాద్ధదేవుడు జన్మించాడు. ఇంకా వారికి యముడు, యమి అనే కవలలు జన్మించారు. ఆ సంజ్ఞాదేవి ఆడుగుఱ్ఱం రూపాన్ని ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవి అనే భార్య వల్ల శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే కన్య జన్మించారు. ఆ తపతిని సంవరణుడు వరించాడు. ఆర్యమునికి మాతృక అనే భార్య వల్ల చర్షణులు జన్మించారు. వారివల్ల మానవ జాతి ఈలోకంలో స్థిరంగా ఉండేవిధంగా బ్రహ్మ ఏర్పాటు చేసాడు. దక్షయజ్ఞంలో పూషుడు శివుణ్ణి చూసి వికృతంగా పళ్ళు బయటపెట్టి వెక్కిరించాడు. శివుడు కోపించి వాని దంతాలను ఊడదన్నాడు. అప్పటినుండి పళ్ళు లేనివాడై, సంతానం లేనివాడై పిండిముద్దలే తినసాగాడు. త్వష్ట భార్య రాక్షసుల సోదరి అయిన రచన. వారిద్దరికి మిక్కిలి బలవంతుడైన విశ్వరూపుడు పుట్టాడు. ఒకసారి దేవతలకు బృహస్పతిపై కోపం రాగా అతడు దేవగురువుగా ఉండక తప్పుకున్నాడు. అప్పుడు దేవతలు ఆ విశ్వరూపుని తమ గురువుగా స్వీకరించారు” అని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అన్నాడు.