పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-304-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కమలయుగళ కీలిత
శిరులై డగ్గఱక భక్తిఁ జేసిరి బహు సం
ణాబ్ధి తరికి నఖరికి
భోజనహస్తిహరికి రకేసరికిన్.

టీకా:

కర = చేతులు యనెడి; కమల = పద్మముల; యుగళ = జంటలచే; కీలిత = తగల్చబడిన; శిరులు = తలలు కలవారు; ఐ = అయ్యి; డగ్గఱక = దగ్గరకుచేరక; భక్తిన్ = ప్రపత్తిని; చేసిరి = చూపిరి; బహు = విస్తారమైన; సంసరణ = సంసారము యనెడి; అబ్ధి = సముద్రమును; తరి = దాటించువాని; కిన్ = కి; నఖరి = గోళ్లుగలవాని; కిన్ = కి; నరభోజన = రాక్షసులు యనెడి {నరభోజనులు - నర (మానవులను) భోజనులు (తినెడివారు), రాక్షసులు}; హస్తి = ఏనుగుకి; హరి = సింహము యైనవాని; కిన్ = కి; నరకేసరి = నరసింహుని; కిన్ = కి.

భావము:

అసంఖ్యాత కష్టాల సాగరమైన సంసారాన్ని తరింపజేసేవాడూ; నరులను భక్షించే రాక్షసజాతిలో మదించిన ఏనుగు అంత బలిష్ఠుడైన ఆ హిరణ్యకశిపుడిని సింహ పరాక్రమంతో హరింప జేసిన వాడూ అయిన నరసింహావతారుడిని; తమ కమలాలవంటి చేతులు రెంటిని జోడించి శిరస్సున జేర్చి దూరం నుండే భక్తితో నమస్కరించారు.

7-305-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబున దేవత లందఱు వేఱువేఱ వినుతించిరి; అందుఁ గమలాసనుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; దేవతలు = దేవతలు; అందఱున్ = అందరును; వేఱువేఱ = వేరవేరుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; కమలాసనుండు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము (పద్మము)ను ఆసనుడు (ఆసనముగా గలవాడు), బ్రహ్మ}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

ఆ సమయంలో అలా నమస్కరించిన దేవతలు అందరూ ఎవరికి వారు వివిధ రీతులలో స్తుతించారు. వారిలో పద్మం ఆసనంగా కలిగిన బ్రహ్మదేవుడు ఇలా సన్నుతించాడు.

7-306-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలాగుణచాతురిన్ భువనముల్ ల్పించి రక్షించి భే
ముం జేయు దురంతశక్తికి ననంజ్యోతికిం జిత్ర వీ
ర్యునికిన్ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికిన్ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై."

టీకా:

ఘన = గొప్ప; లీలా = వేడుకగా ధరించెడి; గుణ = గుణత్రయమును {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; చాతురిన్ = నేర్పుచేత; భువనముల్ = లోకములను; కల్పించి = సృష్టించి; రక్షించి = కాపాడి; భేదనమున్ = నాశనము; చేయు = చేసెడి; దురంత = ఆపలేని; శక్తి = శక్తిగలవాని; కిన్ = కి; అనంత = అపరిమిత; జ్యోతి = తేజముగలవాని; కిన్ = కి; చిత్ర = అబ్బురమైన; వీర్యున్ = పరాక్రమముగలవాని; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; పవిత్ర = పావనములైన; కర్మున్ = కర్మములుచేయువాని; కిన్ = కి; నేను = నేను; ఉత్కంఠ = వేడుక; తోన్ = తోటి; అవ్యయ = నాశములేని; ఆత్మ = ఆత్మస్వరూపుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించెదన్ = చేసెదను; కృపా = దయ; ముఖ్య = మొదలైన; ప్రసాద = అనుగ్రమును; అర్థిన్ = కోరువాడను; ఐ = అయ్యి.

భావము:

“గొప్ప లీలావిలాసాలలా ఈ అఖిల ప్రపంచాన్ని సృష్టించటం, పోషించటం, హరించటం అనే మహాకార్యాలను అవలీలగా నిర్వహించే ఓ ఆపరాని మహా శక్తి స్వరూపా! అపరిమిత తేజో మూర్తీ! అబ్బురమైన పరాక్రమశాలీ! నిత్య పవిత్రకర్మానుసారిణీ! నాశరహితుడైన పరమాత్మా! నేను అత్యంత ఆసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రణామాలు ఆచరిస్తున్నాను. దేవా! స్వీకరించు.”

7-307-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుద్రుం డిట్లనియె.

టీకా:

రుద్రుండు = పరమశివుడు {రుద్రుడు - (మిక్కిలి) రౌద్రము (కోపము) గలవాడు, శివుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

రుద్రుడు ఇలా పొగిడాడు.

7-308-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రవరేణ్య! మీఁదట సస్ర యుగాంతము నాఁడు గాని కో
మునకు వేళ గాదు సురబాధకుఁ డైన తమస్వినీచరున్
రమునన్ వధించితివి చాలుఁ ద దాత్మజుఁడైన వీఁడు స
ద్విలుఁడు నీకు భక్తుఁడు పవిత్రుఁడు గావుము భక్తవత్సలా!"

టీకా:

అమర = దేవతలలో; వరేణ్య = ఎన్నదగినవాడ; మీదట = రాబోవు కాలములో; సహస్ర = వేలకొలది; యుగాంతము = ప్రళయ; నాడు = సమయమున; కాని = తప్పించి; కోపమున్ = కోపమున; కున్ = కు; వేళ = ఇది సమయము; కాదు = కాదు; సుర = దేవతలను; బాధకుడు = బాధించువాడు; ఐన = అయిన; తమస్వినీచరున్ = రాక్షసుని {తమస్వినీచరుడు - తమస్ (చీకటి, రాత్రి) వేళ చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; సమరమునన్ = యుద్ధమునందు; వధించితివి = సంహరించితివి; చాలున్ = ఇంక చాలును; తత్ = అతని; ఆత్మజుడు = పుత్రుడు {ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), కొడుకు}; ఐన = అయిన; వీడు = ఇతడు; సత్ = చక్కటి; విమలుడు = నిర్మలుడు; నీ = నీ; కున్ = కు; భక్తుడు = భక్తుడు; పవిత్రుడు = పావనమైనవాడు; కావుము = కాపాడుము; భక్తవత్సలా = నరసింహుడా {భక్తవత్సలా - భక్తుల యెడ వాత్సల్యము గల వాడు. విష్ణువు}.

భావము:

“ఓ దేవతోత్తమా! భక్తుల యెడ మిక్కిలి వాత్సల్యము గల మహానుభావా! ఇంకా వెయ్యి యుగాలు గడచిన తరువాత కదా నీవు కోపం పూనాలి కానీ, (మహా ప్రళయం వేళ అప్పటికి కాని రాదు కదా) ఆగ్రహానికి ఇది సమయం కాదు. దేవతలను బాధించే దానవేశ్వరుడిని సంహరించావు. బాగుంది. ఇంక చాలు. అతని కుమారుడు ఈ పిల్లవాడు. కల్మషం లేనివాడు. నీకు భక్తుడు. పరమ పవిత్రుడు. ఇతనిని కరుణతో కాపాడు.”

7-309-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రుం డిట్లనియె.

టీకా:

ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంద్రుడు ఇలా సన్నుతించాడు

7-310-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల-
నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు;
దింతకాలము దానవేశ్వరుచే బాధ-
 > డి చిక్కి యున్న యాన్నజనుల
క్షించితివి మమ్ము; రాక్షసుఁ జంపితి-
క్రతుహవ్యములు మాకుఁ లిగె మరల;
మంటిమి; నీ సేవ రిగిన వారలు-
కైవల్య విభవంబు కాంక్ష చేయ

7-310.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రితరసుఖము లెల్ల నిచ్ఛగింపఁగ నేల?
స్థిరంబులివి, యనంతభక్తిఁ
గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక
చిత్తభయదరంహ! శ్రీనృసింహ!"

టీకా:

ప్రాణి = జీవ; సంఘముల = కోటి యొక్క; హృత్ = హృదయములనెడి; పద్మ = పద్మముల; మధ్యంబులన్ = నడిమియందు; నివసించి = ఉండి; భాసిల్లు = ప్రకాశించెడి; నీవ = నీవే; ఎఱుంగుదు = తెలిసి యుందువు; ఇంత = ఇంత; కాలము = కాలము; దానవ = రాక్షసుల; ఈశ్వరు = రాజు; చేన్ = వలన; బాధ = బాధలందు; పడి = పడి; చిక్కి = నీరసించి; ఉన్న = ఉన్నట్టి; ఆపన్న = అపాయములపడిన; జనులన్ = వారలను; రక్షించితివి = కాపాడితివి; మమ్మున్ = మమ్ము; రాక్షసున్ = రాక్షసుని; చంపితి = చంపితివి; క్రతు = యజ్ఞములందలి; హవ్యములున్ = హవిర్భాగములు; మా = మా; కున్ = కు; కలిగె = లభించినవి; మరలన్ = మరల; మంటిమి = బతికితిమి; నీ = నీ యొక్క; సేవన్ = భక్తిని; మరిగిన = మరలుగొనిన, మోహపడిన; వారలు = వారు; కైవల్య = ముక్తిపదము యొక్క; విభవంబున్ = వైభవమును కూడ; కాంక్షచేయరు = కోరరు; ఇతర = మిగిలిన.
సుఖముల్ = సుఖములను; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చగింపన్ = కోరుట; ఏల = ఎందులకు; అస్థిరంబులు = చపలములు; ఇవి = ఇవి; అనంత = తెంపులేని; భక్తిన్ = భక్తితో; కొలువనిమ్ము = సేవించనిమ్ము; నిన్నున్ = నిన్ను; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షస; అనీక = సేనల; చిత్త = మనసులందు; భయద = భయముపుట్టించెడి; రంహ = సంరంభముగలవాడ; శ్రీ = శుభకరమైన; నృసింహ = నరసింహుడా.

భావము:

“అరివీర భయంకర స్పూర్తీ! నరసింహమూర్తీ! నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసు లందరి మనసులలోనూ భయము రేకెత్తించే వాడవు. సమస్త ప్రాణుల హృదయ పద్మాలలోనూ ప్రకాశించు వాడవు. నీకు తెలియనిది ఏమున్నది. ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభువు అయిన హిరణ్యకశిపుని వలన కష్టాలు అనుభవించి ఆర్తులం అయ్యాము. నీవు ఆ రాక్షసుని సంహరించి మమ్ములను రక్షించావు. మాకు మరల మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. నీ సేవా భాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోటం ఎందుకూ, దండగ. అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరం ప్రసాదించు నరకేసరీ!”

7-311-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషు లిట్లనిరి.

టీకా:

ఋషులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి.

భావము:

మునీశ్వరులు ఇలా స్తోత్రాలు చేశారు.

7-312-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ
వి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ
వినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే
విధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ర్మానుసంధాయివై."

టీకా:

భవదీయ = నీ యొక్క; ఆదర = ఆదరము యనెడి; లీలన్ = విలాసముచేత; లోకములన్ = లోకములను; ఉత్పాదించి = సృష్టించి; రక్షింపన్ = కాపాడగా; నేడు = ఇప్పుడు; అవి = అవి; దైత్య = రాక్షస; ఈశుని = రాజు; చేత = చేత; భేదితములు = చెరుపబడినవి; ఐ = అయ్యి; హ్రస్వంబులు = క్షీణించినవి, చిక్కిపోయినవి; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఈ = ఈ; అవినీతున్ = నీతిమాలినవాని; నరసింహ = నరసింహుని; రూపమునన్ = స్వరూపముతో; సంహారంబునొందించి = చంపి; వేద = వేదానుసార; విధిన్ = ధర్మమును; క్రమ్మఱన్ = మరల; ఉద్ధరించితి = నిలబెట్టితివి; కదా = కదా; ధర్మ = ధర్మమార్గమును; అనుసంధాయివి = కూర్చెడివాడవు; ఐ = అయ్యి.

భావము:

“ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి, రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా భిన్నం చేసాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”

7-313-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితృదేవత లిట్లనిరి.

టీకా:

పితృదేవతలు = పితృదేవతలు {పితృదేవతలు - వసురుద్రాది రూపులైన అగ్నిష్వాత్తుడు కవ్యవాహనుడు మొదలైనవారు (పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు వారి దశమ స్కంధము), 2. దేవతలవలె మాన్యులైన పితరులు. (ఆంధ్ర శబ్ధరత్నాకరము)}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

పితృదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు.

7-314-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చంక్రోధముతోడ దైత్యుఁడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్
పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు
ద్దంత్వంబునఁ దాన కైకొను మహోగ్రుండు; వీఁ డిక్కడన్
ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్ గావింతు మాత్మేశ్వరా!"

టీకా:

చండ = తీవ్రమైన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; దైత్యుడు = రాక్షసుడు; వడిన్ = వేగముగ; శ్రాద్ధంబులన్ = ఆబ్దికములాది పితృకర్మలలో; మత్ = మా యొక్క; సుతుల్ = సంతతివారు; పిండంబులన్ = పిండములను; సతిలోదకంబులుగన్ = నువ్వులు నీళ్ళతో కూడినవిగా; అర్పింపంగన్ = సమర్పించుతుండగా; మా = మా; కున్ = కు; ఈక = ఈయకుండ; ఉద్ధండత్వంబునన్ = దాష్టీకముతో; తాన = తనే; కైకొనున్ = స్వీకరించును; మహా = మిక్కిలి; ఉదగ్రుండు = క్రూరుడు; వీడు = ఇతడు; ఇక్కడన్ = ఇక్కడ; ఖండింపంబడె = చంపబడెను; నీ = నీ; నఖంబులన్ = గోళ్ళతోటి; నుతుల్ = స్తోత్రములను; కావింతుము = చేసెదము; ఆత్మేశ్వరా = నరసింహుడా {ఆత్మేశ్వరుడు - ఆత్మ (తమయొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు}.

భావము:

“ఓ పరమాత్మా! నరసింహరూపా! మా సుతులు మా సుగతుల కోసం శ్రాద్ధాలు పెడుతున్నారు; పిండాలు, నువ్వులు నీళ్ళూ వదులుతున్నారు. కాని అవి మాకు అందనీయకుండా ఈ అసురుడు హిరణ్యకశిపుడు అమిత కోపంతో వేగంగా వచ్చి, హరించి, పట్టుకు పోయేవాడు. ఆ స్వార్థపర దుండగీడుని ఇక్కడ సంహరించావు. మా కష్టాలు తీర్చావు. నీకు నమస్కారములు”

7-315-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధు లిట్లనిరి.

టీకా:

సిద్ధులు = సిద్ధులు {సిద్ధులు - 1. సిద్ది పొందినవారు, 2. దేవతలలో ఒక తెగవారు. 3. అణిమాది సిద్ధిగలవారు, 4. అతీంద్రియ శక్తులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

సిద్ధులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.

7-316-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్రుద్ధుండై యణిమాదిక
సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా
యోద్ధవు నీ కృప మాకును
సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!"

టీకా:

క్రుద్ధుండు = కోపముగలవాడు; ఐ = అయ్యి; అణిమాదిక = అణిమ మొదలైన; సిద్ధులున్ = అష్టసిద్ధులను {అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; కైకొనిన = తీసుకొన్న; దైత్యున్ = రాక్షసుని; చీరితివి = చంపితివి; మహా = గొప్ప; యోద్ధవున్ = యోధుడవు; నీ = నీ యొక్క; కృపన్ = దయవలన; మా = మా; కును = కు; సిద్ధులు = అష్టసిద్ధులు; మరలంగన్ = మళ్ళీ; కలిగెన్ = కలగినవి; శ్రీ = మహనీయమైన; నరసింహా = నరసింహుడా.

భావము:

“శ్రీ నరసింహావతారా! నీవు యోధానుయోధుడవు. ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ, మహిమ, గరిమ మున్నగు సిద్ధులు అన్నింటిని లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని చీల్చిచెండాడి సంహరించావు. మేలయ్యను. నీ దయ వలన మరల నా సిద్ధులు మాకు లభించాయి.”

7-317-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విద్యాధరు లిట్లనిరి.

టీకా:

విద్యాధరులు = విద్యాధరులు {విద్యాధరులు - దేవయోని విశేషము, గ్రహణ, ధారణాది శక్తుల కధిపతులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

విద్యాధరులు ఇలా వినుతులు వినుతించారు.

7-318-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దావునిఁ జంపి యంత
ర్ధానాదికవిద్య లెల్ల యతో మరలం
గా నిచ్చితివి విచిత్రము
నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!"

టీకా:

దానవునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; అంతర్థాన = మాయమగుట; ఆది = మొదలగు; విద్యలు = విద్యలు; ఎల్లన్ = అన్నిటిని; దయ = కరుణ; తోన్ = తోటి; మరలంగన్ = పునరుద్దరింపజేసి; ఇచ్చితివి = ఇచ్చతివి; విచిత్రము = అద్భుతము; నీ = నీ యొక్క; నిరుపమ = సాటిలేని; వైభవంబు = ప్రభావము; నిజము = సత్యము; నృసింహా = నరసింహుడా.

భావము:

“ఓ నరకేసరీ! నీ వైభవం అతులితమూ, అసాధారణమూ. నీ చారిత్రము బహు విచిత్రము. హిరణ్యకశిప రాక్షసుడిని చంపి, అంతర్ధానం మున్నగు మా శక్తులు అన్నీ దయతో మాకు వెనక్కు ఇచ్చావు.”

7-319-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భుజంగు లిట్లనిరి.

టీకా:

భుజంగులు = సర్పముల; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

నాగేంద్రులు ఇలా నతులు పలికారు.

7-320-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రత్నములను మత్కాంతా
త్నంబుల బుచ్చికొన్న క్కసు నురమున్
త్నమున వ్రచ్చి వైచితి;
త్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!

టీకా:

రత్నములను = రత్నములను; మత్ = మా యొక్క; కాంతా = స్త్రీ, భార్యా; రత్నంబులన్ = రత్నములను; పుచ్చికొన్న = తీసుకొన్న; రక్కసున్ = రాక్షసుని; ఉరమున్ = వక్షస్థలమును; యత్నమునన్ = పూని; వ్రచ్చివైచితివి = చీల్చివేసితివి; పత్నులున్ = భార్యలను; రత్నములున్ = మణులు; కలిగి = పొంది; బ్రతికితిమి = బతికిపోతిమి; ఈశా = నరసింహా.

భావము:

“ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.”

7-321-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మనువు లిట్లనిరి.

టీకా:

మనువులు = మనువులు {మనువు - వైవస్వాది చతుర్దశ (14) మనువు లందలివాడు, సృష్ట్యాదియందు భగవన్నియామకుఁడు అయి మన్వంతరము పాటు కాలము భూమిని పాలించు రాజు.}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

మనువులు ఇలా మనవి చేసుకున్నారు.

7-322-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దుర్ణయుని దైత్యుఁ బొరిగొని
ర్ణాశ్రమ ధర్మసేతు ర్గము మరలం
బూర్ణము చేసితి వే మని
ర్ణింతుము? కొలిచి బ్రతుకువారము దేవా!"

టీకా:

దుర్ణయుని = దుర్నీతిగలవానిని; దైత్యున్ = రాక్షసుని; పొరిగొని = చంపి; వర్ణ = వర్ణముల యొక్క ధర్మముల; ఆశ్రమధర్మ = ఆశ్రమధర్మముల; సేతు = కట్టుబాట్ల; వర్గమున్ = సమూహమును; మరలన్ = తిరిగి; పూర్ణము = పరిపూర్ణము; చేసితివి = చేసితివి; ఏమని = ఏమని; వర్ణింతుము = కీర్తింతుము; కొలిచి = సేవించి; బ్రతుకు = జీవించెడి; వారము = వారిమి; దేవా = నరసింహా.

భావము:

“ఓ దేవా! ఈ దుష్టుని వలన వర్ణాశ్రమ ధర్మాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి తిరిగి ధర్మం సంస్థాపన కావించావు. నిన్ను ఏమని కీర్తించ గలము? ఎలా స్తుతించ గలము? నీ సేవే మాకు జీవనాధారం ప్రభూ!”

7-323-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాపతు లిట్లనిరి.

టీకా:

ప్రజాపతులు = ప్రజాపతులు {ప్రజాపతి - జీవుల ఉత్పత్తికి అధిపతి, ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవప్రజాపతులు - నవబ్రహ్మలు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ప్రజాపతులు ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.

7-324-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రలం జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ
బ్రలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి; మీ
కునున్ వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు లే కెల్ల చోఁ
బ్రలం జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!"

టీకా:

ప్రజలన్ = లోకులను; చేయుట = పుట్టించుట; కై = కోసము; సృజించితి = పుట్టించితి; మమున్ = మమ్ములను; పాటించి = పూని; దైత్య = రాక్షసుని; ఆజ్ఞ = ఉత్తరువుల; చేత = వలన; ప్రజలన్ = లోకులను; చేయక = పుట్టించకుండగ; ఇంత = ఇన్ని; కాలమున్ = దినములు; మహా = గొప్ప; భారంబు = దుఃఖభారము; తోన్ = తోటి; ఉంటిమి = ఉన్నాము; ఈ = ఈ; కుజనున్ = దుర్జనుని; వక్షమున్ = రొమ్మును; చీరి = చీల్చివేసి; చంపితివి = సంహరించితివి; సంకోచంబుల్ = అనుమానములు; లేకన్ = లేకుండగ; ఎల్ల = అన్ని; చోన్ = చోటులందు; ప్రజలన్ = లోకులను; చేయుచున్ = చేయుచు; ఉండువారము = ఉంటాము; జగత్ = లోకములను; భద్రాయమాణ = క్షేమకరమగుటకు; ఉదయా = అవతరించినవాడ.

భావము:

“ఓ నరకేసరీ! జగత్తులకు మేలు చేయుటకు అవతరించిన ప్రభువా! జగద్రక్షకా! మమ్మల్ని ప్రజాసృష్టి చేయటం కోసమే సృష్టించావు. కానీ ఈ రాక్షసుడి ఆజ్ఞ మూలాన ఆ ప్రజాసృష్టినే మానేయవలసి వచ్చింది. ప్రజా వ్యవస్థకు దురవస్థ దాపురించింది. ఆ దుర్మతి హిరణ్యకశిపుని గుండెలు చీల్చి చంపావు. ఇంక ఏ సంకోచమూ లేకుండా ప్రజాసృష్టి చేస్తుంటాము.”

7-325-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గంధర్వు లిట్లనిరి.

టీకా:

గంధర్వులు = గంధర్వులు {గంధర్వులు - గానములు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము, గంధ (వాసనలు) మోయువారు (అహోరాత్రులు సంకేతము)}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.

7-326-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఆడుదుము రేయుఁబగలుం
బాడుదుము నిశాటు నొద్ద, బాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే."

టీకా:

ఆడుదుము = నాట్యముచేసెదము; రేయున్ = రాత్రులందు; పగలున్ = పగళ్ళయందు; పాడుదుము = పాడెదము; నిశాటున్ = రాక్షసుని {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఒద్దన్ = దగ్గర; బాధించున్ = బాధపెట్టును; దయన్ = కరుణతో; చూడడు = చూడడు; నీ = నీ; చేన్ = చేత; జమునిగూడెన్ = చనిపోయెను {జమునిగూడు - జముని (యముని) కూడు (కలియు), మరణించు}; మహా = అతి; పాతకున్ = తీవ్రమైనపాపములుగలవాని; కున్ = కు; కుశలము = క్షేమము; కలదే = ఉండునా ఏమి.

భావము:

“ప్రభూ! రాత్రిం బవళ్ళు ఈ రాక్షసుడి సమక్షంలో గానం చేసేవాళ్ళం; నాట్యం చేసే వాళ్ళం; అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు; ఏనాడూ దయగా చూడలేదు. వీడిలాంటి మహాపాపిష్టి వానికి మంగళం ఎలా కలుగుతుందా? చివరికి నీ వల్ల యమపురికి పోయాడు”

7-327-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చారణు లిట్లనిరి.

టీకా:

చారణులు = చారణులు {చారణులు - ఒకజాతి ఖేచరులు, దేవగాయక జాతి వారు, వ్యు. చారయతి కీర్తనమ్ -చర (ణిత్)+ల్యు, కీర్తిని నలుగడలకు వ్యాపింప జేయువారు.}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

చారణులు ఇలా అన్నారు.

7-328-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భునజన హృదయభల్లుఁడు
దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీ చేతన్
రోగ నివర్తక మగు
దంఘ్రి యుగంబుఁ జేరి బ్రదికెద మీశా!"

టీకా:

భువన = జగత్తునందలి; జన = జనుల యొక్క; హృదయ = హృదయములకు; భల్లుడు = బల్లెమువంటివాడు; దివిజేంద్ర = ఇంద్రుని {దివిజేంద్రుడు - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు}; విరోధి = శత్రువు; నేడు = ఈ దినమున; తెగెన్ = మరణించెను; నీ = నీ; చేతన్ = వలన; భవ = సంసారము యనెడి; రోగ = రోగమును; నివర్తకము = పోగొట్టునది; అగు = అయిన; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదముల; యుగంబున్ = జంటను; చేరి = చేరి; బ్రదికెదము = బతికెదము; ఈశా = నరసింహుడా.

భావము:

“ఓ నరకేసరీ! సర్వలోకేశ్వరా! హిరణ్యకశిపుడు ప్రజా హృదయ కంటకుడు. దేవేంద్రుని బద్దశత్రువూ. రాత్రించరులైన రాక్షస జాతికి చెందినవాడు నీ చేతిలో మరణించాడు, మా కష్టాలు గట్టెక్కాయి. ఇంక సంసార బంధాలనుండి విముక్తి నొసంగే నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము.”

7-329-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యక్షు లిట్లనిరి.

టీకా:

యక్షులు = యక్షులు {యక్షులు - సంచారులు, దేవయోని విశేషము, ఖేచరులు, కశ్యపునికి సురసయందు జనియించినవారు. వీరు కుబేరాదులు, యక్షుడు (ప్ర) - జక్కుడు (వి)}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

యక్షులు ఈ విధంగా అన్నారు.

7-330-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భ్రంము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంయవృత్తి దిక్కులఁ బ్రచారము చేయుచు నుండు వీఁడు ని
స్త్రింముతోడ; వీనిఁ గడతేర్చితి వాపద మానె నో! చతు
ర్వింతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్యజగన్నివాసకా!"

టీకా:

భ్రంశము = కలత; లేని = లేనట్టి; నీ = నీ యొక్క; భటులన్ = కింకరులము; భంగవిముక్తులము = పరాభవములేనివారము; మమ్మున్ = మమ్ములను; ఎక్కి = అధిరోహించి; నిస్సంశయ = సంశయమేమిలేని; వృత్తిన్ = విధముగ; దిక్కులన్ = అన్నివైపులకు; ప్రచారము = అధికముగ చరించుట; చేయుచునుండు = చేయుచుండు; వీడు = ఇతడు; నిస్త్రింశము = గోర్లు {నిస్త్రింశము - ముప్పది మానములకంటె పెద్దవి, నరహరి గోర్లు}; తోడన్ = తోటి; వీనిన్ = ఇతనిని; కడతేర్చితివి = చంపితివి {కడతేర్చు - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు}; ఆపద = కష్టము; మానెను = తప్పినది {త్రివిష్టపము - (ముల్లోకములు భూర్భువస్సువర్లోకములలోని) త్రి (మూడవ 3) విష్టపము (లోకము), స్వర్గము}; ఓ = ఓ {చతుర్వింశతితత్త్వములు -దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము}; చతుర్వింశతితత్త్వశాసక = నరసింహుడా {చతుర్వింశతితత్త్వశాసకుడు - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు}; త్రివిష్టపముఖ్యజగన్నివాసకా = నరసింహుడా {త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకా (వసించెడివాడు), విష్ణువు}.

భావము:

“ఓ నరసింహస్వామీ! నీవు ఇరవైనాలుగు తత్వాలను ప్రవర్తింపజేసే వాడవు. త్రివిష్టప వాసులైన దేవత లందరికి ఉన్నతుడవు. జగత్తంతా నిండి ఆత్మ రూపంలో వసించి ఉండే వాసుదేవుడవు. ఈ దానవేశ్వరుడు అయ్యో పాపం అనికూడా అనుకోకుండా, మా భుజాల మీద ఎక్కి నల్దిక్కులా తిరుగుతుండే వాడు. ఆ హిరణ్యకశిపుడుని వధించావు. మా కష్టాలు కడతేర్చావు.”

7-331-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కింపురుషు లిట్లనిరి.

టీకా:

కింపురుషులు = కిపురుషులు {కింపురుషులు - నరుని ముఖము అశ్వ దేహము కల దేవయోనివారు, దేవగాయకులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

కింపురుషులు కీర్తిస్తూ ఇలా అన్నారు

7-332-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురుషోత్తమ! నేరము కిం
పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు
ష్పురుషున్ సకల సుజన హృ
త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!"

టీకా:

పురుషోత్తమ = నరసింహుడా; నేరము = సమర్థులముకాము; కింపురుషులము = కింపురుషజాతి వారము; అల్పులము = చిన్నవారము; నిన్నున్ = నిన్ను; భూషింపగన్ = స్తుతించుటకు; దుష్పురుషున్ = చెడ్డవానిని; సకల = అఖిలమైన; సుజన = మంచివారి; హృత్ = హృదయములకు; పరుషున్ = కఠినుని; చంపితివి = సంహరించితివి; జగము = భువనము; బ్రతికెన్ = కాపాడబడినది; అధీశా = నరసింహుడా {అధీశ - సర్వజగత్తులకు అధి (పై) ఈశ (ప్రభువు), విష్ణువు}.

భావము:

“ఓ పురుషోత్తమా! పరమేశ! మేము కింపురుషులు అనే దేవతాభేదం వారం. నరముఖమూ అశ్వశరీరమూ కలవారం. అల్పులం. నీ మహాత్మ్యం కీర్తించడానికి మేము తగినవారం కాదు. శిష్టులైన వారి హృదయాలు గాయపడేలా బాధించేవాడు హిరణ్యకశిపుడు. ఆ దుష్టుడిని సంహరించావు. లోకమంతా బ్రతికిపోయింది.”

7-333-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైతాళికు లిట్లనిరి.

టీకా:

వైతాళికులు = మేలుకొలుపు పాడు వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

మేలుకొలుపులు పాడే వైతాళికులు ఇలా స్తుతించారు

7-334-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"త్రిభువనశత్రుఁడు పడియెను
లందును మఖము లందు గదీశ్వర! నీ
శుగీతములు పఠించుచు
యులమై సంచరింతు మార్తశరణ్యా!"

టీకా:

త్రిభువన = ముల్లోకములకు; శత్రుడు = శత్రువు; పడియెన్ = చనిపోయెను; సభలు = సభలు; అందును = లోను; మఖములు = యజ్ఞములు; అందున్ = లోను; జగదీశ్వర = నరసింహుడా {జగదీశ్వరుడు - జగత్ (భువనములకు) ఈశ్వరుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; శుభ = మంగళ; గీతములున్ = స్తోత్రములను; పఠించుచున్ = పాడుచు; అభయులము = భయములేనివారము; ఐ = అయ్యి; సంచరింతుము = తిరిగెదము; ఆర్తశరణ్య = నరసింహుడా {ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు}.

భావము:

“ఓ సకల భువన పాలకా! నరకేసరి! నీవు ఆర్తులకు శరణు ఇచ్చువాడవు. ముల్లోకాలకూ శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంక యజ్ఞశాలలలోనూ, సభావేదికలమీదా నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము.”

7-335-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిన్నర లిట్లనిరి.

టీకా:

కిన్నరలు = కిన్నరలు {కిన్నెరలు - అశ్వ ముఖము నర దేహము కల దేవయోనివారు, దేవగాయకులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అశ్వముఖమూ నరశరీరమూ కలవారు, దేవతాభేదమూ అయిన కిన్నరులు ఇలా విన్నవించుకున్నారు.

7-336-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధర్మము దలఁపడు లఘుతర
ర్మము చేయించు మమ్ముఁ లుషాత్మకు దు
ష్కర్మునిఁ జంపితి; వున్నత
ర్ములమై నీదు భక్తి లిపెదము హరీ!"

టీకా:

ధర్మమున్ = న్యాయమును; తలపడు = విచారింపడు; లఘుతర = మిక్కిలి నీచపు {లఘు - లఘుతర - లఘుతమ}; కర్మము = పనులను; చేయించున్ = చేయించును; మమ్మున్ = మమ్ములను; కలుషాత్మకున్ = పాపాత్ముని; దుష్కర్మునిన్ = క్రూరకర్ముని; చంపితి = సంహరించితివి; ఉన్నత = గొప్ప; శర్ములము = సుఖముగలవారము; ఐ = అయ్యి; నీదు = నీ యొక్క; భక్తిన్ = భక్తిని; సలిపెదము = చేసెదము; హరీ = నరసింహుడా.

భావము:

“ఓ విష్ణుదేవా! ఈ హిరణ్యకశిప రాక్షసుడు ధర్మం తెలియని వాడు. మా చేత హీనమైన కార్యాలు చేయించేవాడు. అలాంటి దుర్మార్గుడిని సంహరించావు. ఇక సుఖజీవనులమై నిన్ను భక్తితో కొలుస్తాము.”

7-337-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుసేవకు లిట్లనిరి.

టీకా:

విష్ణు = విష్ణుని; సేవకులు = కింకరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

విష్ణుభక్తులు ఇలా వినుతులు చేసారు.

7-338-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సంచిత విప్రశాపమునఁ జండనిశాచరుఁ డైన వీని శి
క్షించుట కీడు గాదు కృప జేసితి వీశ్వర! భక్తితోడ సే
వించుటకంటె వైరమున వేగమ చేరఁగ వచ్చు నిన్ను; నీ
యంచిత నారసింహ తను ద్భుత మాపదఁ బాసి రందఱున్."

టీకా:

సంచిత = పూర్వజన్మమునార్జింపబడిన; విప్ర = బ్రాహ్మణ; శాపమునన్ = శాపముచేత; చండ = క్రూరమైన; నిశాచరుడు = రాక్షసుడు; ఐన = అయిన; వీని = ఇతనిని; శిక్షించుట = దండించుట; కీడు = అపకారము; కాదు = కాదు; కృప = కరుణ; చేసితివి = చూపితివి; ఈశ్వర = నరసింహా; భక్తి = భక్తి; తోడన్ = తోటి; సేవించుట = సేవించుట; కంటెన్ = కంటె; వైరమునన్ = విరోధముతోటి; వేగమ = శ్రీఘ్రమే; చేరగవచ్చున్ = పొందవచ్చును; నిన్నున్ = నిన్ను; నీ = నీ యొక్క; అంచిత = చక్కనైన; నారసింహ = నరసింహుని {నారసింహవపుః - విష్ణుసహస్రనామములలో 21వ నామము, నరుని, సింహమును పోలిన అవయవములు కలవాడు}; తనువు = దేహము; అద్భుతము = ఆశ్చర్యకరము; ఆపదన్ = అపాయమును; పాసితిరి = తొలగింపబడిరి; అందఱున్ = అందరును.

భావము:

“ప్రభూ! విష్ణుమూర్తీ! విప్రులు సనక సనందాదుల ఘోరమైన శాపం వల్ల, క్రూరులైన దానవులుగా జన్మించారు జయవిజయులు. అలా హిరణ్యకశిపునిగా జన్మించిన వాడిని నువ్వు ఇప్పుడు చంపి, కీడు కాదు మేలే చేశావు. ఘోరాతి ఘోరాలు చేసిన వాడు ఇవాళ నీచేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. భక్తితో కంటే శత్రుత్వంతోనే నిన్ను వేగంగా చేరవచ్చు కదా! నీ ఈ నరకేసరి స్వరూపం పరమ అద్భుతమైనది. అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది.”

7-339-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యు లందఱు నెడగలిగి యనేక ప్రకారంబుల వినుతించి; రందు రోషవిజృంభమాణుం డయిన నరసింహదేవుని డగ్గఱఁ జేర వెఱచి లక్ష్మీదేవిం బిలిచి; యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = పరమ శివుడు; ఇంద్ర = ఇంద్రుడు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; పురస్సరులు = మొదలగువారు; ఐన = అయిన; దేవ = దేవతలలో; ముఖ్యులు = ప్రముఖులు; అందఱున్ = అందరును; ఎడ = దూరముగా; కలిగి = ఉండి; అనేక = పలు; ప్రకారంబులన్ = విధములుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; రోష = కోపము; విజృంభమాణుండు = అతిశయించినవాడు; అయిన = ఐన; నరసింహుని = నరసింహుని; డగ్గఱన్ = దగ్గరకు; చేరన్ = చేరుటకు; వెఱచి = భయపడి; లక్ష్మీదేవిన్ = లక్ష్మీదేవిని; పిలిచి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఇలా ఉగ్ర నరసింహుని ప్రసన్నం చేసుకోవటానికి, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు మున్నగు దేవతా ప్రముఖులు అందరూ పరిపరి విదాల ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్ర స్వరూపం శాంతించలేదు. అంతటి రోషభీషణాకారంతో ఒప్పుతున్న నరసింహస్వామిని సమీపించటానికి కూడా బెదిరిన దేవతలు అందరూ, లక్ష్మీ దేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు.

7-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరికిం బట్టపుదేవివి
రిసేవానిపుణమతివి రిగతివి సదా
రిరతివి నీవు చని నర
రిరోషము డింపవమ్మ! రివరమధ్యా!"

టీకా:

హరి = విష్ణుని; కిన్ = కి; పట్టపుదేవివి = ధర్మపత్నివి; హరి = విష్ణుని; సేవా = సేవించుట యందు; నిపుణమతివి = నేర్పుగలదానవు; హరి = విష్ణువే; గతివి = దిక్కుగాగలదానవు; సదా = ఎల్లప్పుడును; హరి = విష్ణుని యెడల; రతివి = ప్రీతిగలదానివి; నీవు = నీవు; చని = వెళ్ళి; నరహరి = నరసింహుని; రోషమున్ = కోపమును; డింపవు = తగ్గింపుము; అమ్మ = తల్లి; హరి = సింహమువలె; వర = చక్కటి; మధ్య = నడుముగలామె.

భావము:

“ఓ లక్ష్మీదేవీ! నువ్వు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పట్టపురాణివి. ఆ శేషసాయికి సేవచేయుటలో మిక్కిలి నేర్పరివి. నారాయణుడే అండగా పొందిన నీవు, నిత్యం శ్రీహరి యెడల ప్రీతితో మెలుగుతుంటావు. సింహం వలె చిక్కని సన్నని నడుము గల చక్కని తల్లీ! నీవల్లే అవుతుంది, నరసింహుని శాంతపరచు.”

7-341-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నియ్యకొని మహోత్కంఠతోడ నా కలకంఠకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుం జని.

టీకా:

అనినన్ = అనగా; ఇయ్యకొని = అంగీకరించి; మహా = గొప్ప; ఉత్కంఠ = కౌతుకము; తోడన్ = తోటి; ఆ = ఆ; కలకంఠ = అవ్యక్తమధురధ్వనిగల; కంఠి = కంఠముగలామె; నరకంఠీరవుని = నరసింహుని; ఉపకంఠంబున్ = సమీపమున; కున్ = కు; చని = వెళ్ళి.

భావము:

దేవతలు ఇలా అభ్యర్థించగా సమ్మతించి, మధురంగా మాట్లాడే మాత ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో ఆ ఉగ్ర నరకేసరి సన్నిధికి వెళ్ళి చూసింది.

7-342-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రళయార్కబింబంబు గిది నున్నది గాని-
నెమ్మోము పూర్ణేందు నిభము గాదు;
శిఖిశిఖాసంఘంబు చెలువు చూపెడుఁ గాని-
చూడ్కిఁ ప్రసాద భాసురము గాదు;
వీరరౌద్రాద్భుతావేశ మొప్పెడుఁ గాని-
భూరి కృపారస స్ఫూర్తి గాదు;
యద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడుఁ గాని-
రహసితాంబుజాతంబు గాదు;

7-342.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఠిన నఖర నృసింహ విగ్రహము గాని
కామినీజన సులభ విగ్రహము గాదు;
విన్నదియుఁ గాదు; తొల్లి నే విష్ణువలన
న్నదియుఁ గాదు; భీషణాకార" మనుచు.

టీకా:

ప్రళయా = ప్రళయకాలమందలి; అర్క = సూర్య; బింబంబు = బింబము; పగిదిన్ = వలె; ఉన్నది = ఉంది; కాని = తప్ప; నెఱ = నిండు; మోము = ముఖము; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని; నిభము = పోలినది; కాదు = కాదు; శిఖి = అగ్ని; శిఖా = మంటల; సంఘంబు = సమూహము; చెలువు = పోలికను; చూపెడున్ = చూపించుచున్నది; కాని = తప్పించి; చూడ్కిన్ = చూపు; ప్రసాద = అనుగ్రహముచే; భాసురము = ప్రకాశించునది; కాదు = కాదు; వీర = శౌర్యము; రౌద్రము = రౌద్రము; అద్భుత = ఆశ్చర్యము; ఆవేశమున్ = ఆవేశము; ఒప్పెడున్ = కనబడునది; కాని = కాని; భూరి = అత్యధికమైన; కృపా = కరుణా; రస = రసమును; స్ఫూర్తిన్ = కనబడునది; కాదు = కాదు; భయద = భయంకరమైన; దంష్ట్ర = కోరల; అంకుర = మొలకల యొక్క; ప్రభలున్ = కాంతులను; కప్పెడున్ = ప్రసరించునది; కాని = తప్పించి; దరహసిత = చిరునవ్వుతోకూడిన; అంబుజాతంబు = పద్మము {అంబుజాతము - అంబువు (నీరు)నందు జాతంబు (పుట్టునది), పద్మము}; కాదు = కాదు.
కఠిన = గట్టి; నఖర = గోళ్ళు కలిగిన; నారసింహ = నరసింహుని; విగ్రహము = రూపము; కాని = తప్పించి; కామినీ = స్త్రీ {కామిని-కామమునందుఆసక్తిగలామె,స్త్రీ}; జన = జనములకు; సులభ = సుళువుగా లభించెడి; విగ్రహము = స్వరూపము; కాదు = కాదు; విన్నదియు = విన్నట్టిది; కాదు = కాదు; తొల్లి = ఇంతకు పూర్వము; నేన్ = నేను; విష్ణున్ = విష్ణుమూర్తి; వలన = వలన; కన్నదియున్ = చూచినది; కాదు = కాదు; భీషణ = భయంకరమైన; ఆకారము = రూపము; అనుచు = అనుచు.

భావము:

“ఆ నరసింహావతారుని ముఖము ప్రళయకాలపు సూర్య బింబంలాగ ఉంది తప్పించి, ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలలు లాగా ఉన్నాయి తప్ప, అనుగ్రహంతో ప్రకాశిస్తూ లేవు. ఆ దేవుని రూపం వీర, రౌద్ర అద్భుత రసావేశాలతో నిండి ఉంది తప్ప, అపార దయారస స్ఫూర్తితో లేదు. ఆయన కోరలు దంతాలు భయంకరమైన ప్రకాశాలు వెలిగక్కుతున్నాయి తప్ప చిరునవ్వులు చిందించే పద్మకాంతులు ప్రసరించటం లేదు. గట్టి గోళ్ళతో కూడిన నరకేసరి విగ్రహం తప్పించి, సుందరీమణులను సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. శ్రీమహావిష్ణువు యొక్క ఈ భీకరతర ఆకారం ఎప్పుడూ నేను విన్నదీ కాదు, కన్నదీ కాదు.” అని ఆశ్చర్యపోయింది శ్రీ లక్ష్మీదేవి.

7-343-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లికెద నని గమకముఁ గొను;
లికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం
లుకఁ డని నిలుచు; శశిముఖి
లువిడి హృదయమునఁ జనవు యమును గదురన్.

టీకా:

పలికెదన్ = పలకరించెదను; అని = అని; గమకముగొను = యత్నించును; పలికినన్ = పలకరించినను; కడు = మిక్కిలి; అలుగు = కోపించును; విభుడు = ప్రభువు; ప్రతి = మారు; వచనములన్ = మాటలు; పలుకడు = పలుకడు; అని = అని; నిలుచున్ = ఆగిపోవును; శశిముఖి = లక్ష్మీదేవి; బలువిడిన్ = వేగముగా; హృదయమునన్ = హృదయమునందు; చనవు = మచ్చిక; భయమునున్ = భయమును; కదురన్ = అతిశయించగా.

భావము:

ఆ చల్లనితల్లి చంద్రవదన శ్రీలక్ష్మి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దాం అనుకుంది. కానీ ఆ ఉగ్ర రూపం చూస్తుంటే, మాట్లాడితే మండిపడతాడేమో బదులు పలుకడేమో అని ఆగిపోయింది. మనస్సులో ఒక వైపు చనువు, ఒక వైపు భయమూ కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది.
ఈ అమృత గుళిక సర్వలఘు కంద పద్యం. ఇది లక్ష్మీ దేవి తడబాటును చూపుతోంది. అలాగే గజేంద్ర మోక్షణము ఉపాఖ్యానంలో కూడా విష్ణుని వెనుక ఏగుచున్న లక్ష్మీదేవి తడబాటునకు వాడిన అమృత గుళిక “అడిగెద నని” కూడ సర్వలఘు కంద పద్యమే.

7-344-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి శంకించి శాంతుడైన వెనుక డగ్గఱెదనని చింతించుచున్న వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప నితరుల కలవిగాదని ప్రహ్లాదుం జీరి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నరహరి = నరసింహుని; రూపంబు = రూపము; వారిజనివాసినిన్ = లక్ష్మీదేవిని {వారిజనివాసిని - వారిజ (పద్మమునందు) నివాసిని (నివసించెడియామె), లక్ష్మి}; వీక్షించి = చూసి; శంకించి = అనుమానపడి; శాంతుడు = శాంతించినవాడు; ఐన = అయిన; వెనుక = తరువాత; డగ్గఱిదన్ = దగ్గరకు వెళ్ళెదను; అని = అని; చింతించుచున్న = ఆలోచించుచుండగా; వారిజసంభవుండు = బ్రహ్మదేవుడు {వారిజసంభవుడు - వారిజ (పద్మమునందు) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; రోషంబున్ = కోపమును; నివారింపన్ = తగ్గించుటకు; ఇతరులు = ఇతరుల; కిన్ = కి; అలవి = వీలు; కాదు = కాదు; అని = అని; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చీరి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

పద్మాలయ లక్ష్మీదేవి ఇలా నరకేసరి రూపం చూసి సందేహించి, ఆయన శాంతించిన పిమ్మట దగ్గరకు వెళ్తాను అనుకుంది. ఆమె మనోభావం గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ ఉగ్ర నరసింహుని కోపం తగ్గించటం ప్రహ్లాదుడితో తప్పించి ఇంక ఎవరివల్లా కాదని తలచి అతనిని పిలిచి ఇలా అన్నాడు.

7-345-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తీండ్ర మగు రోషమున మీ
తండ్రి నిమిత్తమునఁ జక్రి దారుణమూర్తిన్
వేండ్రము విడువఁడు మెల్లన
తండ్రీ! శీతలునిఁ జేసి యచేయఁగదే."

టీకా:

తీండ్రము = ప్రచండమైనది; అగు = అయిన; రోషమునన్ = కోపముతో; మీ = మీ; తండ్రి = తండ్రి; నిమిత్తమునన్ = కారణముచేనైన; చక్రి = విష్ణువు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; దారుణ = భయంకరమైన; మూర్తిన్ = రూపమును; వేండ్రము = తాపమును; విడువడు = వదులుటలేదు; మెల్లన్ = మెల్లిగా; తండ్రీ = నాయనా; శీతలునిన్ = చల్లబడినవానిగా; చేసి = చేసి; దయచేయగదే = అనుగ్రహింపుము.

భావము:

“నాయనా! ప్రహ్లాదా! చక్రాయుధముగా కలవాడైన విష్ణుమూర్తి నీ తండ్రి కారణంగా తీవ్రతరమైన కోపం గలిగిన ఉగ్ర రూపం ధరించాడు. ఇంకా ఆ తాపం వదలటంలేదు. మెల్లిగా దరిచేరి స్వామిని శాంతింప చెయ్యి.”

7-346-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన "నౌఁ గాక" యని మహాభాగవతశేఖరుం డయిన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు జేసిన భక్తపరాధీనుం డగు నయ్యీశ్వరుం డాలోకించి కరుణాయత్తచిత్తుండై.

టీకా:

అనినన్ = అనగా; ఔగాక = సరే; అని = అని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శేఖరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐన; బాలకుండు = పిల్లవాడు; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములను; ముకుళించి = జోడించి; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; అమంద = చురుకైన; వినయ = అణకువ; వివేకంబులన్ = వివేకములతో; నరసింహ = నరసింహరూపమునగల; దేవుని = దేవుని; సన్నిధి = సమీపమున; కిన్ = కి; చని = వెళ్ళి; సాష్టాంగదండప్రణామంబున్ = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగదండప్రణామము - అష్టాంగములు (కాళ్ళు చేతులు రొమ్ము నొసలు భుజములు) నేలను తాకునట్లు కఱ్ఱవలె సాగిలపడి చేసడి ప్రణామము (నమస్కారము)}; చేసినన్ = చేయగా; భక్త = భక్తుల; పర = ఎడ; అధీనుండు = వశమగువాడు; అగు = ఐన; ఆ = ఆ; ఈశ్వరుండు = భగవంతుడు; ఆలోకించి = చూసి; కరుణా = దయా; ఆయత్త = కలిగిన; చిత్తుండు = మనసుగలవాడు; ఐ = అయ్యి;

భావము:

ఇలా అని బ్రహ్మదేవుడు అనగానే పరమ భాగవతుడు భక్తశేఖరుడు అయిన ప్రహ్లాదుడు “అలాగే” అని, చేతులు జోడించి, మెల్లమెల్లగా ఉగ్ర నరసింహుని సమీపించాడు; మిక్కిలి వినయంతో వినమ్రంతో ఆయన దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు చేసాడు; అంతట భక్తవత్సలుడైన నారాయణుడు ప్రసన్నుడై ప్రహ్లాదుడిని ప్రేమగా చూశాడు.

7-347-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రావ మొప్ప నుత్కటకృపామతియై కదియంగఁ జీరిఁ సం
శోభిత దృష్టిసంఘములఁ జూచుచు బాలుని మౌళి యందు లో
కాభినుతుండు పెట్టె నసురాంతకుఁ డుద్భట కాలసర్ప భీ
తాయదాన శస్తము నర్గళ మంగళ హేతు హస్తమున్.

టీకా:

ప్రాభవము = ఠీవి; ఒప్పన్ = ఒప్పుచుండగా; ఉత్కట = అతిశయించిన; కృపా = కరుణా; మతి = హృదయుడు; ఐ = అయ్యి; కదియంగన్ = దగ్గరకు; చీరి = పిలిచి; సంశోభిత = మిక్కిలి ప్రకాశించెడి; దృష్టిన్ = కన్నుల; సంఘములన్ = సమూహములతో; చూచుచున్ = చూచుచు; బాలుని = పిల్లవాని; మౌళిన్ = తల; అందున్ = పైన; లోకాభినుతుండు = నరసింహస్వామి {లోకాభినుతుడు - లోకములచే అభినుతుడు (కీర్తింపబడువాడు), నరసింహుడు}; పెట్టెన్ = పెట్టెను; అసురాంతకుండు = నరసింహస్వామి {అసురాంతకుడు - అసుర (రాక్షసుని) అంతకుడు (చంపినవాడు), నరహరి}; ఉద్భట = క్రూరమైన; కాల = కాలము యనెడి; సర్పమున్ = పామునకు; భీత = భయపడినవారికి; అభయ = అభయమును; దాన = ఇచ్చెడి; శస్తమున్ = శ్రేష్ఠమైనదానిని; అనర్గళ = అడ్డులేని; మంగళ = శుభములకు; హేతున్ = కారణమైనదానిని; హస్తమున్ = చేతిని.

భావము:

నరహరి మనసులో కరుణ ఉప్పొంగింది; చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడిని దగ్గరకు పిలిచాడు; వాత్యల్యపురస్సరంగా చూస్తూ, ఆ రాక్షస సంహారి తన హస్తంతో మస్తకాన్ని ఆప్యాయంగా నిమిరాడు. ప్రశస్తమైన ఆ హస్తం కాలసర్ప భయాన్ని తొలగించేది; నిత్యమంగళం ప్రసాదించేది.

7-348-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరి కరస్పర్శనంబున భయ విరహితుండును, బ్రహ్మజ్ఞాన సహితుండును, బులకిత దేహుండును, సముత్పన్న సంతోషబాష్పసలిలధారా సమూహుండును, బ్రేమాతిశయ గద్గద భాషణుండును, వినయ వివేక భూషణుండును, నేకాగ్ర చిత్తుండును, భక్తిపరాయత్తుండును నయి య ద్దేవుని చరణ కమలంబులు దన హృదయంబున నిలిపికొని కరకమలంబులు ముకుళించి యిట్లని వినుతించె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హరి = నరసింహుని; కర = చేయి; స్పర్శంబునన్ = తగులుటవలన; భయ = భయము; విరహితుండును = పూర్తిగాలేనివాడును; బ్రహ్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానముతో; సహితుండును = కూడినవాడును; పులకిత = గగుర్పాటు చెందిన; దేహుండును = శరీరముగలవాడును; సముత్పన్న = చక్కగాపుట్టిన; సంతోష = ఆనంద; బాష్పసలిల = కన్నీటి; ధారా = ధారలతో; సమూహుండును = కూడినవాడును; ప్రేమా = భక్తి యొక్క; అతిశయ = అతిశయము చేత; గద్గద = డగ్గుతికపడిన; భాషుండును = మాటలుగలవాడు; వినయ = వినయము; వివేక = వివేకములచే; భూషణుండును = అలంకారముగగలవాడు; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండును = మనసుగలవాడు; భక్తి = భక్తి; పర = ఎడల; ఆయత్తుండునున్ = పరవశమైనవాడు; అయి = అయ్యి; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; చరణ = పాదములు యనెడి; కమలములున్ = పద్మములను; తన = తన యొక్క; హృదయంబునన్ = హృదయములో; నిలిపికొని = ఉంచుకొని; కర = చేతులు యనెడి; కమలంబులున్ = పద్మములను; ముకుళించి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వినుతించె = స్తుతించెను.

భావము:

నరసింహస్వామి చేతి స్పర్శతో ప్రహ్లాదునికి భయంపోయింది; బ్రహ్మజ్ఞానం కలిగింది, దేహం పులకరించింది; ఆనందభాష్పాలు ధారలు కట్టాయి; ఆప్యాయతతో కంఠం గాద్గదికం అయింది; వినయవివేకాలు మరింత శోభ చేకూర్చాయి; చిత్తానికి ఏకాగ్రత చిక్కింది; మనసు భక్తితో పరవశించిపోయింది; హృదయంలో హృషీకేశుడి పాదపద్మాలను నిలిపికొన్నాడు; చేతులు జోడించి నరహరిని ఇలా స్తుతించాడు.