పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని పూర్వజన్మ కథ

  •  
  •  
  •  

8-121-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ననాథ! దేవలశాప విముక్తుఁడై-
టుతర గ్రాహరూపంబు మాని
నుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు-
న తొంటి నిర్మల నువుఁ దాల్చి
రికి నవ్యయునకు తిభక్తితో మ్రొక్కి-
విలి కీర్తించి గీములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును-
వినత శిరస్కుఁడై వేడ్కతోడ

8-121.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళిత పాపుఁ డగుచు నలోకమున కేగె
పుడు శౌరి కేల నంటి తడవ
స్తి లోకనాథుఁ జ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె

టీకా:

జననాథ = రాజా {జననాథుడు - జన (మానవులకు) నాథుడు, రాజు}; దేవల = దేవలుని (ముని); శాప = శాపమునుండి; విముక్తుడు = విడివడినవాడు; ఐ = అయ్యి; పటుతర = మిక్కిలి క్రూరమైన {పటు - పటుతరము - పటుతమము}; గ్రాహ = మొసలి యొక్క; రూపంబున్ = స్వరూపమును; మాని = వదలి; ఘనుడు = గొప్పవాడు; హూహూ = హూహూ యనెడి; నామ = పేరుగల; గంధర్వుడు = గంధర్వుడు; అప్పుడు = ఆ సమయములో; తన = తన యొక్క; తొంటి = పూర్వపు; నిర్మల = నిర్మలమైన; తనువున్ = దేహమును; తాల్చి = ధరించి; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; అవ్యయున్ = విష్ణుమూర్తి {అవ్యయుడు - నాశము లేనివాడు, విష్ణువు}; కున్ = కి; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; మ్రొక్కి = నమస్కరించి; తవిలి = పూని; కీర్తించి = స్తోత్రముల చేసి; గీతములున్ = పాటలు; పాడి = పాడి; ఆ = ఆ; దేవున్ = భగవంతుని; కృపన్ = కరుణ; ఒంది = పొంది; అందంద = మరలమరల; మఱియునున్ = ఇంకను; వినత = మిక్కిలి వంచిన; శిరస్కుడు = తల గలవాడు; ఐ = అయ్యి; వేడ్క = వేడుక; తోడన్ = తోటి.
దళిత = పోగొట్టబడిన; పాపుడు = పాపము గలవాడు; అగుచున్ = అగుచు; తన = తన యొక్క; లోకమున్ = లోకమున; కున్ = కు; ఏగెన్ = వెళ్ళిపోయెను; అపుడు = అంతట; శౌరి = నారాయణుడు; కేలన్ = చేతితో; అంటి = ముట్టుకొని; తడవన్ = నివురుటచే; హస్తిలోకనాథుడు = గజేంద్రుడు {హస్తిలోకనాథుడు - ఏనుగుల సమూహమునకు పతి, గజేంద్రుడు}; అజ్ఞాన = అజ్ఞానము; రహితుండు = తొలగినవాడు; ఐ = అయ్యి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; రూపుడు = సారూప్యము పొందినవాడు; అగుచున్ = అగుచు; వెలుగుచుండె = ప్రకాశించుచుండెను.

భావము:

పరీక్షిన్మహారాజా! అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో “హూహూ” అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టేడు. తన పూర్వపు నిర్మలరూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరల మరల నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వుటచే, వెంటనే గజరాజు అజ్ఞాన మంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు.

8-122-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీనాథ! గజేంద్రుఁ డా మకరితో నాలంబుఁ గావించె మున్
ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై
ష్ణ ముఖ్యుండు గృహీతమౌననియతిన్ ర్వాత్ము నారాయణున్
విశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్.

టీకా:

అవనీనాథ = రాజా; గజేంద్రుడు = గజేంద్రుడు; ఆ = ఆ; మకరి = మొసలి; తోన్ = తోటి; ఆలంబున్ = యుద్ధమును; కావించె = చేసెను; మున్ = పూర్వము; ద్రవిళ = ద్రవిడదేశపు; అధీశుడు = ప్రభువు; అతండు = అతడు; పుణ్యతముడు = అత్యంతధిక మైన పుణ్యుడు; ఇంద్రద్యుమ్న = ఇంద్రద్యుమ్నుడు యనెడి; నాముండు = పేరు గలవాడు; వైష్ణవ = విష్ణుభక్తులలో; ముఖ్యుండు = ముఖ్యమైనవాడు; గృహీత = స్వీకరించిన; మౌన = మౌనవ్రత; నియతిన్ = నియమముతో; సర్వాత్మున్ = హరిని {సర్వాత్ముడు - సర్వము తన రూపమే యైనవాడు, విష్ణువు}; నారాయణున్ = హరిని {నారాయణుడు - సారూప్యముక్తికి స్థానమైనవాడు, విష్ణువు}; సవిశేషంబుగన్ = విశిష్టతలతో కూడినట్లుగ; పూజ = పూజలు; చేసెను = చేసెను; మహా = గొప్ప; శైల = పర్వతము; అగ్ర = పై; భాగంబునన్ = ప్రదేశము నందు.

భావము:

రాజా! మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ద్రవిడ దేశపు మహారాజు. అతడు అతి శ్రేష్ఠమైన విష్ణు భక్తుడు. ఒక పెద్ద పర్వతంమీద మౌనవ్రతం పూని సర్వాత్మ ఐన శ్రీహరిని గూర్చి విశేష పూజలు జరిపేవాడు.

8-123-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాఁ డా నృపుఁ డచ్యుతున్ మనసులో నూహించుచున్ మౌనియై
లంకస్థితి నున్నచోఁ గలశజుం చ్చోటికిన్ వచ్చి లే
పూజింపక యున్న మౌనిఁ గని నవ్యక్రోధుఁడై "మూఢ! లు
బ్ధ! రీంద్రోత్తమ యోనిఁ బుట్టు" మని శాపం బిచ్చె భూవల్లభా!

టీకా:

ఒక = ఒక; నాడున్ = దినమున; ఆ = ఆ; నృపుడు = రాజు {నృపుడు - నృ (నరులను) పతి, రాజు}; అచ్యుతున్ = నారాయణుని {అచ్యుతుడు - తన పదవినుండి భ్రంశము పొందని వాడు, విష్ణువు}; మనసు = మనస్సు; లోన్ = అందు; ఊహించుచున్ = భావించుకొనుచు; మౌని = మౌనము ధరించినవాడు; ఐ = అయ్యి; అకలంక = ఏకాగ్రచిత్తము గల; స్థితిన్ = స్థితిలో; ఉన్నచోన్ = ఉన్న సమయము నందు; కలశజుండు = అగస్త్యముని {కలశజుడు - కలశము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు}; ఆ = ఆ; చోటి = ప్రదేశమున; కిన్ = కు; వచ్చి = వచ్చి; లేవక = లేవకుండగ; పూజింపక = గౌరవించకుండగ; ఉన్న = ఉన్నట్టి; మౌనిన్ = మౌనము ధరించిన వానిని; కని = చూసి; నవ్య = వెంటనే పుట్టిన; క్రోధుడు = కోపము గలవాడు; ఐ = అయ్యి; మూఢ = మూర్ఖుడా; లుబ్ధ = లోభి, అనాగరికుడ; కరీంద్రము = మదగజములలో; ఉత్తమ = ఉత్తమ మైన; యోనిన్ = గర్భమున; పుట్టుము = జన్మించుము; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; భూవల్లభా = రాజా {భూవల్లభుడు - భూ (భూమికి) వల్లభుడు (పతి), రాజు}.

భావము:

పరీక్షిన్మహారాజా! ఒక రోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా ఏకాగ్రచిత్తంతోఉన్నాడు. అప్పుడు అక్కడకి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించ లేదని, లేవకుండ మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు “ఓరీ మూర్ఖుడా! పిసినిగొట్టు! ఏనుగు కడుపున జన్మించు.” అని అతనికి శాపమిచ్చాడు.

8-124-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిపతి నవమానించిన
నుఁ డింద్రద్యుమ్న విభుఁడుఁ గౌంజరయోనిం
నం బందెను విప్రులఁ
ని యవమానింపఁ దగదు న పుణ్యులకున్.

టీకా:

ముని = మునులలో; పతిన్ = ప్రభువుని; అవమానించిన = అవమానించి నట్టి; ఘనుడు = గొప్పవాడు; ఇంద్రద్యుమ్న = ఇంద్రద్యుమ్నుడు యనెడి; విభుడు = రాజు; కౌంజర = ఏనుగు యొక్క {కుంజరము – వ్యు. కుంజః (ప్రశస్తః) అస్తిఅస్య – కుంజ+రః, త.ప్ర., మేలైన దంతము చెక్కిలి పై భాగము కలది, ఏనుగు, ఆంధ్రశబ్దరత్నాకరము}; యోనిన్ = గర్భమున; జననంబున్ = జన్మమును; అందెను = పొందెను; విప్రులన్ = బ్రాహ్మణులను; కని = చూసి; అవమానింపన్ = అవమానించుట; తగదు = తగినపని కాదు; ఘన = గొప్ప; పుణ్యులకున్ = పుణ్యవంతుల కైనను.

భావము:

అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు.

8-125-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినాథుఁ డయ్యె నాతఁడు
రులైరి భటాదులెల్ల; జముగ నయ్యున్
రిచరణ సేవ కతమునఁ
రి వరునకు నధికముక్తిఁ లిగె మహాత్మా!

టీకా:

కరినాథుడు = గజేంద్రుడు; అయ్యెన్ = అయ్యెను; ఆతడు = అతడు; కరులు = ఏనుగులు; ఐరి = అయ్యారు; భట = భటులు; ఆదులు = మున్నగువారు; ఎల్లన్ = అందరును; గజముగన్ = గజమువలె; అయ్యున్ = అయినప్పటుకిని; హరి = నారాయణుని; చరణ = పాదముల; సేవ = సేవించుట; కతమునన్ = కారణముచేత; కరి = ఏనుగు; వరున్ = ఉత్తమున; కున్ = కు; అధిక = గొప్ప; ముక్తి = ముక్తి; కలిగెన్ = కలిగినది; మహాత్మా = గొప్పవాడ.

భావము:

ఓ రాజేంద్ర! ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా, అతని భటులందరు ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా కూడ అతనికి విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది.

8-126-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మతంత్రుఁ డగుచుఁ మలాక్షుఁ గొల్చుచు
నుభయ నియతవృత్తి నుండెనేనిఁ
జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన
ప్రబలమైన విష్ణుక్తి చెడదు.

టీకా:

కర్మ = చేసిన కర్మలచే; తంత్రుడు = నడుపబడువాడు; అగుచున్ = అగుచు; కమలాక్షున్ = నారాయణుని; కొల్చుచున్ = సేవించుచు; ఉభయ = ఈ రెండు కార్యములు; నియత = నియమబద్ధమైన; వృత్తిని = విధముగ; ఉండెను = ఉన్నట్లు; ఏని = అయితే; చెడున్ = నశించును; కర్మము = కర్మఫలము; ఎల్లన్ = సమస్తమును; శిథిలము = కరిగిపోయినది; ఐ = అయ్యి; మెల్లన = మెల్లగా; ప్రబలమైన = శక్తివంతమైన; విష్ణు = విష్ణువు యందలి; భక్తి = భక్తి; చెడదు = నశించదు.

భావము:

భక్తుడు తన పనులు తాను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ రెండు నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపాలన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంతమైనట్టి విష్ణుభక్తి ఎప్పటికి నశించదు.

8-127-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెడుఁ గరులు హరులు ధనములుఁ
జెడుదురు నిజసతులు సుతులుఁ జెడు చెనఁటులకుం;
జెక మనునట్టి గుణులకుఁ
జెని పదార్థములు విష్ణుసేవా నిరతుల్.

టీకా:

చెడున్ = నశించును; కరులు = ఏనుగులు; హరులు = గుఱ్ఱములు; ధనములున్ = సంపదలు; చెడుదురు = చెడిపోవుదురు; నిజ = తన యొక్క; సతులు = భార్యలు; సుతులున్ = పుత్రులు; చెడున్ = చెడిపోవును; చెనటుల్ = దుర్జనుల; కున్ = కు; చెడక = చెడిపోవక; మను = జీవించెడి; అట్టి = అటువంటి; గుణుల్ = గుణవంతుల; కున్ = కు; చెడని = చెడిపోని; పదార్థములు = వస్తుతతి; విష్ణు = నారాయణుని; సేవా = కొలిచెడి; నిరతుల్ = అభిలాషలు, ఆసక్తి.

భావము:

దుర్జనుల ఏనుగులు, గుఱ్ఱాలు, సంపదలు అన్ని నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతులైన సజ్జనులు చెడకుండ బతుకుతారు. వారికి విష్ణుభక్తి మీది ఆసక్తి చెడదు.