పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 5రైవతమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-138-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాసు తమ్ముఁడు రైవత
నాకుఁడై వెలసె మనువు; లువురమీదన్
భూమికిఁ బ్రతివింధ్యార్జున
నామాదులు నృపులు మనువు నందనులు నృపా!

టీకా:

తామసు = తామసుని {తామసుడు - నాలుగవ మనువు}; తమ్ముడు = చిన్నసోదరుడు; రైవత = రైవతుడు అనెడి; నామకుడు = పేరుగలవాడు; ఐ = అయ్యి; వెలసెన్ = అవతరించెను; మనువు = మనువు; నలువురమీదన్ = ఐదవవానిగ; భూమి = భూలోకమున; కిన్ = కు; ప్రతివింధ్య = ప్రతివింధ్యుడు; అర్జున = అర్జునుడు; నామ = పేరుగలవాడు; ఆదులు = మున్నగువారు; నృపులు = రాజులు; మనువు = మనువు యొక్క; నందనులు = పుత్రులు; నృపా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! నాలుగవ మనువు తామస మనువుకు తమ్ముడైన రైవతుడు అయిదో మనువు అయ్యాడు. అతని కుమారులు ప్రతివింద్యుడు, అర్జునుడు మొదలైనవారు భూమండలానికి రాజులు అయ్యారు.

8-139-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు-
వేదశీర్షుండను వీరు మొదలు
మరులు భూతరయాదులు శుభ్రుని-
త్ని వికుంఠాఖ్య రమసాధ్వి;
యా యిద్దఱకుఁ బుత్రుఁడై తన కళలతో-
వైకుంఠుఁ డనఁ బుట్టి వారిజాక్షు
వనిపై వైకుంఠ నియెడి లోకంబుఁ-
ల్పించె నెల్లలోములు మ్రొక్క;

8-139.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ యెదుర్కోలు చేకొనె రాజముఖ్య!
దనుభావంబు గుణములుఁ లఁపఁ దరమె?
యీ ధరారేణు పటలంబు నెఱుఁగవచ్చుఁ
గాని రాదయ్య హరిగుణణము సంఖ్య.

టీకా:

మునులు = సప్తర్షులు; హిరణ్యరోముడున్ = హిరణ్యరోముడు; ఊర్ధ్వబాహుండు = ఊర్ధ్వబాహుడు; వేదశీర్షుండు = వేదశీర్షుడు; అను = అనెడి; వీరు = వారు; మొదలు = ముఖ్య; అమరులు = దేవతలు; భూత = భూతుడు; రయ = రయుడు; ఆదులు = మొదలగువారు; శుభ్రుని = శుభ్రుని యొక్క; పత్ని = భార్య; వికుంఠ = వికుంఠుడు యనెడి; ఆఖ్య = పేరుగలయామె; పరమ = అత్యుత్తమ; సాధ్వి = పతివ్రత; ఆ = ఆ; ఇద్దఱ = ఇద్దరి (2); కున్ = కి; పుత్రుడు = కుమారుడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; కళల్ = అంశల; తోన్ = తోటి; వైకుంఠుడు = వైకుంఠుడు; అనన్ = అనబడుతూ; పుట్టి = పుట్టి; వారిజాక్షుడు = హరి {వారిజాక్షుడు - వారిజము (పద్మమువంటి) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అవని = భూమండలము; పైన్ = మీద; వైకుంఠము = వైకుంఠము; అనియెడి = అనెడి; లోకంబున్ = లోకమును; కల్పించెన్ = ఏర్పరచెను; ఎల్ల = అన్ని; లోకములున్ = లోకములును; మ్రొక్కన్ = కొలుచుచుండగ.
రమ = లక్ష్మీదేవి; ఎదుర్కోలు = వివాహమున; చేకొనె = స్వీకరించెను; రాజముఖ్య = రాజులలో ముఖ్యుడ; తత్ = అతని; అనుభావంబున్ = ప్రభావములను; గుణములున్ = గుణములను; తలపన్ = భావించుట; తరమె = సాధ్యమా, కాదు; ఈ = ఈ; ధరా = భూమండలమునందలి; రేణు = ఇసుక; పటలంబున్ = సమూహమును; ఎఱుగవచ్చు = తెలిసికొనవచ్చు; కాని = కాని; రాదు = సాధ్యముకాదు; అయ్య = బాబు; హరి = వైకుంఠుని; గుణ = గుణములు; గణమున్ = అన్నిటి; సంఖ్య = లెక్క.

భావము:

రాజా పరీక్షిత్తూ! ఈ అయిదో మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వ బాహుడు, వేదశీర్షుడు మున్నగువారు, సప్తర్షులు అయ్యారు, భూతరయులు మొదలైనవారు దేవతలు అయ్యారు. శుభ్రుడికి, పతివ్రత అయిన వికుంఠ అనే అతని భార్య కడుపున, “వైకుంఠుడు” అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. అతడు అన్ని లోకాల వారు గౌరవించేలా “వైకుంఠము” అనే లోకాన్ని సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెళ్ళి చేసుకుంది. ఆ దేవదేవుని మహిమను, సుగుణాలను ఊహించడం సాధ్యం కాదు. భూమండలంలో గల ధూళి కణాలు అన్నిటినీ తెలుసుకోగలమేమో కాని వైకుంఠుని గుణగణాలు తెలుసు కోవటం సాధ్యం కాదు.

8-140-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ.

టీకా:

తదనంతరంబ = తరువాత.

భావము:

అటు పిమ్మట.