పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 8సూర్యసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-413-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ననాథ! సంజ్ఞయు ఛాయయు ననువారు-
ల రర్కునకు విశ్వర్మతనయ
లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిఁ-
రఁగు దృతీయము డబ యనఁగ
సంజ్ఞకు యముఁడును శ్రాద్ధదేవుండును-
మునయుఁ బుట్టిరి ర్ష మెసఁగ;
ఛాయకుఁ దపతియు సావర్ణియును శనీ-
శ్వరుఁడునుఁ గలిగిరి; సంవరణుఁడు

8-413.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతి నాలిఁగఁ గైకొనెఁ దా వరించె;
శ్వి యుగళంబు బడబకు వతరించె;
చ్చు నష్టమ వసువు సార్ణి; వాఁడు
పము చేయుచునున్నాఁడు రణినాథ!
వంశవృక్షాలు – శ్రాద్ధదేవుడు

టీకా:

జననాథ = రాజా; సంజ్ఞయున్ = సంధ్య; ఛాయ = ఛాయ; అను = అనెడి; వారు = వారు; కలరు = ఉన్నారు; అర్కున్ = సూర్యుని; కున్ = కి; విశ్వకర్మ = విశ్వకర్మయొక్క; తనయలు = పుత్రికలు; ఇరువురు = ఇద్దరు; వల్లభలు = భార్యలు; ఇటమున్న = ఇంతకుముందు; చెప్పితిన్ = చెప్పియుంటిని; పరగు = ప్రసిద్ధముగ; తృతీయము = మూడవ యామె; బడబ = బడబ; అనగ = అని; సంజ్ఞ = సంధ్య; కున్ = కు; శ్రాద్ధదేవుండు = యముడు; యమునయున్ = యమున; పుట్టిరి = జనించిరి; హర్షము = సంతోషము; ఎసగన్ = అతిశయించగ; ఛాయ = ఛాయ; కున్ = కు; తపతియున్ = తపతి; సావర్ణియును = సావర్ణి; శనీశ్వరుడును = శనిదేవుడు; కలిగిరి = పుట్టిరి; సంవరణుడు = సంవరణుడు; తపతిన్ = తపతిని; ఆలిగన్ = భార్యగా; కైకొనె = చేపట్టెను; తాన్ = అతనే.
వరించె = ప్రేమించెను; అశ్వి = ఏనుగుల; యుగళంబు = జంట (2); బడబ = బడబ; కున్ = కు; అవతరించెన్ = పుట్టెను; వచ్చు = రాబోయెడి; అష్టమ = ఎనిమిదవ (8); వసువు = వసువు; సావర్ణి = సావర్ణి; వాడు = అతడు; తపమున్ = తపస్సు; చేయుచున్ = చేస్తూ; ఉన్నాడు = ఉన్నాడు; ధరణినాథ = రాజా.

భావము:

“ఓ రాజా! సంధ్య, ఛాయ అని సూర్యుని భార్యలు ఉన్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. వారిద్దరే కాక సూర్యునికి బడబ అనే భార్య కూడా ఉంది. సంధ్యకు యముడూ, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు; ఛాయకు సాపర్ణి, శనైశ్చరుడూ, తపతీ పుట్టినారు తపతిని సంవరుణుడు పెండ్లాడాడు. బడబకు ఇద్దరు అశ్వినీదేవతలు కలిగారు. రాబోయే కాలంలో సావర్ణి ఎనిమిదవ మనువు అవుతాడు. అతడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు.

8-414-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పరి చూచిన వెండియు
నొపరి చూడంగ లేకయుండు సిరులకై
యొ నొకని చేటు వేళకు
నొకఁ డొక్కఁడు మనువుఁ గాచి యుండు నరేంద్రా!

టీకా:

ఒక = ఒక; పరి = సారి; చూచిన = కనిపించినను; వెండియున్ = మరల; ఒక = ఇంకొక; పరి = సారి; చూడంగన్ = చూచుటకు; లేక = లేకుండి; ఉండు = పోయెడి; సిరుల్ = సంపదల; కై = కోసము; ఒకనొకని = ఒక్కొక్క; చేటు = దిగిపోయెడి; వేళ = సమయమున; కున్ = కు; ఒకడొక్కడు = ఒక్కొక్క; మనువు = మనువు; కాచి = ఎదురుచూచుచు; ఉండున్ = ఉండును; నరేంద్ర = రాజా.

భావము:

పరీక్షున్మహారాజా! ఒకసారి ఉన్నట్లు కనిపించి ఇంకొకసారి చూద్దామన్నా కనిపించకుండా మాయమయ్యే, సంపదలకోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి మరొక మనువు కాచుకొని సిద్ధంగా ఉంటాడు.

8-415-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులును; సుతపోవిరజోమృత ప్రభు లనువారు దేవతలును గాఁగలరు; గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్రుఁడగు నశ్వత్థామయుఁ, గృపుండును, మజ్జనకుం డగు బాదరాయణుండును, ఋష్యశృంగుండును సప్తర్షు లయ్యెదరు; వార లిప్పుడుఁ దమతమ యోగబలంబుల నిజాశ్రమ మండలంబులఁ జరియించుచున్నవారు; విరోచన నందనుం డగు బలి యింద్రుం డయ్యెడు" నని చెప్పి శుకుం డిట్లనియె.

టీకా:

సూర్యసావర్ణి = సూర్యసావర్ణి; మన్వంతరంబునన్ = మన్వంతరమునందు; అతని = అతని; తనయులు = పుత్రులు; నిర్మోహ = నిర్మోహుడు; విరజస్క = విరజస్కుడు; ఆద్యులు = మున్నగువారు; రాజులును = రాజులును; సుతపస్ = సుతపులు; విరజస్ = విరజులు; అమృతప్రభులు = అమృతప్రభులు; అను = అనెడి; వారు = వారు; దేవతలును = దేవతలును; కాగలరు = అవుతారు; గాలవుండును = గాలవుడు; దీప్తిమంతుడును = దీప్తిమంతుడు; పరశురాముండును = పరశురాముడు; ద్రోణ = ద్రోణుని; పుత్రుడు = కుమారుడు; అగు = అయిన; అశ్వత్థామయున్ = అశ్వత్థామ; కృపుండును = కృపుడు; మత్ = నా యొక్క; జనకుండు = తండ్రి; అగు = అయిన; బాదరాయణుండును = వ్యాసుడు; ఋష్యశృంగుండును = ఋష్యశృంగుడు; సప్తర్షులు = సప్తర్షులు; అయ్యెదరు = అవుతారు; వారలు = వారు; ఇపుడు = ప్రస్తుతము; తమతమ = వారివారి; యోగ = యోగాభ్యాస; బలంబులన్ = శక్తులచేత; నిజ = వారి; ఆశ్రమ = ఆశ్రమముల; మండలంబులన్ = ప్రదేశములందు; చరియించుచున్ = నివసించి; ఉన్నవారు = ఉన్నారు; విరోచన = విరోచనుని; నందనుండు = పుత్రుడు; అగు = అయిన; బలి = బలిచక్రవర్తి; ఇంద్రుండు = ఇంద్రుడు; అయ్యెడున్ = అవుతాడు; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

సూర్య సావర్ణి పాలించే ఎనిమిదవ మన్వంతరంలో అతని కొడుకులైన నిర్మోహుడూ, విరజస్కుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు.

8-416-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లిమున్ను నాకంబు లిమిమైఁ జేకొన్న-
వామనుండై హరి చ్చి వేఁడఁ
బాదత్రయం బిచ్చి గవన్నిబద్ధుఁడై-
సురమందిరము కంటె సుభగమైన
సుతల లోకంబున సుస్థితి నున్నాఁడు-
వెతలేక యట మీఁద వేదగుహికి
నా సరస్వతికిఁ దా ట సార్వభౌముండు-
నాఁ బ్రభువయి హరి నాకవిభునిఁ

8-416.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దవిహీనుఁ జేసి లిఁదెచ్చి నిలుపును;
లియు నిర్జరేంద్రు దము నొందు;
నింద్రపదము హరికి నిచ్చిన కతమున
దానఫలము చెడదు రణినాథ!

టీకా:

బలి = బలి; మున్ను = అంతకుపూర్వము; నాకంబున్ = స్వర్గమును; బలిమి = బలవంతుడు; ఐ = అయ్యి; చేకొన్న = స్వాధీనముచేసికొనగా; వామనుండు = వామనుని(పొట్టివాని)గా; ఐ = అవతరించి; హరి = విష్ణువు; వచ్చి = చేరవచ్చి; వేడన్ = కోరగా; పాద = అడుగులు; త్రయంబు = మూడు (3); ఇచ్చి = ఇచ్చి; భగవత్ = భగవంతునిచేత; నిబద్ధుడు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; సురమందిరము = స్వర్గము; కంటెన్ = కంటె; సుభగము = సౌభాగ్యవంతమైన; సుతల = సుతలము అనెడి; లోకంబునన్ = లోకమునందు; సుస్థితిన్ = సుఖముగా; ఉన్నాడు = ఉన్నాడు; వెత = బాధలు; లేక = లేకుండగ; అటమీద = ఆతరువాత; వేదగుహి = వేదగుహి; కిన్ = కి; ఆ = ఆ; సరస్వతి = సరస్వతి; కిన్ = కి; తాను = అతను; అట = అక్కడ; సార్వభౌముండునా = సార్వభౌముడు అనుపేర; ప్రభువు = అవతరించినవాడు; అయి = అయ్యి; హరి = విష్ణువు; నాకవిభుని = దేవేంద్రుని; పద = పదవినుండి; విహీనున్ = తొలగినవాని; చేసి = చేసి.
బలిన్ = బలిని; తెచ్చి = తీసుకువచ్చి; నిలుపును = అధిష్టింపజేయును; బలియున్ = బలికూడ; నిర్జరేంద్రు = దేవేంద్రుని; పదమున్ = పదవిని; ఒందున్ = పొందును; ఇంద్ర = ఇంద్రుని; పదమున్ = పదవిని; హరి = విష్ణున; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చునట్టి; కతమునన్ = కారణముచేత; దాన = దాని యొక్క; ఫలమున్ = ఫలితము; చెడదు = చెడిపోదు; ధరణీనాథ = రాజా.

భావము:

రాజా! పరీక్షిత్తూ! పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకోగా విష్ణువు వామనుడుగా వెళ్ళి అతనిని మూడడుగులు దానం అడుగుతాడు. దానం ఇచ్చిన బలిని భగవంతుడు బంధించాడు. తరువాత బలికి అమరావతికంటే సొగసైన సుతలలోకాన్ని ఇచ్చాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు వేదగుహికి సరస్వతికి సార్వభౌముడు అనే పేరుతో జన్మిస్తాడు. పాత దేవేంద్రుని పదవినుండి తొలగిస్తాడు. ఆపదవిలో బలిచక్రవర్తిని నిలుపుతాడు. విష్ణువు నుండి బలిచక్రవర్తి ఇంద్రపదవి పొందినప్పటికీ అతడు మొదట విష్ణువుకు దానం చేసిన పుణ్యం చెడదు.