పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 10బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-419-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నుపశ్లోక సుతుం డగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడి; తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును; హవిష్మత్ప్రముఖులు మునులును; శంభుం డను వాఁ డింద్రుండును; విబుద్ధ్యాదులు నిర్జరులును నయ్యెద; రందు.

టీకా:

మఱియును = ఇంకను; ఉపశ్లోక = ఉపశ్లోకుని; సుతుండు = కుమారుడు; అగు = అయిన; బ్రహ్మసావర్ణి = బ్రహ్మసావర్ణి; దశమ = పదవ (10); మనువున్ = మనువు; అయ్యెడిన్ = అవుతాడు; తత్ = అతని; పుత్రులు = పుత్రులు; భూరిషేణ = భూరిషేణుడు; ఆదులు = మున్నగువారు; భూపతులును = రాజులు; హవిష్మత్ = హవిష్మంతుడు; ప్రముఖులు = మున్నగువారు; మునులును = మునులు; శంభుండు = శంభుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడు; విబుద్ధి = విబుద్ధి; ఆదులు = మున్నగువారు; నిర్జరులును = దేవతలు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆ కాలమున.

భావము:

పరీక్షిత్తుమహారాజా! అటు పిమ్మట ఉపశ్లోకుడి కొడుకైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన భూరిషేణుడు మొదలైనవారు రాజులు అవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు ఋషులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధి మొదలైనవారు దేవతలు అవుతారు

8-420-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి
సంభవించు నంశ హితుఁ డగుచుఁ
జెలిమి శంభుతోడఁ జేయు విష్వక్సేనుఁ
నఁగ జగముఁ గాచు వనినాథ!

టీకా:

విశ్వసృజుని = విశ్వసృజుని యొక్క; ఇంటన్ = ఇంటిలో; విభుడు = విష్ణువు; విషూచి = విషూచి; కిన్ = కి; సంభవించున్ = అవతరించును; అంశ = కళ; సహితుండు = కలవాడు; అగుచున్ = అగుచు; చెలిమి = స్నేహము; శంభు = శంభుని; తోడన్ = తోటి; చేయున్ = చేయును; విష్వక్సేనుడు = విష్వక్సేనుడు {విష్వక్సేనః - తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన అంతయు భీతితో పారిపోవు వాడు, విష్ణుసహస్రనాములలో 125వ నామము}; అనగన్ = అనిపిలవబడి; జగమున్ = భువనములను; కాచున్ = కాపాడును; అవనినాథ = రాజా.

భావము:

ఆకాలంలో విష్ణువు విశ్వసృజునికి విషూచికీ విష్వక్సేనుడు అనేపేరుతో జన్మించి శంభునికి చెలికాడై లోకాన్ని కాపాడుతాడు.