పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

  •  
  •  
  •  

8-552-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?-
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?-
నా యంతవాఁడనై డవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?-
బూని ముప్పోకల బోవ నేర్తు;
దినేర్తు నిదినేర్తు ని యేలఁ జెప్పంగ?-
నేరుపు లన్నియు నేన నేర్తు;

8-552.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

8-552.1-ఆ.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

టీకా:

ఇది = దీనిని; నా = నా; కున్ = కు; నెలవు = నివాసము; అని = అని; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పలుకుదు = చెప్పెగలను; ఒక = ప్రత్యేకముగ ఒక; చోటు = ప్రదేశము; అనక = అనకుండ; ఎందున్ = ఎక్కడైనను; ఉండనేర్తున్ = ఉండగలను; ఎవ్వని = ఎవరికిచెందిన; వాడన్ = వాడిని; అంచున్ = అనుచు; ఏమి = ఏమి; అని = అని; నుడువుదున్ = చెప్పెగలను; నా = నా; అంతవాడను = అంతవాడినినేనే; ఐ = అయ్యి; నడవనేర్తు = స్వేచ్చగావర్తించెదను; ఈ = ఇలాంటి; నడవడి = వర్తన కలవాడను; అని = అని; ఎట్లు = ఎలా; వక్కాణింతున్ = చెప్పగలను; పూని = ధృతితో; ముప్పోకలన్ = మూడు పోకడలు, పెక్కు త్రోవలను {ముప్పోకలు - మూడుపోకడలు, 1సత్త్వగుణము 2రజగుణము 3తమోగుణములుకల మూడువిధములు, 1శ్రవణ 2అధ్యయన 3ఉపన్యాస అనెడి మూడు విద్యలు, 1ముందుకు 2వెనుకుక 3పక్కలకు అనెడి మూడు గమనములు}; పోవనేర్తు = వెళ్ళగలను; అది = అది; నేర్తున్ = తెలుసును; ఇది = ఇది; నేర్తున్ = తెలుసును; అని = అని; ఏల = ఎందుకు; చెప్పంగన్ = చెప్పడము; నేరుపులు = విద్యలు; అన్నియున్ = అన్ని; నేన = నేను; నేర్తున్ = తెలుసుకున్నాను; ఒరులు = ఇతరులు; కారు = ఏమీకారు.
నా = నా; కున్ = కు; ఒరుల = ఇతరుల; కున్ = కు; నేన్ = నేను; ఔదు = ఉపయోగపడెదను; ఒంటి = ఒంటరి, అనితరమైన; వాడన్ = వాడిని; చుట్టము = బంధువు; ఒకడు = ఒక్కడుకూడ; లేడు = లేడు; సిరియున్ = లక్ష్మీదేవి, సంపద; తొల్లి = ఇంతకుముందు; కలదు = ఉన్నది; చెప్పెదన్ = తెలియచెప్పెదను; నా = నా యొక్క; టెంకి = నివాసము; సుజనులు = మంచివారి, పుణ్యాత్ముల; అందున్ = లో, ఎడల; తఱచు = ఎక్కువగా, ఎక్కువమార్లు; చొచ్చి = కూడి, చొరవకలిగి; ఉందున్ = ఉంటాను.

భావము:

“ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోటనకుండా అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను? నేను నాఅంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నానడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో మూడుపోకడలూ పొగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గానీ, అన్ని విద్యలూ నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము.

8-553-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది యట్లుండ నిమ్ము.

టీకా:

అది = దాని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనియ్యి.

భావము:

ఆ సంగతి అట్లుండనీ. . ..

8-554-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ననాథ! నీ మాట త్యంబు సత్కీర్తి;
దంబు గులార్హంబు ర్మయుతముఁ
రుణానువర్తులు నసత్త్వమూర్తులు-
కాని మీ కులమందుఁ లుగ రొరులు
ణభీరువులు వితణభీరువులు లేరు-
ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన
దానశౌండిమమునఁ నుపుదు రధికులై-
మీ తాత లందఱు మేటిమగలు

8-554.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీ కులంబునందు మెఱయుఁ బ్రహ్లాదుండు
మింటి చంద్రుమాడ్కి మేలి రుచులఁ
బ్రథిత కీర్తితోడ వదీయవంశంబు
నీరరాశి భంగి నెగడు చుండు.

టీకా:

జననాథ = రాజా; నీ = నీ యొక్క; మాట = మాటలు; సత్యంబు = యధార్థములు; సత్ = మంచి; కీర్తిదంబు = కీర్తినిచ్చెడివి; కులః = కులస్తులకు; అర్హంబు = తగినవి; ధర్మయుతమున్ = ధర్మబద్ధమైనవి; కరుణ = కనికరము కలిగి; అనువర్తులు = నడచువారు; ఘన = మిక్కిలి; సత్త్వ =బలము గల; మూర్తులు = స్వరూపులు; కాని = తప్పించి; మీ = మీ యొక్క; కులము = వంశము; అందున్ = లో; కలుగరు = పుట్టరు; ఒరులు = ఇతరులు; రణ = యుద్ధమునందు; భీరువులున్ = పిరికివారు; వితరణ = దానముచేయుటయందు; భీరువులున్ = వెనుదీయువారు; లేరు = లేరు; ప్రత్యర్థులున్ = శత్రులు; అర్థులున్ = యాచకులు; ప్రబ్బికొనిన = కమ్ముకొనగా; దాన = దానములతోను; శౌండిమమునన్ = పరాక్రమముతోను; తనుపుదురు = తృప్తి కలిగించెదరు; అధికులు = అతిశయించినవారు; ఐ = అయ్యి; మీ = మీ యొక్క; తాతలు = పూర్వీకులు; అందఱున్ = అందరు; మేటి = గొప్ప; మగలు = శూరులు.
మీ = మీ యొక్క; కులంబున్ = వంశము; అందున్ = లో; మెఱయు = ప్రకాశించెడి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; మింటి = ఆకామందున్న; చంద్రు = చంద్రుని; మాడ్కిన్ = వలె; మేలి = శ్రేష్ఠమైన; రుచులన్ = కాంతులతో; పృథిత = పెద్దదైన; కీర్తి = కీర్తి; తోడన్ = తోటి; భవదీయ = నీ యొక్క; వంశంబు = వంశము; నీరరాశి = సముద్రము {నీరరాశి - నీరు రాశిగాగలది, కడలి}; భంగిన్ = వలె; నెగడుచుండున్ = ప్రకాశించును.

భావము:

ఇప్పుడు నాతో నీవు అన్నమాట యదార్థం. మంచి కీర్తిని ఇచ్చేది నీ వంశానికి తగినది ధర్మంతో కూడినది మీ వంశం. మీకులంలో కనికరం కలవారూ ఆత్మబలంకలవారూ తప్ప వేరేవారు పుట్టలేదు. మీలో యుద్ధం చెయ్యడానికి గానీ, దానం ఇవ్వడానికి గానీ భయపడేవారు ఎవరూ లేరు. దరిచేరిన ప్రత్యర్ధులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్ధులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ పూర్వీకులు అందరూ గొప్ప మేటివీరులు. ఆకాశంలో వెలిగే చంద్రునిలా మీ వంశంలో ప్రహ్లాదుడు మేలైన కాంతివంతమైన కీర్తితో ప్రకాశిస్తాడు. మీవంశం సమృద్ధమైన ఆకీర్తితో సముద్రంవలె పెంపారుతుంది.

8-555-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; నప్పుడు.

టీకా:

తొల్లి = పూర్వము; మీ = మీ యొక్క; మూడవతాత = ముత్తాత; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; విశ్వ = జగత్తంతటిని; జయంబుచేసి = జయించి; గదాయుధుండు = గదాయుధమువాడు; భూతలంబునన్ = భూమండలముమీద; ప్రతివీరులన్ = ఎదిరించగల శూరులను; కానక = కనపడనివిధముగ; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుండు = నారాయణుడు; వరాహ = వరాహ; రూపంబునన్ = అవతారముతో; అతనిన్ = అతడిని; సమయించె = సంహరించెను; తత్ = అతని; భ్రాత = సహోదరుడు; అగు = అయిన; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; అది = ఆ విషయమును; విని = విని; హరి = నారాయణుని; పరాక్రమంబున్ = పరాక్రమమునకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తన = అతని; జయంబును = జయశీలమును; బలంబునున్ = శక్తిని; పరిహరించి = తూలనాడి; గ్రద్దనన్ = వెంటనే; ఉద్దవిడిన్ = దండెత్తి; ఆ = ఆ; దనుజమర్దను = వైకుంఠుని; మందిరమున్ = వైకుంఠమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహరూపంలో పరిమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు.

8-556-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శూలాయుధహస్తుండై
కాలాకృతి వచ్చు దనుజుఁ ని విష్ణుండుం
గాజ్ఞత మాయాగుణ
శీత నిట్లని తలంచెఁ జిత్తములోనన్.

టీకా:

శూలా = శూలము యనెడి; ఆయుధ = ఆయుధము; హస్తుండు = చేతగలవాడు; ఐ = అయ్యి; కాలా = యముని; ఆకృతిన్ = వలె; వచ్చు = వచ్చెడి; దనుజున్ = రాక్షసుని; కని = చూసి; విష్ణుండున్ = నారాయణుడు; కాలజ్ఞతన్ = సమయజ్ఞతతో; మాయా = మాయగల; గుణశీలతన్ = లక్షణములతో; ఇట్లు = ఇలా; అ = అని; తలచెన్ = భావించెను; చిత్తము = మనసు; లోనన్ = అందు.

భావము:

అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాలయమునివలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూసి, సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక, విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు.

8-557-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు నంచుం గ్రియా
విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.

టీకా:

ఎదురై = ఎదిరించి; పోర = యుద్ధము చేయుటకు; జయింపన్ = జయించుటకు; రాదు = వీలుకాదు; ఇతనిన్ = ఇతనిని; కాక = అలాకాకుండగ; ఎందేనియున్ = ఎక్కడకైనను; పోవన్ = పోయినచో; భీప్రదుడు = భయము కలిగించెడివాడు; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులను; తోలున్ = తరుమును; మృత్యువు = మరణము; క్రియన్ = వలె; పైవచ్చు = మీదికివచ్చును; అంచున్ = అనుచు; క్రియా = ఉపాయము; విదుడు = తెలిసినవాడు; అబ్జాక్షుడు = నారాయణుడు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమునన్ = రూపముతో; ఆవేశించె = ప్రవేశించెను; నిశ్శ్వాసరంధ్ర = ముక్కు; దిశన్ = ద్వారా; దైత్యు = రాక్షసుని; హృత్ = హృదయము; అంతరాళమునన్ = లోనికి; ప్రత్యక్షక్రియా = ఎదుర్కొనుటకు; భీరుడు = బెదరినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకొని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు.

8-558-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెదకి హరిం గానక కోపంబు మానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబు నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీక్షించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు చాలించి, తనలో నిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; దైత్య = రాక్షస; వల్లభుండు = రాజు; వైష్ణవాలయంబున్ = వైకుంఠమును {వైష్ణవాలయము -విష్ణువు యొక్క నివాసము, వైకుంఠము}; చొచ్చి = ప్రవేశించి; వెదకి = అన్వేషించి; హరిన్ = విష్ణుని; కానక = కనుగొనలేక; కోపంబు = కోపము; మానక = వదలకుండ; మిన్ను = ఆకాశము; మన్ను = నేల; అన్వేషించి = వెతికి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - భూర్భువస్సువః త్రిలోకములలోని మూడవది, స్వర్గము}; అరసి = గాలించి; దిశలన్ = దిక్కులను; పరికించి = పరిశీలించి చూసి; భూవివరంబులున్ = బొరియ గుహాదులందు; వీక్షించి = చూసి; సముద్రంబులు = సముద్రములలో; వెదకి = అన్వేషించి; పురంబులు = పట్టణములు; శోధించి = వెతికి; వనంబులున్ = అడవులను; విమర్శించి = గాలించి; పాతాళంబున్ = పాతాళమును; పరీక్షించి = వెతికి; జగంబునన్ = జగత్తునందు; అదృష్ట = కనబడని; శత్రుండు = శత్రువు కలవాడు; ఐ = అయ్యి; మార్గణంబు = వెతకుట; చాలించి = ఆపివేసి; తన = తన; లోనన్ = మనసులో; ఇట్లు = ఇలా; అనియె = అనుకొనెను.

భావము:

ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి, విష్ణువు కోసం వెదకాడు. కానీ పగవాడు కనిపించ లేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అంతటా వెదకాడు. లోకంలో విష్ణువుజాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఇలా అనుకున్నాడు.

8-559-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పవాఁడు మడియ నోపును
దెడేనియు నెదురుపడఁడె? దేహధరులకుం
దెగిన యెడఁ బగఱ మీఁదనుఁ
గఁ గొనఁ దగ ద నుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్. "

టీకా:

పగవాడు = శత్రువు; మడియన్ = మరణించి; ఓపున్ = యుండిఉండవచ్చును; తెగడు = మరణించక ఉన్నవాడు; ఏనియున్ = అయినచో; ఎదురుపడడె = ఎదుర్కొనెడివాడేకదా; దేహధరుల్ = జీవుల; కున్ = కు; తెగిన = మరణించిన; ఎడన్ = తరువాత; పగఱ = శత్రువుల; మీదనున్ = పైన; పగగొన = పగబూనుట; తగదు = యుక్తముకాదు; అనుచునున్ = అనుచు; ఉడిగెన్ = విడిచెను; ప్రాభవశక్తిన్ = దండయాత్రను;

భావము:

“నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూనడం తగదు.” అని హిరణ్యకశిపుడు అనుకొని విష్ణువుపై దండయాత్ర ఆపెను

8-560-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అతండు మీ ప్రపితామహుం; డతని గుణంబు లనేకంబులు గల; వవి యట్లుండనిమ్ము.

టీకా:

అతండు = అటువంటివాడు; మీ = మీ యొక్క; ప్రపితామహుండు = ముత్తాత; అతని = అతని యొక్క; గుణంబుల్ = గొప్పగుణములు; అనేకంబులు = చాలా; కలవు = ఉన్నాయి; అవి = వానిని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనియ్యి.

భావము:

ఈవిధంగా అనుకొని దండయాత్ర ఆపేసాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో. వాటిని అలా ఉండనీ.

8-561-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుర భూసురగతిఁ బురు
హూతాదులుఁ దన్ను వేఁడ నొగిఁ గొం డనుచున్
మీ తండ్రి యిచ్చె నాయువు
నేన్మాత్రుఁడవె నీవు నీలోకమునన్?

టీకా:

ఆతుర = ఆపదలోనున్న; భూసుర = బ్రాహ్మణుల; గతిన్ = వలె; పురుహూత = ఇంద్రుడు {పురుహూతుడు - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, ఇంద్రుడు}; ఆదులున్ = మొదలగువారు; తన్ను = తనను; వేడన్ = అర్థించగా; ఒగిన్ = ఒప్పుకొని; కొండు = తీసుకొనండి; అనుచున్ = అనుచు; మీ = మీ యొక్క; తండ్రి = నాన్న; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; ఆయువున్ = ఆయుష్షును; ఏతన్మాత్రుడవె = వారికి తీసిపోనివాడవే కదా; నీవున్ = నీవుకూడ; ఈ = ఈ; లోకమునన్ = లోకములో.

భావము:

ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా ఇంద్రాదులు బ్రహ్మణులవలె బాధ నటిస్తూ అర్థించగా సరే తీనుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దానమిచ్చేసాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు.

8-562-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితివి మూఁడు జగములుఁ;
దోలితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం
బోలితివి దానగుణముల;
సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్.

టీకా:

ఏలితివి = పరిపాలించితివి; మూడుజగములున్ = ముల్లోకములను; తోలితివి = తరిమితివి; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మున్నగు; సురలన్ = దేవతలను; తొల్లిటివారిన్ = పూర్వులను; పోలితివి = సరిపోలితివి; దాన = దానముచేసెడి; గుణములన్ = లక్షణములతో; సోలితివి = పారవశ్యము పొందితివి; పిశాచ = భీకరులైన; రాక్షసులన్ = రాక్షసులను; రక్షింపన్ = కాపాడుటయందు.

భావము:

నీవు ముల్లోకాలనూ పాలించావు. ఇంద్రాది దేవతలను ఓడించావు. దానమివ్వడంలోనూ గుణాలలోనూ మీ పెద్దలకు సరిపోలిన వాడవు అయ్యావు. రాక్షసులను రక్షించడంలో సమర్థుడవు అయ్యావు.