పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మీనావతారుని ఆనతి

  •  
  •  
  •  

8-705-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.

టీకా:

అని = అని; పలుకు = అనెడి; సత్యవ్రత = సత్యవ్రతుడు యనెడి; మహారాజున్ = మహారాజున; కున్ = కు; ఆ = ఆ; యుగంబు = యుగ; కడపటన్ = అంతమునందు; ప్రళయ = ప్రళయమువచ్చెడి; వేళన్ = సమయమునందు; సముద్రంబున్ = సముద్రమునందు; ఏకాంతన్ = ఒంటరిగా; చనన్ = గడపవలెనని; ప్రీతుండను = కోరెడివాడను; ఐ = అయ్యి; విహరింపన్ = సంచరించుటను; ఇచ్ఛించి = కోరి; మీన = చేప; రూప = స్వరూపము; ధరుండు = ధరించినవాడు; ఐన = అయిన; హరి = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు.

8-706-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"టమీఁద నీ రాత్రికేడవదినమునఁ-
ద్మగర్భున కొక్క గలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి-
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున-
దానిపై నోషధితులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ-
లవు సప్తర్షులుఁ లసి తిరుఁగ

8-706.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు రవరేణ్య!

టీకా:

ఇటమీద = ఇకపైన; రాత్రి = రాత్రి; కిన్ = గడచినతరువాతి; దినమున = రోజు; పద్మగర్భున్ = బ్రహ్మదేవున; కున్ = కు; ఒక్క = ఒక; పగలు = దినభాగము; నిండున్ = పూర్తగును; భూర్భువాదికజగంబులు = భూః (భూలోకము,) భువః (పాతాళలోకము) సువః (స్వర్గలోకము); మూడున్ = మూడు; విలయ = ప్రళయము యనెడి; అబ్ధిన్ = సముద్రము; లోనన్ = అందు; మునుంగును = మునిగిపోవును; ఆలోనన్ = అప్పుడు; పెద్ద = పెద్దదైన; నావ = నావ; చేరగ = దగ్గరగా; వచ్చున్ = వచ్చును; నా = నా యొక్క; పంపుపెంపునన్ = ఆజ్ఞానుసారమున; దాని = దాని; పైన్ = మీద; ఓషధి = మొక్కల {ఓషధి - ఫలించగనేనశించు వృక్షజాతులు}; తతులున్ = సమూహములు; బీజ = విత్తనముల; రాసులున్ = సమూహములు; ఇడి = ఉంచి; పయోరాశిన్ = సముద్రము {పయోరాశి - పయస్ (నీటి) రాశి, కడలి}; లోన్ = అందు; విహరింపగలవు = సంచరింపుము; సప్తర్షులున్ = సప్తఋషుల; కలసి = తోకూడ; తిరుగన్ = చరించుచుండగా.
మ్రోలన్ = ఎదురుగా ఉన్నదికూడ; కానరాక = కనబడకుండనంతగా; ముంచు = ముంచుకొచ్చిన; పెంజీకటి = పెద్దచీకటి, కటికచీకటి; మిడుకుచున్ = ఆవరించి; ఉండున్ = ఉండును; మునుల = ఋషుల; మేని = దేహ; వెలుగున్ = కాంతి; తొలకుచున్ = మిణుకుమిణుకుమనుచు; ఉండున్ = ఉండును; జలధిన్ = సముద్రమునందు {జలధి - జలమునకునిధి, కడలి}; దోదూయమానము = ఊగుతూతూగుతూఉన్నది; ఐ = అయ్యి; నావ = పెద్దపడవ; తేలుచున్ = తేలుతూ; ఉండున్ = ఉండును; నరవరేణ్య = రాజా {నరవరేణ్యుడు - నరులలోవరేణ్యుడు, రాజు}.

భావము:

“ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.

8-707-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలంకుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడియుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; నొక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట నిప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి"నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; నయ్యవసరంబున.

టీకా:

మఱియున్ = మరి; ఆ = ఆ; నావన్ = నావను; మున్నీటన్ = సముద్రపు; కరళ్ళ = తీక్ష్ణమైన అలల; కున్ = కి; లోనుకాకుండ = దెబ్బతినకుండగా; ఇరు = రెండు (2); కెలంకులన్ = పక్కలను; వెనుక = వెనుకపక్క; ముందటన్ = ముందుపక్క; ఏమఱకన్ = ఏమరుపాటులేకుండ; పెన్ = పెద్దగా; నెఱులు = వ్యాపించినవి; అగు = అయిన; నా = నా యొక్క; గఱులన్ = రెక్కలతో; జడియుచున్ = భయపెడుతు; పొడువన్ = పొడుచుటకు; వచ్చిన = వచ్చెడి; పలు = అనేకమైన; గ్రాహంబులన్ = జలచరములను; ఒడియుచున్ = తరిమేస్తూ; సంచరించెదన్ = తిరిగెదను; ఒక్క = ఒక; పెను = పెద్ద; పాము = సర్పము; చేరువన్ = దగ్గరలో; నా = నా; అనుమతిన్ = అంగీకారముతో; పొడచూపెడున్ = కనబడును; దానన్ = దాని; చేసి = తో; సుడిగాడ్పుల = సుడిగాలుల; కతంబునన్ = వలన; నావ = నావ; వడిన్ = గబుక్కున; తిరుగబడకుండన్ = తిరగబడిపోకుండ; నా = నా యొక్క; కొమ్ము = కొమ్ము; తుదిన్ = చివర; పదిలమున్ = జాగ్రత్తగాకట్టబడిదిగా; చేసి = చేసి; నీ = నీ; కున్ = కు; తపసుల్ = ఋషుల; కున్ = కు; అలజడి = ఆపదలు; చెందకుండ = కలుగకుండగ; మున్నీటన్ = సముద్రమునందు; ఈ = ఈ; పాటన్ = విధముగ; తమ్మిచూలిరేయి = ప్రళయపురాత్రి {తమ్మిచూలిరేయి - తమ్మిచూలి (పద్మమున పుట్టినవాడైన బ్రహ్మ)కి రేయి (రాత్రి), ప్రళయపురాత్రి}; వేగున్ = వెళ్లే; అంతకున్ = అంతవరకు; మెలంగెదన్ = గడిపెదను; అది = అదే; కారణంబు = కారణము; కాన్ = వలన; జలచర = చేప; రూపంబునన్ = స్వరూపమును; కయికొంటిన్ = స్వీకరించితిని; మఱియున్ = ఇంతేకాకుండగ; ఒక = ఇంకొక; ప్రయోజనంబున్ = ప్రయోజనము; కలదు = ఉన్నది; నా = నా యొక్క; మహిమన్ = మహిమ; పరబ్రహ్మంబు = పరబ్రహ్మస్వరూపము; అని = అని; తెలియుము = తెలిసికొనుము; నిన్నున్ = నిన్ను; అనుగ్రహించితిని = అనుగ్రహించితిని; అని = అని; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; చూడన్ = చూచుచుండగా; హరి = విష్ణుమూర్తి; తిరోహితుండు = అదృశ్యమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; అయ్యవసరబునన్ = అప్పుడు.

భావము:

మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్నివైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానిక వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం, అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకూ మునీశ్వరులకూ చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకొక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను.” ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు.

8-708-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
లఁచికొనుచు రాచపసి యొక్క
ర్భశయ్యఁ దూర్పుఁ లగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

టీకా:

మత్స్యరూపి = చేపస్వరూపము కలవాడు; ఐన = అయిన; మాధవున్ = విష్ణుని; నుడుగులు = మాటలు; తలచికొనుచున్ = తలచుకొంటూ; రాచతపసి = రాజర్షి; ఒక్క = ఒక; దర్భశయ్యన్ = దర్భలశయ్యపైన; తూర్పున్ = తూర్పువైపునకు; తలగడ = దిండు; కాన్ = ఉండునట్లు; పండి = పడుకొని; కాచి = వేచి, ఎదురుచూచుచు; ఉండెన్ = ఉండెను; నాటి = అప్పటి; కాలమున్ = సమయము; కున్ = కోసము.

భావము:

అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.

8-709-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ గల్పాంతంబు డాసిన

టీకా:

అంతన్ = అంతట; కల్పాంతము = ప్రళయము; డాసిన = దగ్గరపడగా.

భావము:

ఇంతలో ప్రళయ సమయం దగ్గరపడగా. . . .

8-710-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లసిత మేఘ పంక్తులు
ల్లించి మహోగ్రవృష్టి డిగొని కురియన్
వెల్లి విరిసి జలరాసులు
చెల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.

టీకా:

ఉల్లసిత = మెరుపులతోకూడిన; మేఘ = మేఘముల; పంక్తులు = సమూహములు; జల్లించి = జల్లుజల్లులుగా; మహా = మిక్కిలి; ఉగ్ర = భీకరమైన; వృష్టిన్ = వర్షము; జడిగొని = ఎడతెగకుండ; కురియన్ = కురియగా; వెల్లివిరిసి = పొంగిపోయి; జలరాసులు = సముద్రములు; చెల్లెలికట్టలను = చెలియలికట్టలను; దాటి = దాటిపోయి; సీమలన్ = అన్నిప్రదేశములను; ముంచెన్ = ముంచివేసెను.

భావము:

మెరపులతో కూడిన మేఘాలు ఎడతెరపిలేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి, సముద్రాలు చెలియలికట్ట దాటి పొంగిపొరలి దేశాలను ముంచేస్తున్నాయి.