పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భగీరథుని చరితంబు

  •  
  •  
  •  

9-219-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సుతుండు భగీరథుఁ
తి తప మొనరించి కనియె మృతాపాంగన్
సురంగన్ ముఖవనరుహ
భృంగన్ శివజటాగ్రరంగన్ గంగన్.

టీకా:

అతని = అతనియొక్క; సుతుండు = కొడుకు; భగీరథుడు = భగీరథుడు; అతి = గొప్ప; తపమున్ = తపస్సును; ఒనరించి = చేసి; కనియెన్ = దర్శించెను; అమృతా = అమృతమయమైన; అపాంగన్ = కటాక్షములు కలామెను; సు = మంచి; తరంగన్ = అలలు కలామెను; ముఖ = మోము యనండి; వనరుహ = పద్మమునందు; రత = రమించెడి; భృంగన్ = తుమ్మెదలు కలామెను; శివ = శంకరుని; జట = జటాజూటము; అగ్ర = పైన; రంగన్ = విలసిల్లు యామెను; గంగన్ = గంగను.

భావము:

గంగమయి అమృతమయి, కరుణామయి. ఆమె మంచి అలల కలిగి ఉంటుంది. ముఖపద్మంపై తుమ్మెదలు మూగుతూ ఉంటాయి. శంకరుని జటాజూటంపై విలసిల్లుతూ ఉంటుంది. అట్టి పరమ పవిత్రమైన గంగను దిలీపుని కొడుకు భగీరథుడు గొప్ప తపస్సు చేసి దర్శించాడు.

9-220-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని నమస్కరించిన గంగ గృపజేసి, వరంబు వేఁడు మనిన నా రాచపట్టి యిట్లనియె.

టీకా:

కని = దర్శించి; నమస్కరించినన్ = నమస్కరించగా; గంగ = గంగ; కృపజేసి = దయచూపి; వరంబున్ = వరమును; వేడుము = కోరుకొనుము; అనినన్ = అనగా; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా దర్శనం ఇచ్చిన గంగకు నమస్కరించగా, దయ చూపి వరం కోరుకో అంది. ఆ రాకుమారుడు ఈ విధముగ అన్నాడు.

9-221-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మా వారి భస్మరాసుల
నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!

టీకా:

మా = మాయొక్క; వారి = జనుల; భస్మ = బూడిద; రాసులన్ = గుట్టలను; నీ = నీయొక్క; వారిన్ = నీటియందు; కలిపికొనుము = కలిపేసుకొనుము; నెఱిన్ = చక్కగా; మా = మాయొక్క; వారల్ = జనులు; నీ = నీయొక్క; వారిన్ = నీటిలో; కలయన్ = కలయుటచేత; నాకమున్ = స్వర్గము; మా = మాయొక్క; వారి = జనుల; కిన్ = కి; కలుగున్ = దొరుకును; ఇది = ఇది; ప్రమాణము = యథార్థము; తల్లీ = అమ్మా.

భావము:

“అమ్మా! మా వారి బూడిద గుట్టలను నీ నీటిలో కలిపేసుకో. మా వారికి నీ నీటిలో కలయుట వలన తప్పక ఉన్నత గతి లభిస్తుంది.

9-222-ఇం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెల్లన్ మదిన్ నిన్ను భజింతు గంగన్
ఫుల్లాంతరంగన్ బహుపుణ్యసంగం
ల్లోలలక్ష్మీజితకాశమల్లిం
ల్లిన్ సుధీకల్పలతామతల్లిన్.'

టీకా:

చెల్లన్ = తగినట్లుగ; మదిన్ = మనస్ఫూర్తిగ; నిన్నున్ = నిన్ను; భజింతున్ = పూజించెదను; గంగన్ = గంగాదేవిని; ఫుల్ల = వికసించిన; అంతరంగన్ = హృదయము కలామెను; బహు = అనేకమైన; పుణ్య = పవిత్రతలు; సంగన్ = కలిగినామెను; కల్లోల = అలల; లక్ష్మిన్ = శోభచేత; జితకాశ = జయించబడిన; మల్లిన్ = మల్లెలు కలామెను; తల్లిన్ = మాతను; సుధీ = ఉత్తములపాలిటి; కల్పలతామతల్లిన్ = శ్రేష్ఠమైన కల్పవల్లిని.

భావము:

హృదయ వికాసం కలామె, సకల పవిత్రతలు కలామె, అలల శోభతో కూడిన మల్లెలు కలామె, ఉత్తములపాలిటి కల్పవల్లి అయిన ఓ మా గంగామాతా! మనస్ఫూర్తిగ నిన్ను పూజిస్తాను.”

9-223-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వినుతి చేయుచున్న రాజకుమారునకు లోకపావ నిట్లనియె.

టీకా:

అని = అని; వినుతి = స్తుతి; చేయుచున్ = చేస్తున్న; రాజకుమారున్ = రాకుమారుని; కున్ = కి; లోక = లోకులను; పావని = పవిత్రముచేసెడి యామె; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని స్తుతిస్తున్న రాకుమారునికి లోకపవిత్ర గంగామయి ఈ విధంగ అంది.

9-224-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినువీథిం బఱతెంచి నేలఁబడు నా వేగంబునున్ నిల్ప నో
పివాఁ డెవ్వడు? మేదినీతలము నే భేదించి పాతాళముం
నుదున్; వచ్చితినేని నా జలములన్ సంస్నాతులై మానవుల్
నుఁ బొందించు నఘవ్రజం బెచట నే నాశంబుఁ బొందించెదన్.

టీకా:

విను = ఆకాశ; వీథిన్ = మార్గమున; పఱతెంచి = పరుగెట్టుకొచ్చి; నేలన్ = నేలమీద; పడు = పడెడి; నా = నాయొక్క; వేగంబున్ = వేగమును; నిల్పన్ = ఆపెడి; ఓపినవాడు = సమర్థుడు; ఎవ్వడు = ఎవరు; మేదినీ = భూ; తలమున్ = మండలమును; నేన్ = నేను; భేదించి = బద్దలుకొట్టి; పాతాళమున్ = పాతాళలోకమునకు; చనుదున్ = పోయెదను; వచ్చితిని = అవతరించితిని; ఏనిన్ = అయినచో; నా = నాయొక్క; జలములన్ = నీటియందు; సంస్నాతులు = స్నానములుచేసినవారు; ఐ = అయ్యి; మానవుల్ = మనుషులు; ననున్ = నాకు; పొందించు = కలిగించెడు; అఘ = పాపపు; వ్రజంబున్ = సమూహమును; ఎచటన్ = ఎక్కడ; నేన్ = నేను; నాశంబున్ = పోవుటను; పొందించెదన్ = కలిగించుకొనగలను.

భావము:

“ఆకాశ మార్గాన అతివేగంగా నేలమీద పడే నా వేగానికి భూమిని బ్రద్దలుకొట్టి పాతాళానికి పోతాను. అలా కాకుండా ఆపగల సమర్థుడు ఎవరు ఉన్నారు? అంతేకాక, భూలోకంలో నేను అవతరిస్తే నా నీటిలో స్నానాలు చేసిన మానవుల వలన నాకు కలిగే పాపాలను నేను ఎక్కడ పోగొట్టుకొనగలను?

9-225-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది కారణంబుగా విచారించెద” నని పలుకుచున్న లోకమాతకు రాజన్యవర్యుండగు భగీరథుం డిట్లనియె.

టీకా:

అది = ఆ; కారణంబుగాన్ = కారణముచేత; విచారించెదన్ = సంశయించుచున్నాను; అని = అని; పలుకుచున్న = చెప్పుతున్నట్టి; లోకమాత = లోకులకుతల్లి; కున్ = కి; రాజన్య = రాజులలో; వర్యుండు = శ్రేష్ఠుడు; అగు = ఐన; భగీరథుండు = భగీరథుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందుకనే నేను సంశయిస్తున్నాను.” అని అంటున్న లోకమాత గంగాదేవితో భగీరథుడు ఇలా అన్నాడు.

9-226-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తత్త్వజ్ఞులు శాంతచిత్తులు తపః పారీణు లార్యుల్ ఘనుల్
బురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్ చేయఁగా
సంఘాఘము నిన్నుఁ బొందునె జగన్నాథుండు నానాఘ సం
రుఁ డా విష్ణుఁడు వారిచిత్తములఁ దా నై యుంట మందాకినీ.

టీకా:

పరతత్త్వజ్ఞులు = పరబ్రహ్మజ్ఞానలు; శాంతచిత్తులు = శాంతస్వభావులు; తపస్ = తపస్సుచేయుటలో; పారీణులు = మిక్కిలినేర్పరులు; ఆర్యుల్ = పూజ్యులు; ఘనుల్ = గొప్పవారు; పురుష = మానవులలో; శ్రేష్ఠులు = ఉత్తములు; వచ్చి = చేరి; తల్లి = అమ్మా; భవత్ = నీయొక్క; అంభోగావముల్ = నీటిస్నానములు; చేయగాన్ = చేయుటవలన; నర = మానవ; సంఘ = జాతి; అఘము = పాపము; నిన్నున్ = నిన్ను; పొందునె = చెందునా, చెందదు; జగన్నాథుండు = విష్ణుమూర్తి {జగన్నాథుడు - భువనములకు ప్రభువు, విష్ణువు}; నానా = సమస్తమైన; అఘ = పాపములను; సంహరుడు = నాశనముచేయువాడు; ఆ = ఆ; విష్ణుడు = విష్ణుమూర్తి; వారి = వారియొక్క; చిత్తములన్ = మనసులందు; తానై = తానుగా; ఉంటన్ = ఉండుటచేత; మందాకినీ = గంగా {మందాకిని - మందముగ వక్రగమనముతో ప్రవహించునది, ఆకాశగంగ}.

భావము:

“అమ్మా! గంగాదేవీ! పరబ్రహ్మజ్ఞానులు, పరమ శాంత స్వభావులు, మహా తపోధనులు, పూజ్యులు అయిన మానవోత్తముల యందు విష్ణుమూర్తి ఉంటాడు కదా. అట్టి మహానుభావులు చేరి నీ నీటిలో స్నానాలు చేయుట వలన పాపులు వచ్చి స్నానాలు చేసి కలిపిన సర్వ పాపాలు నశిస్తాయి తల్లీ!

9-227-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్
నీ! తంతువులందుఁ జీర గల యా చందంబునన్ విశ్వభా
నుఁడై యొప్పు శివుండు గాక మఱి నీ వారిన్ నివారింప నే
ర్చి వారెవ్వరు? నిన్ ధరించుకొఱకై శ్రీకంఠునిం గొల్చెదన్."

టీకా:

తన = తన; లోనన్ = అందు; ఇన్ని = సమస్తమైన; జగంబులున్ = భువనములు; కలుగుటన్ = ఉండుటచేత; తాన్ = అతను; అన్నిటన్ = సమస్తమందు; కల్గుటన్ = ఉండుటచేత; జననీ = అమ్మా; తంతువులు = దారముల; అందున్ = లో; చీర = వస్త్రమువలె; కల = ఉన్న; ఆ = ఆ; చందంబునన్ = విధముగ; విశ్వ = భువనములను; భావనుడు = రచించువాడు; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; శివుండు = పరమశివుడు; కాక = తప్పించి; మఱి = మరింకొకరు; నీ = నీయొక్క; వారిన్ = వేగమును; నివారింపన్ = ఆపుట; నేర్చిన = చేయగలిగిన; వారు = వారు; ఎవ్వరు = ఎవరున్నారు; నిన్ = నిన్ను; ధరించు = ధరించుట; కొఱకై = కోసము; శ్రీకంఠుని = పరమశివుని {శ్రీకంఠుడు - వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు}; కొల్చెదన్ = సేవించెదను.

భావము:

అమ్మా! పరమ శివుడు తనలో సకల భువనములు కలవాడు, సమస్తమందు తాను ఉంటాడు, దారములలో వస్త్రమువలె, సకల జగత్తులను రచిస్తుంటాడు. ఆయన తప్పించి మరింకెవరు నీ వేగాన్ని తట్టుకొనలేరు. అందుచేత నిన్ను ధరించుట కోసం శ్రీకంఠుడిని సేవిస్తాను.”

9-228-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యెఱింగించి వీడ్కొని, చని, భగీరథుండు మహేశ్వరు నుద్దేశించి గ్రద్దనఁ దపంబు చేసిన.

టీకా:

అని = అని; ఎఱిగించి = తెలిపి; వీడ్కొని = సెలవుతీసుకొని; చని = వెళ్ళి; భగీరథుండు = భగీరథుడు; మహేశ్వరున్ = పరమశివుని; ఉద్దేశించి = గురించి; గ్రద్దన = వెంటనే; తపంబున్ = తపస్సు; చేసినన్ = చేయగా.

భావము:

అని గంగాదేవికి చెప్పి సెలవుతీసుకొని వెళ్ళి, భగీరథుడు పరమశివుని గురించి తపస్సు చేసాడు.

9-229-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తవత్సలుండు ఫాలాక్షుఁ డా భగీ
థుని మెచ్చి నిజ శిరంబునందు
శౌరిపాదపూత లిల మై దివి నుండి
రకు వచ్చు గంగఁ దాల్చె నపుడు.

టీకా:

భక్త = భక్తులకు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; ఫాలాక్షుడు = పరమశివుడు {ఫాలాక్షుడు - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్నుగలవాడు), శంకరుడు}; ఆ = ఆ; భగీరథుని = భగీరథుని; మెచ్చి = మెచ్చుకొని; నిజ = తనయొక్క; శిరంబున్ = తల; అందున్ = పైన; శౌరి = విష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; పాద = పాదములనుసోకి; పూత = పవిత్రమైన; సలిలము = జలము; ఐ = అయ్యి; దివి = ఆకాశము; నుండి = నుండి; ధర = భూమి; కున్ = కి; వచ్చు = వచ్చెడి; గంగన్ = దేవ గంగను; తాల్చెన్ = ధరించెను; అపుడు = అప్పుడు.

భావము:

భక్తవత్సలుడు ఫాలాక్షుడు భగీరథుని మెచ్చుకొని ఆకాశం నుండి భూలోకాన అవతరించ వచ్చే విష్ణుపాది అయిన గంగను తన తల మీద దర్శిస్తాను అని వరం ఇచ్చాడు. అప్పుడు...