పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీకృష్ణావతార కథా సూచన

  •  
  •  
  •  

9-723-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుష్టజన నిగ్రహంబును
శిష్టజనానుగ్రహంబు చేయుట కొఱకై
ష్టమగర్భమున గుణో
త్కృష్టుఁడు దేవకికి విష్ణుదేవుఁడు పుట్టెన్.

టీకా:

దుష్ట = పాపులైన; జన = వారిని; నిగ్రహంబునున్ = నిగ్రహించుట; శిష్ట = మంచి; జన = వారిని; అనుగ్రహంబున్ = అనుగ్రహించుట; చేయుట = చేయుట; కొఱకు = కోసము; ఐ = అయ్యి; అష్టమ = ఎనిమిదవ (8); గర్భమునన్ = గర్భమునందు; గుణ = సుగుణములందు; ఉత్కృష్టుడు = శ్రేష్ఠమైనవాడు; దేవకి = దేవకీదేవి; కిన్ = కి; విష్ణుదేవుడు = శ్రీమహావిష్ణువు; పుట్టెన్ = జన్మించెను.

భావము:

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయుట కోసం ఎనిమిదవ గర్భంలో సుగుణశ్రేష్ఠుడు శ్రీమహావిష్ణువు దేవకీదేవి యందు అవతరించాడు.

9-724-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుఁ డుదితుఁడైన వెనుక నా దేవకి
ద్రమూర్తి యగు సుద్రఁ గనియె;
నా గుణాఢ్య ముత్తగు నీకు నర్జును
యిత యగుటఁ జేసి రణినాథ!

టీకా:

విష్ణుడు = విష్ణుమూర్తి; ఉదితుడు = పుట్టినవాడు; ఐన = అయిన; వెనుకన్ = తరువాత; ఆ = ఆ; దేవకి = దేవకీదేవి; భద్రమూర్తి = శుభకరురాలు; అగ = అయిన; సుభద్రన్ = సుభద్రను; కనియెన్ = కనెను; ఆ = ఆ; గుణాఢ్య = సుగుణవతి; ముత్తవ = ముత్తవ్వ; అగున్ = అగున్; నీ = నీ; కున్ = కు; అర్జును = అర్జునుని; దయిత = భారయ; అగుటన్ = అగుట; చేసి = వలన; ధరణీనాథ = రాజా {ధరణీనాథుడు - భూమికి భర్త, రాజు}.

భావము:

విష్ణుమూర్తి పుట్టాక ఆ దేవకీదేవి సుభద్రను కన్నది. ఆ సుగుణవతి అర్జునుని భార్య. కనుక, నీకు ముత్తవ్వ అవుతుంది.

9-725-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు ధర్మక్షయ మగు
నెప్పుడు పాపంబుపొడము నీ లోకములో
ప్పుడు విశ్వేశుఁడు హరి
ప్పక విభఁ డయ్యుఁ దన్నుఁ దా సృజియించున్.

టీకా:

ఎప్పుడు = ఎప్పుడైతే; ధర్మ = ధర్మము; క్షయము = క్షీణించినది; అగున్ = అగునో; ఎప్పుడు = ఎప్పుడైతే; పాపంబున్ = పాపములు; పొడమున్ = అతిశయించునో; ఈ = ఈ; లోకము = లోకము; లోన్ = అందు; అప్పుడున్ = ఆ కాలమునందు; విశ్వేశుడు = విష్ణుమూర్తి {విశ్వేశుడు - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి}; హరి = విష్ణుమూర్తి; తప్పక = తప్పకుండగ; విభుడు = భగవంతుడు; అయ్యున్ = అయినప్పటికిని; తన్ను = తనను; తాను = తనే; సృజియించున్ = సృష్టించును.

భావము:

ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ఎప్పుడైతే పాపాలు అతిశయిస్తాయో, అప్పుడు విశ్వేశుడైన విష్ణుమూర్తి తప్పకుండగ తాను సర్వవ్యాపకుడు అయినప్పటికి తనను తనే సృష్టించుకుంటాడు (అవతరిస్తాడు).

9-726-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాయ లేక పరునకు
నునకుఁ నీశ్వరున కాత్మర్తకు హరికిన్
నములకుఁ గర్మములకు
నుజేశ్వర! కారణంబు ఱియును గలదే?

టీకా:

తన = తన యొక్క; మాయ = మాయ; లేక = కాకుండ; పరున్ = పరమాత్మ; కున్ = కి; ఘనున్ = గొప్పవాని; కున్ = కి; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; ఆత్మకర్త = ఆత్మస్వరూపుని; కున్ = కి; హరి = విష్ణుని; కిన్ = కి; జననముల్ = అవతరించుట; కున్ = కు; కర్మముల్ = కర్మల; కునున్ = కు; మనుజేశ్వర = రాజా; కారణంబు = కారణము; మఱియునున్ = ఇంకాఏదైనా; కలదే = ఉండునా, ఉండదు.

భావము:

ఓ రాజా పరీక్షిత్తూ! ఆ పరమాత్మకి, మహాత్మునికి, భగవంతునికి, ఆత్మస్వరూపునికి విష్ణునికి అవతరించుటకు కర్మలుగా కనబడే లీలలకు తన మాయ తప్ప కారణం ఏదీ ఉండదు.

9-727-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁపఁగ నెవ్వని మాయా
విసనములు జననవృద్ధి విలయంబులకుం
లిమి కనుగ్రహ మోక్షం
బుకును జీవునికి మూలములు నా నెగడున్.

టీకా:

తలపగన్ = భావింపగ; ఎవ్వని = ఎవని యొక్క; మాయా = మాయ; విలసనములు = విలాసములు; జనన = సృష్టి; వృద్ధి = స్థితి; విలయంబుల్ = లయముల; కున్ = కు; కలిమి = సంపదల; కిన్ = కి; అనుగ్రహ = కటాక్ష; మోక్షంబుల్ = మోక్షముల; కునున్ = కు; జీవుని = జీవుని; కిన్ = కి; మూలములున్ = మూలాధారములు; నాన్ = వలె అయ్యి; నెగడున్ = అతిశయించును.

భావము:

భావింపగ ఎవని మాయా విలాసాలు జీవుల సృష్టి, స్థితి, లయాలకు, సంపదలకి, కటాక్షమోక్షాలకు మూలాధారాలుగా అలరారుతూ ఉంటాయి.

9-728-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి సర్వేశ్వుని రయంగ జన్మాది-
రతంత్రభావ మెప్పాటఁ గలదు
రాజలాంఛనముల రాక్షసవల్లభు-
క్షౌహిణీశులై వనిఁ బుట్టి
నులను బాధింప శాసించు కొఱకునై-
సంకర్షణునితోడ ననమంది
మరుల మనముల కైన లెక్కింపంగ-
రాకుండు నట్టి కర్మములఁ జేసి

9-728.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లియుగంబున జన్మింపఁ లుగు నరుల
దుఃఖజాలంబు లన్నిటిఁ దొలఁగ నడచి
నేల వ్రేఁగెల్ల వారించి నిఖిలదిశల
విమలకీర్తులు వెదచల్లి వెలసె శౌరి.

టీకా:

అట్టి = అటువంటి; సర్వేశ్వరుని = నారాయణుని {సర్వేశ్వరుడు - సమస్తమునకు ఈశ్వరుడు, విష్ణువు}; అరయంగ = తరచిచూసినచో; జన్మ = పుట్టుక; ఆది = మున్నగువానికి; పరతంత్ర = చిక్కుకొనెడి; భావము = స్వభావము; ఎప్పాటన్ = ఏవిధముగ; కలదు = ఉండును; రాజ = రాజరికపు; లాంఛనములన్ = హోదాలతో; రాక్షస = దానవుల; వల్లభులు = రాజులు; అక్షౌహిణీ = అక్షౌహిణుల సైన్యములకు; ఈశులున్ = అధిపతులు; ఐ = అయ్యి; అవనిన్ = భూమిపైన; పుట్టి = జన్మించి; జనులను = ప్రజలను; బాధింపన్ = బాధించుచుండగా; శాసించు = శిక్షించుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; సంకర్షణుని = బలరాముని; తోడన్ = తోపాటు; జననము = పుట్టుకను; అంది = స్వీకరించి; అమరుల = దేవతల; మనముల = మనసుల; కైన = ఐనప్పటికి; లెక్కింపంగన్ = గణింప; రాకుండునట్టి = శక్యముకాని; కర్మములన్ = గొప్పకార్యములను; చేసి = ఆచరించి.
కలియుగంబునన్ = కలియుగమునందు; జన్మింపగలుగు = పుట్టబోవు; నరుల = మానవుల; దుఃఖ = దుఃఖములు; జాలంబులు = సమూహములు; అన్నిటిన్ = సమస్తమును; తొలగనడచి = పోగొట్టి; నేలన్ = భూమిపైన; వ్రేగున్ = భారము; ఎల్లన్ = అంతటిని; వారించి = పోగొట్టి; నిఖిల = అన్ని; దిశలన్ = దిక్కులందు; విమల = స్వచ్ఛమైన; కీర్తులు = కీర్తులను; వెదజల్లి = వ్యాపింపజేసి; వెలసెన్ = ప్రసిద్ధమయ్యెను; శౌరి = నారాయణుడు {శౌరి - శూరుని వంశమున పుట్టినవాడు, విష్ణువు}.

భావము:

అటువంటి సర్వేశ్వరునికి పుట్టుక మున్నగువాటిలో చిక్కుకునే స్వభావం ఎలా ఉంటుంది. రాక్షసరాజులు భూమ్మీద పుట్టి, అక్షౌహిణుల సైన్యాలకు అధిపతులు అయ్యి, ప్రజలను బాధిస్తుంటే. వారిని శిక్షించడం కోసం బలరాముని తోపాటు శ్రీమహా విష్ణువు శూరుని వంశంలో జన్మించాడు. దేవతలు సైతం గణింప శక్యంకాని గొప్పకార్యాలు ఆచరించాడు. కలియుగంలో పుట్టబోయే మానవుల దుఃఖాన్ని, అఙ్ఞానాన్ని పోగొట్టి, భూభారం తొలగించాడు; సకల దిక్కులా వ్యాపింపించిన స్వచ్ఛమైన కీర్తులతో ప్రసిద్ధుడు అయ్యాడు.

9-729-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంళహరికీర్తి మహా
గంగామృత మించుకైనఁ ర్ణాంజలులన్
సంతము జేసి ద్రావఁ దొ
లంగును గర్మంబు లావిలం బగుచు నృపా!

టీకా:

మంగళ = శుభకరమైన; హరి = నారాయణుని; కీర్తి = కీర్తి; మహా = గొప్ప; గంగా = గంగా; అమృత = అమృతమయజలములు; ఇంచుక = కొంచము; ఐనన్ = అయినప్పటికి; కర్ణ = చెవులు అనెడి; అంజలులన్ = దోసిళ్లతో; సంగతమున్ = చేదుకొనుట; చేసి = చేసికొని; త్రావన్ = తాగినచో; తొలంగును = తొలగిపోవును; కర్మంబులు = కర్మలు; ఆవిలంబులు = నశించినవి; అగుచున్ = అగుచు; నృపా = రాజా.

భావము:

ఓ రాజా పరీక్షిత్తూ! శుభకరమైన విష్ణుమూర్తి కీర్తులు అనే అమృతమయ గంగాజలాలు ఎంత కొంచమైనా చెవులు అనె దోసిళ్లతో ఆస్వాదిస్తే సకల కర్మలు నశించి, తొలగిపోతాయి.

9-730-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాక్షుని మందస్మిత
కుండలదీప్తిగండ లితాననమున్
నితలుఁ బురుషులుఁ జూచుచు
నిమిషభావంబు లేమి లయుదు రధిపా!

టీకా:

వనజాక్షుని = నారాయణుని {వనజాక్షుడు - పద్మాక్షుడు, విష్ణువు}; మందస్మిత = చిరునవ్వుతో; ఘన = గొప్ప; కుండల = చెవికుండలముల; దీప్తి = ప్రకాశించెడి; గండ = చెక్కిళ్ళుతో; కలిత = కూడిన; ఆననమున్ = మోము; వనితలున్ = స్త్రీలు; పురుషులున్ = పురుషులు; చూచుచున్ = దర్శించుకొనుచు; అనిమిష = రెప్పపాటులేకపోయెడి; భావంబున్ = స్వభాaవము; లేమిన్ = లేకపోవుట; కిన్ = కు; అలయుదురు = విచారించెదరు; అధిపా = రాజా.

భావము:

రాజా పరీక్షిత్తూ! వనజాక్షుడు శ్రీమహావిష్ణువు యొక్క చిరునవ్వుతో, కర్ణకుండలాలతో ప్రకాశించే చెక్కిళ్ళతో కూడిన మోము దర్శించిన స్త్రీ పురుషులు రెప్పపాటు విరామాన్ని కూడ భరించలేరు.

9-731-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నకుని గృహమున న్మించి మందలోఁ-
బెరిఁగి శత్రులనెల్లఁ బీఁచ మడఁచి
పెక్కండ్రు భార్యలఁ బెండ్లియై సుతశతం-
బులఁ గాంచి తను నాదిపురుషుఁ గూర్చి
క్రతువులు పెక్కులు గావించి పాండవ-
కౌరవులకు నంతఁ లహ మయిన
నందఱ సమయించి ర్జును గెలిపించి-
యుద్ధవునకుఁ దత్త్వ మొప్పఁ జెప్పి

9-731.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గధ పాండవ సృంజయ ధు దశార్హ
భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుఁ డగుచు
నుర్విభరము నివారించి, యుండ నొల్ల
కా మహామూర్తి నిజమూర్తి యందుఁ బొందె.

టీకా:

జనకుని = తండ్రి (వసుదేవుని); గృహమునన్ = ఇంటియందు; జన్మించి = పుట్టి; మంద = వ్రేపల్లె; లోన్ = అందు; పెరిగి = పెరిగి; శత్రులన్ = శత్రువులను; ఎల్లన్ = అందరి; పీచము = గర్వము; అడచి = అణగగొట్టి; పెక్కండ్రు = అనేకమంది; భార్యలన్ = భార్యలను; పెండ్లి = వివాహము; ఐ = చేసికొని; సుత = పుత్రులను; శతంబులన్ = వందలమందిని; కాంచి = పుట్టించి; తనున్ = తనను; ఆదిపురుషున్ = హరిని; గూర్చి = గురించి; క్రతువులు = యాగములు; పెక్కులు = అనేకములు; కావించి = ఆచరించి; పాండవ = పాండవులు; కౌరవుల = కౌరవులు; కున్ = కు; అంతః = మధ్యన; కలహము = యుద్ధము; అయిన = జరుగగా; అందఱన్ = అందరిని; సమయించి = రూపుమాపి; అర్జునున్ = అర్జునుని; గెలిపించి = విజయముకూర్చి; ఉద్ధవున్ = ఉద్ధవున; కున్ = కు; తత్త్వము = తత్వమును; ఒప్పజెప్పి = తెలియజెప్పి.
మగధ = మాగధులు; పాండవ = పాండవులు; సృంజయ = సృంజయులు; మధు = మధువులు; దశార్హ = దశార్హులు; భోజ = భోజులు; వృష్ణ = వృష్ణులు; అంధక = అంధకులు; ఆది = మున్నగువారిచే; సంపూజ్యుడు = చక్కగాపూజింపబడువాడు; అగుచున్ = అగుచు; ఉర్వి = భూమి; భరమున్ = భారమును; నివారించి = తొలగించి; ఉండన్ = ఇకపైన ఉండుటకు; ఒల్లక = అంగీకరించక; ఆ = ఆ; మహా = గొప్ప; మూర్తి = వ్యక్తి; నిజ = ఆత్మ; మూర్తిన్ = స్వరూపము; అందున్ = లో; పొందెన్ = కలిసిపోయెను.

భావము:

శ్రీమన్నారాయణుడు తండ్రి వసుదేవుని ఇంట పుట్టి, వ్రేపల్లెలో పెరిగి, శత్రువులను నాశనం చేసాడు. అనేకమంది భార్యలను వివాహము చేసికొని, వందల కొలది పుత్రులను కన్నాడు. ఆదిపురుషుడైన తనను హరిని గురించి అనేక యాగాలు చేసాడు. పాండవ కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో అందరిని రూపుమాపి అర్జునుని గెలిపించాడు. యుద్ధవునకు తత్వమును తెలియజెప్పాడు. మాగధ, పాండవ, సృంజయ, మధు, దశార్హ, భోజ, వృష్ణి, అంధకాది వంశాలవారు అందరిచే పూజింపబడుతూ, భూరం తొలగించాక ఆ తేజోమూర్తి, ఆత్మమూర్తిలో కలిసిపోయాడు.

9-732-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుమొగమున్ సుమధ్యమును ల్లనిదేహము లచ్చి కాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
తియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁ బొడసూపుఁగాత గనుమూసిన యప్పుడు విచ్చునప్పుడున్."

టీకా:

నగుమొగమున్ = మగుమోము; సు = చక్కటి; మధ్యమును = నడుము; నల్లని = నల్లటి; దేహము = శరీరము; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసము; అగు = ఐన; ఉరమున్ = వక్షస్థలము; మహా = గొప్ప; భుజముల్ = భుజములు; అంచిత = అలంకరింపబడిన; కుండల = చెవికుండలముల; కర్ణముల్ = చెవులు; మత్ = మదించిన; ఇభ = ఏనుగువంటి; గతియున్ = నడకలు; నీల = నల్లని; వేణియున్ = శిరోజములు; కృపారస = దయారసము ఒలికెడి; దృష్టియున్ = చూపులు; కల్గు = ఉన్నట్టి; వెన్నుడు = విష్ణువు; ఇమ్ముగన్ = కనులనిండుగా; పొడసూపుగాత = కనిపించిగాక; కను = కళ్ళు; మూసిన = మూసెడి; అప్పుడున్ = సమయమునందు; విచ్చున్ = తెరచు; అప్పుడున్ = సమయమునందు.

భావము:

చిరునవ్వులతో కూడిన ముఖము, చక్కని నడుము, నల్లని దేహము, లక్ష్మీదేవి వసించే వక్షస్థలము, గొప్ప భుజములు, అలంకరింపబడిన కర్ణకుండలాలు చెవులు, మదపుటేనుగ వంటి నడక, నల్లని కురులు, దయా రసం తొణకిసలాడు చూపులు కలిగిన శ్రీమహావిష్ణువు సదా కన్నులు మూసినప్పుడు తెరిచినప్పుడు కన్నుల పండువుగా కనుపించుగాక."

9-733-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పి.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి .

భావము:

అని శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు చెప్పిన పిమ్మట.....