కథలు - భాగవతాలు : యజ్ఞ వరాహ మూర్తి:
<h3id="యజ్ఞవరాహమూర్తి:"> తృతీయస్కంధము - యజ్ఞ వరాహ మూర్తి:

ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు,పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమనిపిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది.వరుణుడు అన్నాడు - "సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితోయుద్ధం చెయ్యి" అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగాయజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒకపంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగావేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండదు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహమూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా,ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆహుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు.స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగేవర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసు అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయననను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి,యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆయజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

అపుడు యజ్ఞవరాహంఅడుగులు తీసు అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్రఅడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలోవాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారిచిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

అలా విసిరినప్పుడుదాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖబ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితోచూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికివెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్యఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికిదానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

<h3id="హిరణ్యాక్షవధ-కర్దమునివృత్తాంతం"> తృతీయ స్కంధము - హిరణ్యాక్షవధ - కర్దముని వృత్తాంతం

యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అదినీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమునుపైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమండలమును పైకెత్తేసరికి భూదేవిపొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసినఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.

అపుడు స్వామివారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్యభయమైన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకుస్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు "నేను ఆయుధం లేనివాడితో యుద్ధం చేయను" అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనేస్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు "స్వామీ,నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలాగదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒకశాపము విమోచనం అయిపోతుంది" అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమునుప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.

ఆ గదను స్వామిఅలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడిగూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రములవెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయితన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరిసంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది.శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధపూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.

ఆదివరాహమై,యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకిఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి,చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారిజీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసంఅయిపోతుంది.

వ్యాస భగవానుడుగృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికిఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో అందులో తేడా వస్తేఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో,అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి,ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతులజీవితము.

స్వయంభువు అయినబ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప,ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. "నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమునునిర్వహించాలి. నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించిసంతానమును కను. ఇది నాకోరిక" అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతిజీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీతీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. అపుడుస్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నుల వెంటఆనందభాష్పములు రాలునని చెప్తాము. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చినశ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నీలమీద పడ్డాయి. అది ఎంతవిచిత్రమయిన సంఘటన అంటే - ఆయన కన్నుల వెంట కారిన భాష్పబిందువులు ఎక్కడ పడ్డాయో ఆపడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును"బిందు సరోవరము" అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి"ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలముఅనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషములులేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించివెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్నకాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్నుచేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగముఅనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగమును అనుభవించి వైరాగ్యమునుపొందాలి" అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు"నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు?"అని అడిగారు. అంటే ఆయన "నేను చతుర్ముఖ బ్రహ్మ చేతసృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తిచేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాటపాటించడం నా ప్రథమ కర్తవ్యమ్. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటేనాకు సౌశీల్య అయిన భార్య కావాలి" అని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకుపరమాత్మ సంతోషించి "కర్దమ ప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలాసంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువమనువు వస్తున్నాడు. ఆయనకు "అకూతి", "దేవహూతి","ప్రసూతి" అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతిఅనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లనుఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలోతరిస్తారు" అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కలసవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒకరెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేతప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతిపొంగిపోయాడు.

కర్దమ ప్రజాపతినిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానేవచ్చింది. స్వాయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూపతోటి, తన కుమార్తె అయిన దేవహూతి తోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు.కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమప్రజాపతి పాదములకు స్వాయంభువ మనువు నమస్కరించి "నాకు ముగ్గరు కుమార్తెలు.అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినసౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములనువర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నాకుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడినిచేయవలసినది" అని అడిగాడు. అపుడు కర్దమ ప్రజాపతి "నీ కుమార్తె ఎంతటిసౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీకుమార్తెను చేపట్టగలరు. నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకుఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదనిశ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెనుభార్యగా స్వీకరిస్తాను" అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతిల వివాహంప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీమార్గదర్శకం.

శ్రీమన్నారాయణుడుకర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువ మనువు కూతురునుకర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తనరాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలోఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.