టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (అనఘ - అష్టాంగ)
శ్రీరామ
196} అనఘచరితుడు - పాపములుకాని వర్తనములు కలవాడు, విష్ణువు :-
[3-304.1-తే.]
197} అనఘచరిత్రుడు - పుణ్య వర్తనుడు, కృష్ణుడు :-
[10.2-698-తే.]
198} అనఘచరిత్రుడు - పుణ్యవంతమైన నడవడి కలవాడు, భృగువు :-
[10.2-1277-క.]
199} అనఘాత్ముడు - అనఘ (పాపములేని) ఆత్ముడు (ఆత్మ గలవాడు), పుణ్యాత్ముడు :-
[3-186-క., 3-303-క., 3-304.1-తే., 5.2-3-క., 10.1-854-క.]
200} అనఘుడు - పుణ్యుడు, పాపరహితుడు, పాపములు లేనివాడు, విష్ణువు :-
[2-110-మ., 3-582-క., 3-671-మ., 3-755-మ., 3-833-క., 3-861-క., 3-1024-క., 10.1-1653.1-ఆ., 10.2-102-క.]
201} అనన్యదత్తము - ఇతరులు ఎవ్వరికిని ఇవ్వబడనిది, అన్యదత్తము (ఇతరులకిచ్చినది) కానిది :-
[3-786.1-తే.]
202} అనన్యపురుషసంచారము - అనన్య(అనితరమైన) పురుష (వారి) సంచారము (సంచారము గలది), మానవ సంచారం లేనిది. :-
[8-43-వ.]
203} అనన్యప్రేరితుడు - అన్య (ఇతరులు) అన్య (కానివానిచే) ప్రేరితుడు (ప్రేరేపింపబడువాడు), స్వతంత్రుడు :-
[8-11-వ.]
204} అనలాక్షుడు - అగ్ని నేత్రము కలవాడు, శివుడు :-
[10.2-407-మ., 10.2-1275-క.]
205} అనవద్యచరిత్రుడు - మచ్చలేని నడవడిక గలవాడు, విష్ణువు :-
[4-917-చ.]
206} అనవద్యుడు - నిందనీయుడు కానివాడు, వ్యు. న+అ+వద్+యత్, న అవద్యః నిందనీయః, ప్రశంసింపదగినవాడు, విష్ణువు :-
[4-923-ఉ.]
207} అనాదినిధనుడు - పుట్టుక చావు లేనివాడు, వ్యు. న విద్యతే ఆదినిధనే యస్య. (న.బ.వ్రీ.) మొదలు తుదలేనివాఁడు పుట్టుకలు చావును లేనివాఁడు. :-
[2-277.1-తే.]
208} అనాదిపురుషుడు - అనాది (అత్యంత ఆది) నుండి ఉన్న పురుషుడు, విష్ణువు :-
[3-362.1-తే.]
209} అనాదిభగవంతుడు - అనాది (మొట్టమొదటినుండి) ఉన్న భగవంతుడు (మహిమాన్వితుడు), విష్ణువు :-
[3-506-చ.]
210} అనాధారుడు - వేరు ఆధారము అవసరములేని వాడు, విష్ణువు :-
[5.2-55-వ.]
211} అనారతడు - అనారతము (అనవరతము) యుండెడివాడు, విష్ణువు :-
[6-172-చ.]
212} అనారబ్ధములు - ఇంకనూ ప్రారంభింపబడనివి (ప్రభావము చూపనివి) ఐన పూర్వకర్మఫలములు :-
[1-58-వ.]
213} అనాశ్రయుడు - ఆశ్రయమే అక్కరలేనివాడు, విష్ణువు :-
[3-145.1-తే.]
214} అనాహత చక్రము - కుంజలినీ షట్చక్రములలోని అనాహత చక్రము హృదయస్థానమందుఉండునది :-
[2-29.1-ఆ.]
215} అనాహతము - కుండలినీ షడ్చక్రములలో హృదయస్థానము నందలి చక్రము :-
[10.2-1214.1-తే.]
216} అనికేతనుడు - సంసారము విడిచి నికేతనములు (నివాసములను) విడిచినవాడు, సన్యాసి :-
[4-214-క.]
217} అనిమిషనది - అనిమిష(దేవతా) నది, గంగ :-
[9-217-క.]
218} అనిమిషనాథనందనుడు - అనిమిషనాథుడు (దేవతలప్రభువు, ఇంద్రుని) నందనుడు, అర్జునుడు :-
[10.2-1318-చ.]
219} అనిమిషపతి - అనిమిష (దేవతల)కి పతి, ఇంద్రుడు :-
[4-513-క., 4-539-క.]
220} అనిమిషపతివైరి - అనిమిషపతి (ఇంద్రుని) వైరి, రావణుడు :-
[9-296-క.]
221} అనిమిషమునియోగిజనావనదక్షుడు - అనిమిష (దేవతలు) మునులు యోగులు ఐన జనములను అవన (రక్షించుట) యందు దక్షుడు (సమర్థుడు), విష్ణువు :-
[3-705-క.]
222} అనిమిషులు - నిమిష (కనురెప్పపాటులు) లేనివారు, దేవతలు, మత్యములు :-
[2-142.1-తే., 4-436.1-తే., 6-176-క., 10.1-53-క.]
223} అనిరుద్దుడు - 1. అడ్డుకొనరానివాడు, 2. విష్ణుమూర్తి చతుర్వ్యూహములలోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), 3. ప్రద్యుమ్నుని కొడుకు, శ్రీకృష్ణుని పౌత్రుడు. :-
[4-703.1-తే., 10.2-446-క., 11-77-వ.]
224} అనిర్దేశ్యుడు - ఇట్టివాడు యని నిర్దేశింప (నిశ్చయించి చెప్ప) అలవిగాని వాడు, విష్ణువు :-
[7-217-వ.]
225} అనిలజుడు - అనిల (వాయు) జుడు (పుత్రుడు), భీముడు :-
[10.2-743-క.]
226} అనిలపుత్రుడు - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[1-388.1-తే.]
227} అనిలము - నిలబడి ఉండనిది, గాలి :-
[2-277.1-తే.]
228} అనిలసుతుడు - వాయుపుత్రుడు, హనుమ :-
[9-277-క.]
229} అనీశుడు - తనకు ఏ ప్రభువు లేని వాడు, సర్వనియామకుడు కనుక మరొకరిచే నియమించుట లేనివాడు :-
[2-109-చ., 10.1-901-క.]
230} అనుజులు - వ్యు. అనుజ అను (పశ్చాత్) జాయతే, తన పిమ్మట పుట్టినది. చెల్లెలు :-
[4-61-క.]
231} అనుపమ - ఉపమానమునకు అందనిది, గొప్ప :-
[4-81-చ.]
232} అనుమతి - పూర్ణిమా భేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి, అంగీకారము తెలుపు :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]
233} అనువాదము - మరలమరలపలుకుట, కీర్తించుట. :-
[5.1-162.1-తే.]
234} అనుసంధ్యలు - 1.పొద్దుపొడుచుటకు ముందు మూడుగడియల కాలము (ఉదయ సంధ్య) 2.పొద్దుకుంగిన తరువాత మూడు గడియల కాలము (సాయం సంధ్య) :-
[6-307-వ.]
235} అనేకజన్మములు - పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనం (ఆచార్యోక్తి) అను విధముగ అసంఖ్యాక జన్మలెత్తుట :-
[10.1-1656-ఉ.]
236} అనేకుడు - శ్రు. ఏకోదేవా బహుధానివిష్టః, ఒక్కడుగాను అనేకులుగాను ఉన్నవాడు దేవుడు :-
[10.1-683-వ.]
237} అన్తకుడు - లయకారకుడు, విష్ణువు :-
[4-702.1-తే.]
238} అన్ను - పరవశింప చేయునామె, స్త్రీ :-
[10.1-802-క.]
239} అన్యాపదేశము - అన్య వస్తు నెపనముగ చెప్పబడునది :-
[10.1-1457-వ.]
240} అన్యోన్యత - వానిలో అవి అనుకూలించుట, సహాయపడుట :-
[3-205-వ.]
241} అపక్రాంతవ్యోమాచారి - కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగులుంచుట, రాసక్రీడ యందలి పారిభాషికపదము :-
[10.1-1084-వ.]
242} అపగాత్మజాత - అపగా (నది) ఆత్మజాత (పుత్రుడు), భీష్ముడు :-
[3-28-క.]
243} అపణము - అమ్మకూడనిది, అన్నము :-
[4-768-వ.]
244} అపరము - పరముకానిది, ఇహము, ఈలోకము :-
[3-300-చ.]
245} అపరాజితాంగహారము - ఉత్సాహవర్ధక సూచకమును, రాసక్రీడ యందలి పారిభాషికపదము :-
[10.1-1084-వ.]
246} అపరిచ్ఛిన్నము - దేశ కాల వస్తువుల చేత విభాగింపబడనిది :-
[10.1-681-వ.]
247} అపర్యావర్తనము - అవిచ్ఛిన్నంగా అదే పనినే చేయిస్తూ ఉండడము, నరక విశేషము :-
[5.2-136-వ.]
248} అపవర్గప్రాప్తి - పరలోకము లభించుట, మోక్షము :-
[10.2-1031-వ.]
249} అపాదములు - పాదములు లేనివి, పాములు మొదలగునవి :-
[4-853-వ., 11-91-వ.]
250} అపూర్వము - 1. పూర్వము లేనిది, 2. అద్భుతము, 3. పూర్వమిమాంసా శాస్త్రమున సత్కర్మఫలము అని సంకేతార్థము కలదు :-
[2-213-చ.]
251} అప్పతి - అప్పు (నీరు) నకు పతి (ప్రభువు), వరుణుడు :-
[6-170-త.]
252} అప్రమేయుడు - ప్రమేయము (నిరూపణ) కు అతీతమైన వాడు, మేరలకు కొలతలకు అతీతమైనవాడు, అష్టప్రమాణములను మీరినవాడు, విష్ణువు :-
[3-364-చ., 6-333.1-ఆ., 10.2-477-ఆ., 10.2-749-ఆ., 10.2-959-వ.]
253} అప్సరసలు - దేవవేశ్యలు, 1రంభ 2ఊర్వశి 3తిలోత్తమ 4మేనక ఆది దేవనర్తకిలు :-
[2-274.1-తే., 4-909-వ.]
254} అబల - బలము లేనామె, స్త్రీ :-
[4-655.1-తే., 4-794.1-తే., 4-845-క., 9-62.1-తే., 9-575-మ., 10.1-184-ఆ., 10.1-1277-వ., 10.2-117-మ., 10.2-181.1-ఆ.]
255} అబుద్ధి - బుద్ధికి తెలియకుండగ, అప్రయత్నముగ :-
[3-344-వ.]
256} అబ్జగర్భుడు - అబ్జము (పద్మము) నుండి గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-30-ఉ.]
257} అబ్జజుడు - అబ్జము (పద్మము) అందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-255-క., 3-378.1-తే., 3-716.1-తే.]
258} అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు :-
[4-160.1-తే., 4-313.1-తే.]
259} అబ్జపాణి - పద్మమును చేత ధరించినామె, లక్ష్మీదేవి :-
[4-443.1-తే.]
260} అబ్జభవుడు - అప్ప్ (నీరు) నుండి భవ (పుట్టిన) పద్మము నందు పుట్టినవాడు. బ్రహ్మదేవుడప :-
[3-87-వ.]
261} అబ్జము - అప్పు (నీటియందు) జము (పుట్టునది), పద్మము :-
[3-503-క.]
262} అబ్జము - నీటపుట్టునది, అప్పు (నీరు)నందు పుట్టినది, పద్మము :-
[1-388.1-తే., 2-217.1-తే., 3-118.1-తే., 3-282-తే., 3-306-మ., 3-548-ఉ., 3-735-క., 4-730-చ.]
263} అబ్జముఖి - పద్మములవంటి మోములు కలామె, సుందరి. :-
[10.1-1010.1-తే., 10.2-692.1-తే.]
264} అబ్జలోచనుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-19-చ.]
265} అబ్జవదన - అబ్జము (పద్మము)వంటి వదన (మోముగలామె), అందమైన స్త్రీ :-
[6-512-తే.]
266} అబ్జాక్షి - అంబుజము (పద్మము)ల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[3-965.1-తే.]
267} అబ్జాక్షుడు - పద్మముల (అబ్జముల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-203-దం., 3-753.1-తే., 6-421-క., 9-84.1-ఆ.]
268} అబ్జాతము - అప్పునందు జాతమైనది, పద్మము :-
[10.1-1461-శా.]
269} అబ్జాసనుడు - అబ్జము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[4-142-క., 10.2-627-మ.]
270} అబ్దివిభుడు - సముద్రమునకు ప్రభువు, వరుణుడు :-
[3-619.1-తే.]
271} అభయకారణుడు - భక్తులకు భయములేకుండ చేయుటకు హేతువు ఐనవాడు, విష్ణువు :-
[10.1-688-ఉ.]
272} అభయప్రదుడు - అభయము ఇచ్చువాడు, విష్ణువు :-
[4-900-క.]
273} అభయుడు - భయము లేని వాడు, భగవంతుడు :-
[2-207-క.]
274} అభవుడు - పుట్టుక లేనివాడు, శివుడు, విష్ణువు, భగవంతుడు :-
[1-194-క., 2-98-క., 3-198.1-తే., 3-200-క., 3-293.1-తే., 3-897.1-తే., 4-60-క., 4-66-క., 4-104-వ., 4-117-తే., 4-130-క., 4-159-క., 5.1-74.1-తే., 6-172-చ., 6-229-తే., 6-333.1-ఆ., 6-341-తే., 7-89-క., 10.1-99-ఉ., 10.2-254-ఆ., 10.2-320.1-తే., 10.2-529-క., 11-85-తే.]
275} అభిచారకర్మ - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి, మారణహోమము :-
[3-686.1-తే., 6-307-వ.]
276} అభిచారము - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి, మారణహోమము :-
[10.2-531-తే.]
277} అభిజిత్తు - 1. ఒకానొక నక్షత్రము ఉత్తరాషాఢ యొక్క నాల్గవ పాదమును, శ్రవణము యొక్క మొదటి పాదమును కలిసినది. 2. లగ్నం/ముహూర్తం ఈ నక్షత్రంతో కూడిన లగ్నము లేదా ముహూర్తము మిట్టమధ్యాహ్నము నుండి పదహారు గడియల కాలము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము :-
[3-671-మ., 8-506-మ.]
278} అభిజిన్ముహూర్తము - మిట్టమధ్యాహ్నము 24 నిమిషముల ముందునుండి 24 నిమిషములవరకు గల కాలము, సూర్యోదయమునుండి పద్నాలుగు (14) నుండి పదహారు గడియల కాలము, అభిజిత్ లగ్నము లేదా ముహూర్తము. ఇది సంపూర్ణజయమున సాయపడునది. :-
[7-405-వ.]
279} అభిమన్యుకాంత - ఉత్తర, అభిమన్యుని భార్య :-
[1-280-వ.]
280} అభిమన్యుడు - సుభద్ర అర్జునుని పుత్రుడు, విరాట రాకుమారి ఉత్తర భర్త, పరీక్షిత్తు కొడుకు, కురుక్షేత్రంలో పద్మవ్యూహ ప్రవేశం చేసి వీరమరణం పొందిన అసహాయ శూరుఁడు :-
[3-130-వ.]
281} అభిమన్యునందనుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[3-234-వ., 3-261-క., 10.2-636-వ.]
282} అభిమన్యునితనయుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు. :-
[3-195-క.]
283} అభిమన్యువు - ఇతడు అర్జునుని పుత్రుడు కాదు, వారికంటే పూర్వపు రాజు :-
[2-204.1-తే.]
284} అభిమన్యుసంభవుండు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు. :-
[1-442-వ.]
285} అభిమన్యుసుతుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[5.2-13-క.]
286} అభిమానము - నేను నాది యనెడి భావములైన అహంకార మమకారములు :-
[7-464.1-తే.]
287} అభిమాని - అభిమానము (సంరక్షణ ప్రేమ) కలవాడు :-
[4-817-వ.]
288} అభివ్యంగ్యము - వెలువడు గుర్తులచే తెలియబడునది, అనుభవసారము :-
[4-584-వ.]
289} అభిషేకము - స్నానము చేయించుట, పట్టాభిషేకము :-
[10.2-946-తే.]
290} అభిషేకముచేయుట - పట్టాభిషేకము :-
[1-385.1-ఆ.]
291} అభ్యాసి - మంచి అభ్యాసము చేసినవాడు, చాణూరుడు :-
[10.1-1348-వ.]
292} అభ్రగజము - అభ్ర (ఆకాశపు, స్వర్గలోకపు) గజము (ఏనుగు), ఐరావతము :-
[6-426-ఉ.]
293} అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు :-
[8-96-మ.]
294} అభ్రము - అప్పు (నీటిని) భరించునది, మేఘము :-
[10.1-1582-మ.]
295} అమంద - మందము (మెల్లని, జడత) తక్కువ కాని :-
[4-17-వ.]
296} అమర + అరాతి (సవర్ణదీర్ఘ సంధి) - దేవతల శత్రువు (బలి) :-
[8-611-మ.]
297} అమరకంటకుడు - అమరులు (దేవతలు) కు కంటకుడు (శత్రువు), రాక్షసుడు :-
[3-417-క.]
298} అమరకులాగ్రగణ్యుడు - అమరు (దేవత)ల కులము (గణము)లకు అగ్రగణ్యడు (మొదట లెక్కిందగు వాడు, పెద్దవాడు), బ్రహ్మదేవుడు :-
[3-499-చ.]
299} అమరగణవంద్యమానపాదాబ్జయుగళుడు - దేవతాసమూహముల చే నమస్కరింపదగ్గ పాదములు అను పద్మముల జంట కలవాడు, విష్ణువు :-
[3-225-తే.]
300} అమరగురుడు, అమరగురువు - అమరుల (దేవతల) కు గురువు, బృహస్పతి :-
[5.2-89.1-ఆ., 10.1-1436-క.]
301} అమరనాథుడు - అమర (దేవతలకు) నాథుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[6-414.1-తే.]
302} అమరనాయకుడు - అమరుల (దేవతల) నాయకుడు, ఇంద్రుడు :-
[4-515.1-తే.]
303} అమరభర్త - అమరుల (దేవతల)కి భర్త (ప్రభువు), విష్ణువు :-
[3-686.1-తే.]
304} అమరలలాముడు - అమరుల (దేవతల)కు లలాముడు శ్రేష్ఠమైనవాడు, విష్ణువు :-
[3-633-క.]
305} అమరవంద్యుడు - అమర (దేవతల)చే వంద్యుడు (పూజింపబడు)వాడు, విష్ణువు :-
[3-748-క.]
306} అమరవర్థనుడు - అమరుల (దేవతల)ను వర్ధనుడు (వృద్ధి చేయువాడు), విష్ణువు :-
[3-627-చ.]
307} అమరవల్లభుడు - అమరుల (దేవతల)కి వల్లభుడు, ఇంద్రుడు :-
[9-161.1-తే.]
308} అమరవాహిని - అమర (దేవతల) వాహినీ (నది) ఆకాశగంగ :-
[1-8-ఉ.]
309} అమరవిభుడు - అమరుల (దేవతల) విభుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[4-508.1-తే., 6-443-తే., 8-16.1-ఆ., 9-49-ఆ., 9-161.1-తే., 9-504.1-ఆ.]
310} అమరాధిపుడు - అమర (దేవతల)కు అధిపుడు (రాజు), ఇంద్రుడు :-
[6-445-చ.]
311} అమరాధీశ్వరుడు - అమరుల (దేవతల)కు ఆధీశ్వరుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[10.1-946-మ.]
312} అమరానోకహము - దేవతా వృక్షము, కల్ప వృక్షము :-
[10.2-1229.1-తే.]
313} అమరాబంధుడు - అమర (దేవతల) అబంధుడు (శత్రువు), రాక్షసుడు. :-
[9-164-క.]
314} అమరారి - అమరులు (దేవతలు)కు అరి (శత్రువు), రాక్షసుడు, హిరణ్యాక్షుడు :-
[3-616-క., 3-623-ఉ., 7-199.1-తే.]
315} అమరావతి - దేవతల ఉనికిపట్టు స్వర్గలోకానికి ముఖ్యపట్టణం, దేవతలపట్టణము :-
[10.2-601-వ.]
316} అమరాహితులు - అమరుల (దేవతల) అహితులు, రాక్షసులు :-
[9-277-క.]
317} అమరులు - మరణము లేనివారు, దేవతలు :-
[4-462-చ., 4-557.1-తే., 6-277-క., 6-385-లగ్రా., 7-3.1-ఆ., 7-103-క., 7-259-శా., 7-402-ఆ., 9-161.1-తే., 10.1-1506-మ., 10.2-1147-ఉ.]
318} అమరేంద్రతనయుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[10.2-1093-క.]
319} అమరేంద్రవాహుడు - ఇంద్రుని వాహనముగా కలవాడు, వికుక్షి, శశాదుడు :-
[9-160-చ.]
320} అమరేంద్రాశ - అమరేంద్రుని (ఇంద్రుని) ఆశ (దిక్కు), తూర్పు :-
[9-259-మ.]
321} అమర్త్యులు - మరణములేనివారు, దేవతలు :-
[6-326-వ., 8-181-క.]
322} అమలములు - నిర్మలములు, రాగద్వేషాదులు లేనివి :-
[10.1-553.1-ఆ.]
323} అమలుడు - పరిశుద్ధుడు, నిర్మలుడు, విష్ణువు :-
[11-77-వ.]
324} అమాత్యుడు - మంత్రముతో (ఆలోచనతో) కూడి ఉండువాడు, మంత్రి :-
[10.1-1311-క.]
325} అమితుడు - మేరలేనివాడు. అష్టప్రమాణములకు అందనివాడు, విష్ణువు :-
[10.1-1182-శా.]
326} అమృతకరుడు - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు. :-
[8-224.1-తే.]
327} అమృతకళాస్థానశేఖరుడు - అమృత (అందమైన, అమృతము వంటి) కళా (కళలకు) ఆస్థాన (నివాసమైన చంద్రుని) శేఖరుడు (శిఖ యందు ధరించినవాడు), పరమశివుడు :-
[6-326-వ.]
328} అమృతము - మృతము (చావును) చేరనీయనిది :-
[10.1-1523.1-ఆ.]
329} అమృతాంధసులు - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు :-
[8-531-శా., 10.1-1167.1-ఆ.]
330} అమృతాంశుడు - అమృతము వంటి అంశ (వెన్నెల) కలవాడు, చంద్రుడు :-
[4-710.1-తే.]
331} అమృతాశనులు - అమృతము అశన (తినువారు) దేవతలు :-
[4-167-చ.]
332} అమృతుడు - అమృతమువంటివాడు, మోక్షమును యిచ్చుట ద్వారా జననమరణ చక్రమునుండి విముక్తి కలిగించువాడు, విష్ణువు :-
[9-205.1-తే., 10.1-567.1-ఆ.]
333} అమేయుడు - మేయము (మేర, మితి, ఇంతని చెప్పుటకు) లేనివాడు, విష్ణువు :-
[3-293.1-తే., 3-844-చ., 4-298-చ., 6-172-చ., 6-423-ఉ.]
334} అమోఘము - వ్యర్థము కానిది :-
[1-69-మ.]
335} అయనములు - ఆయనములు రెండు, 1ఉత్తరాయణము 2దక్షిణాయనము :-
[5.2-86-వ.]
336} అయిదువ - 5 వన్నెలు (1మెడలో మంగళసూత్రము 2కాలికి పసుపు 3నుదుట కుంకుమ 4చేతికి గాజులు 5కాలివేళ్ళకి మట్టెలు) కలామె, పునిస్త్రీ :-
[9-67-వ.]
337} అయుతము - పదివేలు :-
[2-3.1-ఆ.]
338} అయోనిజుడు - గర్భమున పుట్టనివాడు, బ్రహ్మదేవుడు :-
[6-224-వ.]
339} అరణందాసి - పెండ్లి యందు పెళ్ళికూతురుతో పంపే బహుమతులు, లాంఛనాలలో భాగంగా పంపబడిన దాసి :-
[9-510-ఉ., 9-537-మ.]
340} అరణి - మధించుట ద్వారా అగ్నిని రగుల్చుటకైన కఱ్ఱపుల్ల, ఘర్షణతో నిప్పును పుట్టించుటకు వాడెడి కఱ్ఱ :-
[3-434-చ., 3-914-వ., 4-619.1-తే., 9-419-వ.]
341} అరణ్యాటము - అరణ్యములో తిరుగునది, ఏనుగు :-
[8-57-శా.]
342} అరవిందదళాక్షుడు - అరవింద (పద్మము) ల దళా (రేకుల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-517-చ.]
343} అరవిందనందనుడు - అరవిందము (పద్మము) యొక్క నందనుడు (కొడుకు), బ్రహ్మదేవుడు :-
[3-501-వ., 4-167-చ.]
344} అరవిందనయనుడు - అరవింద (పద్మము)ల వంటి నయనములు కలవాడు, విష్ణువు :-
[3-507-వ.]
345} అరవిందనాభుడు - పద్మము బొడ్డున కలవాడు, విష్ణువు :-
[3-189.1-తే.]
346} అరవిందభవుడు - అరవిందము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), విష్ణువు :-
[1-71-ఉ., 3-449-తే.]
347} అరవిందలోచనుడు - అరవిందము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-156-వ.]
348} అరవిందవాసిని - పద్మములందు వసించునామె, లక్ష్మీదేవి :-
[10.2-1313-వ.]
349} అరవిందసంభవుడు - అరవిందము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-367-వ., 3-377.1-తే., 3-778-క., 7-93-వ.]
350} అరవిందాక్షుడు - అరవిందములవంటి కన్నులున్నవాడు :-
[1-393-మ.]
351} అరవిందాక్షుడు - అరవిందములవంటి కన్నులున్నవాడు, కృష్ణుడు :-
[10.2-1219-మ.]
352} అరవిందానన - అరవిందము (పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ :-
[3-462-మ.]
353} అరవిందోదరుడు - అరవిందము (పద్మము) ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు :-
[3-429-మ., 4-177-మ., 4-283-మ.]
354} అరిషడ్వర్గము - 1కామ 2క్రోధ 3దంభ 4లోభ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటమి :-
[3-803-వ., 5.1-155-వ., 9-587-క., 11-41-వ.]
355} అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు :-
[1-50.1-ఆ., 1-89-ఉ., 1-278-వ., 4-630-మ., 4-649-వ., 6-88-వ., 6-149-క., 7-249-క., 10.1-282-క., 10.1-543-వ., 10.1-1664-వ., 10.2-235.1-తే.]
356} అరుణగభస్తి - ఎఱ్ఱని కిరణములు కలవాడు, సూర్యుడు :-
[11-48-వ.]
357} అరుణాంభోరుహపత్రలోచనుడు - ఎఱ్ఱకలువల రేకుల వంటి కన్నులు ఉన్నవాడు :-
[2-237-మ.]
358} అరుణుడు - సూర్యుని రథసారథి, ఎర్రని వాడు కనుక అరుణుడు, కనుక ముందు రథసారథి రంగుతో అరుణోదయం. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు, గరుత్మంతుని అన్న, తండ్రి కశ్యపుడు. తల్లి వినత, వినత రెండు గుడ్లు ప్రసవించింది. తొందర పడి ఒక గుడ్డు పగులగొట్టింది. దానితో ఊరువులు లేని ఎర్రని అరుణుడు పుట్టాడు. తల్లిని సవితికి దాసీవి అవుతావు అని శాపం ఇచ్చాడు. రెండవ గుడ్డు నుండి గరుత్మంతుడు పుట్టాడు. :-
[10.2-636-వ.]
359} అరుణోదము - ఒకనది, ఎఱ్ఱని నీరు గలది, మందరపర్వతం నుండి పుట్టినది :-
[5.2-21-ఉ.]
360} అర్కుడు - ఋక్కులకు అధిదేవత ఐన సూర్యబింబము, కిరణములు కలవాడు, సూర్యుడు :-
[2-86-వ., 10.1-1449-మ.]
361} అర్ఘ్యము - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు (1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భ 8పుష్పము) :-
[10.1-1267-వ., 10.2-92.1-తే., 10.2-393-వ.]
362} అర్చన - పూజ, ముగ్గు సుగంధము అక్షతలు పుష్పము ధూపము దీపము ఉపహారము (నైవేద్యము) తాంబూలము అని ఎనిమిది విధమైనవి కలది :-
[5.2-71-క.]
363} అర్జునపౌత్రుడు - అర్జునుని (కొడుకు అభిమన్యుని కొడుకు) మనుమడు, పరీక్షిన్మహారాజు :-
[3-228-క., 3-443-క., 9-21-వ., 10.2-1034-వ.]
364} అర్జునుడివిల్లు - గాండీవము :-
[10.2-1174-వ.]
365} అర్జునుడు - తెల్లని వాడు, పాండవ మధ్యముడు, కుంతీదేవి రెండవ కొడుకు :-
[1-371-క., 10.2-354-మ., 10.2-1171-ఉ.]
366} అర్ణవము - నీటికి నిలయమైనది, సముద్రము :-
[2-267-వ., 10.1-1485-వ.]
367} అర్థచంద్రకరభావము - అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది, శ్లో. అర్ధచంద్రకరస్సోయం పతాకేంగుష్ట సారణాత్, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]
368} అర్థము - ప్రయోజనము, ధనము, పదము లేదా పదబంధానికి వివరణ, టీకకు రెండవ భాగము, దీనికి వివరణ టిప్పణి :-
[4-28-వ.]
369} అర్థవిభుడు - అర్థము (ధనము)నకు విభుడు (ప్రభువు), కుబేరుడు :-
[4-361-తే.]
370} అర్బుదము - వెయ్యి కోట్లు, 1 తరువాత 10 సున్నాలు :-
[5.1-18-వ.]
371} అర్బుదార్బుదములు - క్షితి (1 తరవాత 20సున్నాలు) అర్బుదము (1 తరువాత 10సున్నాలు, వేయికోట్లు) అనేకము :-
[4-830.1-తే.]
372} అర్యముడు - సూర్యుడు, పితృదేవతలలో ఒకడు, ద్వాదశాదిత్యులలో ఒకడు :-
[5.2-47-క.]
373} అర్హులు - అర్హతరులు అర్హతములు :-
[4-572.1-తే.]
374} అలంఘ్యుడు - ఉల్లంఘించుటకు రానివాడు, శంకరుడు :-
[3-473-వ.]
375} అలకాపురము - కుబేరుని పట్టణము :-
[1-256-వ.]
376} అలకాపురము - కుబేరుని పట్టణము :-
[10.2-601-వ.]
377} అలఘుడు - (ఏవిధముగను) తక్కువ కాని వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-380-మ., 2-109-చ., 3-257-క.]
378} అలఘుమూర్తి - అలఘు (చిన్నదికాని, పెద్దదైన) మూర్తి (మూర్తిత్వము కలవాడు), గొప్పవాడు :-
[4-36.1-తే.]
379} అలఘులు - అలఘుతరులు అలఘుతములు :-
[3-967-క.]
380} అలరుటమ్ములవిలుకాడు - పుష్పములు బాణములుగా గల విల్లుగలవాడు, మన్మథుడు :-
[9-609-వ.]
381} అలరుబోడి - పుష్పము వలె సుకుమారమైన దేహము కలామె, స్త్రీ :-
[10.2-180.1-ఆ.]
382} అలరువిలుతుడు - అలరు (అరవిందాది పుష్పములు) విలుతుడు (బాణములుగలవాడు), మన్మథుడు :-
[9-27-వ.]
383} అలర్కుడు - దత్తాత్రేయుని శిష్యుడు, యోగవిద్య ఉపదేశము పొందినవాడు :-
[2-204.1-తే.]
384} అలవాటుకలిమి - హనుమంతుడు బాలునిగా గెంతి సూర్యుని మింగబోయాడు కదా ఆ అలవాటు వలన సముద్రలంఘనం సుళువుగా దాటాడట. :-
[9-275-క.]
385} అలాతదైవమండలము - (అలాత) కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికిమీదికి తిప్పుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]
386} అలికి - అలుకుట చేసి గోడ మట్టిగచ్చు వంటివి మరల మట్టి పేడలతో (గోడలకు సున్నము వేసినట్లు) మెత్తుట :-
[9-321.1-తే.]
387} అలికులవేణి - (అలికులం) తుమ్మెదల బారును పోలిన వేణి (జడ కలామె), రుక్మిణి :-
[10.2-238-చ., 10.2-263-చ.]
388} అలికులాకులమాలికాభిరాముఁడు - అలి (తుమ్మెదల) కుల (సమూహము వంటి) అలక ( ముంగురుల) మాలికా (గుంపులచే) అభిరాముడు (చక్కనైన వాడు), విష్ణువు :-
[3-922.1-తే.]
389} అల్ప - అల్పతర అల్పతమ :-
[1-44-చ.]
390} అల్పము - అల్పతరము అల్పతమము :-
[3-263-తే., 12-11-వ.]
391} అల్లుడు - కూతురు భర్త, మగవారి సోదరి పుత్రుడు, ఆడవారి సోదరుని పుత్రుడు. :-
[10.1-1769-మత్త.]
392} అళికలోచనము - అళీక (నొసటందుండు) లోచనము (కన్ను), శివుడి మూడవ కన్ను :-
[10.2-534.1-తే.]
393} అవటనిరోధము - మలమూత్రాది విసర్జకములను బంధిచుట మున్నగు శిక్షలు, నరక విశేషము, అవటము (రంధ్రము)లు నిరోధించి (మూసి) శిక్షించెడి నరకము :-
[5.2-136-వ.]
394} అవతారము - స్వ స్వరూప భేదము, మరొక రూపములో దిగి వచ్చుట :-
[3-210-క.]
395} అవధూత - పైపొరలు తొలగినవాడు, బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు :-
[1-523-మ., 2-14-వ., 3-39-క., 5.1-78-వ., 5.1-156-ఉ., 7-217-వ., 11-91-వ.]
396} అవనిజము - అవని (భూమి) నుండి జము (పుట్టినది), వృక్షము :-
[6-195.1-తే.]
397} అవనినాథుడు - అవని (భూమి)కి నాథుడు, రాజు. :-
[1-323-తే., 7-468-ఆ.]
398} అవనినాయకుడు - భూమికి నాయకుడు, రాజు :-
[4-835.1-తే.]
399} అవనివిభుడు - అవని (భూమి)కి ప్రభువు, రాజు. :-
[8-18.1-ఆ.]
400} అవనిసురుడు - అవని (బూమికి) సురుడు (దేవత), విప్రుడు :-
[8-466-ఆ., 9-148-ఆ.]
401} అవనీజము - అవని (భూమి) యందు జము (పుట్టినది), చెట్టు, వృక్షము :-
[3-700-మ., 3-812-క.]
402} అవనీనాథుడు - అవని (రాజ్యమున)కు నాథుడు, రాజు :-
[2-261-క., 3-20-క., 5.1-9-క., 5.2-57-క., 10.1-517-క., 10.1-929-క., 10.1-1627-మ.]
403} అవనీపతి - భూమికి ప్రభువు, రాజు :-
[4-814-క.]
404} అవనీవరుడు - భూమికి వరుడు రాజు :-
[2-262-క., 3-21-క.]
405} అవనీశుడు - అవనికి (భూమికి) ఈశుడు (ప్రభువు) :-
[2-253.1-తే., 3-174-క., 4-830.1-తే., 10.1-353.1-ఆ., 10.1-1519.1-ఆ.]
406} అవనీశ్వరుడు - అవని (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు :-
[4-767.1-తే.]
407} అవనీసురులు - భూమికి దేవతలు, విప్రులు :-
[1-315-క.]
408} అవబృథము - యఙ్ఙము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేసెడి కర్మము :-
[4-53.1-తే., 4-534-వ., 9-487-వ., 10.2-800-వ.]
409} అవస్థాత్రయము - 1జాగరణ(మెలకువ) 2స్వప్న(కల) 3సుషుప్తి (నిద్ర) అను అవస్థ (స్థితి) అభాసములు మూడు :-
[1-459.1-తే., 6-484-వ., 7-237-వ., 10.2-1079.1-తే., 11-52-వ., 12-24-వ.]
410} అవస్థాష్టకము - 1కౌమారము (5సం.) 2పౌగండము(10సం.) 3కైశోరము(15సం.) 4బాల్యము (16సం), 5తారుణ్యము (25సం.) 6యౌవనము (50) 7వృద్ధము (70) 8వర్షీయస్త్వము (90), పాఠ్యంతరములు కలవు :-
[7-213-వ., 10.1-487-వ., 10.1-488.1-ఆ.]
411} అవాంతరప్రళయము - రెండు కల్పముల నడిమి కాలము, కల్పము లేదా అవాంతర కల్పము బ్రహ్మదేవునికి పగలు, బ్రహ్మదేవుని పగులు పిమ్మట వచ్చే రాత్రి ప్రళయము లేదా అవాంతర ప్రళయము అంటారు. :-
[2-222-వ.]
412} అవాఙ్మానసగోచరుడు - వాక్కు (వర్ణించుటకు) మానస (ఊహించుటకు) అగోచరుండు (అందనివాడు), విష్షువు :-
[5.2-55-వ.]
413} అవికల్పితుడు - వికల్పము (భ్రాంతి, మారుదల) లేనివాడు, విష్ణువు :-
[7-217-వ.]
414} అవికారుడు - వికారములు (మార్పులు) లేని వాడు, విష్ణువు :-
[3-844-చ., 4-298-చ.]
415} అవితథానుభూతి - అవితథ (అసత్యము కాని, యథార్థమైన, వ్యర్థము కాని) అనుభూతి యైన వాడు, ఆత్మానుభూతి యైన వాడు) :-
[6-213-తే.]
416} అవిద్ధఅంగహారము - మనసునందు నాటుటను సూచించునవి. , రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]
417} అవిద్య - విద్య (తత్త్వజ్ఞానమున)కు ఇతరమైనది. ఆత్మతత్త్వ విద్యకు అన్యమైనది, మాయ :-
[4-540-వ., 5.1-69-వ.]
418} అవిద్యాపంచకమిశ్రమములు - అవిద్య అనబడు ఐదింటి గుంపు, అవి 1) మోహం, 2) మహామోహం, 3) అంధతామిస్రం, 4) తామిస్రం, 5) చిత్త విభ్రమం :-
[3-367-వ.]
418.1} అవిరళదంష్ట్రాభిరాముడు - అవిరళ (దట్టమైన) దంష్ట్తా (కోరలతో) అభిరాముడు (ఒప్పిదమైన వాడు, మనోజ్ఞమైన వాడు), ఆదివరాహావతారుడు :-
[3-633-క.]
419} అవిస్త్రృతము - విస్త్రృతము (పెద్దది) కానిది, చిన్నది :-
[3-560-చ.]
420} అవీచిరయము - మానకవీచి ఎత్తైన కొండపైనుండి విసరి శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]
421} అవ్యక్తుడు - చూడ వీలుకానివాడు, భగవంతుడు, వ్యక్తము (తెలియ) శక్యము కానివాడు, విష్ణువు :-
[2-98-క., 6-333.1-ఆ., 11-77-వ.]
422} అవ్యభిచారి - (అది తప్ప) మరియొకదానియందు చరించనిది :-
[1-58-వ.]
423} అవ్యయానందుడు - అవ్యయము (తగ్గిపోని) ఆనందము కలవాడు వాడు, విష్ణువు :-
[4-191.1-తే., 4-714-తే.]
424} అవ్యయుడు - వ్యయము (తరుగు) లేనివాడు, భగవంతుడు, నాశములేనివాడు, విష్ణువు :-
[2-68.1-తే., 2-98-క., 2-277.1-తే., 4-359.1-తే., 6-172-చ., 6-333.1-ఆ., 7-217-వ., 8-121.1-ఆ., 10.2-130-ఆ., 10.2-749-ఆ., 10.2-1217-ఉ., 11-76-ఆ.]
425} అవ్యాహతంబులు - అవ్యవహితములైనవి, వ్యవహితము (వ్యవధానమైనవి, తేడాకలవి) కానివి :-
[10.2-1220-వ.]
426} అశని - దిక్కులంతము వరకు భుజించగలది, వజ్రాయుధము :-
[10.2-940-మస్ర.]
427} అశ్వశిరస్కుడు - హయగ్రీవుడు, అశ్వనితో మొదలగు కాలమానవిశేషము :-
[4-26-వ.]
428} అశ్వహృదయము - గుఱ్ఱముయొక్క మనోగత భావములు తెలిసికొనగల విద్య :-
[9-235-ఆ.]
429} అష్టఐశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము, మరొక విధానము, 1దాసీజనము 2భృత్యులు 3పుత్రుల 4మిత్రులు 5బంధువులు 6వాహనము 7ధాన్యము 8ధనము :-
[10.2-247-తే.]
430} అష్టకాశ్రాద్దము - వైశ్వదేవ సంబంధమైన సప్తపాక యజ్ఞములలో ఒకటి, మాఘబహుళ షష్టి సప్తమి అష్టమి మూడు తిథులందు పితృదేవతల గూర్చి చేయునది :-
[9-156.1-తే.]
431} అష్టదిక్పాలకులు - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[3-467.1-తే., 6-282-వ., 10.1-340-క., 10.2-131-మ., 10.2-231-మ., 10.2-439-వ., 10.2-583.1-తే., 10.2-764.1-తే.]
432} అష్టదిగ్గజములభార్యలు - 1అభ్రము తూర్పు దిగ్గజము ఐరావతము భార్య 2కపిల ఆగ్నేయము దిగ్గజము పుండరీకము భార్య 3పింగళ దక్షిణము దిగ్గజము వామనము భార్య 4అనుపమ నైఋతి దిగ్గజము కుముదము భార్య 5తామ్రపర్ణి పడమర దిగ్గజము అంజనము భార్య 6శుభ్రదంతి వాయవ్యము దిగ్గజము పుష్పదంతము భార్య 7అంగన ఉత్తరము దిగ్గజము సార్వభౌమము భార్య 8అంజనావతి ఈశాన్యము దిగ్గజము సుప్రతీకము భార్య :-
[11-105-వ.]
433} అష్టదిగ్గజములు - 1ఐరావతము తూర్పు దిగ్గజము 2పుండరీకము ఆగ్నేయము దిగ్గజము 3వామనము దక్షిణము దిగ్గజము 4కుముదము నైఋతి దిగ్గజము 5అంజనము పడమర దిగ్గజము 6పుష్పదంతము వాయవ్యము దిగ్గజము 7సార్వభౌమము ఉత్తరము దిగ్గజము 8సుప్రతీకము ఈశాన్యము దిగ్గజము :-
[7-198.1-ఆ., 11-105-వ.]
434} అష్టపాశములు - 1పశుపాశము 2భవపాశము 3బంధపాశము 4మోహపాశము 5ఆశాపాశము 6కర్మపాశము 7దుఃఖపాశము 8కేశపాశము, పాఠ్యంతరము, 1దయ 2శంక 3భయము 4లజ్జ 5జుగుప్స 6కులము 7శీలము 8జాతి :-
[10.2-156-వ.]
435} అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము :-
[1-491-ఉ., 2-38-వ., 7-372.1-ఆ.]
436} అష్టమదములు - 1కులము 2విద్య 3సంపద 4ఆచారము 5కీర్తి 6భోగము 7దాతృత్వము 8జ్ఞానము ల వలని గర్వములు :-
[10.2-232.1-ఆ.]
437} అష్టవసువులు - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమము) 1ఆవుడు 2ధ్రువుడు 3సోముడు 4అధ్వరుడు 5అనిలుడు 6ప్రత్యూషుడు 7అనలుడు 8ప్రభాసుడు :-
[2-38-వ., 6-254-వ., 11-105-వ.]
438} అష్టవిధవివాహములు - 1బ్రాహ్మము 2దైవము 3ఆర్షము 4ప్రాజాపత్యము 5ఆసురము 6గాంధర్వము 7రాక్షసము 8పైశాచము. ఇవికాక, క్షత్రియ కన్యకు స్వయంవరం అను విధానము కూడ ఉన్నది. :-
[10.1-1683-వ.]
439} అష్టవిభూతులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము :-
[3-880-మ.]
440} అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము :-
[7-316-క.]
441} అష్టాంగములు - 1పాదములు 2మోకాళ్ళు 3తొడలు 4కడుపు 5హృదయము 6వక్షస్థలము 7ముఖము 8తల :-
[6-299-వ.]
442} అష్టాంగయోగమార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8) :-
[2-222-వ., 3-180.1-తే., 3-282-తే., 3-489-తే.]
443} అష్టాంగయోగములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8) :-
[5.1-101-వ., 10.2-1218-చ.]