టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (దంచు - దేవహూతి)
శ్రీరామ
2050} దంచు - బియ్యము మొదలగువాని కొరకు వడ్లు ఆదులను రోకళ్ళతో దంచుట :-
[3-401-చ.]
2051} దండ,దామము - దారమునందు గుచ్చి రెండు పక్కల కలపకుండా ఉండునది దామము, రెండు పక్కల కలిపేసినది దండ. :-
[10.2-1098-చ.]
2052} దండధరుడు - దండించు బాధ్యతను ధరించిన (స్వీకరించిన) వాడు, యముడు :-
[1-389-వ.,
1-394.1-ఆ.,
3-449-తే.,
6-168-వ.,
7-381.1-తే.,
10.1-1593-ఆ.]
2053} దండధరునినగరి - యముని పట్టణము, యమపురి, సంయమని :-
[10.1-1593-ఆ.]
2054} దండపాణి - దండించు బాధ్యతను చేపట్టినవాడు, యముడు, దక్షిణ దిక్పతి :-
[10.2-773-చ.]
2055} దండప్రణామము - సాష్టాగ నమస్కారము, దండము వలె భూమిపై పడి నమస్కరించుట :-
[1-499-వ.,
1-521-వ.,
6-499-వ.,
7-86-వ.,
7-162-వ.,
9-212-వ.,
10.2-588-వ.]
2056} దండము - 1. జపతపాదులందు చేతిని ఆనించుకొనెడి పైన చిన్న అడ్డకఱ్ఱ యుండెడి కఱ్ఱ, 2. దండించుటకైన కఱ్ఱ, 3. సామాన్యార్థంలో కఱ్ఱ, 4, నమస్కారము, 5. చతురుపాయముల లోనిది, 6.రాజశిక్ష, 7. కప్పము, 8. దుడ్ఢుకఱ్ఱ :-
[7-421-వ.,
7-429-వ.,
11-77-వ.]
2057} దండరచితకరణము - దేహము కఱ్ఱవలె బిగదీయుట, రాసక్రీడ యందలి పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
2058} దండలాతదైవమండలము - బాణాకఱ్ఱ తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట, రాసక్రీడ యందలి పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
2059} దండవన్నమస్కృతులు - దండము (కఱ్ఱ)వలె పడి నమస్కరించుటలు :-
[4-279-తే.]
2060} దండి - 1. దండము ధరించువాడు, బ్రహ్మచారి, 2. దండించు (శిక్షించు) వాడు, 3. దండాయుధ ధారి, యముడు :-
[10.1-1236-దం.,
10.1-1558-వ.]
2061} దండితారిసమూహుడు - దండిత (శిక్షింపబడిన) అరి (శత్రువుల) సమూహము గలవాడు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]
2062} దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు, ననకాదుల శాపంవలన జయవిజయులు పొందిన మూడవ మఱియు తుది జన్మము శిశుపాల దంతవక్త్రులు :-
[2-190-చ.,
7-13-వ.]
2063} దంతావళపాలకులు - దంతావళము (ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు)ను పాలకులు (కాచువారు), మావటీలు :-
[10.1-1323-వ.]
2064} దంతావళము - ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు :-
[10.2-214-వ.]
2065} దంతి - దంతములు కలిగినది, ఏనుగు :-
[10.1-1323-వ.]
2066} దంతిపురనాథుడు - దంతిపురము (హస్తినాపురము) నకు నాథుడు (రాజు), పరీక్షిత్తు :-
[6-54-క.]
2067} దంతిముఖుడు - దంతి (ఏనుగు) ముఖుడు (ముఖము గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]
2068} దంతియూథము - దంతి (ఏనుగు) యూథము (వీరుడు), గజేంద్రుడు :-
[7-350-మ.]
2069} దందశూకము - 1. కుత్సితమైన దంశము (కరచుట) కలది, సర్పము, 2. పాములచే శిక్షింపజేయు నరక విశేషము :-
[5.2-136-వ.,
5.2-158-వ.,
11-99-వ.,
12-28-వ.]
2070} దంభుడు - దబాయింపు, అధర్మ శాఖలు అందు అధర్మునకు భార్య మృష, వారి కుమారుడు దంభుడు, కుమార్తె మాయ. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు. ఆ దంపతుల కుమారుడు లోభుడు, కుమార్తె నికృతి. :-
[4-215-వ.]
2071} దంష్ట్రావిభిన్నశత్రుమహోరస్తటి - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలుకొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము :-
[3-698-క.]
2072} దంష్ట్రి - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు :-
[7-376.1-తే.]
2073} దక్షిణ - 1.యజ్ఞాదుల యందు క్రియలు చేసినవారికి ఇచ్చెడు ధనాదులు, 2.ఉత్తరం దిక్కుకు ఎదురు దిక్కు దక్షిణం, 3.రుచి ప్రజాపతి మనుపుత్రి ఆకూతిలకు పుట్టిన కుమార్తె దక్షిణ, కుమారుడు యజ్ఞుడు. యజ్ఞుడిని మాతామహుడు స్వాయంభువమనువు దత్తత తీసుకున్నాడు. :-
[4-367.1-తే.,
10.2-957-వ.]
2074} దక్షిణదిశాధినాయకుడు - దక్షిణపు దిక్కునకు అధినాయకుడు (ప్రభువు), యమధర్మరాజు :-
[6-163-క.]
2075} దక్షుకూతురు - దక్షుని కూతురు, సతి :-
[8-220-క.]
2076} దధ్యంచుడు - దధి (పెరుగు) అంచుడు (కారణుడు), దధన (ధీ) శక్తి ఐనవాడు :-
[4-26-వ.]
2077} దనుజకరటివరహర్యక్షుడు - దనుజులు (రాక్షసులు) అను కరటి (ఏనుగు)ల వర (రాజు)కు హర్యక్షుడు (సింహము వంటివాడు). విష్ణువు :-
[3-705-క.]
2078} దనుజకుంజరుడు - దనుజ (రాక్షసులలో) కుంజరుడ (ఏనుగువలె గొప్పవాడు), హిరణ్యకశిపుడు :-
[7-154-క.]
2079} దనుజకులాంతకుడు - దనుజ (రాక్షస) కులము (వంశము)ను అంతము చేయువాడు, విష్ణువు :-
[3-444-క.]
2080} దనుజఘస్మరుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు :-
[10.1-1171-ఉ.]
2081} దనుజదండి - రాక్షసులను దండించువాడు, కృష్ణుడు :-
[10.1-1142-ఆ.]
2082} దనుజదమనుడు - దనుజ (రాక్షసులను) దమనుడు (శిక్షించువాడు), విష్ణువు :-
[10.1-884-వ.]
2083} దనుజదర్పావహుడు - దనుజ (రాక్షసు)ల దర్పము (గర్వము) ను అపహరించువాడు, హరి :-
[3-640-క.]
2084} దనుజపరిపంథి - దనుజు (రాక్షసు)లకు పరిపంథి (శత్రువు) , విష్ణువు :-
[3-667-వ.]
2085} దనుజభంజనుడు - దనుజ (రాక్షసులను) భంజనుండు (సంహరించువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]
2086} దనుజభేది - దనుజ (రాక్షసులను) భేది (శత్రువు), విష్ణువు :-
[4-553.1-తే.]
2087} దనుజమర్దనుడు - దనుజులు (రాక్షసులను) మర్దనుడు (సంహరించువాడు), హరి :-
[6-73-చ.,
6-423-ఉ.,
7-114-వ.]
2088} దనుజరాజకుమారుడు - దనుజు (రాక్షసు)ల రాజ (రాజు యొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-133-వ.]
2089} దనుజవిభేధి - దనుజ (రాక్షసుల)కు విభేధి (శత్రువు), విష్ణువు :-
[3-683-చ.]
2090} దనుజవిరోధి - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.2-107-చ.]
2091} దనుజహరుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు. :-
[3-145.1-తే.]
2092} దనుజాంతకుడు - రాక్షసుల పాలిటి యముని వంటివాడు, విష్ణువు :-
[10.1-1369-వ.,
10.1-1541-ఉ.,
10.2-19-క.]
2093} దనుజాధిపమంత్రి - రాక్షసరాజు యొక్క పురోహితుడు, శుక్రుడు :-
[9-539-ఉ.]
2094} దనుజాధిపుడు - దనుజు (రాక్షసు)లకు అధిపుడు (రాజు), హిరణ్యకశిపుడు :-
[7-134-ఉ.]
2095} దనుజాధీశచమూవిదారుడు - రాక్షస రాజుల సైన్యాలని భేదించువాడు, కృష్ణుడు :-
[10.2-207-మ.]
2096} దనుజాధీశవిదారి - దనుజా (రాక్షస) అధీశ (రాజులను) విదారి (చంపువాడు), విష్ణువు :-
[10.2-80-మ.]
2097} దనుజారి - దనుజు (రాక్షసు)లకు అరి (శత్రువు) , విష్ణువు, కృష్ణుడు :-
[1-247-శా.,
3-394-క.,
3-666-చ.,
3-679-వ.,
3-837-క.,
6-157-ఉ.,
10.1-732-మ.]
2098} దనుజులు - కశ్యపునకు దనువు యందు కలిగిన సంతానము, రాక్షసులు :-
[7-402-ఆ.]
2099} దనుజేంద్రవైరి - రాక్షసురాజులకు శత్రువు, విష్ణువు :-
[10.1-353.1-ఆ.]
2100} దనుజేశ్వరుడు - దనుజుల (రాక్షసుల)లో ఈశ్వరుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు :-
[3-702-తే.]
2101} దమఘోషసుతుడు - (కృష్ణుని మేనత్త) శ్రుతశ్రవస భర్త, శిశుపాలుని తండ్రి :-
[10.2-786-క.]
2102} దమము - 1 క్లేశములను ఓర్చుట, బహిరింద్రియ నిగ్రహము, 2. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వశపరచుకొనుట :-
[10.1-1474-ఆ.,
11-54-వ.]
2103} దయానిధి - కృపకు సముద్రము వంటివాడు, విష్ణువు :-
[3-599-ఉ.]
2104} దయానువర్తి - దయతో అనుకూలముగా వర్తించువాడు, విష్ణువు :-
[3-423.1-తే.]
2105} దయాపయోధి - దయారసముచేత సముద్రుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]
2106} దయాబ్ధి - దయకు సముద్రమైనవాడు, విష్ణువు. :-
[8-728-క.]
2107} దయాసముద్రుడు - కృప యనెడి సముద్రుగల వాడు, విష్ణువు :-
[8-18.1-ఆ.]
2108} దయాసాంద్రుడు - దయ దట్టముగ కలవాడు, విష్ణువు :-
[2-237-మ.]
2109} దయాసింధుడు - దయాసముద్రుడు, కృష్ణుడు :-
[1-248-క.]
2110} దరహాసము - చిరునవ్వు, మందస్మితము :-
[10.2-1255-చ.]
2111} దరహాసామృతపూరితాస్యుడు - చిరునవ్వు అను అమృతముతో నిండిన ముఖము కలవాడు, విష్ణువు :-
[2-237-మ.]
2112} దర్పకారాతి - దర్పక (మన్మథుని) ఆరాతి (శత్రువు), శివుడు :-
[10.2-1242.1-తే.]
2113} దర్భాస్తరణంబులన్ - దర్భ + ఆస్తరణంబులన్, సవర్ణదీర్ఘ సంధి, దర్భలతో చేసిన ఆసనము :-
[10.2-1190-మ.]
2114} దర్వీకరము - తెడ్డునుబోలు పడగ కలది, పాము :-
[12-48-వ.]
2115} దర్శనాది, పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శ 3 దర్శనము (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[7-467-వ.]
2116} దర్శనీయమనోరథదాయుడు - దర్శనీయ (ఊహించు కొనగలిగిన) మనోరథ (కోరిక)లను దాయుడు (ఇచ్చువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]
2117} దర్శనీయుడు - దర్శనీయతరుడు దర్శనీయతముఁడు. :-
[4-251.1-తే.]
2118} దర్శనుడు - సాక్షీభూతముగ చూచువాడు :-
[10.1-117-క.]
2119} దర్శము - అమావాస్య, అమావాస్యనాఁడు చేయఁదగిన యిష్టి, దర్శయజ్ఞము :-
[6-507-వ.]
2120} దళత్పంకేరుహాక్షుడు - వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడు, విష్ణువు. పంకేరుహము బురదలో పుట్టునది :-
[2-236-మ.]
2121} దళత్పద్మనేత్రుడు - దళత్ (వికసించిన) పద్మముల వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]
2122} దళదరవిందసుందరపత్రనేత్రుడు - విచ్చుకొన్నపద్మముల రేకులవంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]
2123} దళదరవిందసుందరపత్రరుచిరాక్షుడు - దళత్ (విచ్చుకొనుచున్న) అరవింద (పద్మముల) సుందర (అందమైన) పత్ర (రేకుల వంటి) రుచిర( ప్రకాశమైన) అక్షుడు (కన్నులు కలవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]
2124} దళితపంకేరుహాక్షుడు - దళిత (వికసించిన) పంకేరుహ (పద్మముల) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-415-తే.]
2125} దశ - 1.అవస్థ, చతురావస్థలు, బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము, ఇంకోవిధముగ 2. అష్టధశలు పిండ, శైశవ, బాల్య, కౌమార, యౌవన, ప్రౌఢ, వార్థక్య, మరణ దశలు. 3. సంఖ్య పది :-
[3-109-ఉ.]
2126} దశకంఠుడు - పది కంఠముల వాడు, రావణాసురుడు :-
[10.2-68.1-తే.]
2127} దశకంధరుడు - పది కంఠముల వాడు, రావణాసురుడు :-
[9-304-క.,
10.2-1241-వ.]
2128} దశగ్రీవుడు - దశ (పది) గ్రీవుడు (కంఠములు కలవాడు), రావణుడు :-
[5.2-115-వ.,
9-269.1-తే.]
2129} దశదిక్కులు - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద :-
[4-371-వ.,
8-614-క.]
2130} దశదిశలు - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద :-
[1-287-వ.,
5.1-82-వ.,
6-307-వ.,
7-285-వ.,
7-373-వ.,
9-360-చ.,
10.1-266-వ.,
10.1-716-వ.,
10.1-1299-క.]
2131} దశముఖుడు - పదిముఖములు కలవాడు, రావణుడు :-
[9-265-క.]
2132} దశరథతనయుడు - దశరథుని పుత్రుడు, రాముడు :-
[9-230-వ.]
2133} దశరథరాముడు - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింప జేయువాడు), రాముడు. :-
[8-1-క.]
2134} దశరథసూనుడు - దశరథుని పుత్రుడు, రాముడు :-
[9-304-క.]
2135} దశవదనవిదళనుడు - దశవదను (పదితలలవాడు, రావణాసురు)ని విదళన (సంహరించినవాడు), రాముడు :-
[11-72.1-తే.]
2136} దశవిధగుణములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్య 7దంభ 8దర్ప 9ఈర్ష్యా 10అసూయలు అనెడి గుణములు :-
[10.1-939.1-తే.]
2137} దశవిధపవనములు - పంచవాయువులు (1ప్రాణము 2అపానము 3ఉదానము 4వ్యానము 5సమానము) మరియు పంచోపవాయువులు (1నాగము 2కూర్మము 4కృకరము 4దేవదత్తము 5ధనంజయము) :-
[7-464.1-తే.]
2138} దశవిధమన్మథావస్థలు - 1చూచుట 2తలచుట 3కోరుట 4కాచుట 5చిక్కిపోవుట 6అరుచిపుట్టుట 7సిగ్గువిడుచుట 8నడచుట 9మూర్చిల్లుట 10ప్రాణముపోవుట :-
[10.1-1495-ఉ.]
2139} దశానన - దశ (పది) ఆనన (ముఖములు) కలవాడ, రావణుడు, దశకంఠుడు :-
[2-285-ఉ.,
3-1-క.]
2140} దశావరణలు - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయ 8 జ్ఞానమయ 9 మహత్త్వము 10 ప్రకృతి :-
[3-363-వ.]
2141} దశేంద్రియములు - జ్ఞానేంద్రియములు ఐదు (కన్ను ముక్కు చెవులు నాలుక చర్మములు) కర్మేంద్రియములు ఐదు (కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యములు) :-
[10.1-682.1-తే.,
10.2-1203-వ.,
11-62-వ.]
2142} దహనుడు - దహింపజేయు వాడు, అగ్ని :-
[10.2-122-వ.]
2143} దాంతి - బ్రహ్మచర్యాది తపఃక్లేశములను ఓర్చుకొనుట :-
[12-20-వ.]
2144} దాక్షాయణి - దక్షునికూతురు, మూర్తిదేవి, సతి :-
[2-125-క.,
4-34-వ.,
4-211-వ.,
7-409-వ.]
2145} దానవకులవైరి - దానవులందరికి శత్రువు, విష్ణువు :-
[1-111-క.]
2146} దానవకులసంహారుడు - రాక్షసులను సంహరించువాడు, కృష్ణుడు :-
[10.2-1045-క.]
2147} దానవఘస్మరుడు - దానవ (రాక్షసుల) ఘస్మరుడు (నాశకుడు), విష్ణువు :-
[8-197-క.]
2148} దానవచమూజైత్రుడు - రాక్షసుల చమూ (సైన్యములను) జైత్రుడు (జయించువాడు), విష్ణువు :-
[3-284-మ.]
2149} దానవనాథుడు - రాక్షస రాజు, నరకుడు :-
[10.2-187-క.]
2150} దానవరిపుడు - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.1-1424-క.]
2151} దానవలోకేశుడు - దానవ (రాక్షసుల యొక్క) లోకమునకు ఈశుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు :-
[3-700-మ.]
2152} దానవవిద్విట్ - దానవులు(రాక్షసులు) విద్విట్ (ద్వేషించువాడు), విష్ణుమూర్తి :-
[6-500-ఉ.]
2153} దానవవిభుడు - దానవ (రాక్షస) విభుడు (రాజు), హిరణ్యకశిపుడు :-
[7-139-శా.]
2154} దానవహంత - దానవ (రాక్షసుల)ను హంత (సంహరించువాడు), విష్ణువు :-
[3-653-చ.,
10.1-1173-ఉ.]
2155} దానవాంతకుడు - దానవుల (రాక్షసుల)ను అంతకుడు (సంహరించినవాడు, యముడు), విష్ణువు :-
[3-836-చ.]
2156} దానవారాతి - దానవుల (రాక్షసుల)కు ఆరాతి (శత్రువు), విష్ణువు :-
[5.2-112.1-ఆ.]
2157} దానవుడు - దనువునందు కశ్యపునకు పుట్టినవాడు, బలి :-
[10.2-1141-మ.]
2158} దానవులశత్రువు - దానవులకు శత్రువు, హరి :-
[1-100-చ.]
2159} దానవులు - దనువుకశ్యపుల పుత్రులు, రాక్షసులు :-
[7-29-వ.,
8-182-వ.,
8-668-క.,
10.2-155-ఉ.]
2160} దానవేంద్రుడు - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-84-వ.,
7-98-వ.]
2161} దామెన - పశువులను కట్టెడి తాడు, పలుపుతాడు :-
[6-169.1-ఆ.]
2162} దామోదరుడు - వనమాల ఉదరమున కలవాడు, శ్లో. దామాని లోకానామాని తానియస్యోదరాంతరే, తేన దామోదరో దేవశ్శ్రీధరస్త్వం సమాశ్రితః. వ్యాస వచనము, దామములు అనగా లోకములు పదునాలుగు ఉదరమున కలవాడు, దామము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[4-443.1-తే.,
10.1-1223-మ.,
10.2-49-క.,
10.2-533-వ.,
10.2-753-ఉ.]
2163} దాయాదులు - పిత్రార్జితమును పంచుకొనెడివారు :-
[5.1-171-వ.]
2164} దార - వ్యు. దౄ వాదారణే , దౄ (ణిచ్) ఆర్ టాప్, కృ.ప్ర., అన్నదమ్ముల నుండి వేఱుపఱచునది, భార్య :-
[8-81.1-ఆ.]
2165} దారకుడు - కృష్ణుని రథసారథి :-
[10.2-515-వ.,
10.2-669.1-తే.,
10.2-873-ఆ.,
10.2-886-వ.]
2166} దార్తరాష్ట్రలు - కాళ్ళు, ముక్కు ఎఱ్ఱగాను, మిగతా శరీరం తెల్లగా నుండే హంసలు :-
[1-39-వ.]
2167} దావాగ్ని - దావము (అడవి) అందలి అగ్ని, కారుచిచ్చు :-
[3-850.1-తే.]
2168} దాశరథి - దశరథుని పుత్రుడు, శ్రీరాముడు :-
[3-304.1-తే.]
2169} దాసదుఃఖనాశి - భక్తుల దుఃఖములను నశింపజేయువాడు, విష్ణువు :-
[10.2-749-ఆ.]
2170} దాసవిహారుడు - దాస (దాసుల యందు) విహారుడు (విహరించెడివాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]
2171} దిక్కరులు - అష్టదిగ్గజములు భూమి మోయు చుండు దిక్కులందలి ఎనిమిది (8) ఏనుగులు 1తూర్పు ఐరావతము 2 ఆగ్నేయుం పుండరీకము 3 దక్షిణం వామనము 4నైరృతి కుముదము 5పడమర అంజనము 6వాయవ్యం పుష్పదంతము 7ఉత్తరం సార్వభౌమము 8ఈశాన్యం సుప్రతీకము :-
[3-603-తే.]
2172} దిక్కులరాజులు - దిక్పాలకులు అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[7-261-క.]
2173} దిక్పాలకులు - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-42.1-తే.,
6-260.1-తే.]
2174} దిక్పాలవరులు - అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-460.1-తే.]
2175} దిక్పాలురు - అష్టదిక్పాలకులు అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[4-170-వ.,
7-357.1-తే.]
2176} దిగంబరుడు - దిక్కులే అంబరము (బట్టగా) కలవాడు, నగ్నుడు, అవధూత. :-
[5.1-54-వ.,
5.1-78-వ.,
7-21-వ.]
2177} దిగిభము - దిక్ + ఇభము, దిగ్గజము :-
[10.1-1351-క.]
2178} దిగీశులు - దిక్పాలకులు అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[7-206-శా.]
2179} దిగ్గజములు - అష్టదిగ్గజములు భూమి మోయు చుండు దిక్కులందలి ఎనిమిది (8) ఏనుగులు 1తూర్పు ఐరావతము 2 ఆగ్నేయుం పుండరీకము 3 దక్షిణం వామనము 4నైరృతి కుముదము 5పడమర అంజనము 6వాయవ్యం పుష్పదంతము 7ఉత్తరం సార్వభౌమము 8ఈశాన్యం సుప్రతీకము :-
[3-413.1-తే.,
5.2-73-వ.,
7-285-వ.]
2180} దిగ్గజరాజు - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము :-
[3-688-క.]
2181} దిగ్గజేంద్రము - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము :-
[10.1-1174-ఉ.,
10.1-1331.1-తే.]
2182} దిగ్విజయము - అన్ని దిక్కులందలి భూమండలమును జయించుట :-
[1-396-వ.,
9-433-వ.]
2183} దిఙ్మండలశుండాలములు - అష్టదిగ్గజములు దిక్ (దిక్కుల) చివర మండల (స్థలము లందలి) శుండాలములు (ఏనుగులు), దిగ్గజములు :-
[6-218.1-ఆ.]
2184} దితిజుడు - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[3-420-మ.,
3-684-క.,
3-688-క.]
2185} దితితనూజుడు - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-95.1-తే.]
2186} దితినందనుడు - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-93-వ.]
2187} దితిపుత్రుడు - దితికి పుట్టినవాడు, దైత్యుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు :-
[7-99-మ.]
2188} దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభాశుక్రము - దితి యొక్క సంతానము (పుత్రుల) కుల (సమూహము) అను అటవీ (అడవి)ని మహిత (గొప్ప) సందీప్త (బాగా వెలిగిపోయిన) ప్రభా (కాంతులు) కల శుక్రము (అగ్నిహోత్రము), విష్ణుచక్రము :-
[3-678-మ.]
2189} దితిసంభవుడు - దితికి పుట్టినవాడు, హిరణ్యాక్షుడు :-
[3-689-మ.]
2190} దితిసుతనిరాకరిష్ణుడు - దితియొక్క పుత్రులైన రాక్షసులను తిరస్కరించువాడు, విష్ణువు :-
[10.1-109-క.]
2191} దితిసుతుడు - దితి యొక్క సుతుడు (పుత్రుడు), హిరణ్యాక్షుడు :-
[3-674-క.,
7-110-మ.,
9-161.1-తే.]
2192} దినకరకోటిసందీప్తతేజుడు - దినకర (సూర్యులు) కోటి (కోటి మందితో సమానమైన) సందీప్తుడు (ప్రకాశము కలవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]
2193} దినకరుడు - దినమునకుకారణుడు, సూర్యుడు :-
[2-31.1-ఆ.,
8-546-వ.,
10.1-568-వ.,
10.1-937-క.,
10.2-441-వ.]
2194} దినక్షయము - ఒకదినమున మూడు తిథులు కలుగుట, తద్వార సూర్యోదయానికి ఉన్న మొదటి తిథి ఆ నాటి తిథి అవుతుంది, మూడవ తిథి మరునాటి సూర్యోదయానికి ఉంటుంది కనుక ఆనాటి తిథి. మధ్యలో ఉన్న తిథికి వేరే దినము లేనందున దానిని దిన క్షయం అంటారు :-
[7-448-వ.]
2195} దిననాథుడు - పగళ్ళకు అధిపతి, సూర్యుడు :-
[10.1-717.1-ఆ.]
2196} దిననాయకుడు - దిన (పగలు)కి నాయకుడు, సూర్యుడు :-
[4-641-క.,
4-956-క.]
2197} దినభాగములు - (పగలు, రేయి ముహుర్తములు) 2 X 15 (ఒక్కోటి 48 ని. లకు సమానము) 1 రౌహిణేయము 2 విరించము 3 సోమము 4 నిరృతి 5 మహేంద్రము 6 వరుణము 7 భటము 8 రౌద్రము 9 శ్వేతము 10 మైత్రము 11 శారభటము 12 సావిత్రము 13 విజయము 14 గాంధర్వము 15 కుతపము :-
[2-12-వ.]
2198} దినశేషము - ఆనాటికి మిగిలిన సమయము, రాత్రి :-
[3-169-క.]
2199} దినేశుడు - దిన + ఈశుడు, గుణ సంధి, పగలుకు ప్రభువు, తత్పురుష సమాసము, సూర్యుడు :-
[3-1054-మాలి.,
9-718-క.,
10.2-1225-ఆ.]
2200} దిలీపుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు, ఇతని మునిమనవడు దశరథుడు :-
[2-204.1-తే.]
2201} దివసాగమదళదరవిందదళాక్షుడు - దివస ఆగమ (ప్రాతః కాలము నందు) తళత్ (ఇంచుక వికసించిన) అరవింద (తామరల యొక్క) దళ (రేకుల వంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-246-క.]
2202} దివాకరుడు - దివమునకు ఆకరుడు (చేయువాడు), సూర్యుడు :-
[4-374-వ.,
11-12.1-తే.]
2203} దివిజకాంతామణులు - దేవరమణులు, అప్సరసలు. :-
[2-126-క.]
2204} దివిజరాజు - దివి (స్వర్గమున) జులు (చెందినవారు) దేవతలు వారి రాజు, ఇంద్రుడు :-
[6-386-వ.,
6-531-గ.,
7-373-వ.]
2205} దివిజరిపువిదారుడు - దివిజరిపు (రాక్షసు)లను విదారుడు (సంహరించినవాడు), శ్రీరాముడు :-
[8-744-మాలి.]
2206} దివిజాంతకుడు - దివిజు (దేవత)లను అంతకుడు (చంపువాడు), రాక్షసుడు :-
[10.1-474-మ.]
2207} దివిజాధీశుడు - దివిజుల (దేవతల)కు అధీశుడు (ప్రభువు),ఇంద్రుడు :-
[3-113-మ.,
3-227-క.]
2208} దివిజాధీశ్వరుమాత - దివిజాధీశ్వరుని (ఇంద్రుని) మాత, అదితి :-
[8-506-మ.]
2209} దివిజానీకవిరోధి - దివిజ (దేవతా) అనీక (సేనల) కు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-85-మ.]
2210} దివిజారి - దివిజుల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-633-క.]
2211} దివిజారిహరుడు - దేవతశత్రువు (రాక్షసు)లను సంహరించువాడు, విష్ణువు. :-
[10.2-1212-క.]
2212} దివిజులు - దివి (స్వర్గమున) జులు (జనించినవారు), దేవతలు :-
[3-1-క.,
3-92-చ.,
3-702-తే.,
6-176-క.,
6-275-క.,
7-95.1-తే.,
8-182-వ.]
2213} దివిజేంద్రుడు - దివిజ (దేవత)లకు ఇంద్రుడు, దేవేంద్రుడు :-
[7-328-క.]
2214} దివౌకః+స్వామి - దివౌకః (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు :-
[8-611-మ.]
2215} దివ్యదృష్టి - భూతభవిష్యద్వర్తమానములు చూడగల దృష్టి, అతీంద్రియ విషయములను తెలుసుకొనగల జ్ఞానము :-
[7-219-వ.]
2216} దివ్యము - దివ్యతరము దివ్యతమము :-
[2-121.1-తే.]
2217} దివ్యవాణి - దివ్యమైన వాణి గలామె, సరస్వతి :-
[6-17.1-తే.]
2218} దివ్యసంవత్సరము, దివ్యవత్సరము - 1 మానవ సంవత్సరము, దేవతలకు ఒక దినము, దివ్యదినము. ఉత్తరాయణము పగలు దక్షిణాయణము రాత్రి అట్టి దినములు 30 ఐన 1 దివ్యమాసము అవి 12 అయిన 1 దివ్యసంవత్సరము 1000 దివ్య సంవత్సరములు బ్రహ్మకు 1 రాత్రి లేదా పగలు ఇవి రెండుకలిపిన బ్రహ్మకు 1 దినము ఆ రాత్రి భాగము ప్రళయము పగలు భాగము కల్పము అగును. బ్రహ్మ ఆయువు 100 బ్రహ్మవత్సరములు ఇదే బ్రహ్మకల్ప మందురు :-
[3-281-మ.,
4-11.1-తే.,
6-484-వ.,
7-360-వ.]
2219} దివ్యాంబరాభరణాలంకృతుడు - దివ్యమైన వస్త్రములు ఆభరణములచే అలంకరింపబడినవాడు, శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]
2220} దిశలు - అష్టదిక్కులు 1తూర్పుదిక్కు 2 ఆగ్నేయమూల 3దక్షిణదిక్కు 4నైరృతిమూల 5పడమరదిక్కు 6వాయవ్యమూల 7ఉత్తరదిక్కు 8ఈశాన్యమూల :-
[3-603-తే.]
2221} దిశాధిపులు - దిక్పాలకులు అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు :-
[6-385-లగ్రా.]
2222} దీక్షితుడు - సోమముగల యజ్ఞమునందు దీక్ష వహించువాడు :-
[10.1-854-క.]
2223} దీనలోకాధారుడు - దీనులైనవారికి ఆధారుడు (ఆధారముగా నుండువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]
2224} దీనవత్సలుడు - దీనులయెడవాత్సల్యముగలవాడు, విష్ణువు :-
[4-963.1-తే.]
2225} దీనార్తినిర్మూలనుడు - దీనుల ఆర్తిని నిర్మూలించువాడు, విష్ణువు :-
[12-36-మ.]
2226} దీపందర్శయామి - వెలిగించిన దీపమును చూపుట అనెడి దేమునికి చేసెడి సేవ :-
[10.1-808-వ.]
2227} దీపాంకురము - దీపమునుండి అంకురించునది, దీపపుకాంతి, దీపకళిక :-
[3-1048.1-తే.]
2228} దీమము - పశుపక్షులను పట్టుటకు పెంచిన సజాతీయ పశుపక్షులు, పెంపుడుజంతువు. ఎర చేపలు మున్నగు వానిని పట్టుకొనుటకు పెట్టెడి వానపాము, మాంసం వంటి వాటి ఆహారం :-
[10.1-967.1-ఆ.]
2229} దీర్ఘము - దీర్ఘతరము దీర్ఘతమము :-
[4-540-వ.,
7-355-మ.]
2230} దుందుమారుడు,ధుంధుమారుడు - ఈ రెండు పాఠ్యంతరములు కువలయాశ్వునికి వర్తించి ఉన్నాయి దుందు కాష్ఠదీపిక, చక్రారారపు దివిటీ, సూర్యారాయాంద్ర నిఘంటువు (ధుంధువు అని పాఠ్యంతరం, ధుంధుమారము అంటే ఆరుద్ర పురుగు అని నిఘంటువు) :-
[9-164-క.]
2231} దుఃఖభంజనుడు - దుఃఖములను భంజన (నాశము చేయువాడు), విష్ణువు :-
[6-342-ఆ.]
2232} దుఃఖవారణుడు - దుఃఖములను నివారించెడివాడు, విష్ణువు :-
[6-529-త.]
2233} దుగ్దార్ణవము - దుగ్ద (పాల) అర్ణవము (నీటికిస్థానమైనది, సముద్రము), పాలసముద్రము :-
[12-48-వ.]
2234} దుగ్ధజలధిజాతశుండాలము - దుగ్ధజలధిన్ (పాలసముద్రమునందు) జాత (పుట్టిన) శుండాలము (ఏనుగు), ఐరావతము :-
[7-285-వ.]
2235} దురంతము - అంతమును చూచుటకు కష్టమైనది :-
[2-202-చ.]
2236} దురదుర - వేగవంతమైన గమనము యొక్క ధ్వన్యనుకరణము :-
[10.2-161-క.]
2237} దురన్తుడు - దురితములను అంతముచేయువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
2238} దురన్వయక్రమణుడు - అన్వయ (ఘటింప) రాని (శక్యముగాని) క్రమణుడు (ప్రవర్తన గలవాడు), విష్ణువు :-
[7-148-శా.]
2239} దురితతారణుడు - పాపములనుండి తరింపజేయువాడు, విష్ణువు :-
[6-529-త.]
2240} దురితధ్వాంతపతంగుడు - దురిత (పాపములు అనెడి) ధ్వాంత (చీకటికి) పతంగుడు (సూర్యుని వంటివాడు), రాముడు :-
[4-975-క.]
2241} దురితపయోనిధితరుడు - దురితములు (పాపములు) అను పయోనిధి (సముద్రము)ని తరుడు (దాటించువాడు), విష్ణువు :-
[3-647-క.]
2242} దురితవిదూరుడు - దురితముల (పాపములు) విదూరుడు (పోగొట్టువాడు), విష్ణువు :-
[3-748-క.,
3-861-క.]
2243} దురితార్ణవతారణుడు - దురితములు (పాపములు) అను ఆర్ణవము (సముద్రము) తారణుడు (దాటించువాడు), బ్రహ్మదేవుడు :-
[3-499-చ.]
2244} దురుక్తి - నింద, చెడుగా పలుకుట :-
[4-215-వ.]
2245} దుర్గ - కాశీక్షేత్రమున దుర్గ (వనాది దుర్గమ స్థావరములు కలది, ఎరుగుటకు చాలా కష్టమై నామె) :-
[10.1-61-వ.]
2246} దుర్గము - దాటరానిది, వెళ్ళరానిది, కోట :-
[10.2-157-మ.]
2247} దుర్దాంతము - దుర్దాంతతరము దుర్దాంతతమము :-
[6-183-క.]
2248} దుర్భరభవవిదూరుడు - దుర్ (చెడ్డ) భవ (జన్మము) భవ (కలుగుటను) విదూర (మిక్కిలి దూరము చేయువాడు), కృష్ణుడు. :-
[10.2-257.1-తే.]
2249} దుర్భవభయవిదూరడు - భయంకరమైన భవము (సంసారము) వలని భయమును పూర్తిగా దూరము చేయువాడ, విష్ణువు. :-
[3-304.1-తే.]
2250} దుర్మద - దుర్ (చెడ్డది) మద (మదము) కలది :-
[4-768-వ.]
2251} దుర్మదాసురమారణుడు - దుర్మద (అదికమైన గర్వముగల) అసురులను మారణుడు (సంహరించెడివాడు), విష్ణువు :-
[6-529-త.]
2252} దుర్లభుడు - పొందరాని వాడు, విష్ణువు :-
[10.1-1497-మ.]
2253} దుర్వారబలుడు - వారింపశక్యముకాని బలము కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]
2254} దుర్వాసుడు - ఒకముని, అత్రి అనసూయలకు రుద్రుని అంశమున పుట్టిన కొడుకు. ఇతని సోదరులు సోముడు, దత్తాత్రేయుడు. ఇతడు మహాకోపిష్ఠుడు. ఇతని శాపకథలు అనేకములు కలవు. :-
[8-148-క.]
2255} దుశ్శాసనుడు - దుర్యోధనుని తమ్ముడు, దుః (అతిగా, చెడుగా) శాసన (ఆజ్ఞాపించుట) చేయువాడు :-
[3-34-క.,
9-230-వ.]
2256} దుష్కృతము - దుః (పాపపు) కృతము (పని), అపరాథము :-
[4-397-క.]
2257} దుష్కృతహరుడు - దుష్కృతములు (పాపములు) హరించువాడు (పోగొట్టువాడ), శ్రీకృష్ణ :-
[5.1-182-క.]
2258} దుష్టమదాసురేంద్రనాశంకరుడు - దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) నాశనము చేయువాడు, శివుడు :-
[10.2-315-ఉ.]
2259} దుష్టమదాసురేంద్రసంహరణుడు - దుష్ట (చెడ్డ) మదా (మదముగల) అసురేంద్ర (రాక్షసరాజులను) సంహరణుడు (చంపువాడు), శ్రీరాముడు :-
[10.2-1340-చ.]
2260} దుష్టలోకసంహరుడు - దుష్టులు లోక (సర్వులను) సంహరుడు (సంహరించెడి వాడు), విష్ణువు :-
[6-173-చ.]
2261} దుష్టవినాశుడు - చెడును (పాపులను) నాశనము చేయువాడు, విష్ణువు :-
[4-703.1-తే.]
2262} దుష్టవిమర్దనుడు - దుష్టుల (చెడ్డవారి)ని విమర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు :-
[3-627-చ.]
2263} దుష్టశిక్షకుడు - దుష్టులను శిక్షించువాడును, శంకరుడు :-
[3-473-వ.]
2264} దుష్టానీకవిదళనాకుంఠుడు - దుష్ట (రాక్షసుల) అనీక (సైన్యమును) విదళన (చీల్చివేయుటయందు) అకుంఠుడు (అనర్గళుడు), శివుడు :-
[7-393-క.]
2265} దుస్తరము - దుస్తరతరము దుస్తరతమము :-
[10.1-1144-చ.]
2266} దూడ - ఆవు/గేదె పిల్ల, పెయ్య, లేగ, లేగదూడ :-
[1-341-క.]
2267} దృఢచ్యుతుడు - దృఢ అచ్యుతుడు, జారనట్టి దీక్షకలవాడు, సత్యలోకాది భోగములనుండి చ్యుతుడు (జారినవాడు), ఐహికాముష్మిక భోగముల ఎడ విరాగము కలవాడు :-
[4-831-క.]
2268} దేవ - దివికి సంబంధించిన వాడు, స్వయం ప్రకాశకుడు, స్వతంత్రుడు, భగవంతుడు, దేవుడు, విష్ణువు, శివుడు :-
[3-152-చ.,
4-159-క.,
4-704-తే.,
8-503.1-తే.,
10.2-530-క.]
2269} దేవఋణము - వేదోక్త కర్మలనాచరించుట ద్వారా తీర్చుకొనునది, దేవ, పితృ, మనుష్య ఋణములను ఋణత్రయముల లోనిది :-
[6-252-వ.]
2270} దేవకిరీటరత్నరుచిదీపితపాదసరోజుఁడు - దేవతల కిరీటముల కాంతులచే ప్రకాశిస్తున్న పాదములు అనెడి పద్మములు కలవాడు, విష్ణువు :-
[4-263-ఉ.]
2271} దేవకీదేవి - శ్రీకృష్ణుని కన్నతల్లి. :-
[10.1-106.1-తే.]
2272} దేవకీనందనుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు :-
[1-188-వ.]
2273} దేవకీసుతుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు :-
[10.1-1692.1-ఆ.]
2274} దేవకుల్య - 1.దేవనది, గంగానది 2. మరీచి కళల కుమార్తె పూర్ణిమ జన్మాంతరంలో విష్ణుపాదనది ఐన గంగ అయి పుట్టింది. గంగ కూతురు దేవకుల్య, కుమారుడు విరజుడు. :-
[4-7.1-తే.]
2275} దేవచక్రవర్తి - దేవతలకి చక్రవర్తి, విష్ణువు. :-
[3-311.1-తే.]
2276} దేవచూడామణి - దేవుళ్ళలో శిరోమణి (అత్యుత్తముడు), విష్ణువు. :-
[3-301-మ.]
2277} దేవజ్యేష్ఠుడు - దేవతలలో పెద్దవాడు, బ్రహ్మ :-
[9-108-శా.]
2278} దేవతాగ్రేసరుడు - దేవతలలో గొప్పవాడు, విష్ణువు :-
[3-590-ఉ.]
2279} దేవతాచక్రవర్తి - దేవతలకు చక్రవర్తి, విష్ణువు :-
[3-203-దం.]
2280} దేవతానగరి - దేవతల రాజధాని, అమరావతి :-
[8-100-మ.]
2281} దేవతానీకగోబ్రాహ్మణార్తిహరణుడు - దేవత దేవతల, అనీక సేనలకును, బ్రాహ్మణ బ్రాహ్మణులకును, గోగణ గోవులమందకును, ఆర్తి బాధలను, హరణా హరించువాడు, కృష్ణుడు :-
[1-201-శా.]
2282} దేవతానోకహంబు - దేవతా అనోకహంబు, దేవతావృక్షము :-
[2-155.1-తే.]
2283} దేవతాపతి - దేవతల యొక్క పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[6-270.1-తే.]
2284} దేవతావిభవదాత - దేవత (దేవతల యొక్క) విభవ (వైభవములను) దాత (సమకూర్చెడి వాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]
2285} దేవతాహ్లాదగరిష్ఠుడు - దేవతా (దేవతలకు) ఆహ్లాద (సంతోషమును కలిగించువారిలో) గరిష్ఠుడు (శ్రేష్ఠుడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]
2286} దేవదేవుడు - దేవుళ్ళకు దేవుడు, విష్ణువు. బ్రహ్మదేవుడు, శివుడు :-
[3-94.1-తే.,
3-203-దం.,
3-219-తే.,
3-500-ఉ.,
3-574-మ.,
3-861-క.,
3-897.1-తే.,
4-276-చ.,
4-373-ఆ.,
4-918.1-తే.,
6-131-ఆ.,
6-330-తే.,
7-75-క.,
7-169.1-తే.,
7-381.1-తే.,
8-547-ఆ.,
8-659.1-తే.,
9-73.1-తే.,
10.2-201-వ.,
10.2-1014-క.,
10.2-1032-ఆ.]
2287} దేవద్వేషి - దేవతల యెడ ద్వేషముగల వాడు, హిరణ్యకశిపుడు, రాక్షసుడు :-
[7-102-శా.,
8-178-క.]
2288} దేవధాని - దేవతల యొక్క ధాని (ఆశ్రయము), అమరావతి :-
[8-458-వ.]
2289} దేవనదీతనయుడు - గంగదేవి పుత్రుడు, భీష్ముడు :-
[1-205-క.]
2290} దేవనాయకుడు - దేవతలకు నాయకుడు, ఇంద్రుడు :-
[6-436.1-ఆ.]
2291} దేవపతినందనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[10.2-743-క.]
2292} దేవపుంగవుడు - దేవ (దేవతలలో) పుంగవుడు (శ్రేష్ఠుడు), ఇంద్రుడు :-
[6-270.1-తే.]
2293} దేవమంత్రి - దేవతలకు మంత్రి, బృహస్పతి :-
[3-46-చ.]
2294} దేవమయుడు - సమస్త దేవతలు తానైనవాడు, విష్ణువు :-
[10.1-52.1-ఆ.]
2295} దేవయాన, పాలపుంత - అంతరిక్షమున ప్రకాశవంతమైన దారివలె నుండు తారల వరుస :-
[5.2-97-వ.]
2296} దేవలోకోపకారుడు - దేవలోక (దేవత లందరికి) ఉపకారుడు (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు :-
[8-744-మాలి.]
2297} దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), శివుడు, విష్ణువు :-
[8-222.1-ఆ.,
8-659.1-తే.]
2298} దేవవిభుడు - దేవతలకు విభుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[3-62-మ.,
6-269-ఉ.]
2299} దేవవిభునిసుతుడు - దేవవిభుని (ఇంద్రుని) సుతుడు (పుత్రుడు), అర్జునుడు :-
[10.2-1165.1-తే.]