పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (గంగా - ఘోష)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


వసం.) పదం / పదబంధం = వివరం :: పద్యం సంఖ్యలు.
1290) గంగాకలాపుడు = గంగ (గంగదేవి)ని కలాపుడు (భూషణముగ కలవాడు), శివుడు :: 4-149-సీ.
1291) గంగానందనుడు = గంగాదేవి పుత్రుడు, భీష్ముడు :: 1-206-వ.
1292) గంగావతరణకరణము = ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట, రాసక్రీడా పారిభాషిక పదము :: 10.1-1084-వ.
1293) గండభేరుండము = రెండు తలలు మూడు కన్నుల కలిగి ఏనుగును తన్నుకుపోగల పక్షి :: 9-595-క.
1294) గంధగజదానవభంజనుడు = గంధ (మదించిన) గజదానవ (గజాసురుని) భంజనుడు (సంహరించినవాడు), శివుడు :: 6-2-ఉ.
1295) గంధగమన = ఏనుగు వంటి నడక కలామె, స్త్రీ :: 9-622-క.
1296) గంధర్వము = వట్రువు తోక దొడ్డ కడుపుగల దుప్పి :: 10.2-112-మ.
1297) గంధర్వులు = గానములు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము, గంధ (వాసనలు) మోసుకొచ్చెడివారు (అహోరాత్రులు సంకేతము) :: 2-274-సీ.; 4-819-వ.
1298) గంధర్వోత్తములు = చిత్రసేనాదులు :: 10.1-107-క.
1299) గంధవాహుడు = గంధ (వాసనను) వాహుడు (మోసుకొని వెళ్ళువాడు), వాయుదేవుడు :: 3-535-చ.; 4-29-సీ.; 4-646-మత్త.; 11-99-వ.
1300) గగనకేశుడు = గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు), శివుడు :: 4-63-క.
1301) గగనచరనది = ఆకాశమునందు వర్తించు నది, గంగ :: 11-72-ససీ.
1302) గగనముఖములు = పంచభూతములు, 1గగనము 2వాయు 3జలము 4తేజము 5పృథ్వి :: 3-893-సీ.
1303) గజగమన = గజ (ఏనుగు వలె ఒయ్యారమైన) గమన (నడక కలామె), స్త్రీ :: 10.1-813-వ.
1304) గజగామిని = గజ (ఏనుగు వలె ఒయ్యారమైన) గమన (నడక కలామె), స్త్రీ :: 4-747-వ.
1305) గజజాతులు = త్రివిధగజములు, 1భద్రము 2మందము 3మృగము :: 6-386-వ.
1306) గజనామధేయపురము = గజ (హస్తిన అను) నామధేయ (పేరు కల) పురము (పురము) హస్తినాపురము :: 1-438-క.
1307) గజపురవల్లభుడు = గజపురము (హస్తినా పురము)నకు వల్లభుడు (రాజు), పరీక్షిత్ :: 6-444-వ.
1308) గజభేదములు = 1భద్రము 2మందము 3మృగము :: 8-19-క.
1309) గజరాజవరదుడు = గజరాజు (గజేంద్రుని) వరదుడు (కాపాడినవాడు), విష్ణువు :: 11-49-క.
1310) గజరిపు = గజము (ఏనుగు)నకు రిపు (శత్రువు), సింహము :: 7-71-క.
1311) గజరిపుపీఠము = గజ (ఏనుగు) రిపు (శత్రువు, సింహము) పీఠము (ఆసనము), సంహాసనము :: 1-438-క.
1312) గజవైరిపరాక్రముడు = (గజ (ఏనుగు) వైరి (శత్రువు, సింహ) పరాక్రముఁడు (పరాక్రమము కలవాడు, - సింహపరాక్రముడు :: 1-438-క.
1313) గజేంద్రము = గజము (ఏనుగు)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), ఐరావతము :: 6-387-మ.
1314) గడియ = 24 నిముషముల కాలము, 2 గడియలు - 1 ముహుర్తము, 60 విగడియలు - 1 గడియ :: 2-11-క.
1315) గడుపుచుండును = సమయమును నడుపుచుండును, నడుపుచుండును :: 5.2-83-వ.
1316) గణనాతీత = ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు. :: 1-196-క.
1317) గణేశుడు = సర్వ గణములకు ఈశుడు (అధిపతి), విఘ్నేశ్వరుడు :: 6-4-ఉ.
1318) గతత్రపుడు = గత (పోయిన) త్రపుడు (సిగ్గు కలవాడు) :: 4-42-సీ.
1319) గతవిగ్రహుండు = గత (తొలగిన) విగ్రహము (విరోధము) కలవాడు, విష్ణువు :: 3-524-వ.
1320) గతాగతతానకము = తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :: 10.1-1084-వ.
1321) గతి = గమనము :: 4-26-వ.
1322) గతులు = సంగీతమునందలి ధ్వని భేదములు :: 10.2-801-సీ.
1323) గద = చేత పట్టుకొన వీలైన పొడవైన కడ్డీ దాని చివర పెద్ద బరువైన గుండ్రటి తల కలిగిన ఆయుధవిశేషము, గుదియ :: 10.2-165-వ.
1324) గదాచక్రాంబుజాద్యంకితుడు = గద చక్రము పద్మములు అలంకారముగా కలవాడు, విష్ణువు. :: 12-36-మ.
1325) గదాధరుడు = గదను ధరించినవాడు, బలరాముడు :: 4-652-వ.
1326) గదాధారణుడు = కౌమోదకి అను గదను ధరించువాడు, విష్ణువు :: 10.2-49-క.
1327) గదాసికోదండశంఖసుదర్శనాంకుడు = గదను అసి (కత్తిని) కోదండ (విల్లు)ను శంఖమును సుదర్శనచక్రమును అంకుడు (పార్శ్వమున కలవాడు), కృష్ణుడు :: 5.2-167-మత్త.
1328) గమనించునది = గమనము చేసెడిది, నడచెడిది :: 5.2-81-వ.
1329) గయాశీర్షము = గయాసురుని శిరస్సుగల పుణ్యప్రదేశము, గయ :: 7-451-వ.
1330) గయాసురుడు = గయాక్షేత్రము ఇతని శరీరమున నిర్మింపబడి యందు పితృదేవతలు తరించుచున్నారు :: 2-204-సీ.
1331) గరితలు = ఉత్తమురాండ్రు, స్త్రీలు :: 10.1-327-సీ.
1332) గరుడ = ఒక జాతి పక్షి, గరుత్మంతుడు ఈ జాతికి చెందినవాడు. :: 2-274-సీ.
1333) గరుడగమనుడు = గరుడవాహనము పై తిరుగువాడు, విష్ణువు :: 4-291-సీ.; 10.2-167-వ.; 10.2-212-సీ.
1334) గరుడధ్వజుడు = గరుడధ్వజము కలవాడు, విష్ణువు :: 3-1051-వ.
1335) గరుత్మంతుడు = విష్ణుని వాహనము :: 4-16-చ.
1336) గర్జన = సింహపు అరుపు :: 7-291-సీ.
1337) గర్భసంపదలు = గర్భ (గర్భమున పుట్టినవారి క్షేమములు అనెడి) సంపద (సౌభాగ్యము) :: 5.2-108-తే.
1338) గర్భాది = 1పుట్టుట 2ఉండుట 3పెరుగుట 4మారుట 5క్షీణించుట 6నశించుట :: 7-214-సీ.
1339) గవాదులు = గో + ఆదులు :: 3-215-వ.
1340) గాంగానందనుడు = భీష్ముడు - గంగ యొక్క పుత్రుడు :: 1-208-వ.
1341) గాంగేయుడు = భీష్ముడు - గంగ యొక్క పుత్రుడు :: 1-79-సీ.; 1-189-సీ.; 1-207-క.; 1-368-మ.; 10.2-766-సీ.
1342) గాండివము = అర్జునుని ధనుస్సు పేరు :: 10.2-143-ఉ.
1343) గాండీవము = అర్జునుని ధనుస్సు పేరు :: 10.2-1174-వ.
1344) గాండీవి = గాండీవము అను విల్లు కలవాడు, అర్జునుడు :: 1-417-క.; 10.2-1307-సీ.
1345) గాంధర్వము = గంధర్వులు చేయునది (గానము) నకు సంబంధించిన విద్య, సంగీతము :: 3-388-వ.
1346) గాంధారక్షితినాథుకూఁతురు = గాంధార (గాంధార) క్షితి (దేశ) నాథు (రాజు) కూఁతురు (పుత్రిక), గాంధారి :: 1-318-శా.
1347) గాంధారి = గాంధార దేశపు రాజుగు సుబలుని కుమార్తె :: 10.2-83-వ.
1348) గాంధారేయుడు = గాంధారి యొక్క కొడుకు, దుర్యోధనుడు :: 10.2-94-క.
1349) గాధి = విశ్వామిత్రుని వంశమునకు మూల పురుషుడు :: 2-204-సీ.
1350) గాయకుడు = బిరుదులను ఉగ్గడించి కీర్తించుచు జీవించువాడు, గానము చేయువాడు, మాగధుడు :: 10.1-724-క.
1350-1) గాయత్రి = 1) పాఠ్యంతరాలు గాయత్త్రీ, గాయత్రీమంత్రము; ద్విజులు సంధ్యోపాసనా సమయమున జపించు ఒకానొక మంత్రము; దీనికి ఋషి విశ్వామిత్రుడు, దేవత సవిత; దీనికి 3 పాదములును పాదమునకు 8 అక్షరములును ఉండును, ,వ్యు. (అ) త్త్రైజ - పాలనే - గాయతం త్రాయతే - గాయత్+త్త్రై+క, కృప్ర., తనను జపించు వానిని కాపాడునది, (శబ్దరత్నాకరము) (ఆ) గాయతాం త్రాయతే యస్మా ర్గాయత్రీ తేనకధ్యతే (ఆంధ్రవాచస్పతముు) 2) దేవతా విశేషము, :: 1-35-వ.
1351) గిరిభిత్ = గిరి (పర్వతములు) భిత్ (భేదించినవాడు), ఇంద్రుడు :: 10.1-923-మ.
1352) గిరిభూజప్రముఖవాసుడు = ససర్వనామా సచ విశ్వరూపా (శ్రుతి) చేత కొండలు చెట్లు మున్నగు సమస్తమును తానైనవాడు :: 10.1-901-క.
1353) గిరిభేది = పర్వతములను భేదించినవాడు, ఇంద్రుడు :: 10.1-926-వ.
1354) గిరివిహారణుడు = గిరి (పర్వతమును) విహారణుడు (ఎత్తి రక్షించినవాడు), కృష్ణుడు :: 6-529-త.
1355) గిరివ్రజము = జరాసంధుని పట్టణము :: 10.2-718-వ.
1356) గిరిశుడు = గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు :: 3-61-చ.; 4-47-వ.
1357) గిరీశుడు = గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు :: 8-547-ఆ.
1358) గీక = ఏనుగు యొక్క అరుపు, ఘీంకారము :: 6-408-క.
1359) గీర్వాణులు = మాటయే బాణముగా గలవారు, , శాపరూపమగు వాక్కు (బాణముగా) గలవారు, దేవతలు :: 6-271-క.; 7-397-వ.
1360) గుండిగ = వెడల్పుగా ఉండెడి లోహపాత్ర, దాక :: 8-699-వ.
1361) గుజ్జెనగూళ్ళు = పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు :: 10.1-1690-సీ.
1362) గుడికట్టుట = ఆకాశమునందు సూర్యునిచుట్టు ఏర్పడెడి ప్రకాశవంతమైన తెల్లని చక్రాకారము తయారగుట :: 10.1-754-సీ.
1363) గుణక్షోభము = స్వభావము యొక్క కలతపాటు, త్రిగుణసమతావస్థ యైన అవ్యక్త చలన స్థితి :: 10.1-537-వ.; 10.1-537-వ.
1364) గుణత్రయము = త్రిగుణములు - సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు :: 1-386-వ.; 3-718-సీ.; 4-855-వ.; 7-7-వ.; 7-237-వ.; 7-306-మ.; 8-624-వ.; 12-24-వ.
1365) గుణత్రయమువృత్తులు = 1సత్వగుణము (శాంతవృత్తి) 2రజోగుణము (ఘోరవృత్తి) 3తమోగుణము (మూఢవృత్తి) :: 10.2-248-సీ.
1366) గుణనిధి = గుణములకు స్థానమైన వాడు, విష్ణువు :: 3-218-క.
1367) గుణమండనుడు = సుగుణములు అలంకారముగా కలవాడు, విష్ణువు :: 3-572-చ.
1368) గుణము = అల్లెత్రాడు :: 1-415-వ.
1369) గుణములు = ఆ నడవడులకు తగిన స్వభావములు కలిగి ఉండుట :: 10.1-537-వ.
1370) గుణరత్ననిధి = సుగుణము లనెడి మణులకు నిధి వంటి వాడవు, కృష్ణుడు. :: 10.1-907-క.
1371) గుణరత్ననిధీ = సర్వజ్ఞత్వము సర్వేశ్వరత్వము సర్వభోక్తృత్వము మున్నగు గుణములలో రత్నముల (శ్రేష్ఠమైనవాని)కి నిధివంటివాడు లేదా రత్ననిధి (సముద్రము వంటివాడు), విష్ణువు. :: 10.1-577-క.
1372) గుణవంతుడు = సుగుణములు (శమము దమము ఉపరతి తితిక్ష ఆది గుణములు) కలవాడు, సజ్జనుడు :: 3-124-చ.; 10.2-441-వ.
1373) గుణవర్జితము = గుణము (శ్రేష్ఠత్వము) వర్జితంబు (పోయినది), పాడైపోయినది :: 7-438-సీ.
1374) గుణవిభ్రాజిష్ణుడు = గుణములచే విశేషముగ ప్రకాశించు వాడు, విష్ణువు :: 2-236-మ.
1375) గుణవిరహితుడు = త్రిగుణాతీతుడు :: 10.1-901-క.
1376) గుణవ్రజము = సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వపాలకత్వ సర్వస్రష్టత్వ సర్వసంహారకత్వ సర్వభోక్తృత్వాది గుణముల సముదాయము :: 10.1-553-సీ.
1377) గుణసాగరుడు = సుగుణములకు సాగరుడు (సముద్రము వంటివాడు), రాముడు :: 4-974-చ.
1378) గుణస్తోమధాముడు = గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు :: 8-1-క.
1379) గుణహారుడు = గుణ (సుగుణములు) హారుడు (అలంకారముగా కలవాడు), విష్ణువు :: 8-483-సీ.
1380) గుణాఢ్య = సుగుణములచే ఉత్తమురాలు, స్త్రీ. :: 10.1-325-క.
1381) గుణాఢ్యుడు = సుగుణములు అనెడి సంపద గలవాడు, విష్ణువు :: 4-917-చ.; 8-743-క.
1382) గుణాతీత = త్రిగుణములకు అతీతమైనవాడు, విష్ణువు :: 3-203-దం.
1383) గుణాధీశుడు = త్రిగుణములు అధీనమున యుంచుకొనెడి వాడు, విష్ణువు :: 4-963-సీ.
1384) గుణాశ్రయ = త్రిగుణములకు ఆశ్రయమైనవాడ, శ్రీకృష్ణ :: 5.1-1-క.
1385) గుణి = సుగుణముల స్వరూపమైనవాడు, విష్ణువు :: 6-34-క.
1386) గురుకలుషకుంజరహరి = గురు (పెద్ద పెద్ద) కలుష (పాపము లనెడి) కుంజర (ఏనుగులను) హరి (సంహరించెడి వాడు), విష్ణువు :: 6-33-క.
1387) గురుజనబుధసంతాపనివారణమతి = గురుజన (గొప్పవారి) బుధ (జ్ఞానుల) సంతాపములను నివారణ (పోగొట్టెడి) మతి (మనసు గలవాడు), విష్ణువు :: 6-32-క.
1388) గురుడు = పెద్దవాడు, విష్ణువు :: 6-327-సీ.
1389) గురుతనయుడు = గురువు ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ :: 3-130-వ.
1390) గురుతరభవదూరుడు = గురుతర (మిక్కిలి భారమైన) భవ (సంసారబాధలను) విదూరుడు (తొలగించువాడ), శ్రీకృష్ణ :: 5.1-183-మాలి.
1391) గురునందనుడు = గురువు (ద్రోణుని) కొడుకు, అశ్వత్థామ :: 1-158-వ.
1392) గురుపుత్రులు = శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు :: 7-208-వ.
1393) గురుబుధజనతోషి = గురు (గొప్ప) బుధ (జ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు :: 10.1-1791-మాలి.
1394) గురుబుధసుఖకర్త = గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ (సౌఖ్యమును) కర్త (ఏర్పరచినవాడు), రాముడు :: 7-481-మాలి.; 11-126-మాలి.
1395) గురుభుజుడు = అధికమైన భుజబలము కలవాడు, కృష్ణుడు :: 10.2-891-చ.
1396) గురువు = అష్టగురువులు, 1. ఉపాధ్యాయుడు 2. బృహస్పతి 3. కులముపెద్ద 4. తండ్రి 5. తండ్రితోడబుట్టినవాడు 6. తాత 7. అన్న 8. మామ 9. మేనమామ 10. రాజు 11. కాపాడువాడు, పాఠ్యంతరం 1 కన్నతండ్రి 2 పెంచినతండ్రి ,3 ఉపాధ్యాయుడు 4 బృహస్పతి 5 కులముపెద్ద 6 తండ్రితోడ పుట్టిన వాడు 7 తాత 8 అన్న 9 మామ 10 మేనమామ 11 రాజు 12 కాపాడినవాడు, - శ్లో. గుశబ్దస్త్వంధకారస్స్యా ద్రుశబ్దస్తన్నివర్తకః, అంధకార నివృత్తి త్వాద్గురు రిత్యభిధీయతే, అజ్ఞానాంధకార నివారకుడైన కారణాచార్యుడు :: 3-31-ఉ.; 3-222-ఉ.; 4-730-చ.; 8-152-క.; 9-471-క.; 10.1-568-వ.
1397) గురువులు = అష్టగురువులు, 1. ఉపాధ్యాయుడు 2. బృహస్పతి 3. కులముపెద్ద 4. తండ్రి 5. తండ్రితోడబుట్టినవాడు 6. తాత 7. అన్న 8. మామ 9. మేనమామ 10. రాజు 11. కాపాడువాడు, పాఠ్యంతరం 1 కన్నతండ్రి 2 పెంచినతండ్రి ,3 ఉపాధ్యాయుడు 4 బృహస్పతి 5 కులముపెద్ద 6 తండ్రితోడ పుట్టిన వాడు 7 తాత 8 అన్న 9 మామ 10 మేనమామ 11 రాజు 12 కాపాడినవాడు, - శ్లో. గుశబ్దస్త్వంధకారస్స్యా ద్రుశబ్దస్తన్నివర్తకః, అంధకార నివృత్తి త్వాద్గురు రిత్యభిధీయతే, అజ్ఞానాంధకార నివారకుడైన కారణాచార్యుడు :: 1-85-సీ.; 3-457-చ.
1398) గురుశిష్యన్యాయము = గురువు (నేర్పువాడు)ను శిష్యుడు (నేర్చుకొనువాడు) సేవించవలెననెడి గౌరవించవలెనెడి న్యాయము :: 10.1-1414-క.
1399) గురుసన్మనోవాగగోచరుడు = 1. మిక్కిలి మంచివారి మనస్సులకు వాక్కులకు గోచరుడవు (అందెడివాడవు), విష్ణువు. 2. నారాయణుడు, గొప్పవారికి సైతము మనసు, వాక్కు మున్నగువానికి అగోచరుడు :: 4-918-సీ.
1400) గురుసమరవిహారుడు = గురు (గొప్ప) సమర (యుద్ధమున) విహారుడు (వీరవిహారము సలిపెడి వాడు), రాముడు :: 4-976-మాలి.
1401) గురుసుత = గురువు (ద్రోణాచార్యుని), సుత (పుత్రుడు), అశ్వత్థామ :: 10.1-7-క.
1402) గురుసుతుడు = ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ :: 1-145-వ.
1403) గురుహీనుడు = తనకంటె పెద్దవాడు లేనివాడు :: 10.1-901-క.
1404) గుహుడు = తన సైన్యమును రక్షించుకొనువాడు, కుమారస్వామి :: 10.2-402-చ.
1405) గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుడు = గుహ్యకసాధ్యరక్షోయక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు :: 4-138-సీ.
1406) గుహ్యకుడు = యక్షుల భేదము, పాతాళవాసులు :: 2-274-సీ.
1407) గుహ్యకేశ్వరుడు = గుహ్యకులు ప్రభువు, కుబేరుడు, ఉత్తర దిక్పతి :: 10.2-773-చ.
1408) గూఢుడు = సాధరణముగ వ్యక్తము కాక యుండువాడు :: 1-76-వ.
1409) గృహము(ప్ర) = గేహము (వి) :: 10.1-1488-మ.; 10.1-1688-క.
1410) గృహమేధి = గృహస్థాశ్రమ ధర్మమున కట్టుబడినవాడు, గృహస్థుడు :: 10.2-1329-సీ.
1411) గొంతి = కుంతి - కుంతల దేశ ఇంతి :: 1-210-ఉ.
1412) గొంది = (పాపులు చొరబడుటకు వీలుకాని) సందు, వీథి :: 3-508-చ.
1413) గొబ్బిళ్ళుగోరాడు = గొబ్బిళ్ళు (బాలక్రీడావిశేషము) వలె గోరాడు (ఎగురుకుంటు ఆడు). :: 8-35-మ.
1414) గోకులమందార = గోకులమునకు మందార (కల్పవృక్షము వంటివాడు), కృష్ణుడు :: 5.2-1-క.
1415) గోకులము = గోపాలుర ఆవాసము, వ్రేపల్లె :: 10.1-59-సీ.
1416) గోకులవిస్తార = గోకులమునకు వృద్ధికారక, శ్రీకృష్ణ :: 5.1-1-క.
1417) గోగతి = ఎడతెగని కృషి క్రియలచేత వృషభముల వలె :: 10.2-259-క.
1418) గోచీ = పురుషావయవము కనబడకుండ కట్టుకొను సన్నని పొడవైన గుడ్డ :: 9-688-తే.
1419) గోచీబిగియగట్టు = స్త్రీ సౌఖ్యమునకు బాగా దూరముగా నుండు :: 9-688-తే.
1420) గోత్రభిత్సూనుడు = పర్వతముల రెక్కలను భేదించువాని (ఇంద్రుని) సూనుడు (కొడుకు), అర్జునుడు :: 10.2-731-ఉ.
1421) గోపకుమారశేఖరుడు = గోపక వంశము పుట్టినవారిలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :: 10.2-449-మ.
1422) గోపకుమారుడు = (నంద) గోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు :: 6-52-ఉ.; 10.1-1348-వ.
1423) గోపకులేంద్రుడు = గోపకుల వంశము నందు శ్రేష్ఠుడు, కృష్ణుడు :: 10.1-1174-ఉ.
1424) గోపచమూవిభుడు = గోపకుల సేనకు అధిపతి, కృష్ణుడు :: 10.1-1139-ఉ.
1425) గోపతి = గోవులకు అధిపతి, కృష్ణుడు :: 6-32-క.
1426) గోపదరేణు = పశువుల కాళ్ళచే రేగిన దుమ్ము, గోధూళి :: 10.1-628-ఉ.
1427) గోపద్వజుడు = గోప (వృషభము) ధ్వజము (జండా) గా గలవాడు, శివుడు :: 7-399-క.
1428) గోపవీరుడు = గోపకులలో వీరుడు, నందుడు :: 10.1-1445-క.
1429) గోపశేఖరుడు = గోపకులలో శేఖరుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు :: 10.1-763-క.
1430) గోపసింహుడు = గోపకులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :: 10.1-1146-ఆ.
1431) గోపాలకుడు = గోవులను పరిపాలించినవాడు, శ్రీకృష్ణ. :: 5.1-181-మ.
1432) గోపాలకులు = గోవులను పాలించెడివారు, యాదవులు, గోపాలకము (అమరపురమున) వసించు వారు, దేవతలు :: 3-106-క.; 10.1-59-సీ.
1433) గోపాలగ్రామణి = గోపాలురలో ముఖ్యుడు, కృష్ణుడు :: 10.1-1322-ఉ.
1434) గోపాలచక్రవర్తి = గోపకులకు మహారాజు, కృష్ణుడు. :: 10.1-770-సీ.
1435) గోపాలశేఖరుడు = పశువుల కాపరులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :: 10.1-919-వ.
1436) గోపాలసుందరుడు = గోవులను పాలించెడి సుందరమైనవాడు, కృష్ణుడు :: 10.1-1076-వ.
1437) గోపాలుడు = గోవులను పాలించువాడు, గొల్ల :: 3-106-క.; 10.1-1550-క.
1438) గోపికాచిత్తచోరా = గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ :: 5.1-183-మాలి.
1439) గోపీమనోవిహారుడు = గోపికల మనస్సు లందు విహరించువాడు, కృష్ణుడు :: 10.2-1045-క.
1440) గోపీవల్లభుడు = గోపికలకు ప్రియుడు, కృష్ణుడు :: 1-275-క.
1441) గోవత్సము = ఒక సంవత్సరములోపు ఆవు దూడ :: 10.1-481-శా.
1442) గోవర్దనధరుడు = గోవర్దనపర్వతము మోసినవాడు, కృష్ణుడు :: 10.1-926-వ.
1443) గోవర్ధనగిరి = గో (గోవులు, జీవులు, ఇంద్రియములు) వర్ధనము (వర్ధిల్లజేయు) గిరి (ఉన్నతమైనది, పర్వతము) :: 10.1-915-క.
1444) గోవింద = గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు :: 1-49-మ.; 1-188-వ.; 4-171-సీ.; 4-191-సీ.; 5.1-181-మ.
1445) గోవిందమూర్తి = గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు :: 10.1-973-మ.
1446) గోవిందుడు = గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు :: 1-176-వ.; 1-202-వ.; 1-351-శా.; 1-375-శా.; 1-530-గ.; 2-11-క.; 2-265-సీ.; 3-55-మ.; 3-96-క.; 3-258-క.; 3-315-మ.; 3-553-క.; 3-623-ఉ.; 3-743-వ.; 3-751-వ.; 8-99-వ.; 9-82-సీ.; 10.1-236-వ.; 10.1-508-వ.; 10.1-760-శా.; 10.1-769-వ.; 10.1-850-వ.; 10.1-1059-క.; 10.1-1197-వ.; 10.1-1223-మ.; 10.1-1726-శా.; 10.2-49-క.; 10.2-478-వ.; 10.2-625-క.; 10.2-749-ఆ.; 11-30-వ.
1447) గౌరి = గౌరవర్ణము కలామె, పార్వతి :: 10.1-1729-ఉ.; 10.2-318-వ.; 12-38-చ.
1448) గౌరీదయితుడు = పార్వతీదేవి (గౌరి) ప్రియుడు (దయితుడు), శివుడు :: 3-227-క.
1449) గౌరీపతి = గౌరీదేవి యొక్క భర్త, శివుడు :: 3-30-ఉ.
1450) గౌరీశుడు = గౌరీదేవి భర్త, శంకరుడు :: 4-48-మ.; 10.1-1710-మ.
1451) గౌరీశ్వరుడు = గౌరీదేవి భర్త, శంకరుడు :: 10.1-1107-క.
1452) గ్రంథసంఖ్యలు = గ్రంథములలోని శ్లోకముల పరిమాణములు :: 12-48-వ.
1453) గ్రథన = ముడి పెట్టబడినది :: 1-58-వ.
1454) గ్రహ = గ్రహ అధిదేవతలు, జ్యోతిషాధిపతులు :: 2-274-సీ.
1455) గ్రహములు = పట్టెడివి, పిశాచబేధము :: 6-307-వ.; 6-307-వ.
1456) గ్రామకము = మోటుతనము, సురతము :: 4-768-వ.
1457) ఘటపటాదిక = ఘట (కుండ) పట (బట్ట) ఆదిక (మున్నగునవి), సమస్తమైన పదార్థములు :: 10.2-1072-సీ.
1458) ఘటపటాదికన్యాయము = ఘటపటాదికన్యాయముఅనుతర్కశాస్త్రవిషయముప్రకారము త్రికరణములు (మూడు కారణములు) - 1 ఉపాదానము (ఇతర వస్తువు) 2 సమవాయము (చేసే నేర్పు) 3 నిమిత్త (పనివాడు) :: 3-345-సీ.
1459) ఘట్టితపాదకర్మలు = రెండు అడుగులను చేరబెట్టుట, రాసక్రీడా పారిభాషిక పదము :: 10.1-1084-వ.
1460) ఘన = పొడవు వెడల్పు లోతు మిక్కిలి యున్నది, పెద్దది :: 5.2-65-సీ.
1461) ఘనచతుర్భాహువు = గొప్పవైన చేతులు నాలుగు కలవాడు, విష్ణువు :: 3-145-సీ.
1462) ఘనజనకవరనృపజామాతృవరేశుడు = ఘన (గొప్ప) జనకవరనృప (జనకమహారాజు యొక్క) జామాతృ (అల్లుళ్ళలో) వరేశ (ఘనత వహించినవాడు), రాముడు :: 12-1-క.
1463) ఘనజననస్థితిప్రళయకారణభూతుడు = గొప్ప సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, విష్ణువు :: 4-892-చ.
1464) ఘనతరకిరి = ఘనతర (మిక్కిలి గొప్పదైన) కిరి (వరాహావతారు డైన వాడు), విష్ణువు :: 6-33-క.
1465) ఘనములు = పోడవు, వెడల్పు, ఎత్తుగలవి :: 9-230-వ.
1466) ఘనమూలము = ఏ సంఖ్యనైతే దానిని దానితోనే 2 సార్లు గుణించినప్పుడు వచ్చెడి రెండవ సంఖ్య యొక్క ఘనమూలము ఆ సంఖ్య :: 9-230-వ.
1467) ఘనరుచిరశరీరి = ఘన (మేఘము) వంటి రుచిర (ఛాయ, రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), విష్ణువు :: 4-16-చ.
1468) ఘనవాహుడు = ఘన (మేఘము)లపై వాహ (విహరించువాడు), ఇంద్రుడు :: 9-288-క.
1469) ఘనసాంఖ్యయోగీశ్వరుడు = ఘన (గొప్ప) సాంఖ్యయోగులకు ఈశ్వరుడు, విష్ణువు :: 4-703-సీ.
1470) ఘనసింధువు = అత్యధికమైన నీరుగలది, సముద్రము :: 1-200-ఉ.
1471) ఘనుడు = ఘనమైన వర్తనము గలవాడు, విష్ణువు, కృష్ణుడు :: 2-142-సీ.; 3-844-చ.; 3-844-చ.; 4-298-చ.; 10.2-102-క.
1472) ఘీంకారము = ఏనుగు అరుపు :: 8-119-క.
1473) ఘోటకము = భూమి యందు పొరలునది, గుఱ్ఱము :: 10.1-1558-వ.; 10.1-1757-వ.
1474) ఘోటకవదనుడు = గుఱ్ఱపుముఖము గలవాడు, హయగ్రీవుడు, విష్ణువు :: 7-361-క.
1475) ఘోరదైతేయశోషి = ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు. :: 10.1-1791-మాలి.
1476) ఘోరదైత్యప్రహారి = ఘోర (భయంకర మైన) దైత్య (రాక్షసులను) ప్రహారి( సంహరించినవాడు), రాముడు. :: 4-976-మాలి.
1477) ఘోషకామినీప్రాణవల్లభుడు = గోపికాస్త్రీల ప్రాణముతో సమానమైన ప్రియుడు, కృష్ణుడు :: 10.1-1532-వ.