టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (సుర - స్వైరిణి)
శ్రీరామ
5593} సురకంటకుడు - దేవతలకు శత్రువు, రాక్షసుడు :-
[10.2-381-చ.]
5594} సురకరువలి - సుడిగాలి, వ్యు. సుర (గాలిసుడి ధన్వనుకరణ) కరువలి (వాయువు), :-
[10.1-264-క.]
5595} సురగురుడు - సుర (దేవతల)కి గురుడు (గురువు), బృహస్పతి :-
[3-269-క.,
6-259.1-తే.]
5596} సురతరువు - దేవతల చెట్టు, కల్పవృక్షము :-
[4-319.1-తే.]
5597} సురతానుకూలకాలములు - జాతి (యామము) 1హస్తిని (మొదటి) 2శంఖిణి (రెండవ) 3చిత్తిని (మూడవ) 4పద్మిని (నాల్గవయామము, తెల్లవారగట్ల) మిక్కిలి అనుకూలము :-
[10.1-1495-ఉ.]
5598} సురద్విపము - దేవతల ఏనుగు, ఐరావతము :-
[10.1-951-మ.]
5599} సురనాథుడు - సుర (దేవతలకు)నాథుడు, ఇంద్రుడు :-
[6-404-క.,
8-249-క.,
10.1-951-మ.]
5600} సురపతి - సుర (దేవతల) పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[6-264-క.,
8-147-క.]
5601} సురపతివీడు - సురపతి (ఇంద్రుడు) యొక్క వీడు (పట్టణము), అమరావతి :-
[4-436.1-తే.]
5602} సురపాలుడు - సుర (దేవతలను) పాలుడు (పరిపాలించెడివాడు), ఇంద్రుడు :-
[6-294-ఉ.]
5603} సురప్రభువు - దేవతలరాజు, ఇంద్రుడు :-
[9-504.1-ఆ.]
5604} సురభయపరిహర్త - సుర (దేవతల) భయ (భయమును) పరిహర్త (పోగొట్టినవాడు), రాముడు :-
[7-481-మాలి.,
11-126-మాలి.]
5605} సురభిత్తు - దేవతల శత్రువు, రాక్షసుడు :-
[10.2-193-మ.]
5606} సురభులు - చీలిన గిట్టలు గల జంతువులు, ఆవులు ఎద్దులు మున్నగునవి, సురభి అంటే ఆవు :-
[6-257.1-తే.]
5607} సురమాత - సుర (దేవత) మాత, అదితి :-
[8-461.1-ఆ.]
5608} సురరక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు :-
[7-169.1-తే.]
5609} సురరాజసుతుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[1-159-క.]
5610} సురరాజు - సురలు (దేవతలు)కి రాజు, దేవేంద్రుడు :-
[4-501.1-తే.,
5.1-117-ఉ.,
10.2-1147-ఉ.]
5611} సురరాజునగరి - సురరాజు (ఇంద్రుని) నగరి (పట్టణము), అమరావతి :-
[10.1-786-క.]
5612} సురరిపుడు - సుర (దేవత)లకు రిపుడు (శత్రువు), రాక్షసుడు :-
[3-645-క.]
5613} సురరిపువిషభీముడు - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]
5614} సురలతల్లి - దేవతల మాత, అదితి :-
[8-492-వ.]
5615} సురలు - సురాపానము చేయువారు, దేవతలు :-
[2-274.1-తే.,
3-184-వ.,
4-426-క.]
5616} సురవందితుడు - దేవతలచే వందనీయుడు, విష్ణువు :-
[3-156-వ.]
5617} సురవంద్యుడు - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు :-
[7-122.1-తే.]
5618} సురవర్తము - దేవతలు తిరుగునది, ఆకాశము :-
[4-440-క.]
5619} సురవిమతవిదారుడు - సుర (దేవతలకి) విమత (శత్రువులైన వారిని) విదారుడు (సంహరించినవాడు), రాముడు :-
[4-976-మాలి.]
5620} సురవిరోధి - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-125-వ.]
5621} సురవృషభుడు - సుర (దేవతలలో) వృషభుడు (శక్తి గలవాడు), ఇంద్రుడు :-
[6-425-వ.]
5622} సురవైరి - సురల (దేవతల) వైరి (శత్రువు), రాక్షసుడు, కంసుడు, రావణుడు :-
[3-686.1-తే.,
9-285-క.,
10.1-275-క.,
10.2-188-వ.,
10.2-320.1-తే.]
5623} సురశత్రుడు - సురల(దేవతల)కు శత్రుడు, రాక్షసుడు :-
[6-303-చ.]
5624} సురశాత్రవుడు - సురలు (దేవతలు)కి శత్రువు, హిరణ్యాక్షుడు :-
[3-709-చ.,
7-227-ఉ.]
5625} సురాచార్యుడు - దేవతల గురువు, బృహస్పతి :-
[9-377-వ.]
5626} సురాధిపుడు - సురలు (దేవతల)కి అదిపతి, ఇంద్రుడు :-
[4-522-ఉ.]
5627} సురారాతిజీవనసంపత్తినిరాకరిష్ణుడు - సుర (దేవతల) ఆరాతి (శత్రువుల యొక్క) జీవనసంపత్తి (బ్రతుకుదెరువు)ను నిరాకరిష్ణుడు (నిరాకరించెడివాడు), విష్ణువు :-
[8-105-మ.]
5628} సురారి - సురల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-676-తే.,
6-387-మ.,
9-539-ఉ.,
10.2-377-క.]
5629} సురారికులేంద్రుడు - సుర (దేవతల) అరి (శత్రువుల) కుల (వంశము లంన్నిటికి) ఇంద్ర (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-81-మత్త.]
5630} సురారితనయుడు - సురారి (రాక్షసు, హిరణ్యకశిపు)ని తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-123-శా.]
5631} సురారిరాజసుతుడు - సురారి (రాక్షసరాజు యొక్క) సుతుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-134-ఉ.]
5632} సురారిహరుడు - సురారుల (రాక్షసుల)ను హరుడు (హరించువాడ), విష్ణువు :-
[4-920-ఉ.]
5633} సురారులు - సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు, దైత్యులు :-
[1-10-ఉ.,
2-285-ఉ.]
5634} సురాలయము - సురల (దేవతల) ఆలయము (నివాసము), స్వర్గము :-
[6-324-లగ్రా.]
5635} సురుచి - సు (మంచి) కాంతి కలామె, ఉత్తానపాదుని రెండవ భార్య, ధ్రువుని సవితితల్లి :-
[4-218-క.]
5636} సురుచిరగుణధాముడు - సు (మిక్కిలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (ఉనికిపట్టైన వాడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]
5637} సురుచిరద్వారకాపురసమాశ్రయుడు - మనోహరమైన ద్వారకానగరమునకు చక్కటి ఆశ్రయిము అయినవాడు, కృష్ణుడు :-
[3-145.1-తే.]
5638} సురేంద్రశాఖి - ఇంద్రుని చెట్టు, కల్పవృక్షము :-
[10.1-1084-వ.]
5639} సురేంద్రారాతి - సురేంద్ర (దేవేంద్రుని) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-136-శా.]
5640} సురేంద్రుడు - దేవేంద్రుడు, దేవతల ప్రభువు, ఇంద్రుడు :-
[2-209-చ.,
10.1-947-క.,
10.2-631-క.]
5641} సురేశ్వరుడు - సురలకు ఈశ్వరుడు, ఇంద్రుడు :-
[8-171-క.]
5642} సురోచి - సు (మంచి) రోచి (వెలుగు కలవాడు), వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల కలిగిన చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులలో ఒకడు :-
[4-26-వ.]
5643} సుశాశ్వతములు - ఎల్లప్పుడును మంచి కలవి, వేదములు :-
[2-194-చ.]
5644} సుశ్రీకాంతుడు - సు (శుభకరమైన) శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు :-
[9-562-శా.]
5645} సుశ్లోకుడు - 1. సు (మంచివారిచే) శ్లోకుడు (కీర్తింపబడువాడు), 2. విష్ణువు :-
[3-270-క.,
3-924.1-తే.,
4-386-క.,
5.2-1-క.,
6-422-ఉ.]
5646} సుషిరము - బెజ్జము కలది, పిల్లనగ్రోవి మొదలగునది :-
[11-57.1-తే.]
5647} సుషుమ్న - మనోజ్ఞమును ఇచ్చునది, ఒక నాడి, వెన్నుపాము వెలుపల ఇడా పింగళ నాడుల మధ్యనుండు నాడి, సుషు అని అవ్యక్త శబ్దము చేయుచుండును, మేరుదండబాహ్యే ఇడాపింగలానాడీమధ్యస్థ నాడీవిశేషః, :-
[2-30-వ.]
5648} సుషుమ్ననాడిమార్గము - రొమ్ము మొదలుకొని శిరస్సువరకు వ్యాపించుచున్న నాడీమార్గము :-
[10.2-1214.1-తే.]
5649} సుస్థిరత - మిక్కిలి స్థిరముగా నుండుట. :-
[2-275-మ.]
5650} సుహృత్తముడు - మంచి ఆప్తుడైన వాడు, విష్ణువు :-
[3-523-చ.]
5651} సూకరము - వరాహము, పంది :-
[3-361-వ.]
5652} సూకరముఖము - సూకరము (పందుల) ముఖము (నోటి) యందు పడుట, నరక విశేషము :-
[5.2-136-వ.]
5653} సూక్ష్మకాలము - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు :-
[2-222-వ.]
5654} సూక్ష్మరూపము - కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలోని ఆత్మైకరూపము :-
[2-250.1-ఆ.]
5655} సూక్ష్మస్వరూపుడు - సూక్షమమైన రూపము కలవాడు, విష్ణువు :-
[3-874-వ.]
5656} సూక్ష్ముడు - సూక్ష్మమే తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
5657} సూచికాభేధ్యము - సూచిక (సూది) అభేద్యము (గుచ్చుటకు సందులేనిది), ఎడతెగనిది :-
[10.2-999.1-తే.]
5658} సూచీముఖము - సూదిమొనలచే శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]
5659} సూచీవ్యోమాచారి - మొనవేళ్ళు నేలను తాకునట్లు మెలగుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
5660} సూత్రాత్మకుడు - పువ్వులలోని దారము పువ్వులకు ఆధారమైన విధమగువాడు, ఆధారభూతుడు :-
[4-457-వ.]
5661} సూరి - పదునైన బుద్ధికలవాడు, పండితుడు :-
[3-234-వ.]
5662} సూరిచేతోవిహర్తుడు - సూరి (జ్ఞానుల) చేతః (చిత్తములలో) విహర్తుడు (క్రీడించువాడు), రాముడు. :-
[7-481-మాలి.,
11-126-మాలి.]
5663} సూరిత్రాణుడు - సూరి (పండితులను) త్రాణుడు (కాపాడెడివాడు), రాముడు :-
[9-1-క.]
5664} సూర్యతనయ - 1. సూర్యుని పుత్రిక, యమున, 2. సూర్యుని పుత్రుడు, 1సుగ్రీవుడు 2కర్ణుడు, 3. యముడు :-
[9-230-వ.]
5665} సూర్యవంశాబ్ధిసోముడు - సూర్యవంశము అను అబ్ధి (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు. :-
[10.2-1342-మాలి.]
5666} సూర్యసుత - సూర్యుని కుమారుడు, కర్ణుడు :-
[1-368-మ.]
5667} సూర్యాదిఅధిష్ఠానదేవతలు - కంటికి చూపునకు సూర్యుడు, నాలుకకు రుచికి అగ్ని, ముక్కునకు వాసనకు వాయువు, చెవికి శబ్దమునకు ఆకాశము, చర్మమునకు స్పర్శకి భూమి అధిష్ఠాన దేవతలు :-
[2-267-వ.]
5668} సృష్టికారణుడు - సృష్టికి కారణము అయినవాడు, బ్రహ్మదేవుడు. :-
[3-499-చ.]
5669} సెలగోల - కఱ్ఱచివర తాడువంటిది ఉండి గుఱ్ఱబ్బండి ఆదుల తోలు కొరడాకఱ్ఱ, చెర్నాకోల, అట్టి ఆయుధము :-
[10.1-362-మ.]
5670} సేచన - నైష్ఠిక కర్మలలో మంత్రోదకాన్ని చిలకరించుట, చల్లుట, తడుపుట, ఇది ప్రోక్షణ, అవోక్షణ, అభ్యుక్షణ అని మూడు విధములు :-
[8-630-మ.,
10.2-269-క.]
5671} సేవకనవకల్పము - సేవించువారికి కొత్త కల్పవృక్షము వంటివాడు, విష్ణువు :-
[3-19-చ.]
5672} సైంధవము - సింధుదేశమున పుట్టినది, ఉత్తమజాతిగుఱ్ఱము :-
[9-16.1-తే.]
5673} సైంహకేయుడు - సైంహకేయుడు అంటే సింహిక యొక్క కొడుకు, రాహువు; సింహిక ఎవరంటే హిరణ్యకశిపుని కూతురు, ఆమె కుమారుడు స్వర్భానుడు, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు; :-
[10.1-1621.1-ఆ.,
10.1-1621.1-ఆ.]
5674} సైరంధ్రి - సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా. (అమరము), శృంగారించు టాదుల కైన పనిగత్తె :-
[10.1-1494-మ.,
10.1-1500-క.]
5675} సోzహమ్మమేతి - సోzహం (వాడు నేను) మమ (నాది) ఇతి (అనెడి), భేదభావము :-
[4-359.1-తే.]
5676} సోమపానము - 1.సోమరసము తాగుట, 2.సామవేదమునందలి స్తోత్రము 3.స్తోమము స్తోభము నుమ్నము శస్త్రము మొదలగువాని గానము ఆస్వాదించుట :-
[5.2-10-వ.]
5677} సోమపులు - యాగముచేసి అవశిష్టమైన సోమలతరసములు తాగినవారు, సోమయాజులు :-
[4-210.1-తే.]
5678} సోమము - వ్యుత్పత్తి. షు ను (అభిషవే), షూ సూ (ప్రేరణే ప్రసవే) సు సూ + మన్, కృ.ప్ర. అమృతము ఒసగువాడు, ప్రేరకుడు, చంద్రుడు (ఆంధ్రశబ్దరత్నాకరము) :-
[3-426-వ.]
5679} సోమయాజి - యజ్ఞము చేసినవాడు :-
[5.2-156-ఆ.]
5680} సోమరూపుడు - సోమము (అమృతము) వంటి రూపము కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
5681} సోమలోకము - సోములు అనెడి గంధర్వుల లోకము :-
[4-104-వ.]
5682} సోమార్ధధరుడు - సోమ (చంద్ర) అర్ధ (ఖండమును) ధరుడు (ధరించినవాడు), శివుడు. :-
[8-230-క.]
5683} సోముడు - చంద్రుడు, అమృత ప్రేరకుడు :-
[3-44-ఉ.,
10.1-1236-దం.]
5684} సోల్లుంఠము - మర్మభేదకములైన మాటలు, దెప్పిపొడుపుమాటలు, ఆక్షేపణ, సహ+ఉల్లంఠ, సహ ఉల్లంఠేన వ్యంగ్యేన] వ్యంగ్యముతో కూడినది. :-
[10.1-1577-ఉ.]
5685} సౌందర్యాంగులు - సౌందర్యముతో కూడిన అంగములు (అవయవములు) కలవారు :-
[4-24-క.]
5686} సౌజన్యనిధి - సుజనుల లక్షణములకు నిధి వంటి స్త్రీ. :-
[3-939-క.,
3-954-క.]
5687} సౌజన్యము - సుజనుల లక్షణము, మంచితనము :-
[2-113-ఉ.,
2-264-క.]
5688} సౌత్రామణి - సుత్రాముడైన ఇంద్రుని సంబంధమైన హోమము :-
[10.1-854-క.]
5689} సౌధము - సున్నముతో కట్టిన ఇండ్లు, మేడ, రాజప్రసాదము :-
[3-45-ఉ.,
8-95-మ.,
10.1-1597-శా.]
5690} సౌభకపతి - సౌభక విమానమునకు పతి, సాల్వుడు :-
[10.2-888-వ.]
5691} సౌభకము - సాల్వుని విమానం. శశిపాలుని మరణానికి ప్రతీకారం తీర్చుకోడానికి అతని తమ్ముడు సాల్వుడు తపస్సు చేసి శివుని నుండి సౌభకము అని విమానం పొందాడు. అది కామగమనాది ప్రత్యేకతలు కలది. (సాల్వదేశ రాజధాని సౌభము) :-
[10.2-888-వ.]
5692} సౌభద్రబంధము - వారివారికి అనువైన చొప్పున హస్త విన్యాసాదులను చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
5693} సౌభపతి - సౌభకము యజమాని, సాల్వుడు :-
[10.2-851-మ.]
5694} సౌభాగ్యములు - సౌభాగ్య చిహ్నములైన తలకట్టు తిలక ధారణాదులు :-
[1-363-మ.]
5695} సౌమల్లికుడు - మహాకవి కాళిదాసు అంతటి వానిచే సబహుమానంగా పేర్కొనబడిన అంతకు పూర్వకవి :-
[6-11.1-తే.]
5696} సౌమిత్రి - సుమిత్రకొడుకు, లక్ష్మణుడు :-
[9-319.1-ఆ.]
5697} సౌమ్యుడు - సోముని (చంద్రుని) పుత్రుడు, బుధుడు :-
[5.2-88.1-తే.]
5698} సౌమ్యులు - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, సౌమ్యము (శాంతము) గనుండు అగ్నులు? :-
[4-34-వ.]
5699} స్కంధము - సమూహము, శరీరము, సంస్కారము, గ్రంథములోని భాగము :-
[12-47-క.]
5700} స్తంబేరము - స్తంబముల (పొదల) యందు రమించునది, ఏనుగు :-
[11-99-వ.]
5701} స్తబ్ధరోమము - వ్యు. స్తబ్ధాని రోమాణి అవ్య., బ.వ్రీ,, నిక్కబొడిచిన రోమములు కలది, అడవిపంది, వరాహము. :-
[3-408.1-తే.]
5702} స్తవము - సాకార నిరాకారముల మహిమలను తెలిపెడి స్తోత్రము :-
[10.1-5-క.]
5703} స్త్రీజాతులు - 1పద్మిని 2శంఖిణి 3చిత్తిని 4హస్తిని :-
[10.1-1495-ఉ.]
5704} స్థాణుడు - స్థిరముగ నుండువాడు, ప్రళయకాలమునను నుండువాడు, శివుడు :-
[10.1-1341-శా.,
10.2-312-క.,
10.2-445-వ.]
5705} స్థాపత్యము - స్థలములను (ఆవరణలు, నిర్మాణములు మొదలగునవి) ఏర్పరచుట నిర్మించుటాదికి సంబంధించిన శాస్త్రము, స్థపతి యొక్క పని :-
[3-388-వ.]
5706} స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, 2.చురుకుదనము లేనివి, వృక్షములు మొదలైనవి, వ్యు. స్థా స్థా(గతి నివృతో) + వరచ్, కృ,ప్ర. :-
[1-435-వ.,
3-338-క.,
3-344-వ.,
3-432.1-తే.,
3-905-క.,
3-997-వ.,
3-1019-మ.]
5707} స్థిరము(ప్ర) - తిరము (వి) :-
[10.2-1182-చ.]
5708} స్థూలరూపము - కంటికి కనిపించు పంచభూతాత్మక స్వరూపము :-
[2-250.1-ఆ.]
5709} స్పర్శములు - క నుండి మ వరకు కలవి ఇవి ఐదేసి చొప్పున ఐదు వర్గములుగా ఉంటాయి (1క ఖ గ ఘ ఙ 2చ ఛ జ ఝ ఞ 3ట ఠ డ ఢ ణ 4త థ ద ధ న 5ప ఫ బ భ మ) :-
[12-30-వ.]
5710} స్పృహణీయుడు - స్పృహణీయతరుడు స్పృహణీయతముడు :-
[4-712.1-తే.]
5711} స్మయము - గర్వము, ఆశ్చర్యము :-
[4-28-వ.]
5712} స్మృతి - జ్ఞాపకము :-
[4-28-వ.]
5713} స్రష్ట - సమస్తమును సృజించువాడు, బ్రహ్మదేవుడు :-
[1-425-క.,
11-81-క.]
5714} స్రుక్కు - హోమము కొరకు నేతిని తీయు తెడ్డు, గరిటి :-
[3-425.1-తే.]
5715} స్రువము - హోమము చేయునప్పుడు నేతిని అగ్నిలో వేయుటకైన తెడ్డు, గరిటి :-
[3-425.1-తే.]
5716} స్వకృతంబులు - అపౌరుషేయములు హరి తన (భగవంతుని)చేత చేసినవి, వేదములు. :-
[2-194-చ.]
5717} స్వగురుహృదయతోషుడు - తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు :-
[9-735-మాలి.,
12-53-మాలి.]
5718} స్వతంత్రుడు - ఇతరుల అదుపులేక తన సంకల్పా నుసారం తను వర్తించువాడు, విష్ణువు :-
[4-132-వ.,
10.1-942-ఆ.]
5719} స్వధ - పితృదేవతలకు సమర్పించు హవిస్సు / హవిర్దానము :-
[4-34-వ.,
4-204-వ.]
5720} స్వప్రకాశుడు - సాధనాంతరము లేక స్వయముగా ప్రకాశించువాడు :-
[10.1-541-వ.]
5721} స్వయంజ్యోతి - స్వయం ప్రకాశుడు, పరంజ్యోతి, విష్ణువు :-
[3-874-వ.,
10.1-567.1-ఆ.]
5722} స్వయంజ్యోతిషుడు - స్వయం ప్రకాశము కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
5723} స్వయంప్రకాశుడు - స్వయం ప్రకాశము కలవాడు, శంకరుడు :-
[3-473-వ.]
5724} స్వయంభువుడు - తనంత తాను పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-390-క.,
6-224-వ.]
5725} స్వయంవరము - అష్టవిధ వివాహాలు ఇతరమైనది. ఇది క్షత్రియులకు విధితం. క్షత్రియ కన్య స్వయంవర సభలో నచ్చిన వరుని వరించుట, :-
[3-123.1-తే.,
3-124-చ.,
10.1-1683-వ.,
10.2-124-వ.]
5726} స్వరధీశ్వరుడు - స్వర్ (స్వర్గలోకము)నకు అధిపతి, ఇంద్రుడు :-
[4-426-క.]
5727} స్వరములు - అకారాది, అచ్చులు, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ అలు అలూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ ఇవి షోడశ (16) స్వరాలు :-
[12-30-వ.]
5728} స్వరాట్టు - (1) స్వయముగ ప్రకాశించువాడు. (2)భగవంతుడు, (3) విరాట్పురుషుని నుండి ఆవిర్భవించినవాడు :-
[3-388-వ.]
5729} స్వర్గాపర్గసుద్వారము - స్వర్గమునకు అపవర్గము (మోక్షము)నకు మంచి ద్వారము వంటివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]
5730} స్వర్భానుడు - రాహువు, స్వర్భానుడు ప్రహ్లాదుని మేనల్లుడు, సింహిక కొడుకు, హిరణ్యకశిపుని దైహిత్రుడు; జగన్మోహిని అమృతం పంచుతున్నప్పుడు, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే సూర్య చంద్రులు సైగ చేసారు. విష్ణుస్వరూపం ఎత్తి చక్రంతో తల నరికా డు. అప్పటికే, అ అమృతం నాలికకు తగులట వలన, చావలేదు. బ్రహ్మదేవుడు ఆ తల, మొండాలను రాహువు కేతువులుగా గ్రహాలు ఉండమని అనుగ్రహించాడు.. :-
[8-51.1-తే.]
5731} స్వర్భువనాధినాథుడు - స్వర్భువన (స్వర్గలోకపు) అధినాథుడు (ప్రభువు), ఇంద్రుడు :-
[7-227-ఉ.]
5732} స్వామి - వస్తు స్వాతంత్ర్యము గలవాడు, విష్ణువు :-
[6-229-తే.]
5733} స్వాయంభువుడు - ప్రథమ మనువు, స్వయంభువుడు ( స్వయముగ పుట్టినవాడు, బ్రహ్మదేవుడు) కుమారుడు :-
[3-388-వ.,
3-390-క.,
4-3.1-తే.,
4-216-క.]
5734} స్వారోచిషుడు - రెండవ మనువు, స్వ (తనంతతాను) రోచిష (ప్రకాశము కలవాడు) :-
[4-25-క.]
5735} స్వాశ్రయుండు - స్వయం (తనకు తనే) ఆశ్రయమైన వాడు, విష్ణువు :-
[6-229-తే.]
5736} స్వేదజము - స్వేదమునుండి పుట్టునవి, పురుగులోనగునవి :-
[8-150-క.]
5737} స్వైరిణి - స్వేచ్ఛగా (విచ్చలవిడిగా) తిరుగునట్టి స్త్రీ, తిరుగుబోతు :-
[10.2-262-వ.]