టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (తంగేటి - త్వష్ట)
శ్రీరామ
1828} తంగేటిజున్ను - అందుబాటులో ఉన్న వస్తువు, తంగేడు చెట్టు యందున్న తేనెపట్టు యొక్క జున్ను (తేనె) :-
[6-190-ఆ.]
1829} తండ్రులు - అయిదుగురు, తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు :-
[1-253-ఉ.]
1830} తంత్రరూపకుడు - సృష్టిస్థితిలయాధికమైన తంతులు తంత్రము, అట్టి తంత్రము తన రూపమైన వాడు :-
[2-98-క.]
1831} తక్రము - పాతిక పాలు నీరు చేర్చిన మజ్జిగ, ఆంధ్ర వాచస్పతము :-
[8-464-ఆ.]
1832} తగరు - తగళ్ళు(బహువచనం), గొఱ్ఱెలు :-
[9-394-మ.]
1833} తటస్థుడు - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి :-
[10.1-1779-వ.]
1834} తత్త్వము - విచారించు జ్ఞానము, లక్షణము, ఉన్నయదార్థస్థితి, తత్త్వశాస్త్రము, మొత్తం సృష్టి యొక్క యదార్థ స్థితి :-
[2-250.1-ఆ.,
2-252-వ.]
1835} తత్త్వములు - ప్రకృతి మహత్తాదు లిరువదినాల్గు, (అ.) అష్టప్రకృతులు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము), వీనిలో చివరి మూడింటికి కారణమైన విక్షేపశక్తి, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ విషయములు (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము), పాఠ్యంతరము, (ఆ.) పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు [చూ. పంచ ఇంద్రియములు], పంచప్రాణములు, చతుర్ అంతఃకరణములు, పాఠ్యంతరము, (ఇ) అష్టప్రకృతులు, షోడశ వికారములు :-
[1-63-వ.,
10.2-1211.1-తే.]
1836} తత్త్వయోగము - ఆత్మతత్త్వమునకు సంబంధించిన యోగము :-
[5.1-158-ఆ.]
1837} తత్త్వరూపుడు - పరతత్త్వమే రూపుడు (తన స్వరూపమైనవాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]
1838} తత్త్వసంహిత - ఒక వేదాంత విషయము, తత్త్వమును (స్వస్వరూపమును) గురించిన విషయములను సంహిత (చక్కగ కూర్పబడినది) :-
[3-759-వ.]
1839} తను - తనుతర తనుతమ :-
[7-285-వ.]
1840} తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుముగలామె), అందగత్తె :-
[6-521-వ.,
9-413-మ.,
10.1-300-క.,
10.1-363-వ.,
10.1-839-వ.,
10.1-863-క.,
10.1-1752-మ.]
1841} తనువివరములు - తను (శరీరమునందలి) వివరములు (రంద్రములు), నేత్రములు రెండు, శోత్రములు రెండు, నాసారంధ్రములు రెండు, నోరు ఒకటి, మలమూత్ర విసర్జక రంధ్రములు రెండు, మొత్తం ఈ తొమ్మిది దేహము నందలి రంధ్రములు, నవరంధ్రములు :-
[10.1-738-క.]
1842} తనూజ - తనువు (శరీరము) నుండి జ (పుట్టినది), కుమార్తె :-
[6-224-వ.,
9-521-శా.]
1843} తనూజాత - తనువు (శరీరము) నుండి జ (పుట్టినది), కుమార్తె :-
[4-35.1-తే.]
1844} తనూజుడు - తనువున పుట్టినవాడు, కొడుకు :-
[4-44-వ.,
4-313.1-తే.,
7-349-మ.,
10.1-712-శా.,
10.2-454.1-తే.]
1845} తనూభవ - తనువు (దేహము)న భవ పుట్టినది, పుత్రిక :-
[4-73-క.,
4-92-మ.,
4-95-చ.]
1846} తనూభవుడు - శరీరమున పుట్టినవాడు, పుత్రుడు :-
[5.1-61-చ.,
9-633-వ.,
10.2-12-మత్త.,
10.2-527.1-తే.,
11-35-వ.]
1847} తనూసంభవుడు - శరీరమున పుట్టినవాడు, పుత్రుడు :-
[10.1-1416-శా.]
1848} తన్మాత్రలు - దాని లక్షణము లేదా తత్త్వము, శబ్ద స్పర్శ రస, రూప గంధములు :-
[1-62.1-తే.,
3-202-వ.]
1849} తన్వంగి - తనువు (సన్నని) అంగి (దేహము కలది), స్త్రీ, (తన్వి తనివి, తృప్తి). :-
[10.1-75.1-తే.,
10.2-175-శా.]
1850} తన్వి - తనువు (సన్నని దేహము కలది), స్త్రీ, (తన్వి తనివి, తృప్తి గల స్త్రీ). :-
[5.1-32-క.,
6-501-క.,
10.2-181.1-ఆ.]
1851} తపనీయాద్రి - తపనీయము (బంగారు) అద్రి (పర్వతము), మేరుపర్వతము :-
[5.2-39-క.]
1852} తపనుడు - తపింపజేయు వాడు, సూర్యుడు :-
[5.1-18-వ.,
10.2-115-ఉ.]
1853} తపసిరాచూలు - ఋషి యొక్క రాకుమారి, శకుంతల :-
[9-623-వ.]
1854} తపస్సు - స్వధర్మమును నడపుట, కాయిక వాచిక మానసికము లనెడి త్రివిధనిష్ఠ :-
[2-62-చ.,
2-64-మ.,
10.1-1474-ఆ.,
10.2-1198-వ.,
10.2-1266-క.]
1855} తప్తకాంచనరుచిరశరీరి - తప్తకాంచనము (పుటము వేసిన బంగారము) వంటి రుచిర (రంగుకలిగిన) శరీరి (దేహము కలవాడు), బ్రహ్మదేవు :-
[4-16-చ.]
1856} తప్తోర్మి - తెర్లుతూ కాగుతున్న నూనెలలో కాగించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]
1857} తమము - తమోగుణము వలె చూడగలిగినను తగువర్తన తెలియని పరిస్థితి, చీకటి, తమోగుణావరణ :-
[3-721.1-తే.,
4-460.1-తే.]
1858} తమస్వినీచరుడు - తమస్ (చీకటి, రాత్రి) వేళ చరుడు (తిరుగువాడు), రాక్షసుడు :-
[7-308-చ.]
1859} తమ్మికంటి - తమ్మి (పద్మ) కంటి (అక్షుడు), విష్ణువు :-
[10.1-479-వ.]
1860} తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ :-
[7-384-వ.]
1861} తమ్మిచూలిరేయి - తమ్మిచూలి (బ్రహ్మదేవుని)కి రేయి (రాత్రి), ప్రళయపురాత్రి :-
[8-707-వ.]
1862} తమ్ములయిల్లు - తమ్మి (పద్మము)లకు ఇల్లు (నివాసము), సరస్సు :-
[10.1-492-వ.]
1863} తరంగిణి - నీటి అలలుగలది, నది :-
[8-695-వ.]
1864} తరణి - 1) చీకటిని తరింప (దాట)జేయువాడు, సూర్యుడు, 2) నీటిని దాటించెడి వాహనము, ఓడ, పడవ. :-
[9-431.1-తే.,
10.1-340-క.,
10.1-757-వ.,
10.1-1321-వ.]
1865} తరలాక్షి, తరళాక్షి - తరల (చలించెడి) అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[3-966.1-తే.,
9-514.1-ఆ.,
10.1-59.1-ఆ.,
10.2-370.1-తే.,
10.2-498-మ.,
10.2-1071.1-తే.]
1866} తరళనేత్ర - తరళ (చలించెడి) నేత్రి (కన్నులుగలామె), స్త్రీ :-
[6-506.1-ఆ.]
1867} తరళము - తరళతరము తరళతమము :-
[3-808.1-తే.,
7-285-వ.]
1868} తరళేక్షణ - తరళ (చలించెడి) అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-751.1-తే.,
9-425-ఆ.]
1869} తరి - (నీటిని) దాటించునది, ఓడ :-
[10.1-1361-క.]
1870} తరుచరము - తరువుల (చెట్లపై) చరించునది, కోతి :-
[10.2-553-క.]
1871} తరుచరసైన్యపాలనుడు - తరుచర (వానర) సైన్య (సేనలను) పాలనుడు (పరిపాలించువాడు), రాముడు :-
[7-482-చ.]
1872} తరుణారుణాంభోజనేత్రుఁడు - లేత ఎఱ్ఱకలువల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-673-తే.]
1873} తరుణి - తరుణ వయసున కలామె, యువతి :-
[3-461-మ.,
3-465-క.,
3-781-మ.,
3-818-క.,
3-835-మ.,
3-932-క.,
3-977-క.,
3-1010-క.,
4-73-క.,
4-81-చ.,
4-751.1-తే.,
4-755-చ.,
4-816-క.,
5.1-31-క.,
7-417-క.,
10.1-326-ఆ.,
10.1-786-క.,
10.1-969-మ.,
10.1-1280.1-ఆ.,
10.2-142-ఉ.,
10.2-1171-ఉ.]
1874} తరుణుడు - తరుణ వయసున కలవాడు,యువకుడు :-
[10.1-833-క.]
1875} తర్కము - శాస్త్రములు (నియమన గ్రంథములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము. కార్యకారణ సంభందములను పరీక్షించు నియమానుసరణి శాస్త్రం తర్కము :-
[8-629.1-తే.]
1876} తర్జనము - తర్జని (చూపుడువేలు) చూపి బెదిరించుట :-
[4-713-చ.,
5.2-138-వ.,
6-383-వ.]
1877} తర్ణకము - అప్పుడే పుట్టిన దూడ :-
[10.1-1199-వ.]
1878} తలకొని - తల (ముందు) భాగమును తీసుకొని, నాయకత్వము వహించి :-
[3-309.1-తే.]
1879} తలవాకిలి - తల (ముఖము)నకు వాకిలి (ముందుగుమ్మము), నోరు :-
[10.1-537-వ.]
1880} తలోదరి - తలమైన (పల్చని) ఉదరి (ఉదరము కలామె), సుందరి :-
[3-729-చ.,
3-787-తే.,
4-846-క.,
10.1-23-క.,
10.1-310-మత్త.,
10.2-330-చ.,
10.2-1064-చ.,
10.2-1165.1-తే.]
1881} తవిలిసంసారహారిమేధస్కుడవు - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించునట్టి) మేధస్కుడవు (బుద్ధిబలము గలవాడవు), విష్ణువు :-
[4-918.1-తే.]
1882} తవుడు - ధాన్యము దంచినప్పుడు వచ్చెడి మెత్తటిపొడి, రాలే ధాన్యము పైపొట్టు, చిట్టు. :-
[5.1-129-వ.]
1883} తాండవధురీణుడు - తాండవము అను నృత్యమున మిక్కిలి నేర్పరి, శివుడు :-
[10.2-312-క.]
1884} తాండవము,లాస్యము - 1. తాండవము ఉద్ధృతమైన నృత్యము, శివుడు (పురుషుడు) చేయు నాట్యము, 2. లాస్యము మృదుమధురమైన నృత్యము, లాస్యము పార్వతీదేవి (స్త్రీ) చేయు నాట్యము :-
[10.1-777-మ.]
1885} తాంబూలచర్వితము - తాంబూలము (కిళ్ళీ) చర్వితము (నమలబడి మెత్తగా ఐనది), తమ్మ :-
[10.1-1062.1-ఆ.]
1886} తాంబూలము - తమలపాకులు యందు వక్కలు సున్నము ఇష్టానుసారముగ ఇతర సుగంధద్రవ్యాదులు కలిపి ఆరగించునది. :-
[4-635.1-తే.,
10.1-1283-వ.,
10.1-1745-వ.]
1887} తాత్పర్యము - దాని యందే లగ్నమగుట, ఏకాగ్రత :-
[7-350-మ.]
1888} తానము - సంగీతమున స్వరముల ప్రస్తార విశేషము, సంగీత పారిభాషిక పదము :-
[9-350-వ.]
1889} తాపత్రయము - 1ఆధ్యాత్మిక 2ఆధిదైవిక 3ఆధిభౌతిక రూపములైన తాపములు (బాధలు, ఇక్కట్లు) :-
[1-36.1-తే.,
1-110-వ.,
2-61-ఉ.,
3-203-దం.,
3-797-వ.,
3-874-వ.,
3-938-క.,
3-997-వ.,
4-241-వ.,
7-171.1-తే.,
7-356-వ.,
10.1-958-ఉ.,
10.1-1664-వ.,
10.1-1704.1-తే.,
10.2-431.1-తే.,
10.2-1209-చ.]
1890} తాపము - తపింప జేయునది, బాధ, ఇక్కట్టు :-
[2-61-ఉ.]
1891} తాపసపుంగవుడు - తాపసులలో శ్రేష్ఠుడు, మైత్రేయుడు :-
[3-148-మ.]
1892} తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు :-
[10.1-1272-క.]
1893} తాపసమానసకేళి - తాపసుల మానస (మనసు లందు) కేళి (విహరించెడి యామె), పార్వతి :-
[6-7-క.]
1894} తాపసస్తుతిపారణుడు - తాపసుల యొక్క స్తుతులకు పారణుడు (పాత్రమైనవాడు), విష్ణువు. :-
[6-529-త.]
1895} తాపసస్తోత్రసీముడు - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]
1896} తాపసాభీష్టకరుడు - తాపసుల అభీష్టము (కోరికలు) కరుడు (తీర్చువాడు), శివుడు :-
[4-138.1-తే.]
1897} తామరకంటి - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-146-మత్త.]
1898} తామరచూలి - పద్మసంభవుడు, బ్రహ్మదేవుడు :-
[10.2-278-తే.]
1899} తామరసగర్భుడు - పద్మము నందు పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[7-171.1-తే.]
1900} తామరసభవుడు - పద్మములో పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు. :-
[3-325-క.]
1901} తామరసవిలోచనుడు - తామర (పద్మముల) స(వంటి) వి(విశిష్ట) లోచనుండు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[3-212-చ.]
1902} తామరసాక్షుడు - తామరల వంటి కనులు కలవాడు, కృష్ణుడు :-
[1-445.1-తే.,
10.2-81-ఉ.]
1903} తామరసాభలోచనుడు - తామరల వంటి కనులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1180-ఉ.]
1904} తామరసాసనుడు - పద్మము ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-103-చ.,
10.2-631-క.]
1905} తామసుడు - నాలుగవ మనువు :-
[8-138-క.]
1906} తామిశ్రము, తామిస్రమము - చీకటి ఏమియును తెలియని జంతుప్రాయము, చీకటిలోకము, నరక విశేషము :-
[3-721.1-తే.,
5.2-136-వ.,
5.2-138-వ.]
1907} తారక - నక్షత్రము, నక్షత్రాదులందు ఉండు విడివిడి గోళము, ఆకాశమందలి జ్యోతిర్మయగోళము :-
[3-346-వ.]
1908} తారకాధిపవదనలు - తారకాధిప (చంద్రుని వంటి) వదనలు (మోము కలవారు), స్త్రీలు :-
[10.2-223.1-తే.]
1909} తారమల్లికాపాండురవర్ణుడు - తార (తారక లేదా వెండి) వంటి మల్లికా (మల్లెపూల) వంటి పాండుర (తెల్లని) వర్ణుడు (రంగు దేహము గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]
1910} తారాధిపనిభవదనలు - తారాధిపుడు (చంద్రుని) నిభ (వంటి) వదనము కలామె, స్త్రీ :-
[10.1-1090-క.]
1911} తారాధిపవంశుడు - తారాధిప (చంద్ర) వంశమువాడు, కృష్ణుడు :-
[10.1-1090-క.]
1912} తారాధిపుడు - తారకలకు అధిపుడు (ప్రభువు), చంద్రుడు :-
[5.1-7.1-తే.,
10.1-1299-క.]
1913} తారాధ్వముబద్దము - తారలకు అధ్వము (త్రోవ), ఆకాశము; బద్దము హద్దు పరిమితికలది, ఐనన్ ఐనా సరే,; అపరిమితమైన ఆకాశం పరిమితమైనది అగుట అంటే కుంచించుకుపోవుట జరిగినప్పటికి, గమనిక బద్దలైనన్ అన లేదు బద్దమైనన్ అన్నారు కనుక ముక్కలవ్వడం కాడు కుంచించుకుపోవడమే సరి} :-
[8-595-క.]
1914} తారేశుడు - తారలకు ఈశుడు (భర్త), చంద్రుడు :-
[10.1-481-శా.]
1915} తార్క్షనందనుడు - తార్క్షు ని (కశ్యపుని) కొడుకు, గరుడుడు :-
[8-638-వ.]
1916} తాలాంకుడు - తాడిచెట్టు జండాపై కలవాడు, బలరాముడ :-
[10.2-291-క.,
10.2-483.1-తే.,
10.2-574.1-తే.]
1917} తిక్కన - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవవాడు :-
[6-11.1-తే.]
1918} తితిక్ష - ఓర్పు, క్షమ, శీతోష్ణాది ద్వంద్వ సహనము, వ్యు. తిజ క్షమయామ్+ (స్వార్థే) సన్ + అచ్ టాప్, కృప్ర., :-
[4-28-వ.]
1919} తిథులు - చంద్రుని 15 కళల పారిభాషిక పదములు 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15పున్నమి లేక అమావాస్య :-
[5.2-86-వ.,
11-105-వ.]
1920} తిమి - నూరు యోజనముల పొడవుగల చేప, పెద్దచేప :-
[6-326-వ.]
1921} తిమింగలము - తిమిని మింగెడు చేప :-
[6-326-వ.]
1922} తియ్యవిలుకాడు - తియ్యని (చెరకుగడ) విల్లుగా కలవాడు, మన్మథుడు :-
[10.1-1059-క.]
1923} తిర్యక్కులు - జంతువులు, పక్షులు, నం,విణ, అడ్డముగా పోవునవి, :-
[1-61-వ.,
1-192-వ.,
2-274.1-తే.,
3-338-క.,
3-344-వ.,
3-353-క.,
3-715-వ.,
3-905-క.,
5.2-75-వ.]
1924} తిలకిని - తిలకము ధరించుస్త్రీ, నుదుటి తిలకము వలె శ్రేష్ఠమైన స్త్రీ :-
[10.1-1732.1-ఆ.]
1925} తిలకుడు - నుదుటి తిలకము వలె శ్రేష్ఠమైన వాడు. :-
[3-235-క.,
3-391-క.]
1926} తిలోదకములిచ్చుట - బంధు మరణాంతర కర్మ :-
[1-176-వ.]
1927} తీర్థపదాంబుజాతుడు - తీర్థ (పుణ్య గంగానదికి నిలయమైన) పద (పాదములు అనెడి) అంబుజాతుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]
1928} తీర్థపాదుడు, తీర్థపాదుడు - పుణ్యతీర్థము (గంగ) పాదమున కలవాడు, విష్ణువు, తీర్థములవలె పవిత్రమైన పాదములు కలవాడు :-
[2-89-వ.,
3-824-వ.,
4-382.1-తే.,
4-610-చ.,
8-483.1-తే.]
1929} తీవబోడి - పూలతీగ వంటి దేహము కలామె, అందగత్తె :-
[3-786.1-తే.]
1930} తుంగము - పొడవైనది, తురంగ అని పాఠాంతరము ఉంది, తురంగము, త్వరితముగలది :-
[9-230-వ.]
1931} తుచ్ఛము - తుచ్ఛతరము తుచ్ఛతమము :-
[10.1-1772-క.]
1932} తుదకుతుది - అంతమునకు అంతమైనవాడు, అనంతుడు :-
[6-338-క.]
1933} తుదిలేక - ఆది (సృష్టి) స్థితి అంతము(లయము)లు లేకుండ, అనంతమై :-
[10.1-567.1-ఆ.]
1934} తురంగము - త్వర యైన గమనము కలది, గుఱ్ఱము :-
[10.1-1558-వ.]
1935} తురగదానవుడు - గుఱ్ఱము రూపున గల రాక్షసుడు, కేశి. :-
[10.1-1172-ఆ.]
1936} తురగము - త్వరగా పోవునది, గుఱ్ఱము :-
[10.1-1532-వ.]
1937} తుర్యము - తురీయము, నాలుగవది, 1. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధములను చతుర్విధ తత్త్వములలోనూ నాలుగవదైన అనిరుద్ధుడు, 2. జాగ్రత్ సుషుప్తి నిద్ర లనెడి అవస్థాత్రయము తరువాతి అవస్థ తృతీయము, దీనిపైన ఉన్మని (యోగుల అవస్థా విశేషము) :-
[3-57-వ.]
1938} తులసీదళదాముడు - తలసీ దళముల దామము (దండను) ధరించువాడు, విష్ణువు :-
[3-490-ఉ.,
4-264-ఉ.]
1939} తుష్టి - సంతృప్తి, ఏదైనా ఇక చాలు అనే మానసిక స్థితి :-
[4-28-వ.]
1940} తుహినకిరణుడు - తుహిన (మంచువలె చల్లని) కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.1-800-క.]
1941} తుహినధాముడు - తుహిన (మంచువంటి చల్లదనమునకు) ధాముడు (నివాసమైనవాడు), చంద్రుడు :-
[9-265-క.]
1942} తుహినమయూఖశేఖరుడు - చల్లని కిరణములు కలవాడు (చంద్రుడు) శిఖ యందు కలవాడు, శివుడు :-
[10.2-1271-చ.]
1943} తూర్పుముట్టియున్ననుత్తరభాగము - ఈశాన్యము :-
[9-206-వ.]
1944} తూర్యత్రయము - 1నాట్యము 2గీతము 3వాద్యములు అనెడి మూడు, 1తంత్రీ (తతవాయిద్యములు) 2చర్మ (అవనద్ద వాయిద్యములు) 3ఊదెడి (సుషిర వాద్యములు) అను మూడు రకముల వాద్యములు :-
[10.1-1310.1-ఆ.]
1945} తృణప్రాయము - తృణము (గడ్డిపరక)తో ప్రాయము (సమానము), అతితేలికైనది :-
[6-282-వ.]
1946} తృణములు - విత్తనమునాటక పండెడి గడ్డి చేమ మున్నగునవి :-
[8-175.1-ఆ.]
1947} తృణీకరించు - తృణముగా నెంచు, లెక్కచేయకుండు :-
[10.2-1102-చ.]
1948} తెగజూచు - తెగునట్లు (చనిపోవునట్లు) చూచు, చంపు :-
[10.1-1572-క.]
1949} తెనుగుగుణమగు - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది :-
[1-20-క.]
1950} తెఱవా - తెఱ (దాపరికము లేని) వా (వాక్కు కలామె), తెఱవు (స్వచ్ఛమైన, చక్కని) వా (వాక్కుగల ఆమె), తెఱకువ (వివేచన కల) వా (వాక్కుగల ఆమె), స్త్రీ :-
[8-463-మ.,
10.2-1023-తే.]
1951} తెలవాఱెడివేళ - తెలవారుఝాము తెల్లగా వారు (అవ్వు) సమయము, సూర్యదయానికి ముందు సమయం :-
[10.2-1002-క.]
1952} తెలికపిండి - నువ్వులు మొదలగువాని నుండి నూనె తీసినప్పుడు వచ్చెడి అచ్చులు లేదా పొడి :-
[5.1-129-వ.]
1953} తెలియరానివాడు - శ్రు. నతత్ర చక్షుఃగచ్ఛతి నవాగ్గచ్ఛతి నోమనః, నీవు ఇట్టివాడవు అని చూపులచేత మాటలచేత ఊహలచేత తెలియ శక్యము కాదు, ఆత్మ, భగవంతుడు :-
[10.1-577-క.]
1954} తేజోబలాఢ్యుడు - తేజము బలము మిక్కిలిగా కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
1955} తేజోభిన్నంబులు - 1.భూర్భువస్సువర్లోకములు అనెడి ద్రవ్య శక్తి ప్రజ్ఞా మయలోకములు, 2.వసు రుద్ర ఆదిత్య లోకములు, 3.దేహము ప్రాణము మనస్సు :-
[4-849-వ.]
1956} తొగలసంగడికాడు - తొగ (కలువ)ల సంగటికాడు (స్నేహితుడు), చంద్రుడు :-
[10.1-297.1-ఆ.]
1957} తొయ్యలి - తోయలి, తాయ్య (సంతానపాలనయోః) కాశ ధా, తాయీ (కనునది, పెంచునది), స్త్రీ :-
[10.1-1495-ఉ.]
1958} తొలిబిడ్డడు - మొదట (సృష్టికే మొదట) పుట్టినవాడు, బ్రహ్మ :-
[2-240-చ.]
1959} తోయజదళాక్షుడు - పద్మదళముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-951-మ.]
1960} తోయజనయన - పద్మములవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-816-క.]
1961} తోయజనాభుడు - తోయజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-245-క.,
3-551-చ.,
3-650-క.,
10.1-1562-వ.]
1962} తోయజనేత్ర - తోయజము (పద్మము) వంటి నేత్రములు కలామె, స్త్రీ. :-
[4-793-క.]
1963} తోయజనేత్రుడు - (తోయజ) పద్మముల వంటి నేత్రములు కల వాడు కృష్ణుడు. :-
[1-252-క.]
1964} తోయజము - తోయము (జలము) లందు జము (పుట్టినది), పద్మము :-
[3-309.1-తే.]
1965} తోయజసంభవుడు - తోయజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-275.1-తే.,
3-387-క.]
1966} తోయజహితుడు - తోయముజ (పద్మము)లకు హితుడు (ఇష్టుడు) సూర్యుడు :-
[2-155.1-తే.]
1967} తోయజాక్షుడు - తోయజ (పద్మముల వంటి) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[8-14.1-ఆ.]
1968} తోయజేక్షణుడు - తోయజము (తెల్లతామరల)లవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.1-128-మత్త.]
1969} తోయధి - తోయము (నీటి)కి నివాసము, సముద్రము :-
[3-158-క.]
1970} తోయరాశి - తోయము (నీరు) రాశిగా కలది, కడలి :-
[10.1-640-శా.]
1971} తోయరుహాప్తుడు - తోయరుహ (పద్మము)లకు ఆప్తుడు, సూర్యుడు :-
[3-44-ఉ.]
1972} తోయరుహాయతాక్షుడు - తోయరుహము (నీట పుట్టినదైన పద్మమువలె) ఆయత (విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-410-ఉ.]
1973} తోయరుహోదరుడు - తోయరుహము (పద్మము) ఉదరుడు (గర్భమున గలవాడ), విష్ణువు :-
[4-920-ఉ.]
1974} తోరణము - వరుసగా కట్టిన ఆకులు పూలు వంటివి కట్టిన పొడుగైన తాడు :-
[10.1-1310.1-ఆ.,
10.1-1783-వ.]
1975} తోషుడు - తుష్టి కలవాడు, యజ్ఞునకు భార్య దక్షిణ యందు కలిగిన యామ అను పన్నెడుగురు దేవతలలో పెద్దవాడు. :-
[4-6-వ.]
1976} త్రయాధీశ్వరుడు - త్రయ (వేదత్రయము)లకు అధిపతి, విష్ణువు :-
[3-99.1-తే.]
1977} త్రయీమయదివ్యశరీరుడు - త్రయి (వేద) మయమైన దివ్య దేహము కలవాడు, వరాహమూర్తి, విష్ణువు :-
[3-436-ఉ.]
1978} త్రయోదశరాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము. :-
[1-192-వ.]
1979} త్రికరణములు - మనోవాక్కాయములు మూడు :-
[6-43-క.,
11-54-వ.]
1980} త్రికాలములు - 1భూత 2భవిష్య 3వర్తమాన కాలములు :-
[6-9-చ.,
10.1-89.1-ఆ.]
1981} త్రికూటము - మూడు శిఖరములు గల పర్వతము :-
[5.2-30-వ.]
1982} త్రిగుణములు - 1శాంతవృత్తిగల సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల తమోగుణము అనెడి; మూడుగుణములు :-
[1-61-వ.,
1-236-వ.,
3-184-వ.,
3-203-దం.,
3-246.1-తే.,
3-252-క.,
3-972-వ.,
3-1025-వ.,
4-64-వ.,
4-889-వ.,
5.2-126.1-తే.,
6-85.1-తే.,
6-88-వ.,
7-217-వ.,
7-217-వ.,
7-360-వ.,
8-85.1-తే.,
10.1-91.1-తే.,
10.1-405.1-తే.,
10.1-684-క.,
10.1-1180.1-ఆ.,
10.1-1182-శా.,
10.1-1450.1-ఆ.,
10.1-1472.1-తే.,
10.1-1495-ఉ.,
10.2-441-వ.,
10.2-1204.1-తే.]
1983} త్రిగుణాత్మకము - త్రిగుణములు కలది, సత్వగుణముచేత ఇంద్రియాధిదేవతలను రజోగుణముచేత ఇంద్రియములను తమోగుణముచేత పంచమహాభూతములను కలిగినది :-
[10.1-118-క.]
1984} త్రిగుణాత్మకహంకృతులు - రాజసాహంకృతి తామసాహంకృతి సాత్వికాహంకృతి :-
[10.1-682.1-తే.]
1985} త్రిగుణాత్మకుడు - రజోగుణముచే సృష్టి సత్వగుణముచే స్థితి తమోగుణముచే లయము చేయువాడు, భగవంతుడు, విష్ణువు :-
[10.2-791-క.]
1986} త్రిజగత్కల్యాణుడు - త్రిజగత్ (ముల్లోకములకు) కల్యాణ (శుభము చేకూర్చువాడ), శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]
1987} త్రిజగత్తు, లోకత్రయము - భూః భువః సువః లోకములు, ముల్లోకములు :-
[10.1-1506-మ.]
1988} త్రిజగత్తులు - భూ ఊర్థ్వ అథో లోకములు ఇంకోవిధముగ భూ భువర్ సువర్ లోకములు :-
[3-327-క.]
1989} త్రిజగత్పావనుడు - ముల్లోకములను పవిత్రము చేయకలవాడు, పరమ శివుడు :-
[3-465-క.]
1990} త్రిజగత్సంపత్కరుడు - ముల్లోకములకు సంపదలను కలుగజేయువాడు, విష్ణువు :-
[10.2-1014-క.]
1991} త్రిజగములు - 1స్వర్గ భూ(మానవ) పాతాళలోకములు, 2.భూ భూవః సువః లోకములు :-
[6-467-వ.]
1992} త్రిదండి - మనోదండము (శిక్షించుట) వాగ్దండము కర్మదండము అను మూడు దండములు కల సన్యాసి :-
[10.2-1166-వ.]
1993} త్రిదశరిపులు - రాక్షసులు (దేవతల శత్రువులు) :-
[6-257.1-తే.]
1994} త్రిదశారి - త్రిదశులు (దేవతలు) కు అరి (శత్రువు), రాక్షసుడు :-
[3-681-క.]
1995} త్రిదశుడు - వ్యు. త్రిస్యః దశాః అస్య,, బ.వ్రీ., త్రిదశపరిమాణ వయస్కుడు, బాల్య కౌమార యౌవన వార్ధకములనెడి నాల్గు వయోదశలలో మూఁడవ దశలోనే ఉండువాడు. ఎప్పుడును 30 ఏండ్లవయసువారివలె (యౌవనమున) ఉండువాడు, వేల్పు, దేవత :-
[4-394.1-తే.,
8-685-ఆ.]
1996} త్రిదశేంద్రుడు - త్రిదశు (దేవత)ల ఇంద్రుడు, దేవేంద్రుడు :-
[10.1-132-క.]
1997} త్రిదివము - ముల్లోకములు భూఃభువస్సువః లో మూడవది, స్వర్గము :-
[4-321-తే.,
8-558-వ.,
8-681-వ.]
1998} త్రినయనుడు - శివస్వరూపుడు, విష్ణువు :-
[6-343-వ.]
1999} త్రినాభుడు - మూడు (లోకములు) నాభి యందు కలవాడు, విష్ణువు :-
[8-503.1-తే.]
2000} త్రిపాద - మూడుకాళ్ళు కలవి :-
[11-91-వ.]
2001} త్రిపురఘస్మరుడు - త్రిపురములను భస్మము చేసినవాడు, శివుడు :-
[4-471-క.]
2002} త్రిపురశాసనుడు - త్రిపురములను కూల్చినవాడు, శంకరుడు :-
[4-14-చ.]
2003} త్రిపురసంహరుడు - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[6-178.1-తే.,
10.2-319-తే.]
2004} త్రిపురసంహారకరుడు - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[4-131.1-తే.]
2005} త్రిపురసంహారకుడు - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు :-
[3-467.1-తే.,
4-117-తే.]
2006} త్రిపురుషాధీశ్వరుడు - త్రిపురుష (1క్షరపురుషుడైన వ్యక్తి 2అక్షర పురుషుడైన జీవుడు 3అంతర్యామియైన పురుషోత్తముడు) తానే అయిన ప్రభువు :-
[4-915-క.]
2007} త్రిపృష్ట - త్రి (మూడు అడుగులు) పృష్ట (అడుగబడినవి కలవాడ), వామనుడు, విష్ణువు :-
[8-503.1-తే.]
2008} త్రిభంగి - మువ్వంకల భంగిమ, మూడు వంకరలు (1కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు భంగిమ 2తల ఎడమపక్కకు వాల్చుటచేనగు భంగిమ 3కుడి చేతిని వంచి వేణువు రంధ్రము లందు వేళ్ళూనుట యందలి భంగిమ అనెడ మూడు భంగిమలు) కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ :-
[3-118.1-తే.,
10.1-1084-వ.]
2009} త్రిభంగితానకము - త్రిభంగిమలు (తల చేయి కాలుల యందు మూడు రకాల భంగిమలు)తో నటనము చేయుట, రాసక్రీడలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
2010} త్రిభువనజయరూఢుడు - త్రిభువన (ముల్లోకములను) జయ (జయించుట) రూఢుడు (నిశ్చయముగా గలవాడు), విష్ణువు :-
[8-503.1-తే.]
2011} త్రిభువనాత్మభవుడు - త్రిభువన (ముల్లోకములును) ఆత్మన్ (తానే అయ్యి) భవుడు (దివ్యమైనవాడు), విష్ణువు :-
[6-343-వ.]
2012} త్రిమస్తకుడు - త్రి (మూడు) మస్తక (శిరములు గలవాడు) :-
[7-29-వ.]
2013} త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరుడు :-
[6-333.1-ఆ.,
7-88-వ.,
7-274-మ.,
8-154.1-తే.,
8-227-ఆ.,
10.1-294-క.,
10.1-1306.1-తే.,
10.2-1279.1-తే.,
11-113-వ.]
2014} త్రిలింగములు - (అ) 1.స్థూలశరీరము, 2.సూక్ష్మశరీరము, 3.కారణశరీరము అను మూడు, (ఆ) త్రిగుణములు పంచభూతములు ఇంద్రియాదులు, (ఇ) 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము :-
[2-84-వ.,
7-274-మ.]
2015} త్రిలోకపతి - ముల్లోకములకు భగవంతుడు, విష్ణువు :-
[6-32-క.]
2016} త్రిలోకమనోహరానుభావుడు - తిలోక (ముల్లోకములకు) మనోహరమైన అనుభవముల యిచ్చువాడు, విష్ణువు :-
[6-343-వ.]
2017} త్రిలోకములు - ముల్లోకములు, 1 భూ 2 భువర్ 3 సువర్ లోకములు అధిదేవతలు ఇంద్రియములు విషయములు అనెడి రూపములైన, 1స్వర్గ 2మర్త్య 3పాతాళ లోకములు :-
[3-347-క.,
7-6-క.,
10.1-1241-క.,
10.2-260-ఆ.]
2018} త్రిలోకశరణ్యుడు - ముల్లోకములకు రక్షకుడు, విష్ణువు :-
[10.2-752-చ.]
2019} త్రిలోకారాధితుడు - ముల్లోకములచేత ఆరాధింపబడు వాడు, విష్ణువు :-
[10.2-128-క.]
2020} త్రిలోచనుడు - త్రి (మూడు) లోచనుడు (కన్నులుగలవాడు) :-
[4-695-మ.,
7-29-వ.]
2021} త్రివక్ర - మువ్వంకలామె, వంకరమెడ, దొడ్డికాళ్ళు, గూనినడుము అను మూడు వంకరలను త్రివక్రములు అంటారు. అలా మూడు వంకరలు కల స్త్రీ. :-
[10.1-1278-ఉ.]
2022} త్రివర్గము - ధర్మము అర్థము కామము అనెడి మూడు (3) వర్గములు :-
[4-368-వ.,
4-625.1-తే.]
2023} త్రివిక్రమదేవుడు - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు :-
[6-302-క.]
2024} త్రివిక్రమము - మూడడుగులతో ముల్లోకములను కొలువగల పరాక్రమము (సామర్థ్యము) :-
[2-200-చ.,
5.2-31-క.,
5.2-112.1-ఆ.,
8-503.1-తే.]
2025} త్రివిక్రముడు - మూడడుగులతో ముల్లోకములను కొలువగల పరాక్రమము (సామర్థ్యము) కల వాడు, వామనావతారుడు, విష్ణువు :-
[6-343-వ.,
10.1-236-వ.]
2026} త్రివిధకర్మములు - పుణ్య పాప మిశ్ర కర్మలు :-
[5.2-55-వ.,
10.1-1664-వ.]
2027} త్రివిధగజజాతులు - 1భద్రము 2మందము 3మృగము, భద్రగజమును దేవాలయాలాదులలో కొలువులకు ఊరేగింపులకు వాడుటకు యోగ్యమైనది, మందము యుద్ధకాలమున వాహనముగా వాడుటకు యోగ్యమైనది మృగము అడవిలో తిరుగునది, దీనిని మచ్చికచేయుట కష్టము :-
[10.1-1721-మ.]
2028} త్రివిధదుఃఖములు - 1ఆదిభౌతికము 2అధ్యాత్మికము 3అధిదైవికము :-
[4-861-చ.]
2029} త్రివిధపాపములు - 1అంహ (దోషము) 2ఆగము (తప్పు) 3ఏనస్సు (అపరాధము), (దోషము చేయుటలోని పొరపాటు, తప్పు అతిక్రమించి చేయునది, దోషము చేయరానిది చేయుట) :-
[10.1-484-క.,
10.2-789-వ.]
2030} త్రివిధములు - 1 అధ్యాత్మము2 అధిభూతము 3 అధిదైవము :-
[3-209-క.]
2031} త్రివిధసృష్టి - 1 కాలము 2 ద్రవ్యము 3 గుణము అను ఒకదాని పైనొకటి ఆధారపడు మూడు విధములు అయిన సృష్టి :-
[3-344-వ.]
2032} త్రివిష్టపము - త్రిదివము, భూర్భువస్సువః అను మూడవలోకము, వ్యు. తృతీయం విష్టపము త్రివిష్టపము, స్వర్గలోకము, ముల్లోకములలో మూడవది :-
[4-277-వ.,
7-330-ఉ.]
2033} త్రివిష్టపముఖ్యజగన్నివాసకుడు - త్రివిష్టప (స్వర్గము) మొదలగు జగత్ (లోకములలో) నివాసకుడు (వసించెడివాడు), విష్ణువు. :-
[7-330-ఉ.]
2034} త్రిశంకుడు - 1తండ్రికి బాధకలిగెడి కార్యము చేయుటచేతను 2గురుధేనువును వధించుట చేతను 3అప్రోక్షిత మాంసమును భక్షించుట చేతను త్రివిధ హృదయ శంకువులుగల ఇతనికి ఈ పేరు వసిష్ఠునిచే పేరుపెట్టబడెను. విశ్వామిత్రుడు ఇతనికొరకు త్రిశంకు స్వర్గము సృష్టించెను. :-
[9-192.1-తే.]
2035} త్రిశక్తులు - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి 1 ఇచ్చాది ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది సత్వము, రజస్సు, తమస్సు :-
[2-58-మ.,
2-101-చ.]
2036} త్రిశూలము - శివుని ఆయుధము, మూడు మొనలు గల ఆయుధ విశేషము. :-
[5.1-147.1-తే.]
2037} త్రిషవణస్నానములు - ముప్పొద్దుల చేయు స్నానములు, మూడు సవనముల ముందు చేయు స్నానములు :-
[5.1-99-వ.]
2038} త్రిసంధ్యలు - త్రి (మూడు, ఉదయ మద్యాహ్న సాయంకాల) సంధ్యలు :-
[7-421-వ.]
2039} త్రుటి - సుమారు 0.39 మిల్లిసెకన్లు, 300 నిమేషములు, నిమేషము 3 లవములు, లవము 3 వేధలు. వేధ 100 త్రసరేణువులు, త్రుటి 3 త్రసరేణువులు :-
[10.1-529-వ.]
2040} త్రేతలో - నాలుగింట మూడు వంతుల (3, 4) ధర్మము ఉండును :-
[3-350-వ.]
2041} త్రేతాగ్నులు - 1గార్హపత్యము (గృహస్థునికి సంబంధించినది) 2దక్షిణాగ్ని (పితృదేవతలకి ఉద్దేశించినది) 3ఆహవనీయము (యజ్ఞమున ఇవ్వ యోగ్యమైనది) అను శ్రౌతాగ్నులు మూడు :-
[1-85.1-ఆ.,
4-104-వ.,
4-673.1-తే.,
8-536.1-తే.,
9-333.1-ఆ.,
9-419-వ.,
10.1-805-ఆ.,
10.2-718-వ.]
2042} త్రైజగన్నుతుడు - త్రైజగత్ (ముల్లోకముల)చేత నుతుడు (స్తుతింపబడువాడు), రాముడు. :-
[7-482-చ.]
2043} త్రైలోక్యపాలకుడు - త్రైలోక్య (ముల్లోకములను) పాలకుడు, విష్ణువు :-
[4-702.1-తే.]
2044} త్రైలోక్యసుందరుడు - మూడులోకములకు సుందరుడు, విష్ణువు :-
[2-237-మ.,
3-99.1-తే.]
2045} త్రైవర్గములు - 1 భూభువస్సువ ర్లోకములు మూడు వర్గములు 2 ద్రవ్యము శక్తి ప్రకాశము అను మూడు వర్గములు 3 ధర్మార్థకామములు అను మూడు వర్గములు... :-
[3-1021-వ.]
2046} త్రైవర్గికములు - 1 భూభువస్సువ ర్లోకములు మూడు వర్గములు 2 ద్రవ్యము శక్తి ప్రకాశము అను మూడు వర్గములు 3 ధర్మార్థకామములు అను మూడు వర్గములు... :-
[3-354-క.]
2047} త్రైవిధ్యము - 1సుఖమయ 2సుఖదుఃఖ మిళితమయ 3దుఃఖమయములైన మూడు విధముల ఫలితములు, ఇంకొకవిధమున 1హర్ష 2శోక 3భయములు :-
[6-88-వ.,
6-162-తే.]
2048} త్ర్యవస్థలు - 1జాగ్రత్త 2స్వప్నము 3సుషుప్తి :-
[6-224-వ.]
2049} త్వష్ట - 1.విశ్వకర్మ, ద్వాదశాదిత్యులలోనొకడు, 2.అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు, 3.త్వష్ట కుమారుడు విశ్వరూపుడు ఇంద్రునివలన హతుడగుటకు కోపించి, హోమంలో వృత్రాసురుని సృష్టించాడు. 4.ఏకాదశ రుద్రులలో కూడ ఒక త్వష్ట కలడు. :-
[4-443.1-తే.,
6-506.1-ఆ.]