టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (కంజద - కాళిదాసు)
శ్రీరామ
819} కంజదళాక్షుడు - కం (నీట) జ (పుట్టిన) (పద్మము) వంటి అక్షమున్ (కన్నులు) ఉన్న వాడు, భగవంతుడు, విష్ణువు, కృష్ణుడు :-
[2-211-ఉ.,
6-401-క.,
11-17-క.]
820} కంజము - కం నందు(నీట) పుట్టినది :-
[3-277-చ.,
3-780-వ.,
10.1-1236-దం.,
10.2-821-వ.]
821} కంజాక్షుడు - కంజము (పద్మముల)వంటి అక్షుడు (కన్నులుగల వాడు), విష్ణువు :-
[5.2-9.1-ఆ.,
6-498-తే.,
7-170.1-ఆ.,
10.2-119-మ.]
822} కంజాతకిజల్కపుంజరంజితపీతకౌశేయవాసుడు - కంజాత (పద్మముల)యొక్క కింజల్క (కేసరముల) పుంజ (సమూహము) వలె రంజిత (రంజిల్లుతున్న) పీత (పచ్చని) కౌశేయ (పట్టువస్త్రము)లను ధరించినవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]
823} కంజాతగర్భుడు - కం (నీరు) అందున జాత (పుట్టినది, పద్మము) అందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-284-మ.,
7-86-వ.]
824} కంజాతపత్రనేత్ర - కంజాతము (తామర) పత్ర (ఆకులు) వంటి నేత్ర (కన్నులు ఉన్నామె), స్త్రీ :-
[4-797-క.]
825} కంజాతపత్రేక్షణ - కంజాతము (తామర) పత్ర (ఆకులు) వంటి ఈక్షణ (కన్నులు ఉన్నామె), స్త్రీ (ఈక్షణ అంటే చూపు అని కూడా ఉంది, పద్మం జ్ఞానానికి సంకేతం కనుక, జ్ఞానదృష్టి లేదా కలామె అనుకోవచ్చు) :-
[10.2-355-మ.]
826} కంజాతభవాండము - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[1-1-శా.]
827} కంజాతభూదేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభావ్యావిద్ధాంఘ్రిసరోజుడు - కంజాతభూ (నీటపుట్టునట్టి పద్మమున జనించినవాడు, బ్రహ్మదేవుడు) దేవేంద్రుడు ఆది (మొదలగు) దేవమకుట (దేవతల కిరీటములందు) ఉద్దీప్త (మిక్కిలి ప్రకాశిస్తున్న) ఉరు (పెద్ద) రత్నముల ప్రభా (కాంతులు) వ్యావిద్ధ (విశేషముగా పరచబడిన) అంఘ్రి (పాదములనెడి) సరోజుడు (పద్మములుగలవాడు), హరి :-
[6-1-శా.]
828} కంజాతము - కం (నీటిలో) జాతము (పుట్టినది), పద్మము :-
[3-203-దం.,
10.2-68.1-తే.]
829} కంజాసనుడు - కంజము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-368-మ.]
830} కంజేక్షణ - కంజ (పద్మము)వంటి ఈక్షణ (కన్నులు కలామె), స్త్రీ :-
[10.1-1130-శా.]
831} కంజోదరుడు - కంజము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణువు :-
[7-94-క.]
832} కంటకులు - ముండ్లవంటి వారు, క్షుద్ర శత్రువులు :-
[1-360-క.]
833} కంఠీరవము - కంఠమున శబ్దము కలది, భీకరమైన కంఠధ్వని కలది, సింహము :-
[9-595-క.,
10.1-639-ఉ.,
10.1-1558-వ.,
10.1-1615-వ.]
834} కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు :-
[9-615-క.]
835} కండి - ఇరుసుపై తిరిగెడి మధ్య రంధ్రముగల గుండ్రముగానుండి ఆకులుద్వారా చక్రమునకు కలపబడి యుండెడిది :-
[10.1-251-క.]
836} కంతునిగురువు - కంతుడు (మన్మథుడు) యొక్క గురువు (తండ్రి), విష్ణువు :-
[6-54-క.]
837} కందర్పుడు - కం (ఆనందముచేత) దర్పించువాడు (అతిశయించువాడు), సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున గర్వము కలవాడు, మన్మథుడు :-
[1-237-మ.,
10.2-13-వ.]
838} కందుకబంధము - పూలచెండ్లు ఎగరవేయునట్లు ఎగురుతుగాని పూలచెండ్లను ఎగురవేయుచుగాని హస్త విన్యాసాదులు కనుపింపజేయుట, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
839} కంధి - కం (నీటికి) నిధి, కడలి. :-
[9-275-క.]
840} కంపితశిరోభావాలు - కిందమీదలుగా కదలించు శిరస్సులు కలవి, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
841} కంబుకరుడు - కంబు (పాంచజన్యము యనెడి శంఖమును) కరుడు (చేత ధరించెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]
842} కంసజింఘాంసునంశము - కంసజింఘ (కంసునిశత్రువైన కృష్ణుని) యొక్క అంశము (అంశ అయినవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]
843} కంసధ్వంసి - కంసుని చంపినవాడు, కృష్ణుడు :-
[10.2-58-మ.]
844} కంసమర్దనుడు - కంసుని శిక్షించినవాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]
845} కంసవిదారి - కంసుని విదారి (సంహరించివాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]
846} కంసారి - కంసునకు శత్రువు, కృష్ణుడు :-
[1-273-వ.,
10.1-1704.1-తే.,
10.2-78-మ.,
10.2-164-మ.,
10.2-186-వ.,
11-77-వ.]
847} కంసాసురసంహారుడు - కంస (కంసు డనెడి) అసుర (రాక్షసుని) సంహారుడు (సంహరించిన వాడు), కృష్ణుడు :-
[6-35-క.]
848} కంసుడు - కృష్ణని మేనమామ :-
[2-190-చ.]
849} కంసునిసోదరులు - 1న్యగ్రోధుడు 2కహ్వుడు 3సునామకుడు 4శంకుడు 5సుభుడు 6రాష్ట్రపాలుడు 7విసృష్టుడు 8తుష్టిమంతుడు :-
[10.1-1382-శా.]
850} కకుత్స్థుడు - ఎద్దుమూపుపై విహరించిన వాడు, కకుత్స్థుడు, శశాదుడు అను పేర్లు గల సూర్యవంశపు రాజు, వికుక్షి కొడుకు, ఇక్ష్వాకుని మనుమడు :-
[9-160-చ.]
851} కజ్జికాయలు - తీపితినుబండారము (కొబ్బరి కోరు బెల్లం పాకంలో పట్టించినది లస్కోరా, లౌజు అంటారు. పిండి పూరీలా గుండ్రంగా వత్తి ముందు చేసుకున్న లస్కోరా మధ్యలో పెట్టి సగానికి మడుస్తారు. రెండు పొరలు కలవటానికి అందంగా నొక్కులు నొక్కుతారు. అప్పుడు కాగుతున్న నూనెలో వేయిస్తారు. కొద్దిగా పొంగుతాయి. వాటిని కజ్జికాయలు అంటారు) :-
[10.1-458-క.]
852} కటకాముఖకరభావము - వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది, శ్లో. కపిత్థ తర్జనీచోర్ధ్వం మిశ్రితాంగుష్ట మధ్యమా, కటకాముఖహస్తోయం కీర్తితో భరతాదిభిః, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
853} కటితటహతకమలజాండఘటి - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (గంటకలది), ఆదివరాహము :-
[3-698-క.]
854} కటిభ్రాంతకరణము - నడుముమాత్రము కదలించుట, రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
855} కడతేర్చు - (జీవితము) కడ (చివరకు) చేర్చు, చంపు :-
[7-330-ఉ.]
856} కడపటిచేత - ఎల్ల పనులకు చివరి పని, చావు :-
[10.2-752-చ.]
857} కడలుకొను - కడ (చివర) వరకు కొను (తీసుకుపోవు), మిక్కిలి వ్యాపించు :-
[4-35.1-తే.]
858} కడుపుబొక్కు - కడుపు (గర్భపు), పొక్కు (శోకము), గర్భశోకము :-
[8-484-ఆ.]
859} కత్తివాతియమ్ము - కత్తివంటి పదును గల బాణము :-
[10.1-1771-వ.]
860} కనకాక్షుడు - హిరణ్యాక్షుడు బంగారు కళ్ళు ఉన్న వాడు, బంగారం రజోగుణ సంకేతం కనుక రజోగుణ దృష్టి కలవాడు. :-
[2-115-మ.]
861} కనకాచలేంద్రము - కనక (బంగారు) ఆచల (కొండలలో) ఇంద్రము (గొప్పది), మేరుపర్వతము :-
[8-49.1-ఆ.]
862} కన్నీరుమున్నీరుగా - కన్నీరు (దుఃఖమువలన కలిగెడి కంటినీరు) మున్నీరు (సముద్రమువలె) కాన్ అగునట్లు, అత్యధికముగా కన్నీరుకార్చుచు :-
[10.1-14.1-తే.]
863} కన్యక - కన్యాకుబ్జక్షేత్రమున కన్యక (సకల జనులచేత కోరబడెడియామె), అవివాహిత :-
[10.1-61-వ.,
10.1-850-వ.]
864} కపిత్తకరభావము - వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది, శ్లో. అంగుష్టమూర్ధ్ని శిఖరేవక్రితాయది తర్జనీ, కపిత్థాఖ్యకరస్సోయం తన్నిరూపణముచ్యతే., రాసక్రీడ ఆడుటలోని పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]
865} కబళాహారము - తినెడి ఆహారము, పూలతేనె :-
[8-24-వ.]
866} కమండలము - జలమును సన్నని ధారగా పోయుటకు వీలై జల భక్షణ, యోగ క్రియాదులకు అనుకూలమైన తొండము ఉండు కలశము, జలపాత్ర :-
[11-77-వ.]
867} కమఠము - జలమునందు వసించునది, తాబేలు :-
[8-203-మ.]
868} కమనీయగుణగణాకరుడు - కమనీయ (మనోజ్ఞము లైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు :-
[10.2-1-క.]
869} కమనీయభుజంగమరాజమండలీమండనుడు - కమనీయ (మనోహరమైన) భుజంగమ (సర్ప) రాజ (రాజుల) మండలీ (సమూహములచే) మండనుడు (అలంకరింపబడినాడు), శివుడు :-
[6-2-ఉ.]
870} కమనీయము - మనోహరమైనది,4 కామ్యతే కమనీయం వా, కోరబడునది; అందముగా నున్నది. :-
[2-21.1-తే.]
871} కమనీయలోకమంగళదాయకుడు - కమనీయ (మనోహరమైన) లోక (విశ్వజనీన) మంగళ (శుభములను) దాయకుడు (ఇచ్చువాడు), శివుడు :-
[4-138.1-తే.]
872} కమనీయవలయకరకీలితకంకాళి - కమనీయ (మనోహరమైన) వలయ (కంకణములు) కర (చేతు లందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుఱ్ఱెల) ఆళి (సమూహములు గలామె), పార్వతి :-
[6-7-క.]
873} కమలగర్భుడు - కమలమున గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-738-వ.,
6-282-వ.]
874} కమలగృహము - పద్మములకు నిలయము, సరస్సు :-
[10.1-1732.1-ఆ.]
875} కమలజాండము - కమల (పద్మము)న జ (పుట్టినవాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[3-698-క.,
5.2-77-ఆ.,
10.1-482-ఆ.]
876} కమలజుడు - కమలమున (పద్మమున) జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-246-క.,
3-930-చ.,
4-569.1-తే.,
4-943.1-తే.,
8-682-క.]
877} కమలదళాక్షి - కమల (పద్మముల) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ :-
[4-401-చ.,
8-236-క.]
878} కమలదళాక్షుడు - కమలముల దళ (రేకుల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు. :-
[3-571-చ.,
4-922-చ.]
879} కమలదళాయతేక్షణుడు - కమల (తామర) దళ (రేకులవంటి) ఆయత (విశాలమైన) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-147-చ.]
880} కమలదళేక్షణుడు - తామర రేకులవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-1358-క.]
881} కమలనయన - కమలముల వంటి నయనములు (కన్నులు) ఉన్నామె, స్త్రీ. :-
[3-1040-తే.]
882} కమలనయనుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-573.1-తే.,
6-122-ఆ.]
883} కమలనాభుడు - కమల (పద్మము) నాభుడు (నాభి యందు కలవాడు), విష్ణువు :-
[1-50.1-ఆ.,
1-102.1-ఆ.,
1-482-ఆ.,
2-51.1-ఆ.,
3-123.1-తే.,
4-254.1-తే.,
10.1-17-ఆ.,
10.1-1692.1-ఆ.]
884} కమలనేత్రుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[6-181-తే.]
885} కమలపత్రనయనుడు - కమల (తామర) పత్ర (ఆకు)ల వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-805-తే.]
886} కమలబంధువు - పద్మాలకు మిత్రుడు, సూర్యుడు :-
[1-74-వ.]
887} కమలభవాండము - కమలభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1299-క.]
888} కమలభవుడు - కమలము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-90-క.,
4-144-తే.,
10.1-14.1-తే.,
12-24-వ.]
889} కమలమిత్రుడు - పద్మము లకు మిత్రుడు, సూర్యుడు :-
[10.1-568-వ.]
890} కమలలోచన - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[4-837-తే.]
891} కమలలోచనుడు - కమలములవంటి కన్నులుగలవాడు, విష్ణువు :-
[1-58-వ.,
3-652-వ.,
4-126-తే.,
9-133-ఆ.]
892} కమలసంభవుడు - కమలమున సంభవుడు (జన్మించినవాడు), బ్రహ్మదేవుడు :-
[2-226-వ.,
3-276-తే.,
3-725-వ.,
5.1-26-వ.,
5.1-74.1-తే.,
6-178.1-తే.,
8-505-వ.]
893} కమలహితుడు - కమలములకు ప్రీతిపాత్రుడు, సూర్యుడు. :-
[3-451.1-తే.,
8-154.1-తే.]
894} కమలాకరము - కమలమలకు ఆకరము (పుట్టుచోటు), సరస్సు :-
[3-1044-ఉ.,
4-693-మ.]
895} కమలాకాంతుడు - కమల (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు :-
[3-88-మ.]
896} కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[1-237-మ.,
1-450-క.,
2-217.1-తే.,
3-546.1-తే.,
3-681-క.,
6-397.1-ఆ.,
7-169.1-తే.,
7-240.1-తే.,
8-203-మ.]
897} కమలాధీశుడు - కమల (లక్ష్మీదేవి) భర్త, లక్ష్మీపతి విష్ణువు. :-
[3-58-మ.,
3-155-క.,
8-611-మ.]
898} కమలాధీశ్వరుడు - కమల (లక్ష్మీదేవి) అధీశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-494-క.,
4-929-మ.]
899} కమలానన - పద్మములవంటి అననము (ముఖము) కలామె, స్త్రీ :-
[3-457-చ.,
3-474-క.,
3-484-చ.,
4-789-క.]
900} కమలాప్తకులనాథుడు - కమలాప్త (సూర్య) వంశపు రాజు, రాముడు :-
[9-286-ఆ.]
901} కమలాప్తుడు - కమల (లక్ష్మీదేవికి) ఆప్తుడైనవాడ, విష్ణువు, కమలములకు మిత్రుడు, సూర్యుడు :-
[8-92-ఉ.,
10.1-410-క.]
902} కమలామనోహరుడు - కమల (లక్ష్మీదేవికి) మనోహరుడు (భర్త), విష్ణువు. :-
[10.1-688-ఉ.]
903} కమలాలయ - కమలములు ఆలయముగ కలది, లక్షీదేవి :-
[2-232-క.]
904} కమలాలయము - కమలములకు స్థానము, సరస్సు :-
[1-406.1-ఆ.]
905} కమలాసననందనుడు - బ్రహ్మదేవుని కొడుకు, భృగువు :-
[10.2-1274-ఉ.]
906} కమలాసనుజులు - కమలాసనుడు (బ్రహ్మదేవుడు)కి జులు (పుట్టినవారు), బ్రహ్మపుత్రులు :-
[4-214-క.]
907} కమలాసనుడు - కమలమును ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[1-445.1-తే.,
3-397-క.,
3-422-వ.,
5.2-125-వ.,
6-170-త.,
6-241-చ.,
7-84-వ.,
7-305-వ.]
908} కమలుజుడు - కమలమునందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-848-క.,
6-277-క.]
909} కమలేక్షణ - కమలములవంటి కన్నులు కలామె, అందగత్తె, స్త్రీ :-
[10.1-269-ఉ.]
910} కమలేశుడు - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు :-
[7-170.1-ఆ.]
911} కమలోదరుడు - కమలము ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-591-క.,
4-896-క.]
912} కరగ్రహణము - చేతిని గ్రహించి, వివాహము చేసికొనుట :-
[4-42.1-తే.]
913} కరణత్రయము - త్రికరణములు 1మనస్సు 2వాక్కు 3కాయము :-
[11-42-క.]
914} కరతలామలకము - కరతల (అరచేతిలోని) అమలకము (ఉసరికాయ) వలె సులభముగ అందునది, తెలియునది :-
[10.2-482-క.]
915} కరభము - ముంజేయి, 1. మనికట్టునుండి చిటికెనవేలు మొదలుదాక గల చేతి వెలుపల భాగము, 2. కర (ఏనుగు) భ (చేయి, తొండము) :-
[2-158.1-తే.]
916} కరభాజనులు - 1 హరి, 2 కవి, 3 అంతరిక్షుడు, 4 ప్రబుద్ధుడు, 5 పిప్పలాహ్వయుడు, 6 అవిర్హోత్రుడు, 7 ద్రమిళుడు, 8 చమనుడు, 9 కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు :-
[11-35-వ.]
917} కరభోరువు - కరభమును (చేతిచిటికెనవేలికి మణికట్టునకు నడిమి భాగమును) పోలిన ఊరువు (తొడలు కలిగినామె) (ఆంధ్రవాచస్పతము, విద్యార్థికల్పతరువు), అందగత్తె, ఏనుగుతొండము వంటి తొడలు గలది . శ్రీహరి నిఘంటువు :-
[10.1-1496-క.]
918} కరాగ్రస్థగిరి - కర (చేతి) అగ్రస్థ (పైన ఉన్న) గిరి (కొండ (గోవర్దనగిరి) గలవాడు), కృష్ణుడు :-
[6-33-క.]
919} కరికులేంద్రుడు - కరి (ఏనుగు) కుల (సమూహమునకు) ఇంద్రుడు (ప్రభువు), గజేంద్రుడు :-
[8-97-వ.]
920} కరిపాలకుడు - ఏనుగును పాలించువాడు, మావటి :-
[10.1-1316-వ.]
921} కరిరాజశుభప్రదుడు - కరిరాజు (గజేంద్రుని)కి శుభ (శుభములు) ప్రదుడు (ఇచ్చెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]
922} కరివరదుడు - కరి (గజేంద్రుని)కి వరదుడు (వరము ప్రసాదించినవాడు), హరి :-
[4-166-చ.,
6-187-క.]
923} కరుణాంబుధి - కరుణకు సముద్రమైన వాడు, కృష్ణుడు :-
[1-242-ఉ.]
924} కరుణాకరుడు - కరుణ (దయ)కు ఆకరుడు (నిలయము) ఐనవాడు, విష్ణువు, శ్రీకృష్ణుడు :-
[3-155-క.,
3-166-క.,
3-748-క.,
5.1-182-క.,
6-530-తో.]
925} కరుణాపాథోనిధి - దయకు సముద్రము వంటివాడు, విష్ణువు :-
[2-236-మ.]
926} కరుణావర్ధిష్ణుడు - కారుణ్యము వృద్ధి యగు స్వభావము గల వాడు, విష్ణువు :-
[8-105-మ.]
927} కరుణాసముద్రుడు - సముద్రము అంత దయ కలవాడ, శివుడు :-
[4-161.1-తే.]
928} కరుణాసాగరుడు - దయాసముద్రుడు, శ్రీకృష్ణుడు :-
[5.1-1-క.]
929} కరువలిసుతుడు - కరువలి (వాయువు) సుతుడు, భీముడు :-
[10.2-732-క.]
930} కరేణుకావిభుడు - కరేణుక (ఏనుగుల) విభుడు (ప్రభువు), గజేంద్రుడు :-
[8-115-మ.]
931} కర్ణధారుడు - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), పడవ నడుపు వాడు, మార్గదర్శి, తరింపజేయువాడు :-
[1-52-క.,
1-325-ఉ.,
3-459-వ.,
10.2-1227-చ.]
932} కర్ణమూలము - చెవిగూబ :-
[3-700-మ.]
933} కర్త - కారణభూతుడైనవాడు, విష్ణువు :-
[10.1-876-మ.]
934} కర్తరీముఖకరభావము - కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది, శ్లోఅన్యైవచాపిహస్త తర్జనీచ కనిష్టకా బహిః ప్రసారితేద్వేత్స కరః కర్తరీముఖః :-
[10.1-1084-వ.]
935} కర్తృ - చేయునది (కర్త) :-
[3-201.1-తే.]
936} కర్బురసూత్రసమావృతాంసము - కర్బుర (బంగారు) సూత్ర (యజ్ఞోపవీతము)చే సమావృత (చక్కగా కలిగిన) అంసము (మూపు గలవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]
937} కర్బురుడు - కర్బర, కర్బుర (పాపము, చిత్ర వర్ణము) కల వాడు, రాక్షసుడు :-
[10.2-405-చ.]
938} కర్మ - ఆ అభిలాషలకు తగిన నడవడులు :-
[10.1-537-వ.]
939} కర్మజీవులు - కర్మబద్ధులైన జీవులు, మానవులు :-
[3-845.1-తే.]
940} కర్మత్రయము - 1ఆగామి (భవిష్యత్తులో ఫలితము అనుభవించ వలసిన కర్మవిశేషము) 2సంచిత (ప్రోగుచేయఁబడినది, పూర్వజన్మలలో చేసి అనుభవించవలసిన కర్మవిశేషము) 3ప్రారబ్ధ కర్మములు (జన్మము నెత్తించెడు కర్మవిశేషము.) :-
[10.2-1071.1-తే.]
941} కర్మఫలబోధన - కర్మలను అనుసరించి స్వర్గ లోకాది ఫలితములు చెప్పునది :-
[2-20-వ.]
942} కర్మములు - కార్యము (ఫలితము, పని) వలని కారణము (కారణము, పని), ఫలితములు అనుభవించక తప్పని పనులు. :-
[2-222-వ.]
943} కర్మవసుధ(కర్మభూమి) - శ్లో. గాయంతి దేవాషు కిలగీతకాని ధన్యాస్తు యే భారతభూమిభాగే, స్వర్గాపవర్గాస్య ఫలార్జనాయ భవంతి భూయః పురుషాస్సురాత్వాత్. అను ప్రమాణముచేత కర్మభూమి అంటే భారతభూమి, భరతఖండము :-
[10.1-1656-ఉ.]
944} కర్మవిస్తారకాయుడు - వేదకర్మలను విస్తరింపజేయువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]
945} కర్మవిహీనుడు - కర్మముల (బంధము) లేని వాడు, నిష్కాముగా కర్మ చేసినను అది వానికి అంటదు అందుచేత వాడు కర్మవిహీనుడు (నిష్కామకర్ముడు) :-
[10.1-886-క.]
946} కర్మశ్రేష్ఠుడు - కర్మములు (పనిచేయుట) యందు ఉత్తముడు :-
[4-26-వ.]
947} కర్మసాక్షి - సకల ఇంద్రియ వ్యాపారములను సాక్షిగా చూచుచుండువాడు, ఆత్మ :-
[10.2-88.1-తే.]
948} కర్మసాధనుడు - వేదకర్మలకు సాధనమైనవాడు, విష్ణువు. :-
[4-702.1-తే.]
949} కర్మసూత్రము - ప్రతికర్మ (పని)కి ఫలితం ఉంటుంది :-
[4-573-వ.,
4-581-ఉ.]
950} కర్ముడు - కర్మములు చేయువాడు, మానవుడు :-
[10.1-886-క.]
951} కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు, పాఠ్యంతరము 1వాక్, 2పాణి, 3పాద, 4పాయు, 5ఉపస్థులు :-
[1-403-వ.,
2-112-వ.,
4-849-వ.,
6-88-వ.,
7-237-వ.]
952} కర్షణవృత్తి - పొలము దున్ని జీవించెడి జీవిక, కర్షకవృత్తి, గృహస్తాశ్రమ విశేషము :-
[7-410.1-ఆ.]
953} కఱకంఠకార్ముకవిఖండనఖేలనుడు - కఱకంఠ (శివుని) కార్ముక (ధనుస్సును) విఖండన (విఱుచుట అనెడి) ఖేలన (క్రీడ గలవాడు), రాముడు :-
[4-974-చ.]
954} కఱకంఠసతి - కఱకంఠుని భార్య, పార్వతి :-
[2-285-ఉ.]
955} కఱకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శివుడు :-
[2-285-ఉ.]
956} కలకంఠము - కల (చక్కని), కంఠ, (కంఠములు గలది), కోయిల :-
[3-767-క.]
957} కలకంఠి - కోకిల వంటి కంఠస్వరము కలామె, స్త్రీ :-
[10.1-75.1-తే.,
10.1-327.1-ఆ.,
10.1-396-క.,
10.1-1066-క.,
10.2-1025.1-తే.]
958} కలడు - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానము లందు ఉన్నాడు, భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు :-
[10.1-683-వ.]
959} కలభగామిని - కలభ (ఏనుగుగున్న వంటి) నడక కలామె, స్త్రీ :-
[10.1-360-వ.]
960} కలభములలోవిశేషములు - 1బాలము 2పోతము 3విక్కము :-
[8-35-మ.]
961} కలశజుడు - కలశము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు :-
[8-123-మ.]
962} కలహంస - కలకలారావము చేయు హంసలు, ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు రెక్కలు కలిగి మంచి స్వరముతో కలకలారావము చేయు హంసలు :-
[3-507-వ.,
10.2-153.1-తే.,
10.2-1323-వ.]
963} కలి - 1. కలికాలపురుషుడు, 2. కలికాలము, 3. పాపము కలిగంచుటకు కారణభూతము ఐన కాలము, 4. జగడము :-
[2-198-మ.,
4-215-వ.]
964} కలికలుషసుముదపహరణ - కలియుగమున కలుగు కలుష (పాపములను) సు (మిక్కిలి) ముద (సంతోషముతో) అపహరణ (తొలగించువాడు), కల్కి :-
[11-72.1-తే.]
965} కలిలో - నాలుగింట ఒక వంతు (1/4 వంతు) ధర్మము ఉండును :-
[3-350-వ.]
966} కలువడములు - స్తంభమునకు వేలాడదీసిన (బంగారు) కలువపూల దండ :-
[10.1-1719.1-ఆ.]
967} కల్కి - కలిని (కలి అన చెడు, పాపము కారణభూతుడు) చెడుపు వాడు, కపటస్వభావము కలవాడు. కల్క్యవతారము :-
[2-197-వ.,
2-198-మ.,
10.1-1236-దం.]
968} కల్పము - బ్రహ్మకు ఒక పగలు అయిన కాలము కల్పము :-
[1-237-మ.]
969} కల్పము - బ్రహ్మకు ఒక పగలు అయిన కాలము, 14 మన్వంతరములు జరిగిన బ్రహ్మకు ఒక పగలు, అదే కల్పము (సృష్టి) అవాంతరకల్పము. అంతే కాలము బ్రహ్మకు రాత్రి, అదే అవాంతర ప్రళయము. రెండును కలిపిన ఒక బ్రహ్మదినము. అటువంటి 360 బ్రహ్మ దినముల కాలము బ్రహ్మోదయము నుండి బ్రహ్మాస్తమయము మహాకల్పము లేదా కల్పము. మహా ప్రళయము (అంతే కాలము) బ్రహ్మ అస్తమయము నుండి బ్రహ్మ ఉదయం వరకు. :-
[2-222-వ.]
970} కల్పవృక్షము - కల్ప (భావించిన వానిని యిచ్చెడి) వృక్షము (చెట్టు) :-
[6-326-వ.]
971} కల్పవృక్షములలోరకములు - 1మందారము 2పారిజాతము 3సంతానము 4కల్పవృక్షము 5హరిచందనము :-
[6-326-వ.]
972} కల్హారము - సౌగంధికము, ఇంచుక ఎఱుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువ :-
[8-49.1-ఆ.]
973} కళ - 1. ముప్పది కాష్ఠల కాలము, 2. చంద్రుని కళలు పదహారులోనిది :-
[2-188.1-తే.,
10.2-430-వ.]
974} కళానిధి - 16 కళలు కలవాడు, చంద్రుడు :-
[10.1-110-క.,
12-48-వ.]
975} కళావతి - కళలు తెలిసినామె, స్త్రీ :-
[10.2-188-వ.]
976} కళాస్థానములు - బొటకనవేలు, స్తనము, చెక్కిలి, ముఖము మున్నగు కళాస్థానములు. వాని శక్తి చంద్రకళలను అనుసరించును. మరియొక విధముగ చతుషష్టి మన్మథ కళలు :-
[10.1-1495-ఉ.]
977} కళిందకన్య - కళిందపర్వతుని పుత్రిక, యమునానది :-
[10.1-1227-క.]
978} కళిందితనయ - కళింద పర్వతమునకు పుట్టినది, యమునానది :-
[10.1-1479-శా.]
979} కళేబరము - ప్రాణము విడిచిన శరీరము :-
[4-652-వ.,
4-844-చ.]
980} కవి - 1. రూపములు అల్లువాడు, 2. శుక్రధాతువు, 3. రూపములను వ్యాపింపజేయువాడు, 4. ఉశనసుడు, 5. శుక్రుడు. 6. కవిత్వము చెప్పువాడు :-
[4-6-వ.,
4-26-వ.]
981} కవియోగివంద్యుడు - కవులచేతను యోగులచేతను వంద్యుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[8-92-ఉ.]
982} కవ్యము - కవ్యములు ( పితృదేవతలకు సమర్పించు పిండములు (అన్నములు) :-
[3-738-వ.,
4-502-వ.,
7-455-వ.]
983} కవ్వడి - కవ + వడి, రెండు చేతులలోను వడి కలవాడు, అర్జునుడు :-
[10.2-1287-క.]
984} కవ్వము - పెరుగు చిలికెడు సాధనము :-
[8-200-ఉ.]
985} కశ్యప - 1. మునివిశేషము, 2. మీనము, 3 కశ్యపప్రజాపతి మరీచి భార్య కళ యొక్క పుత్రుడు :-
[4-7.1-తే.]
986} కశ్యపపుత్రుడు - కశ్యపుని పుత్రుడు, హిరణ్యకశిపుడు :-
[7-92-శా.]
987} కశ్యపునిసోదరుడుశివుడు - రుద్రులును ప్రజాపతులును బ్రహ్మదేవుని దేహమునుండే పుట్టిరి కనుక పరమశివుడు కశ్యపుడు అన్నదమ్ములు అనుటకు తగినది అందుచేత శివుడు దితికి మరిది అనుట చెల్లినది :-
[3-462-మ.]
988} కహ్లారము - కొంచెము ఎరుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువపువ్వు, సౌగంధికము :-
[10.2-153.1-తే.]
989} కాంచనము, బంగారము - రజోగుణమునకు సంకేతము :-
[4-771.1-తే.]
990} కాంచనలోచనుడు - బంగారము వంటి కన్నులు ఉన్నవాడు, బంగారము రజోగుణ సంకేతం కనుక రజోదృష్టి కలవాడు, హిరణ్యాక్షుడు? :-
[3-611-చ.]
991} కాండర్షులు - వేద కాండములను అధ్యయనము చేసినవారు :-
[1-499-వ.]
992} కాంత - మనోహరమైన ఆమె, కాంక్షిప దగి నామె, స్త్రీ :-
[4-783-క.,
5.1-92-మ.,
10.1-798-వ.,
10.1-1101-వ.,
10.2-265-ఉ.]
993} కాంతాలయము - కాంత (భార్య) ఉండెడి ఆలయము (ఇల్లు), నివాసము :-
[8-177-క.]
994} కాంతిధరుడు - కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు. :-
[6-530-తో.]
995} కాకోదరము - 1కుటిల గమనము గల ఉదరము (పొట్ట)గలది 2 కాకివంటి పొట్టగలది. సర్పము (విద్యార్థికల్పతరువు,పుట313) :-
[12-26-వ.]
996} కాచుట - 1. పశువులను మేపుటకు తీసుకు వెళ్ళి అక్కడ వాటికి ఏ ప్రమాదములు రాకుండ అవి తప్పిపోకుండ చూచుట, 2. కాపాడుట :-
[3-106-క.]
997} కాత్యాయని - వ్యుత్పత్తి, కతి అయనాని మోక్షమార్గాస్సంతీతి విచారయతీతి కత్యయనః, కత్యయనస్సాపత్యంస్త్రీ కాత్యాయనీ. మోక్షమార్గములెన్ని కలవని విచారించువాడు కత్యయనుడు (బ్రహ్మవేత్త),వాని యందు పుట్టినామె కనుక కాత్యాయనీ బ్రహ్మవిద్య, బ్రహ్మవిద్యాస్వరూపిణీః. :-
[10.1-809-క.]
998} కాదంబము - ధూమ్రవర్ణము కల ముక్కు కాళ్ళు కల హంస :-
[10.1-491-మ.]
999} కాదంబరి - కదంబ రసముచే చేయబడిన మద్యము :-
[10.2-499.1-తే.]
1000} కాదంబిని - కదంబ వృక్షములను పుష్పించుట కలిగి ఉండునది, మేఘము :-
[10.2-441-వ.]
1001} కానిక,కానుక - 1.రాజ దర్శనార్థము తెచ్చెడిది 2.బహుమానము :-
[10.2-6-వ.]
1002} కామక్రోధాదిశత్రువులు - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[4-96-వ.]
1003} కామక్రోధాదులు - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[5.1-87-క.,
7-117.1-ఆ.]
1004} కామదుఘములు - కామధేనువులు వంటివి, కామదుఘ కామధేనువు :-
[4-582-వ.]
1005} కామధేనువు - కామ (కోరినవి యిచ్చెడి) ధేనువు (ఆవు) :-
[3-288-వ.,
6-326-వ.,
9-230-వ.]
1006} కామపాలుడు - వ్యు. కామాన్ పాలయతి, కామ+పాల+అణ్, కృ.ప్ర., భక్తుల కోరికలను తీర్చి పాలించువాడు, బలరాముడు. :-
[10.2-543-చ.]
1007} కామము - 1. వస్తువులు ధనము స్త్రీలాదులు కావాలనెడి చిత్తవృత్తి, 2. ఇంద్రియ విషయములైన ఆహార నిద్రా భయ సంగమ పుష్ప చందనాదుల యెడ లాలస, విషయాసక్తి, 3. శబ్దాదు లందు గల రాగద్వేష రూపములైన అభిలాషలు కలిగి ఉండుట :-
[10.1-537-వ.,
10.1-1655-క.,
10.1-1659-ఆ.]
1008} కామముఖషట్కము - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[1-126-ఉ.]
1009} కామాది - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[7-371-వ.,
9-152-ఆ.,
10.1-1046-మ.]
1010} కామాదులు - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు :-
[7-460-వ.]
1011} కామారాతి - కాముని (మన్మథుని) కి శత్రువు, శివుడు :-
[3-461-మ.]
1012} కామితమునిరాజయోగికల్పద్రుముడు - కామిత (కోరి ఆశ్రయించిన) ముని (ఋషులకు) రాజ (రాజులకు) యోగి (యోగులకు) కల్పద్రుముడు (కల్పవృక్షము వంటివాడు), విష్ణువు :-
[12-1-క.]
1013} కామిని - ప్రియ సంగము నందు మిక్కిలి ఆశ కలామె, స్త్రీ. :-
[1-409-ఉ.,
3-1008-తే.,
4-65-చ.,
4-768-వ.,
4-776-వ.,
4-810-వ.,
4-849-వ.,
5.1-35-శా.,
7-342.1-తే.,
10.1-80-ఉ.,
10.1-777-మ.,
10.1-791-మ.,
10.1-1281-క.,
10.1-1437-శా.,
10.2-262-వ.]
1014} కాముడు - కామమును ప్రేరేపించు వాడు, మన్మథుడు :-
[3-377.1-తే.]
1015} కాయ - చెట్టునకు కాయు కాయ, 2.కాయము చెట్టు :-
[3-39-క.]
1016} కారణభూతము - కార్యకారణన్యాయములో కారణము ఐ ఉండునది :-
[10.1-1503-వ.]
1017} కారణభూతులు - సృష్టి స్థితి లయాదులకు కారణమైనవారు :-
[10.1-1503-వ.]
1018} కారణము - దానికి (కార్యమునకు) హేతువు (కర్మ?), ప్రపంచసృష్టికి కారణములు ఐన అవ్యక్తము మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు :-
[3-201.1-తే.,
10.2-1204.1-తే.,
10.2-1230-వ.]
1019} కారణవిగ్రహము - ప్రయోజనార్థమైన జన్మ :-
[5.1-156-ఉ.]
1020} కారణాత్మ - కారణభూతమైన ఆత్మ, విష్ణువు :-
[4-704-తే.]
1021} కారణావస్థలు - అవ్యక్త మహదాదులు :-
[10.2-1230-వ.]
1022} కారుణ్యనిధి - కారుణ్యము (దయ)కు నిధి వంటివాడు, బ్రహ్మదేవుడు. :-
[7-75-క.]
1023} కారుణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు :-
[10.2-1-క.]
1024} కార్చిచ్చు - అడవి తగులబడునప్పటి పెద్ద నిప్పు, దావాగ్ని, దహించు అగ్ని :-
[2-180-మ.,
2-180-మ.]
1025} కార్యకారణనియమము - ప్రతి కార్యమునకు కారణము ప్రతి కారణమునకు కార్యము ఉంటుంది ఇది సృష్టి నియమము :-
[10.2-1230-వ.]
1026} కార్యకారణసంబంధము - సృష్టిలో కార్యము కారణములకు అవినాభావ (విడదీయరాని) సంబంధము కలదు అన్నది ప్రమాణము :-
[10.1-558-త.]
1027} కార్యభూతములు - కార్యకారణ సూత్రములోని కార్యరూపులు అయినవి. :-
[3-202-వ.]
1028} కార్యము - చేయబడినది (క్రియ), కార్యకారణములలో అదృశ్య శరీరము కారణము అయిన దాని కార్యము, కారణము వలన కలుగునది, ప్రపంచము :-
[2-252-వ.,
3-201.1-తే.,
3-738-వ.,
3-1028.1-తే.,
10.2-1204.1-తే.,
10.2-1230-వ.]
1029} కార్యలింగం - ప్రారబ్దలింగ శరీరము ప్రకృతి లక్షణముల ద్వారా కలిగినది ప్రారబ్దము. ప్రారబ్దం వలన కలిగిన లింగ దేహం :-
[1-381-వ.]
1030} కాలకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శివుడు :-
[10.1-905-వ.,
10.1-1321-వ.,
10.2-440-తే.]
1031} కాలకన్యక - కాలము వలన జన్మించెడియామె, ముసలితనము :-
[4-817-వ.]
1032} కాలకేయులు - మారీచునకు కలక యందు కలిగిన 1,400 అసుర సంతతి :-
[8-182-వ.]
1033} కాలగళుడు - కాల (నల్లని) గళుడు (కంఠము గలవాడు), శివుడు :-
[6-362-క.]
1034} కాలచకితుడు - కాల ప్రభావమున కలుగు మరణాదులకు భయపడువాడు, కాలముచేత వెరచువాడు :-
[10.1-1631.1-ఆ.]
1035} కాలచక్రము - అఖండమై నిమేష ఘటిక దిన మాస సంవత్సరాది కాలావయవము లనెడి భేదములచే చక్ర భ్రమణయుక్తమైన కాలము :-
[10.1-681-వ.]
1036} కాలత్రయము - 1భూత 2భవిష్య 3వర్తమాన కాలములు :-
[3-997-వ.,
8-227-ఆ.]
1037} కాలపరవశుడు - కాలప్రభావమునకు లోనైనవాడు, మరణించినవాడి :-
[9-218-క.]
1038} కాలపరిణామస్థితి - కాలస్థితి మాఱి ప్రపంచ వృత్తితో కూడి అహంకార రూపముగా పరిణమించునట్టి స్థితి :-
[10.1-537-వ.]
1039} కాలపుత్రిక - అవసాన కాలమున జనించునది :-
[4-811-క.]
1040} కాలము - నిమేషము మొదలు ప్రళయము తుదిగాఁ ప్రవాహరూపమున గలది, సర్వము కలిగించెడిది కాలము :-
[10.1-8-ఆ.,
10.1-684-క.]
1041} కాలయవనుడు - కృష్ణనిచే ప్రేరేపితుడై అతని వెన్నంటి ముని చూపు వలని అగ్నిలో మరణించినవాడు :-
[2-190-చ.]
1042} కాలవశత - కాలమునకు లొంగుట, చావు :-
[9-73.1-తే.]
1043} కాలశాంఖికుడు - సమయము తెలుపుటకై చాటింపు వేయువాడు, సమయసూచకుడు :-
[10.1-1306.1-తే.]
1044} కాలసూత్రము - ఇనప తంతులుగలది, నరక విశేషము :-
[5.2-136-వ.,
5.2-141.1-ఆ.]
1045} కాలాంజనము - 1. కాలము అనెడి అంజనము, ఎట్టి కష్టమైన మరపునకు పంపు అంజనము, 2. చక్కటి దృష్టికి తోడ్పడునది :-
[5.1-118-వ.]
1046} కాలాహ్వయుడు - కాలము అని పేర్కొనబడు వాడు, విష్ణువు :-
[3-366-క.]
1047} కాలుపురి - కాలు (యముని) పురి (పట్టణము), నరకము :-
[9-162-చ.]
1048} కాళి - భయంకర రూపమున ఉన్న శక్తిస్వరూపిణి, కాళికాదేవి :-
[5.1-130-క.]
1049} కాళిందనందన - కాళింద పర్వతమునందు పుట్టినది, యమునానది :-
[10.1-1101-వ.]
1050} కాళింది - కళింద పర్వతుని పుత్రిక, యమునానది :-
[10.1-1228-వ.]
1051} కాళిందీజలవర్ణుడు - కాళిందీ (యమునా నది) యొక్క జల (నీటి) వలె నల్లని వర్ణుడు (రంగు దేహము కలవాడు), కృష్ణుడు :-
[10.1-632-క.]
1052} కాళిదాసు - మేఘసందేశం, రఘువంశం, కుమారసంభవం మున్నగునవి వ్రాసిన మహా గొప్ప పండితుడు, ఇతనిని మించిన కవి లేడు :-
[6-11.1-తే.]