టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (ఆంగీరసుడు- ఈషణ)
శ్రీరామ
478} ఆంగీరసుడు - అంగిరసుని కొడుకు, బృహస్పతి :-
[10.2-1117-ఉ.]
479} ఆంజనేయుడు - పరమ భాగవతుడు, భగవంతుని సేవయే కాని తనకు కావలసిన దేమియును లేని మొదటి భక్తుడు :-
[2-204.1-తే.]
480} ఆంబికేయుడు - వ్యు. అంబికాయాః అపత్యమ్ అంబికా + ఢక్. (త.ప్ర.). ఆంధ్రశబ్దరత్నాకరం, అంబికయొక్క పుత్రుడు, ధృతరాష్ట్రుడు :-
[10.2-573-వ.,
10.2-766.1-ఆ.]
481} ఆకాశదేవతలు - స్వర్లోక దేవతలు :-
[2-38-వ.]
482} ఆకాశము - అంతట నిండి ఉండి అన్నిటిని అంటియు అంటక ఉండునది ఆకాశము :-
[10.2-441-వ.]
483} ఆకాశాది - 1ఆకాశము 2తేజము 3వాయువు 4జలము 5పృథ్వి అను పంచభూతములు :-
[3-896-వ.,
3-903-వ.]
484} ఆకూతి - ఆకూతములు కలది మంచి తలంపులు, ఆశయము,లు, సంకల్పములు కలది :-
[2-117.1-తే.,
4-3.1-తే.,
4-390-వ.,
8-7-వ.]
485} ఆఖండలనందనుడు - ఆఖండలుడు (ఇంద్రుడు) యొక్క నందనుడు, అర్జునుడు :-
[10.2-143-ఉ.,
10.2-1174-వ.]
486} ఆఖండలుడు - పర్వతములను భేదించిన వాడు, శత్రువులను ఖండించు వాడు, ఇంద్రుడు :-
[1-361-క.,
3-595-ఉ.,
7-33-క.,
10.1-1084-వ.]
487} ఆఖ్యంబునకున్ - ఆఖ్యంబు + కున్ ఆఖ్యంబునకున్. నుగాగమ సంధి... కున్ పరమగుట వలన నుగామమయింది. :-
[10.2-947-క.]
488} ఆగమవినుతుడు - ఆగమ (వేదముల)చే వినుతుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[6-327.1-తే.]
489} ఆగమాంతవిదితధ్రువపుణ్యరమావతంసము - ఆగమాంత (వేదాంతములో) విదిత (తెలుపబడి) ధ్రువ (నిశ్చయమైన) పుణ్యము యొక్క రమా (శోభను) వతంసము (శిరస్సున ధరించినవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]
490} ఆగామి ప్రారబ్ధ సంచిత - సంచితం అంటే కూడబెట్టుకొన్నది. ప్రారబ్ధం అంటే కూడబెట్టుకొన్న దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఆగామి అంటే ఈ జన్మలో చేసే పనులతో కూడబెట్టుకొనబోయేది (అంటే, సంపాదించుకొంటున్నది) :-
[10.2-1123.1-తే.]
491} ఆచంద్రసూర్యము - సూర్య చంద్రులున్నంత వరకు ఉండునది, ఎప్పటికి ఉండునది :-
[10.2-68.1-తే.]
492} ఆచక్రవాళాచలచక్రము - అచల (పర్వతముల) చక్రము (గుంపుల) పర్యంతము కల చక్రవాళము (మండలము), భూమండలము :-
[10.2-400.1-తే.]
493} ఆచమనము - మంత్రపూర్వకముగ అరచేత జలము తీసుకొనెడి వైదిక ధర్మము :-
[6-311-వ.]
494} ఆచారము - ఆచరించవలెనని నియమింపబడిన విధానములు, 1విధి 2నిషేధములు అని ద్వి విధములు :-
[3-775-మ.,
4-51.1-తే.,
5.1-121-మ.,
11-91-వ.,
12-20-వ.]
495} ఆచ్చాదించి - ఆపాదించి, లేనిది ఉన్నట్లు చెప్పు ఆరోపణ :-
[1-428-వ.]
496} ఆజానుబాహుడు - ఆజాను (మోకాళ్ళ వరకు కల) బాహువు (చేతులు కలవాడు), సుందరుడు :-
[10.2-380.1-తే.,
11-12.1-తే.]
497} ఆజ్ఞాచక్రము - కనుబొమల మధ్య స్థానమున, భృకుటి వద్ద ఉండునది. (ఇది దేహమందు ఉండు ద్విదళాది పద్మాకారంలో షట్చక్రములలో ఒకటి. అవి, 1.మూలాధారం గుద స్థానంలో, 2. స్వాధిష్టానం మేహనం వద్ద, 3.మణిపూరం నాభి వద్ద, 4.అనాహతం హృదయాబ్జము వద్ద, 5.ఆజ్ఞాచక్రం నిటలం వద్ద, 6,సహస్రారం మూర్ధం వద్ద బ్రహ్మ రంధ్రం వద్ద) :-
[2-29.1-ఆ.]
498} ఆజ్యపులు - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, ఆజ్యము (నేతి)ని తాగు అగ్నులు.? :-
[4-34-వ.]
499} ఆఢ్యుడు - లక్ష్మీదేవి యనే సంపద గలవాడు, సంపన్నుడు :-
[1-187-క.,
2-277.1-తే.,
2-279-మ.,
3-212-చ.,
3-315-మ.,
3-364-చ.]
500} ఆతతాయి - ఇంటికి నిప్పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తి పట్టుకొని నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు :-
[1-171-ఉ.]
501} ఆత్తచక్రుడు - ఆత్త (పొందిన) చక్రుడు (చక్రము ఆయుధముగా కలవాడు), శ్రీకృష్ణుడు :-
[10.1-7-క.]
502} ఆత్మ - అతతితత్తద్వస్తురూపేణ వ్యాప్నోతీత్యాత్మా ఆతసాతత్యగమనే (వ్యుత్పత్తి), సర్వ వస్తు నామ రూపములతో మరియు అందు అంతట నిండి యున్నట్టిది, పరమాత్మ, విష్ణువు :-
[4-703.1-తే.,
10.1-567.1-ఆ.,
10.1-1236-దం.]
503} ఆత్మకుడు - స్వరూపుడు :-
[10.2-1204.1-తే.]
504} ఆత్మజ - ఆత్మ (తనకు) జ (పుట్టినది), కూతురు :-
[9-8.1-తే.]
505} ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), పుత్రుడు :-
[3-395.1-తే.,
5.1-121-మ.,
7-308-చ.,
8-16.1-ఆ.]
506} ఆత్మజులు - ఆత్మన్ (తనకు) పుట్టినవారు, సంతానము :-
[7-55-మ.,
9-418-ఉ.]
507} ఆత్మద్వాదశలక్షణములు - 1. శాశ్వతమైనది, 2. నాశనం లేనిది, 3. శుద్ధుడు, 4. క్షేత్రజ్ఞుడు, 5. గగనాదులకు ఆశ్రయుడు, 6. క్రియాశూన్యుడు, 7. స్వయంప్రకాశం, 8. సృష్టికి కారణం, 9. వ్యాపించు స్వభావం కలది, 10. సంగం లేనిది, 11. పరిపూర్ణమైనది, 12. ఏకలుడు :-
[7-237-వ.]
508} ఆత్మనాథుండు - ఆత్మ (నాయొక్క) నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-198.1-తే.]
509} ఆత్మభవులు - తనకు పుట్టినవారు, పుత్రులు :-
[9-483-ఉ.]
510} ఆత్మమయుడు - ఆత్మరూపమున నుండువాడు, విష్ణువు :-
[7-108-ఉ.]
511} ఆత్మవస్తుసంపన్నుఁడు - ఆత్మ అనెడి వస్తువు యొక్క సమృద్ధి కలవాడవు, పరమాత్మ :-
[10.1-120-క.]
512} ఆత్మవిదులు - పరమాత్మ విద్య తెలిసినవారు, ఆధ్యాత్మికవేత్తలు. జ్ఞానులు :-
[3-546.1-తే.]
513} ఆత్మశక్తిత్రయంబు - ఆత్మయొక్క మూడుశక్తులు 1ఆజ్ఞాశక్తి 2 సంకల్పశక్తి 3మంత్రశక్తి :-
[6-217-వ.]
514} ఆత్మసంభవుడు - ఆత్మలలో సంభవుడు (పుట్టువాడు), మన్మథుడు :-
[6-446.1-తే.]
515} ఆత్మారామత్వము - తన యందు తానే క్రీడించుట కలిగి యుండుట :-
[10.1-683-వ.]
516} ఆత్మారాముడు - ఆత్మ యందే రమించెడి వాడు :-
[10.1-1099-వ.]
517} ఆత్ముడు - ఆత్మస్వరూపుడు, విష్ణువు :-
[9-170.1-తే.]
518} ఆత్ములు - ఆత్మ కలవారు, జీవులు :-
[5.1-176-క.]
519} ఆత్మేశ్వరుడు - ఆత్మ (తమయొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు. :-
[7-314-శా.]
520} ఆత్యంతికప్రళయము - మోక్షము. జీవి పరమాత్మలో ఐక్యమగును కనుక దీని తరువాత జీవికి జననమరణాలుండవు :-
[12-24-వ.]
521} ఆదికవినన్నయ - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో ప్రథముడు :-
[6-11.1-తే.]
522} ఆదిత్యాదులు - 1. ఆదిత్యులు, వసువులు, రుద్రులను ముగ్గురు. (ఋగ్వేద సంహిత, డా. దాశరథి రంగాచార్య), 2. వేదంగజ్యోతిషకర్తలు :-
[2-38-వ.]
523} ఆదిత్యుడు - అదితికి కశ్యపునివలన పుట్టినవాడు, సూర్యుడు :-
[12-45-వ.]
524} ఆదిత్యులు - అదితి పుత్రులు, దేవతలు, ద్వాదశాదిత్యులు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వినస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు :-
[7-90-శా.]
525} ఆదిదేవుడు - సృష్టికి పూర్వమునుండి స్వయంప్రకాశముతో ఉండువాడు, విష్ణువు :-
[5.2-74.1-తే.,
10.2-1313-వ.]
526} ఆదిధరణివిభుడు - మొట్టమొదటిరాజు, ఇంద్రియమూలములను నియమించువాడు, పృథుచక్రవర్తి :-
[4-460.1-తే.]
527} ఆదినారాయణుడు - ఆది (సృష్టికి ముందు) నారములు (నీటి) యందు వసించెడివాడు, సూర్యుడు :-
[5.2-86-వ.]
528} ఆదిపురుషుడు - సృష్టికి మొదటినుండి ఉన్న పురుషుడు (కారకుడు), విష్ణువు :-
[1-218-వ.,
4-936-వ.,
5.2-115-వ.,
6-333.1-ఆ.,
6-343-వ.,
9-15-వ.]
529} ఆదిమధ్యాంతశూన్యుడు - ఆది (పుట్టుక, మొదలు) మధ్య (బతుకు, నడుమ) అంత (చావు, చివర)లు లేనివాడు, విష్ణువు :-
[2-277.1-తే.]
530} ఆదిమధ్యాంతహీనుడు - ఆది (పుట్టుక, మొదలు) మధ్య (బతుకు, నడుమ) అంత (చావు, చివర)లు లేనివాడు, విష్ణువు :-
[10.2-429.1-ఆ.]
531} ఆదిమపురుషుడు - ఆదిమ (సృష్టికి మూలము యైన) పురుషుడు (పురుషోత్తముడు), విష్ణువు :-
[6-421-క.]
532} ఆదిమపూరుషుడు - ఆదిమ (సృష్టికి మూలము యైన) పూరుషుడు (పురుషోత్తముడు), విష్ణువు :-
[6-216-ఉ.]
533} ఆదిమూర్తి - సృష్టికి ఆదిన ఉన్నవాడు :-
[2-101-చ.]
534} ఆదివిష్ణుడు - మూలాధారమైన సర్వవ్యాపకుడు, విష్ణువు :-
[10.1-343-ఆ.]
535} ఆద్యంతభావశూన్యుడు - ఆది అంతములను భావములు లేనివాడు, భగవంతుడు :-
[2-217.1-తే.]
536} ఆద్యంతవికారదూరుడు - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని దూరుడు (లేనివాడు), విష్ణువు :-
[2-236-మ.]
537} ఆద్యంతవికారశూన్యుఁడు - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని శూన్యుడు (లేనివాడు), విష్ణువు :-
[3-599-ఉ.]
538} ఆద్యంతవిహీనుడు - ఆది (పుట్టుక) అంతము (మరణము) లేనివాడు, విష్ణువు :-
[2-110-మ.]
539} ఆద్యంతశూన్యుడు - ఆది (పుట్టుక) అంతము (మరణము) లేనివాడు, విష్ణువు :-
[3-99.1-తే.,
3-293.1-తే.,
3-861-క.]
540} ఆద్యుడు - ఆది (మొదట) నుండి ఉన్నవాడు, విశ్వ సృష్టి స్థితి లయములకు మూలకారణుడు, విష్ణువు, శివుడు :-
[2-109-చ.,
3-236-చ.,
3-844-చ.,
3-861-క.,
4-105-శా.,
4-298-చ.,
7-3.1-ఆ.,
7-217-వ.,
10.1-567.1-ఆ.,
10.1-819-శా.]
541} ఆధ్యాత్మ - ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించిన జ్ఞానము :-
[2-282-వ.]
542} ఆనందపరిపూర్ణుడు - ఆనందమునకు పరిపూర్ణ రూపుడు, విష్ణువు :-
[3-145.1-తే.]
543} ఆనందమాత్రుడు - ఆనందము తానే ఐన వాడు, విష్ణువు :-
[4-359.1-తే.]
544} ఆనకదుందుభి - పుట్టినప్పుడు దివ్యమైన ఆనక (తప్పెట్లు) దుందుభి (భేరీలు) మోగిన వాడు, వసుదేవుడు :-
[3-104-క.,
10.1-51-వ.,
10.1-1505-క.,
10.2-1123.1-తే.]
545} ఆనకదుందుభిభార్య - వసుదేవుని భార్య, దేవకి :-
[10.2-1137.1-తే.]
546} ఆనర్తమండలము - పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము, కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది :-
[1-243-వ.]
547} ఆనర్తము - పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము, కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది :-
[10.1-1718-వ.]
548} ఆపగాతనూభవుడు - ఆపగా (ఉదకముచే పోవునది, గంగకు) శంతనుని వలన పుట్టినవాడు, భీష్ముడు :-
[10.2-573-వ.]
549} ఆపన్నభక్తజనార్తివిఖండనుడు - ఆపన్న (శరణువేడిన) భక్త (భక్తులైన) జన (వారి) ఆర్తిన్ (దుఃఖములను) విఖండనుడు (పూర్తిగా తొలగించెడివాడు), విష్ణువు :-
[8-483.1-తే.]
550} ఆపూర్ణుడు - అంతట నిండియుండు వాడు, అఖండ స్వరూపుడు, విష్ణువు :-
[10.1-567.1-ఆ.]
551} ఆప్తకాములు - పొందబడినకోరికలు కలవారు, నిరాశులు :-
[10.1-1077.1-ఆ.]
552} ఆప్తుడు - సర్వహితుడు, విష్ణువు :-
[10.2-697.1-తే.]
553} ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు :-
[3-388-వ.]
554} ఆభిమన్యుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు :-
[10.2-1338-క.]
555} ఆయుర్వేదము - ఆయువు (ప్రాణము, ఆరోగ్యము) నకు సంబంధించిన శాస్త్రము, వైద్యవిద్య :-
[3-388-వ.]
556} ఆయుర్వేదాదులు - ఉపవేదములు ఋగ్వేదమునకు ఆయుర్వేదము, యజుర్వేదమునకు ధనుర్వేదము, సామవేదమునకు గాంధర్వము, అధర్వణవేదమునకు స్థాపత్య శస్త్ర వేదములు ఉపవేదములు :-
[2-222-వ.]
557} ఆర్తజనపోషణుడు - ఆర్తి కల జనులను పోషించు (కాపాడు) వాడు, విష్ణువు :-
[3-588-ఉ.]
558} ఆర్తజనబాంధవుడు - ఆర్తి (బాధలనుండి విముక్తికై ప్రాధేయపడుట) కల జనులకు బంధువు, విష్ణువు :-
[3-194-చ.]
559} ఆర్తపోషణుడు - ఆర్తులను (దుఃఖమును పొందినవారిని) పోషణుడు (రక్షించువాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]
560} ఆర్తశరణ్యుడు - ఆర్తులైనవారికి శరణు యిచ్చువాడు, విష్ణువు. :-
[7-334-క.]
561} ఆర్యామహాదేవి - ఆర్య శ్రేష్ఠురాలు, పార్వతి, మహాదేవి పార్వతి :-
[10.1-1727-మ.]
562} ఆర్యావర్తము - ఆర్యులు తిరిగెడి ప్రదేశము, వింధ్య హిమాచలముల మధ్యప్రదేశము :-
[5.1-64-వ.,
9-156.1-తే.]
563} ఆలంగితధారుణి - ఆలింగనము చేసికొన్న నేల కలామె, నేలపై పడిపోయినామె :-
[10.2-240-మ.]
564} ఆలవాలము - మొక్క మొలచుటకు చేయు పాదు, పుట్టిల్లు, స్థానము :-
[3-203-దం.]
565} ఆలీఢము - విలుకాడు కుడికాలు ముందరికి చాచి బాణములు వేయుటకైన నిలుకడ (మానము) :-
[10.2-180.1-ఆ.]
566} ఆలీఢాదులు - పంచమానములు, 1ఆలీఢము 2ప్రత్యాలీఢము 3సమపదము 4విశాఖము 5మండలము అనెడి ఐదు విలుకాని పద విన్యాసములు :-
[10.2-180.1-ఆ.]
567} ఆవిర్ముఖుడు - స్పష్టమైన ముఖము కలవాడు, చంద్రుడు :-
[4-853-వ.]
568} ఆవృతములు - కప్పివేయునవి :-
[3-297-వ.]
569} ఆశువేగము - ఆశుగము(వాయు) వేగము :-
[4-771.1-తే.]
570} ఆశ్రమధర్మములు - 1బ్రహ్మచర్య 2గార్హస్త్య 3వానప్రస్థ 4సన్యాస అనెడి చతురాశ్రమముల ధర్మములు :-
[4-147.1-తే.]
571} ఆశ్రమము - బ్రహ్మచర్యాది, మానవునికి బ్రహ్మచర్యాది వంటివే భగవంతునికి అనంత అవతారములు అనంత ఆశ్రమములు ? :-
[3-150-వ.]
572} ఆశ్రమములు - చతురాశ్రమములు, 1 బ్రహ్మచర్య 2 గార్హస్థ 3 వానప్రస్థ 4 సన్యాస ఆశ్రమములు :-
[3-459-వ.,
3-775-మ.,
4-421-వ.,
5.2-86-వ.]
573} ఆశ్రయము - 1 అండ,ప్రాపు, 2. పుట్టుట నిలుచుట వృద్ధి పొందుట క్షీణుంచుట నశించుటలకు ఆధారముగ ఉండుట :-
[10.1-1472.1-తే.]
574} ఆశ్రితరక్షకుడు - ఆశ్రయించినవారిని రక్షించువాడు, కృష్ణుడు :-
[3-146-మత్త.]
575} ఆశ్రితవరదుడు - ఆశ్రయించినవారికి కోరికలు తీర్చు వాడు :-
[10.2-1032-ఆ.]
576} ఆశ్వినులు - నాసత్యుడు, దస్రుడు అను పేర్లు కల అశ్వనీదేవతల పుత్రులు, దేవవైద్యులు :-
[2-86-వ.]
577} ఆసనము - పద్మాసనాది, యోగక్రియాచరణాదులకై ప్రత్యేక ఆకారములలో అవయవములను ఉంచుకొనుస్థితి :-
[3-180.1-తే.]
578} ఆసురి - (అసుర సంబంధ) రాక్షసపు లక్షణములు కలది :-
[4-768-వ.]
579} ఆస్కందితజానువర్తన - మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట, రాసక్రీడా పారిభాషికపదము :-
[10.1-1084-వ.]
580} ఇంచువిలుకాడు - ఇంచు (ఇక్షు, చెరకు) విలుకాడు (విల్లు కలవాడు), మన్మథుడు :-
[10.2-24-వ.]
581} ఇందిందిర - వ్యు. పద్మసంపదలతో కూడి యుండునది, లక్ష్మీదేవి, తుమ్మెద, (విద్యార్థి కల్పతరువు) :-
[2-227.1-తే.,
3-1047-వ.,
8-42-మ.,
8-447-వ.,
9-603-క.,
9-603-క.,
10.1-597-వ.,
10.1-1465-మ.,
10.2-243-క.,
10.2-495.1-తే.,
10.2-1310.1-తే.]
582} ఇందిర - లక్ష్మీదేవి, ఆమె అవతారం రుక్మిణి :-
[3-49-చ.]
583} ఇందిరాకామినీమణి - ఇందిర (లక్ష్మీ) యనెడి కామినీ (స్త్రీలలో) మణివంటియామె, లక్ష్మీదేవి :-
[4-963.1-తే.]
584} ఇందిరాచిత్తచోరుడు - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించినవాడు), విష్ణువు. :-
[3-423.1-తే.,
3-573.1-తే.,
4-203.1-తే.]
585} ఇందిరాధీశ్వరుడు - ఇందిర (లక్ష్మీదేవి) అధీశ్వర (భర్త) అయినవాడు, విష్ణువు :-
[3-436-ఉ.,
5.1-98.1-తే.]
586} ఇందిరానాథుడు - ఇందిర (లక్ష్మీదేవి) నాథుడు (భర్త), లక్ష్మీపతి, విష్ణువు :-
[10.2-1137.1-తే.]
587} ఇందిరామనోహరుడు - ఇందిర (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు :-
[3-508-చ.]
588} ఇందిరారమణుడు - ఇందిర (లక్ష్మీదేవి)కి రమణుడు (మనోహరుడు), విష్ణువు :-
[6-188.1-ఆ.]
589} ఇందిరావరుడు - ఇందిర (లక్ష్మీదేవి) వరుడు (భర్త), విష్ణువు :-
[3-629-చ.,
3-761-చ.,
4-917-చ.]
590} ఇందిరావిభుడు - ఇందిర (లక్ష్మీదేవి) విభుడు (భర్త), విష్ణువు :-
[10.2-774-క.]
591} ఇందిరాసుందరీరమణుడు - ఇందిరా (లక్ష్మీ) సుందరీ (దేవియొక్క) రమణుడు (భర్త), విష్ణుమూర్తి :-
[3-156-వ.,
3-507-వ.]
592} ఇందిరేశుడు - ఇందిర (లక్ష్మీదేవి) ఈశుడు (భర్త), విష్ణువు :-
[10.2-749-ఆ.]
593} ఇందీవరేక్షణ - ఇందీవరము (నల్లకలువల వంటి) ఈక్షణ (కన్నులుగలామె), స్త్రీ :-
[4-794.1-తే.,
10.1-1031.1-ఆ.]
594} ఇందుకళాధరుడు - ఇందుకళ (చంద్రవంక) ధరించిన వాడు, శివుడు :-
[10.2-324-ఉ.]
595} ఇందుకులోద్భవుడు - ఇందు (చంద్ర) కుల (వంశము) ఉద్భవుడు (పుట్టినవాడు), పరీక్షితుడు :-
[5.2-120-క.]
596} ఇందుజూటుడు - ఇందు (చంద్రుని) జూటుడు (జటాజూటమున కలవాడు), శంకరుడు :-
[8-547-ఆ.]
597} ఇందుధరసుందరి - ఇందుధరుని (శివుని) యొక్క సుందరి (భార్య), పార్వతి :-
[10.1-1743-వ.,
10.1-1747-వ.]
598} ఇందునిభానన - చంద్రుని వంటి మోము కలామె, చంద్రముఖి, అందగత్తె, స్త్రీ :-
[10.1-214-మాని.,
10.1-1031.1-ఆ.]
599} ఇందుమకుటుడు - చంద్రుడు తలపై ఉన్నవాడు, శివుడు :-
[10.2-1245-తే.]
600} ఇందుముఖి - ఇందు (చంద్రుని) వంటి ముఖి (ముఖముగలామె), చంద్రవదన, స్త్రీ :-
[6-255.1-తే.,
10.1-83-ఆ.,
10.2-232.1-ఆ.]
601} ఇందుమౌళి - ఇందు (చంద్రుడు)ని మౌళి (సిగ)లో కలవాడు, శివుడు :-
[4-152-చ.]
602} ఇందువదన - ఇందు (చంద్రుని) వంటి వదన (ముఖముగలామె), స్త్రీ :-
[10.2-177.1-తే.,
10.2-804-వ.]
603} ఇంద్రతనూభవుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[10.2-728-ఉ.]
604} ఇంద్రమానిని - ఇంద్రుని భార్య, శచీదేవి :-
[9-509-క.]
605} ఇంద్రసభామండపము - సుధర్మామండపము :-
[1-350.1-తే.]
606} ఇంద్రసూనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[1-346-క.]
607} ఇంద్రస్పృక్ - ఇంద్రుడు రక్షించెడి ప్రదేశము :-
[5.1-64-వ.]
608} ఇంద్రాదివంద్యుడు - ఇంద్రుడు మొదలగు వారిచే నమస్కరింపబడువాడు, విష్ణువు :-
[3-203-దం.]
609} ఇంద్రారి - ఇంద్రుని అరి (శత్రువు), వృత్రుడు :-
[6-432-ఆ.]
610} ఇంద్రావరజుడు - ఇంద్రుని యొక్క తమ్ముడు, విష్ణువు :-
[5.2-12-క.]
611} ఇంద్రియప్రపంచము - పంచేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఇంద్రియములు :-
[2-259-తే.]
612} ఇంద్రియములు ఆరు - మనసు, పంచేంద్రియాలు కలిసి 6 :-
[1-69-మ.,
1-329-వ.,
4-626-వ.]
613} ఇంద్రియవిషయములు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు :-
[2-12-వ.]
614} ఇంద్రియషట్కము - 1శ్రోత్రము 2త్వక్కు 3చక్షుః 4జిహ్వ 5ఘాణము వీనిచేరికగల 6మనస్సు :-
[10.1-1664-వ.]
615} ఇంద్రియసంగ్రహము - పంచేంద్రియములు (1కళ్ళు 2ముక్కు 3చెవులు 4నాలిక 5చర్మము) మరియు 6మనస్సు :-
[4-849-వ.]
616} ఇంద్రియసంచారములు - వినుట చూచుట మొదలైనవి, ఇంద్రియ విషయములు :-
[10.1-1650-వ.]
617} ఇంద్రియాదులు - ఇంద్రియములు మనసు దేహము :-
[6-416-వ.]
618} ఇంద్రియేశుడు - ఇంద్రియములకు ప్రభువు, జీవుడు :-
[4-602-తే.]
619} ఇంద్రుడు - ఇంద్రియములకు అధిపతి, దేవేంద్రుడు, అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు :-
[5.1-74.1-తే.]
620} ఇక్షుచాపుడు - చెఱుకు విల్లు వాడు, మన్మథుడు :-
[3-288-వ.]
621} ఇక్ష్వాకుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు :-
[2-204.1-తే.]
622} ఇజ్య - ప్రయోజనము బట్టి యజ్ఞము చేయవలసిన క్రమము, పూజా విధానము :-
[3-388-వ.]
623} ఇడస్పతి - విష్ణువు, సూర్యుడు (ఆంధ్రశబ్ధార్థచంద్రిక) :-
[4-6-వ.]
624} ఇతరవస్త్వంతరాపరిచ్ఛిన్నుండు - ఇతరమైన వస్తువులుగా అపరిచ్ఛిన్నుడు (విడదీసి తెలిసికొనలేని వాడు), విష్ణువు :-
[3-874-వ.]
625} ఇతరసంకల్పార్థము - సరికాని ఆలోచనలవలన కలిగినది, అసత్యము, చిత్తభ్రమ :-
[10.1-342-మ.]
626} ఇతిహాసము - (ఇతి+హా+ఆసీత్) ఇది ఈ విధముగా జరిగినది, పూర్వరాజుల చరిత్రము గలది, భారతము మొదలగునవి :-
[1-73.1-ఆ.,
2-222-వ.,
3-388-వ.,
8-629.1-తే.]
627} ఇదమిత్థము - ఇదమ్ (ఇది) ఇత్థము (ఇట్లు) అని తెలియుట, విశదముగా తెలియుట :-
[10.2-1148-మ.]
628} ఇద్దమూర్తి - పరిశుద్ధస్వరూపుడు :-
[3-99.1-తే.]
629} ఇద్ధచరితుడు - ఇద్ధ (ప్రసిద్ధిచెందిన) చరిత (నడవడిక) కలవాడు, విష్ణువు. :-
[3-724-తే.]
630} ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడు. - ఇద్ధ (ప్రసిద్ధమైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణమైన) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు)నాముడు (పేరుబడ్డవాడు), విష్ణువు :-
[4-918.1-తే.]
631} ఇద్ధరూపి - ప్రసిద్ధమైన రూపములు కలవాడు. సర్వాధిష్ఠానమైనవాడు :-
[8-78.1-ఆ.]
632} ఇద్ధసనందాదిసిద్ధసంసేవితుడు - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితుడు (చక్కగా సేవించబడుతున్నవాడు), శివుడు :-
[4-138.1-తే.]
633} ఇధ్మవాహకుడు - ఇధ్మము (సమిధ)లను వాహకుడు (మోసెడివాడు), సమిత్పాణి :-
[4-831-క.]
634} ఇధ్ముడు - సమిధలు కలవాడు :-
[4-6-వ.]
635} ఇనతనయుడు - ఇన(సూర్యుని) తనయుడు(పుత్రుడు), కర్ణుడు :-
[3-34-క.]
636} ఇపుడు+కైకొని - ఇపుడుఁగైకొని, గసడదవాదేశ సంధి :-
[10.2-1236-క.]
637} ఇభకులోత్తమయాన - ఏనుగులన్నిటికన్న ఉత్తమమైన నడక కలామె, స్త్రీ :-
[10.1-1031.1-ఆ.]
638} ఇభజిద్వీర్యుడు - ఏనుగును జయించు సింహమువంటి పరాక్రమము కలవాడు :-
[1-363-మ.]
639} ఇభదైత్యారాతి - ఇభ (గజ) దైత్య (అసురుని) సంహరించినవాడు, శంకరుడు :-
[4-105-శా.]
640} ఇభలోకేంద్రుడు - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు :-
[8-47-మ.]
641} ఇరుసు - చక్రము తిరుగనాధార మైన గుండ్రటి కమ్మి :-
[10.1-251-క.]
642} ఇలబిల - భూరంధ్రము, తృణబిందువునకు అలంబసయందు పుట్టిన కూఁతురు. మగఁడు విశ్రవసుఁడు. కొడుకు కుబేరుఁడు. :-
[4-26-వ.]
643} ఇలాతనూజ - భూమియందు జనించినామె, సీత :-
[9-270-ఉ.]
644} ఇలావర్తము - గో భూమి :-
[5.1-64-వ.]
645} ఇలావృతము - ఇల (భూమి)చేత ఆవృతము (చుట్టబడినది), సముద్రము ఏసరిహద్దున లేనిది :-
[5.2-17-వ.]
646} ఇలేశుడు - ఇల (రాజ్యము)నకు ఈశుడు (ప్రభువు), రాజు. :-
[7-462-క.,
10.1-649-క.,
10.1-711-క.,
10.1-895-క.,
10.1-1023-క.,
10.1-1413-క.]
647} ఇల్లాలు - ఇల్లు నందు యుండెడి ఆలు, భార్య :-
[6-136-క.,
8-461.1-ఆ.]
648} ఇషుడు - ఇషువు (బాణము) కలవాడు :-
[4-390-వ.]
649} ఇష్టఫలప్రదుడు - ఇష్ట (కోరినకోరికలు) ఫల (తీరుటను) ప్రదుడు (కలిగించువాడు), విష్ణువు :-
[6-438-చ.]
650} ఇష్టము - అగ్నిహోత్రాదికర్మము :-
[2-222-వ.]
651} ఇష్టాపూర్తములు - పంచమహాయిష్టులు షడ్విధపూర్తములు ఆచరించుట, ఇష్టము అగ్నిహోత్రాది కర్మము, పూర్తము వాపీకూప తటాకారామ దేవాలయ నిర్మాణం, దానములు4. :-
[10.2-465-వ.]
652} ఇష్టి - కోరికల సాదనకై చేయు యజ్ఞములు :-
[4-34-వ.]
653} ఇష్టుడు - ఇష్టమైనవాడు, విష్ణువు :-
[3-523-చ.]
654} ఈశ - ఈశ్వరుడు, విష్ణువు :-
[3-203-దం.,
3-569-తే.,
3-580-తే.]
655} ఈశాన - రుద్రకోటిక్షేత్రమున ఈశాన (ఐశ్వర్యములు కలామె) :-
[10.1-61-వ.]
656} ఈశానుడు - ఈశాన్యదిక్కునకు అధిపతి, పరమ శివుడు :-
[10.1-104-వ.]
657} ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములు గలవాడు, ప్రభువు, శివుడు, విష్ణువు, భగవంతుడు :-
[2-98-క.,
3-184-వ.,
3-212-చ.,
3-213-వ.,
3-362.1-తే.,
3-436-ఉ.,
3-844-చ.,
3-1019-మ.,
3-1024-క.,
4-62-క.,
4-131.1-తే.,
4-298-చ.,
4-701-వ.,
4-917-చ.,
6-414.1-తే.,
7-274-మ.,
10.1-4-క.,
10.1-95-క.,
10.1-121-ఆ.,
10.1-123.1-ఆ.,
10.1-245-క.,
10.1-553.1-ఆ.,
10.1-563-క.,
10.1-684-క.,
10.1-954.1-తే.,
10.1-1182-శా.]
658} ఈశ్వరుడు - సర్వనియామకుడు, స్వభావము చేతనే ఈశత్వము కలవాడు, పంచకృత్యములను (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) చేయుటకు కర్తృత్వము కలవాడు, విష్ణువు, శివుడు, భగవంతుడు :-
[1-213-ఆ.,
2-109-చ.,
2-207-క.,
2-226-వ.,
2-269-వ.,
2-272.1-ఆ.,
3-72-మ.,
3-200-క.,
3-313-చ.,
3-434-చ.,
3-524-వ.,
3-545-చ.,
3-571-చ.,
3-991.1-తే.,
3-1025-వ.,
4-54-వ.,
4-130-క.,
4-347.1-తే.,
4-358.1-తే.,
7-217-వ.,
7-239-వ.,
7-359-ఉ.,
7-447-ఆ.,
10.1-412-వ.,
10.1-549-మ.,
10.1-569-శా.,
10.1-960-వ.,
10.1-1180.1-ఆ.,
10.2-102-క.,
10.2-219-చ.,
10.2-529-క.,
11-77-వ.]
659} ఈశ్వరేశుడు - ఈశ్వరుల (సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నియమించెడి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాదుల)కు ఈశుడు (నియామకుడు), విష్ణువు, భగవంతుడు. :-
[10.1-566-ఆ.]
660} ఈశ్వరేశ్వరుడు - ఈశ్వరుల (సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నియమించెడి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాదుల)కు ఈశ్వరుడు (నియామకుడు), విష్ణువు, భగవంతుడు. :-
[3-523-చ.,
4-367.1-తే.]
661} ఈషణత్రయము - 1దారేషణ 2ధనేషణ 3 పుత్రేషణలు అనెడి ఆత్రములు, 1. దారేషణ దార (భార్య) యందు ఈషణ (త్వర, ఇచ్చ), 2. ధనేషణ ధన (సంపద) యందు ఈషణ (త్వర, ఇచ్చ). 3. పుత్రేషణ పుత్ర (సంతానము) యందు ఈషణ (త్వర, ఇచ్చ) :-
[4-618-వ.,
11-41-వ.,
11-91-వ.]