టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (అష్టాక్షరీ-అహిరాట్టు)
శ్రీరామ
444} అష్టాక్షరీమంత్రము - ఓంనమోనారాయణాయ అనెడి 8 అక్షరములు గల ఓంకారముతో ప్రారంభించి శిరస్సుతో మొదలిడి అష్టాంగవిన్యాసముతో చేసెడి మంత్రము :-
[6-299-వ.]
445} అష్టాదశపురాణములు - 1బ్రాహ్మము 2పాద్మము 3వైష్ణము 4శైవము 5భాగవతము 6నారదీయము 7మార్కండేయము 8ఆగ్నేయము 9భవిష్యత్తు 10బ్రహ్మకైవర్తము 11 లైంగము 12వారాహము 13స్కాందము 14వామనము 15కౌర్మము 16మాత్స్యము 17గారుడము 18బ్రహ్మాండము :-
[10.1-2-వ.]
446} అష్టాదశసిద్ధులు - అణిమాది ఎనిమిది (8) గౌణసిద్ధులు పది (10) అణిమాది 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము; గౌణములు 1వాయు భక్షణం, 2దూరశ్రవణం, 3దూరదర్శనం, 4కామగమనం, 5కామరూపం, 6పరకాయప్రవేశం, 7దివ్యదర్శనం, 8సంకల్పసిద్ధి, 9వశీకరణం, 10స్వచ్చంద మరణం. :-
[11-105-వ.]
447} అష్టావరణలు - 1.పృథివి, 2.జలము, 3.వాయువు, 4.అగ్ని, 5.ఆకాశము, 6.మనసు, 7.బుద్ధి, 8.అహంకారములు, పాఠ్యంతరము, 1. పృథివి, 2. అప్పు, 3, తేజము, 4. వాయువు, 5. ఆకాశము, 6, అహంకారము, 7. మహత్తత్వము, 8. ప్రకృతి. :-
[2-270-క.,
10.1-91.1-తే.]
448} అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము :-
[3-856.1-తే.,
3-919-వ.,
3-958-వ.,
4-93-వ.,
6-39.1-తే.,
6-343-వ.]
449} అసంభవము - జన్మరాహిత్యము, ముక్తి, మరల సంభవము (జనన్మించుట) లేనిది :-
[1-381-వ.]
450} అసమనయనాద్రి - అసమనయనుని (శివుని) అద్రి (పర్వతము), కైలాసపర్వతము :-
[10.1-1563-లవి.]
451} అసమబాణుడు - బేసిసంఖ్యగల (ఐదు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము లేదా 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంబన 5సమ్మోహనము) బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-1101-వ.,
10.2-1168-ఆ.]
452} అసమశరుడు - బేసిసంఖ్యగల (ఐదు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము లేదా 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంబన 5సమ్మోహనము) బాణములు కలవాడు, మన్మథుడు :-
[3-507-వ.]
453} అసమానలోచనుడు - అసమాన (ఎగుడు దిగుడు)గా లోచనుడు (కన్నులు ఉన్నవాడు), శివుడు :-
[5.2-38.1-ఆ.]
454} అసి - ముప్పది అంగుళములకు ఎక్కువ ఉండు కత్తి, ఆయుధములు ముప్పది రెండింటిలో నొకటి, (ఆంధ్ర వాచస్పతము) :-
[10.2-1335-మ.]
455} అసిక్ని - అంతఃపురమున పనిచేసెడి పడుచుస్త్రీ :-
[6-224-వ.]
456} అసితేక్షణ - నల్లని కన్నులుకలామె, అసిత (నల్లనివాడైన కృష్ణుని యందు) ఈక్షణ చూపుకలామె), కృష్ణునిసేవించుట యందు రుచికలామె :-
[4-830.1-తే.]
457} అసిపత్రవనము - అసి (కత్తులే) పత్ర (ఆకులు)గా కలిగిన వనము, నరకవిశేషము :-
[5.2-136-వ.,
5.2-142-వ.]
458} అసురఖండనుడు - అసురులను సంహరించు వాడు, కృష్ణుడు :-
[10.2-3-ఉ.]
459} అసురరాజతనయడు - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు :-
[7-118-ఆ.]
460} అసురాంతకుడు - అసుర (రాక్షసు)లకు అంతకుడు (నాశము చేయువాడు), విష్ణువు :-
[3-630-చ.,
3-697-వ.,
7-347-ఉ.]
461} అసురారి - అసురులు (రాక్షసులు)కి శత్రువు, విష్ణువు :-
[3-301-మ.,
7-122.1-తే.,
9-82.1-తే.,
10.1-75.1-తే.]
462} అసురుడు - సుర (దేవత) కానివాడు, రాక్షసుడు :-
[3-667-వ.,
3-697-వ.,
3-697-వ.,
3-722-వ.,
4-340-క.,
5.2-100-క.,
7-3.1-ఆ.,
7-23-క.,
8-179-క.,
10.2-166-ఉ.]
463} అసురేంద్రారాతి - రాక్షసులకు ఆరాతి (శత్రువు), కృష్ణుడు :-
[3-163-మ.]
464} అసురేంద్రుడు - అసురుల (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు, రావణుడు :-
[7-94-క.,
9-291-వ.]
465} అసువులు - పంచప్రాణములు 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు :-
[3-425.1-తే.]
466} అస్తమించు - కనబడకుండగ పోవు, మరణించు. :-
[3-83.1-తే.]
467} అస్తోకము - స్తోకము (అల్పము) కానిది :-
[10.2-159-శా.,
10.2-564-శా.]
468} అస్త్రము - మంత్ర ప్రయోగముగల మహిమగల ఆయుధములు :-
[10.2-871-క.]
469} అస్త్రము - మంత్రములచేత యంత్రములచేత ప్రయోగింప బడెడి ఆయుధములు అస్త్రములు, సామాన్యమైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.) శస్త్రములు :-
[10.2-178-మ.]
470} అస్థిమాలాధరుడు - అస్థి (ఎముకలు) మాలలను ధరించువాడు, శివుడు :-
[3-467.1-తే.]
471} అస్థిరము - అస్థిరతరము అస్థిరతమము :-
[3-441-చ.]
472} అహంకారత్రయములు - సాత్విక, రాజస, తామస అహంకారములు :-
[2-112-వ.]
473} అహంకారదూరుడు - అహంకారములు లేనివాడు, విష్ణువు :-
[6-327.1-తే.]
474} అహికులాంతకుడు - అహి (సర్పముల) కుల (సమూహమునకు) అంతకుడు (యమునివంటివాడు), గరుడుడు :-
[10.1-703.1-తే.]
475} అహికులారాతి - అహి (సర్పముల) కుల (సమూహమునకు) ఆరాతి (శత్రువు), గరుడుడు :-
[10.1-707-వ.]
476} అహిపతిభూషుడు - అహిపతి (నాగేంద్రుడు) భూషుడు (అలంకారముగా కలవాడు), శివుడు :-
[10.2-1271-చ.]
477} అహిరాట్టు - అహి (సర్పము) లందు రాట్టు (రాజు), ఆదిశేషుడు :-
[4-199-మ.]