పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

జాబితాలు : ప్రాచీన ప్రదేశాలు - ప్రస్తుత పేర్లు


భాగవతము.
ప్రాచీన ప్రదేశాలు - ప్రస్తుత పేర్లు

  • మహావిష్ణువు గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం (8-42-మ. ) - గజేంద్ర ధామ్, దేవ్ ధాం, మానససరోవరము దగ్గరలో, నేపాల్.
  • నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్.
  • మహీష్మతి పురము (9-434-క. ) - కార్తవీర్యార్జునుని రాజధాని -మహేశ్వర్, మధ్యప్రదేశ్
  • శమంత పంచకము (9-487-వ. ) పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో అయిదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు భీముడు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్రము దగ్గర, హర్యానా
  • మహేంద్రము (5.2-55-వ. ) అను పర్వతం , పరశురాముడు తపస్సు చేసిన స్థలం - పశ్చిమ ఒరిస్సా
  • నిషాద రాజ్యం (10.2-348-ఉ. ) నల మహారాజు రాజ్యం - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
  • నైమిశారణ్యం (1-39-వ. ) వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
  • ప్రతిష్టానపురము (9-32-వ. 2) పురూరవుని రాజధాని -ఝున్సి, అలహాబాద్.
  • సాళ్వ రాజ్యం - జరాసంధుని మిత్రులలో ఒకడు సాళ్వ దేశపువాడు, (10.1-1682-మ. ) - కురుక్షేత్రము దగ్గర.
  • హస్తినాపురము - కౌరవుల రాజధాని, పరీక్షిత్తుని రాజధాని, (1-78-వ. ) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
  • మధుర - కంసుని రాజధాని, (10.1-18-వ. ) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
  • వ్రేపల్లె / గోకులం - (2-186-వ. ) గోకుల్, మధుర దగ్గర.
  • కుంతి - పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు - గ్వాలియర్.
  • మద్ర దేశం - పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, (3-62-మ. ) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
  • అంగ రాజ్యం - కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
  • పాండవుల, లాక్షగృహ (3-14-క. ) దహనం- వర్నాల్, హస్తినాపూర్.
  • కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన (10.1-1639-ఉ. ) స్థలం - గిర్నార్, గుజరాత్.
  • ద్వారక - శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరము (10.1-1615-వ. ) - ద్వారక,గుజరాత్.
  • విదర్భ - రుక్మిణిదేవి తండ్రి రాజ్యం, (10.1-1687-చ. ) - విదర్భ, మహరాష్ట్ర
  • కుండినపురము - రుక్మిణిదేవి జన్మస్థలం, విదర్భ ముఖ్యపట్టణము, (10.1-1687-చ. ) - కుండినపుర, మహరాష్ట్ర
  • చేది రాజ్యము - శిశుపాలుని రాజ్యం, (10.1-1697-ఉ. ) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
  • కారుష రాజ్యము - దంతవక్రుని రాజ్యం, (9-722-వ. ) - దాంతియ జిల్లా, మధ్యప్రదేశ్.
  • ఖాండవవనము / ఇంద్రప్రస్థము - పాండవుల రాజధాని, (1-361-క. ) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
  • కుచేలుడు (10.2-965-సీ. ) నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
  • పాంచాల దేశం - ద్రుపద మహారాజు రాజ్యం, (1-365-సీ. ) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
  • జరాసంధ్ కీ ఆఖరా జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
  • మత్స్య దేశం (1-243-వ. ) విరాట మహారాజు రాజ్యం -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
  • విరాటనగరము - పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం (1-243-వ. ) - విరాట్ నగర్,రాజస్థాన్
  • శోణపురము - బాణాసురుడి రాజధాని (10.2-318-వ. ) - సోనిత్ పూర్, అస్సాం.
  • ప్రాగ్జ్యోతిష్యం - నరకాసురుని రాజధాని (10.2-156-వ. ) - తేజ్ పూర్, అస్సాం.
  • ప్రభాస తీర్థం (11-87-సీ. ) - శ్రీ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి జరిపిన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
  • జనమేజయుడు సర్పయాగం (12-26-వ. ) చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
  • గంగోత్రి - భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం (9-230-వ. ), ఉత్తరాఖండ్
  • గంగాసాగర్,- కపిల మహర్షి ఆశ్రమం, శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది (9-231-మ. ), వెస్ట్ బెంగాల్
  • కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  • మిథిల - సీతాదేవి పుట్టినిల్లు (9-372-వ. ) - జనక్ పూర్, నేపాల్
  • కోసలదేశం(9-362-ఆ. ) - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
  • సరయూ నది (9-211-చ. ) - ఈ నదీ తీరములోనే అయోధ్య నిర్మితమైనది - ఘాఘర నది.
  • ఆయోధ్య (9-266-క. ) - శ్రీరాముని జన్మస్థలం, - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
  • దండకారణ్యం (9-268-ఉ.) - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
  • చిత్రకూటం (9-267-క. ) - సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  • పంచవటి - శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం (9-269-సీ. ) - నాసిక్, మహరాష్ట్ర.
  • హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ,
  • కిష్కింద - ఆంజనేయ పర్వతం, హనుమంతుడి జన్మస్థలం, (2) సుగ్రీవుని రాజ్యం, (3) ఋష్యమూక పర్వతం (9-271-వ. ) - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక
  • విభీషణుడు రాముని శరణు కోరిన (9-289-వ. ) స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
  • శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు (9-288-క. ) - రామేశ్వరము,తమిళనాడు
  • అశోకవనం (9-311-వ. ) - సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
  • వాల్మీకి ఆశ్రమం (9-346-సీ.) - సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరములోని బితూర్.
ఇంకా ఈ జాబితాలో చేర్చాల్సినవి ఉన్నాయి.