పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2015 సెప్టంబరు, 11 - మియాపూరు

ఇవటూరి శారద గారి ఇంట్లో సౌహార్ద్ర సమావేశం

ఛాయా చిత్రాలు, విశేషాలు

ఎలీన్సు ఎలైటు,
మియాపూర్,హైదరాబాదు
2015- సెప్టెంబర్, 11

1) శ్రీ చంద్రశేఖరుగారిని సత్కరించి నమస్కరిస్తున్న సందర్భం
Mr1

2) భాగవతం గుండెలుమీద పెట్టుకన్న నామీద శ్రీ చింతా రామకృష్ణా రావు గారు ఆశువుగా పద్యం చెప్తున్నారు
Mr2

3) శ్రీ రామరోహనరావుగారిని సత్కరించుకుంటున్న సందర్భం
Mr3

4) శ్రీ చింతా రామకృష్ణా రావు గారిని సత్కరించుకుంటున్న సందర్భం
Mr4

5) అయిదుగురం కూర్చుని సరదాగా తెలుగుభాగవతంలోని విషయాలు గురించి చర్చించుకుంటున్నాం. ఎడంప్రక్క ఎర్రచొక్కా వేసుకున్న వారు శ్రీ రామోహనరావు గారు, వారి ప్రక్క వరుసగా శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారు, శ్రీ చింతా రామకృష్ణారావు గారు, శ్రీ చంద్రశేఖరు గారు మరయు ఊలపల్లి సాంబశివరావుగారు
Mr5

6) శ్రీ అన్నపురెడ్డి గారిని సత్కరించుకున్న సందర్భం
Mr6

పూజ్యులు, పండితులు, ఆత్మీయ మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, చంద్రశేఖరు గారు, రామమోహనరావుగారు, నేను (భాగవత గణనాధ్యాయి, ఊలపల్లి సాంబశివరావు) 2015-09-11 తారీఖున హైదరాబాదు, మియాపూరు నందలి, మా సోదరి ఇవటూరి శారదా దేవిగారి స్వగృహం (ఎలీన్సు ఎలైటు)లో సమావేశం అయ్యి తెలుగుభాగవతం గురించీ, మరికొన్ని పాండిత్య విషయాలు గురించీ చర్చించుకున్నాం.ఈ సందర్భంలో పిలవగానే హార్దిక సౌహృదయంతో విచ్చేసిన శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, చంద్రశేఖరు గారు, రామ్మోహనరావు గారులకు మా దంపతులం శాలువాలు కప్పి పండిత సత్కారం చేసి ఆనందించాము. మిత్రులు, కవి వరేణ్యులు, అవధాని, శ్రీ చింతా రామకృష్ణా రావు గారు ప్రేమతో మమ్ముద్దేశించి అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు అల్లి, వినిపించి అలరింపజేశారు. ఆ పద్యాల మాధుర్యం ఆస్వాదించండి.

(అ) భాగవతం గణని సంచిలో పెట్టుకుని, హృదయంపై ధరించిన నన్ను చూసి
చంపకమాల.
భువి కలుగున్ కదా! శుభము పూజ్యులఁ జూచిన శోభఁ గొల్పుచున్|
జవ వెలుగున్ కదా! సకల సత్కళసాధకసౌమ్యులెన్నగన్|
కవి జిలుగుల్ కదా! కవిత కన్నులవెల్గులు కాంచి వెల్గనున్|
కవి వెలయున్ కదా! తనువుగా గల భాగవతంబుఁ గాంచగన్||


గమనిక:- ఈ చంపకమాల గర్భంలో 54 కంద పద్యాలు, 2 ఆటవెలదులు గుచ్చిన అద్భుతమైన పూమాల.

(ఆ) విందువలె చక్కటి ఫలహారాలు పెట్టిన మా సోదరి ఇవటూరి శారదా దేవిని ఉద్దేశించి. .
తేటగీతి
నిండుహృదయాన కడుపులు నిండగాను|
సకల సంతృప్త భక్ష్యముల్ చాల నొసగి|
సంతసించిన శారదా సత్ కృపాళి|
వెలుగుగావుత సతతంబు నిలను సుఖిగ||


ఈ కార్యక్రమానికి విచ్చేసిన పండితులు శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, శ్రీ చంద్రశేఖరు గారు, శ్రీ రామమోహనరావుగారు, చక్కటి ఆతిథ్యం ఇచ్చి అమృతోపమేయమైవ ఫలహారాలతో రంజింపజేసిన శ్రీమతి శారదాదేవిగారు మరియు ఏర్పాట్లు నిర్వహణలు చక్కగా చేసిన ఊలపల్లి లలిత గారు సమావేశం జయప్రదంగా, రసరంజకంగా జరుగుటలో మిక్కిలి తోడ్పడ్డారు. వీరందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
- భాగవత గణనాధ్యాయి.